Shuru
Apke Nagar Ki App…
DANGER: పిల్లలకు టీ, కాఫీ తాగిస్తున్నారా?.... 12ఏళ్ల లోపు పిల్లలకు టీ లేదా కాఫీలు ఇవ్వడం ఆరోగ్యానికి చాలా హానికరం అని పిల్లల వైద్యుడు గౌతమ్ హెచ్చరించారు. టీలో టానిన్లు, కాఫీలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల పిల్లల్లో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత వస్తుందని చెప్పారు. అలాగే ఇది ఆకలిని తగ్గించడంతో పాటు హైపర్ యాక్టివిటీ పెరగడం, నిద్రలేమి సమస్య లకు దారితీస్తుందని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య రీత్యా వీటికి దూరంగా ఉంచాలని ఆయన సూచించారు.
MOHAMMED SALEEM꧁•𝐌𝐒𝐏@6078
DANGER: పిల్లలకు టీ, కాఫీ తాగిస్తున్నారా?.... 12ఏళ్ల లోపు పిల్లలకు టీ లేదా కాఫీలు ఇవ్వడం ఆరోగ్యానికి చాలా హానికరం అని పిల్లల వైద్యుడు గౌతమ్ హెచ్చరించారు. టీలో టానిన్లు, కాఫీలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల పిల్లల్లో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత వస్తుందని చెప్పారు. అలాగే ఇది ఆకలిని తగ్గించడంతో పాటు హైపర్ యాక్టివిటీ పెరగడం, నిద్రలేమి సమస్య లకు దారితీస్తుందని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య రీత్యా వీటికి దూరంగా ఉంచాలని ఆయన సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- SIR వేగవంతం చేయాలి.. బీఎల్‌వోలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచన అక్రమ ఎయిర్‌టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి1
- ఫోన్ ఎత్తలేదని స్నేహితుల వినూత్న ప్రతీకారం.. బ్యాండు మేళాతో ఇంటిపైకి దండయాత్ర! స్నేహితులు అంటేనే అల్లరి, సరదాలు, కొట్లాటలు. అయితే, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదనే కోపంతో ఓ గ్రూప్ ఫ్రెండ్స్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుమార్ భాయ్ అనే వ్యక్తి తన స్నేహితుల ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో, వారంతా ఊరుకోకుండా వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నారు. "కుమార్ భాయ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే బ్యాండు మేళాలతో అతని ఇంటికి వెళ్తున్నాం" అంటూ వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డప్పు చప్పుళ్లు, కేరింతలతో నేరుగా అతని ఇంటి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఈ ఊహించని షాక్ చూసి కుమార్ అవాక్కై, ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. మీ ఫ్రెండ్స్ లోనూ ఫోన్ ఎత్తని వాళ్లుంటే ఈ ఫన్నీ వీడియోను వారికి వెంటనే షేర్ చేయండి!1
- సర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజులే మిగిలి ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, జూలై 30 ఉదయం 10 గంటల వరకు 63.27% నమోదు మాత్రమే జరిగిందన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా SIRలో పాల్గొని వివరాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.1
- మూడున్నర ఏళ్ల క్రితం రాహుల్ గాంధీ మాటిచ్చారు :కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి నాకు ఎవరిమీదైనా కోపం ఉంటే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీకే చెప్తాను మూడున్నరేళ్ల క్రితం రాహుల్ గాంధీకి మాటిచ్చాను..అందుకే అంతర్గత విషయాలు బయట మాట్లాడటంలేదు – కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి1
- నిషేధిత రైల్వే ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చేయరాదు : ఆర్పిఎఫ్ భువనగిరి ఎస్ఐ కె.కిష్టయ్య నిషేధిత రైల్వే ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలను నిలపరాదని, వాహనాలను నిలిపినచో భారత రైల్వే యాక్ట్ 159 అమెండ్మెంట్ 2026 ప్రకారం ఐదు వందల రూపాయల పెనాల్టీ విధించడం జరుగుతుందని ఆర్పిఎఫ్ భువనగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె.కిష్టయ్య తెలిపారు. బుధవారం జనగామ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పలువురు ప్రయాణికులతో మాట్లాడుతూ నిషేధిత రైల్వే ప్రగణంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చెసినచో భారత రైల్వే యాక్ట్ 159/2026 ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోబడతాయో వివరించారు. 500 రూపాయల నుండి ఆపై ఫైన్ వేయబడునని, ప్రజలు, ప్రయాణికులు ఇది గమనించాలి సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.2
- అక్రమ ఎయిర్‌టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి మల్కాజిగిరి డివిజన్ సర్దార్‌పటేల్ నగర్‌లో అనుమతులు లేకుండా ఎయిర్‌టెల్ టవర్ నిర్మిస్తున్నారని కాలనీవాసులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో సమస్యను వివరించారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారని, అక్రమ నిర్మాణంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.1
- ఓవర్‌హెడ్ వైర్ షార్ట్ సర్క్యూట్: రైలు ప్రయాణికుల్లో భయాందోళన! BREAKING NEWS: రైల్వే ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి ఘటనల్లో మొత్తం రైలుకు విద్యుత్ ప్రవహించి భారీ ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందా అనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదాలను నివారించడానికి ఇప్పటికే పటిష్టమైన భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల పూర్తి రక్షణ కోసం రైల్వే శాఖ అత్యవసరంగా మరిన్ని అదనపు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. #IndianRailways #TrainSafety #OverheadWire #ShortCircuit #RailNews1
- సీజనల్ వ్యాధులపై వెంకటాయపల్లిలో ప్రత్యేక దృష్టి.. దోమల నివారణకు ఆయిల్ బాల్స్ తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామంలోని నిల్వ నీటి ప్రాంతాలను గుర్తించి దోమల లార్వా నిర్మూలన కోసం ఆయిల్ బాల్స్ వేశారు. సర్పంచ్ బట్టికాడి హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ఇలాంటి నివారణ చర్యలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.1
- ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హవేలి ఘనపూర్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరోసారి ధూప్ సింగ్ తండా ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో వాడి గ్రామపంచాయతీ పరిధిలోని ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తండాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారంగా నూతన వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు అధికారులను కోరుతున్నారు. కొత్త బ్రిడ్జి పూర్తయితే ఈ సమస్యకు శాశ్వతంగా తెరపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.1