Shuru
Apke Nagar Ki App…
వేములవాడలో అద్భుతంగా తీర్చిదిద్దిన గుడి చెరువు.. ప్రత్యేక ఆకర్షణగా మినీ 'ఆదియోగి' విగ్రహం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఆనుకుని ఉన్న చారిత్రక 'గుడి చెరువు' ట్యాంక్‌బండ్ కొత్త హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
GB MAHENDAR
వేములవాడలో అద్భుతంగా తీర్చిదిద్దిన గుడి చెరువు.. ప్రత్యేక ఆకర్షణగా మినీ 'ఆదియోగి' విగ్రహం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఆనుకుని ఉన్న చారిత్రక 'గుడి చెరువు' ట్యాంక్‌బండ్ కొత్త హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
More news from తెలంగాణ and nearby areas
- ఉప్పల్‌లో రూ.76.46 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన ఉప్పల్ నియోజకవర్గంలో రూ.76.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొంటూ, కాలువలు, సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, క్రీడా మైదానాలు తదితర పనులు చేపడుతున్నట్లు తెలిపారు.1
- భారీ వర్షాలు.. కరెంట్ పోల్స్ను టచ్ చేయకండి!..... వర్షాకాలంలో కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారుతాయి. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో నీటితో నిండిన వీధిలో విద్యుత్ లీకై ఒక యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇలాంటి సమయంలో వర్షపు నీటిలో నడిచేటప్పుడు పవర్ పోల్కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వేలాడుతున్న వైర్లు లేదా కరెంట్ లీకేజీలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.1
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- అనాథ బాలుడి చదువుకు గురువు అండ.. భవిష్యత్ కోసం ప్రత్యేక నిధికి శ్రీకారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి విద్యార్థి ప్రేమ్ కుమార్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను ప్రమాదంలో కోల్పోయి నానమ్మ సంరక్షణలో పెరుగుతున్నాడు. ఎన్నో ఆర్థిక, కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ చదువులో ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మంగ నర్సింలు బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రేమ్ కుమార్ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అతని భవిష్యత్ విద్య కోసం ప్రత్యేక ఆర్థిక నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ నిధికి తొలి విరాళంగా రూ.5,116 అందజేస్తానని ప్రకటించి, దాతలు ముందుకు వచ్చి బాలుడి విద్యాభారాన్ని పంచుకోవాలని పిలుపునిచ్చారు.1
- భువనగిరి: సైబర్ మోసం.. వీడియో కాల్తో బెదిరింపులు అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మన్మధ కుమార్ సూచించారు. చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి వీడియో కాల్ చేసి స్కీన్షాట్లు తీసిన మోసగాళ్లు, పోలీసు ఐడీ కార్డు డిపిగా పెట్టుకుని కేసు నమోదు కాకుండా డబ్బులు చెల్లించాలని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు పరిశీలించి ఇది సైబర్ మోసమని గుర్తించారు. అపరిచిత కాల్స్, బెదిరింపులను నమ్మవద్దని సీఐ సూచించారు.1
- వింత ఘటన: కాళేశ్వరంలో కురిసిన చేపల వర్షం! ఆశ్చర్యానికి గురైన ప్రజలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో ఓ వింత ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, కొన్ని ప్రాంతాల్లో ఆకాశం నుంచి వర్షంతో పాటు చేపలు పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పల్లె ప్రకృతి వనం, మజీద్ పల్లి తదితర ప్రాంతాల్లోని రోడ్లపై, నేలపై ఎటుచూసినా చిన్న చేపలు ప్రత్యక్షమయ్యాయి. సాధారణంగా కనిపించే చేపల్లా కాకుండా, వీటి శరీరంపై గట్టిగా బలమైన ముళ్లు ఉండటంతో ఇవి ఏ రకమైన చేపలని ప్రజలు ఆందోళన చెందారు. భారీ వర్షాలు, ఈదురు గాలులతో కూడిన తుఫానుల సమయంలో ఆకాశంలో ఏర్పడే సుడిగాలి (వాటర్ స్పాట్) ప్రభావంతో సమీపంలోని జలశయాల నుంచి నీటితో పాటు చేపలు కూడా పైకి ఎగసి, వర్షం రూపంలో కిందకు పడి ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వింత ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివస్తున్నారు.1
- SIR వేగవంతం చేయాలి.. బీఎల్‌వోలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచన అక్రమ ఎయిర్‌టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి1
- DANGER: పిల్లలకు టీ, కాఫీ తాగిస్తున్నారా?.... 12ఏళ్ల లోపు పిల్లలకు టీ లేదా కాఫీలు ఇవ్వడం ఆరోగ్యానికి చాలా హానికరం అని పిల్లల వైద్యుడు గౌతమ్ హెచ్చరించారు. టీలో టానిన్లు, కాఫీలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల పిల్లల్లో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత వస్తుందని చెప్పారు. అలాగే ఇది ఆకలిని తగ్గించడంతో పాటు హైపర్ యాక్టివిటీ పెరగడం, నిద్రలేమి సమస్య లకు దారితీస్తుందని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య రీత్యా వీటికి దూరంగా ఉంచాలని ఆయన సూచించారు.1
- జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ స్నేహమేహ్ర వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వికారాబాద్ Hasn't ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర పేర్కొన్నారు. రాబోయే 48 గంటల పాటు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని పోలీసులు అందరూ సిబ్బంది 24 * 7 అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో అత్యవసర పరిస్థితులకు వెంటనే స్పందించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాగులు వంకలు చెరువులో ప్రాజెక్టులు ఉదృతంగా ప్రవహిస్తే ప్రజలు ఎట్టి పరిస్థితిలోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరిక జారీ చేశారు.1