logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనాథ బాలుడి చదువుకు గురువు అండ.. భవిష్యత్ కోసం ప్రత్యేక నిధికి శ్రీకారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి విద్యార్థి ప్రేమ్ కుమార్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను ప్రమాదంలో కోల్పోయి నానమ్మ సంరక్షణలో పెరుగుతున్నాడు. ఎన్నో ఆర్థిక, కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ చదువులో ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మంగ నర్సింలు బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రేమ్ కుమార్ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అతని భవిష్యత్ విద్య కోసం ప్రత్యేక ఆర్థిక నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ నిధికి తొలి విరాళంగా రూ.5,116 అందజేస్తానని ప్రకటించి, దాతలు ముందుకు వచ్చి బాలుడి విద్యాభారాన్ని పంచుకోవాలని పిలుపునిచ్చారు.

2 hrs ago
user_Priya
Priya
నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
2 hrs ago

అనాథ బాలుడి చదువుకు గురువు అండ.. భవిష్యత్ కోసం ప్రత్యేక నిధికి శ్రీకారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి విద్యార్థి ప్రేమ్ కుమార్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను ప్రమాదంలో కోల్పోయి నానమ్మ సంరక్షణలో పెరుగుతున్నాడు. ఎన్నో ఆర్థిక, కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ చదువులో ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మంగ నర్సింలు బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రేమ్ కుమార్ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అతని భవిష్యత్ విద్య కోసం ప్రత్యేక ఆర్థిక నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ నిధికి తొలి విరాళంగా రూ.5,116 అందజేస్తానని ప్రకటించి, దాతలు ముందుకు వచ్చి బాలుడి విద్యాభారాన్ని పంచుకోవాలని పిలుపునిచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • అనాథ బాలుడి చదువుకు గురువు అండ.. భవిష్యత్ కోసం ప్రత్యేక నిధికి శ్రీకారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి విద్యార్థి ప్రేమ్ కుమార్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను ప్రమాదంలో కోల్పోయి నానమ్మ సంరక్షణలో పెరుగుతున్నాడు. ఎన్నో ఆర్థిక, కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ చదువులో ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మంగ నర్సింలు బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రేమ్ కుమార్ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అతని భవిష్యత్ విద్య కోసం ప్రత్యేక ఆర్థిక నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ నిధికి తొలి విరాళంగా రూ.5,116 అందజేస్తానని ప్రకటించి, దాతలు ముందుకు వచ్చి బాలుడి విద్యాభారాన్ని పంచుకోవాలని పిలుపునిచ్చారు.
    1
    అనాథ బాలుడి చదువుకు గురువు అండ.. భవిష్యత్ కోసం ప్రత్యేక నిధికి శ్రీకారం
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి విద్యార్థి ప్రేమ్ కుమార్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను ప్రమాదంలో కోల్పోయి నానమ్మ సంరక్షణలో పెరుగుతున్నాడు. ఎన్నో ఆర్థిక, కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ చదువులో ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మంగ నర్సింలు బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రేమ్ కుమార్ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అతని భవిష్యత్ విద్య కోసం ప్రత్యేక ఆర్థిక నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ నిధికి తొలి విరాళంగా రూ.5,116 అందజేస్తానని ప్రకటించి, దాతలు ముందుకు వచ్చి బాలుడి విద్యాభారాన్ని పంచుకోవాలని పిలుపునిచ్చారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • సర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజులే మిగిలి ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, జూలై 30 ఉదయం 10 గంటల వరకు 63.27% నమోదు మాత్రమే జరిగిందన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా SIRలో పాల్గొని వివరాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
    1
    సర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి 
పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజులే మిగిలి ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, జూలై 30 ఉదయం 10 గంటల వరకు 63.27% నమోదు మాత్రమే జరిగిందన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా SIRలో పాల్గొని వివరాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • వేములవాడలో అద్భుతంగా తీర్చిదిద్దిన గుడి చెరువు.. ప్రత్యేక ఆకర్షణగా మినీ 'ఆదియోగి' విగ్రహం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఆనుకుని ఉన్న చారిత్రక 'గుడి చెరువు' ట్యాంక్‌బండ్ కొత్త హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
    1
    వేములవాడలో అద్భుతంగా తీర్చిదిద్దిన గుడి చెరువు.. ప్రత్యేక ఆకర్షణగా మినీ 'ఆదియోగి' విగ్రహం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఆనుకుని ఉన్న చారిత్రక 'గుడి చెరువు' ట్యాంక్‌బండ్ కొత్త హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • మెదక్‌లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమంNSSHసురేష్ మెదక్‌లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమం మెదక్‌లో గురువారం నేషనల్ ఎస్సీ-ఎస్టీ హబ్ (NSSH), హైదరాబాద్ ఆధ్వర్యంలో, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI) సహకారంతో ఎంట్రప్రెన్యూర్ అవగాహన మరియు ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం వినాయక కన్వెన్షన్ హాల్, మెదక్లో జరిగింది.అతిథుల స్వాగతం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ NSSHO ఎస్. సురేష్ స్వాగత ప్రసంగం చేశారు.తదుపరి డిక్కీ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు జె. సీతారాం, డిక్కీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు అరుణ దాసరి, ఎన్‌ఎస్‌ఐసీ (AP & తెలంగాణ) జోనల్ జనరల్ మేనేజర్ వి. సురేష్ బాబు పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ పథకాలు, ఎస్సీ–ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న సహాయ కార్యక్రమాలపై వివరించారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ–ఎస్టీ యువత ముందుకు రావాలని, ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలని పిలుపునిచ్చారు.అనంతరం సాంకేతిక సమావేశంలో ప్రభుత్వ కొనుగోలు విధానాలు, వెండర్ రిజిస్ట్రేషన్, ఆర్థిక సహాయం, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోమెదక్ జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ , దళిత సంఘ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
    1
    మెదక్‌లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమంNSSHసురేష్ 
మెదక్‌లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమం
మెదక్‌లో గురువారం నేషనల్ ఎస్సీ-ఎస్టీ హబ్ (NSSH), హైదరాబాద్ ఆధ్వర్యంలో, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI) సహకారంతో ఎంట్రప్రెన్యూర్ అవగాహన మరియు ప్రత్యేక వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం వినాయక కన్వెన్షన్ హాల్, మెదక్లో జరిగింది.అతిథుల స్వాగతం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ NSSHO ఎస్. సురేష్ స్వాగత ప్రసంగం చేశారు.తదుపరి డిక్కీ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు  జె. సీతారాం, డిక్కీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు అరుణ దాసరి, ఎన్‌ఎస్‌ఐసీ (AP & తెలంగాణ) జోనల్ జనరల్ మేనేజర్ వి. సురేష్ బాబు పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ పథకాలు, ఎస్సీ–ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న సహాయ కార్యక్రమాలపై వివరించారు.
పారిశ్రామిక రంగంలో ఎస్సీ–ఎస్టీ యువత ముందుకు రావాలని, ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలని పిలుపునిచ్చారు.అనంతరం సాంకేతిక సమావేశంలో ప్రభుత్వ కొనుగోలు విధానాలు, వెండర్ రిజిస్ట్రేషన్, ఆర్థిక సహాయం, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోమెదక్ జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ , దళిత సంఘ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    2 hrs ago
  • కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపడ్డాయని, సిబ్బంది నియామకాలు పెరిగాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులు కూడా సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
    1
    కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపడ్డాయని, సిబ్బంది నియామకాలు పెరిగాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులు కూడా సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
    user_FOCUS MEDIA
    FOCUS MEDIA
    Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    1 hr ago
  • భారీ వర్షాలు.. కరెంట్ పోల్స్ను టచ్ చేయకండి!..... వర్షాకాలంలో కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారుతాయి. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో నీటితో నిండిన వీధిలో విద్యుత్ లీకై ఒక యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇలాంటి సమయంలో వర్షపు నీటిలో నడిచేటప్పుడు పవర్ పోల్కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వేలాడుతున్న వైర్లు లేదా కరెంట్ లీకేజీలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
    1
    భారీ వర్షాలు.. కరెంట్ పోల్స్ను టచ్ చేయకండి!.....
వర్షాకాలంలో కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారుతాయి. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో నీటితో నిండిన వీధిలో విద్యుత్ లీకై ఒక యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇలాంటి సమయంలో వర్షపు నీటిలో నడిచేటప్పుడు పవర్ పోల్కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వేలాడుతున్న వైర్లు లేదా కరెంట్ లీకేజీలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
    user_MOHAMMED SALEEM꧁•𝐌𝐒𝐏@6078
    MOHAMMED SALEEM꧁•𝐌𝐒𝐏@6078
    Department of Social Services కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    10 hrs ago
  • మదీనా కాలనీలో వీధి కుక్కల భయం.. చిన్నారిపై దాడితో ప్రజల్లో ఆందోళన మదీనా కాలనీలో వీధి కుక్కల సమస్య మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో పిల్లలను బయటకు పంపాలన్నా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది. కాలనీలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం, గతంలో కూడా వీధి కుక్కల బెడదపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించలేదని వాపోతున్నారు. కుక్కలను పట్టుకుని తరలించడం, వాటి జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టడం, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. "మరో ప్రమాదం జరిగే వరకు అధికారులు ఎదురుచూడకూడదు. చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రాణం అమూల్యం.. ప్రజల భద్రతే ప్రభుత్వాల తొలి బాధ్యత" అని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    మదీనా కాలనీలో వీధి కుక్కల భయం.. చిన్నారిపై దాడితో ప్రజల్లో ఆందోళన
మదీనా కాలనీలో వీధి కుక్కల సమస్య మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో పిల్లలను బయటకు పంపాలన్నా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది. కాలనీలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, గతంలో కూడా వీధి కుక్కల బెడదపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించలేదని వాపోతున్నారు. కుక్కలను పట్టుకుని తరలించడం, వాటి జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టడం, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
"మరో ప్రమాదం జరిగే వరకు అధికారులు ఎదురుచూడకూడదు. చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రాణం అమూల్యం.. ప్రజల భద్రతే ప్రభుత్వాల తొలి బాధ్యత" అని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_Jeetender
    Jeetender
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.