Shuru
Apke Nagar Ki App…
ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
KUMAR
ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
More news from తెలంగాణ and nearby areas
- ఫోన్ ఎత్తలేదని స్నేహితుల వినూత్న ప్రతీకారం.. బ్యాండు మేళాతో ఇంటిపైకి దండయాత్ర! స్నేహితులు అంటేనే అల్లరి, సరదాలు, కొట్లాటలు. అయితే, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదనే కోపంతో ఓ గ్రూప్ ఫ్రెండ్స్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుమార్ భాయ్ అనే వ్యక్తి తన స్నేహితుల ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో, వారంతా ఊరుకోకుండా వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నారు. "కుమార్ భాయ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే బ్యాండు మేళాలతో అతని ఇంటికి వెళ్తున్నాం" అంటూ వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డప్పు చప్పుళ్లు, కేరింతలతో నేరుగా అతని ఇంటి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఈ ఊహించని షాక్ చూసి కుమార్ అవాక్కై, ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. మీ ఫ్రెండ్స్ లోనూ ఫోన్ ఎత్తని వాళ్లుంటే ఈ ఫన్నీ వీడియోను వారికి వెంటనే షేర్ చేయండి!1
- సీజనల్ వ్యాధులపై వెంకటాయపల్లిలో ప్రత్యేక దృష్టి.. దోమల నివారణకు ఆయిల్ బాల్స్ తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామంలోని నిల్వ నీటి ప్రాంతాలను గుర్తించి దోమల లార్వా నిర్మూలన కోసం ఆయిల్ బాల్స్ వేశారు. సర్పంచ్ బట్టికాడి హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ఇలాంటి నివారణ చర్యలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.1
- SIR వేగవంతం చేయాలి.. బీఎల్‌వోలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచన అక్రమ ఎయిర్‌టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి1
- భారీ వర్షాలు.. కరెంట్ పోల్స్ను టచ్ చేయకండి!..... వర్షాకాలంలో కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారుతాయి. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో నీటితో నిండిన వీధిలో విద్యుత్ లీకై ఒక యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇలాంటి సమయంలో వర్షపు నీటిలో నడిచేటప్పుడు పవర్ పోల్కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వేలాడుతున్న వైర్లు లేదా కరెంట్ లీకేజీలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.1
- వ్యవసాయ ఎరువుల కోసం బుకింగ్ యాప్ రద్దుచేసి, బ్యాంకు, రైతు వేదికల ద్వారా రైతులకు యురియా అందించాలి : తెలంగాణ రైతు సంఘం. వికారాబాద్ : వ్యవసాయ ఎరువుల కోసం బుకింగ్ యాప్ రద్దుచేసి pacs రైతు వేదికల నుండి ప్రభుత్వం రైతులకు యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు ప్రభుత్వం సబ్సిడీతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు పంపిణీ చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. అందులో భాగంగా ఈరోజు బుధవారం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని పలు ఎరువుల దుకాణాలకు వెళ్లి రైతు సంఘం వికారాబాద్ నాయకులు పరిశీలించారు. రైతులు పడుతున్న సమస్యలు తెలుసుకొని ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన ఎరువు ధరలు కాకుండా దళారులు తమ ఇష్టానుసారంగా ఏరియాను డిఏపిని అమ్ముతున్నారని ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్ర పూజలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా వెలసిన పద్మావతి అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం శ్రవణా నక్షత్ర పూజలను శ్రీ రామభక్త భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాయగిరి కమాన్ వద్ద డప్పు వాయిద్యాలు స్వామివారి కీర్తనలతో పాదయాత్ర నిర్వహించి స్టేషన్ రాయగిరి వద్ద గల వెంకటేశ్వర స్వామి గుట్టపైకి మెట్ల ద్వారా బయలుదేరి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అభిషేకాధి కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు వివిధ ప్రాంతాలకు చెందినవారు వందల మందిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన మండలి సభ్యులు గడ్డమీ చంద్రయ్య గౌడ్ పెద్దగాని శ్రీనివాస్ గౌడ్ సామల శ్రీరాములు నర రమేష్1
- ఓవర్‌హెడ్ వైర్ షార్ట్ సర్క్యూట్: రైలు ప్రయాణికుల్లో భయాందోళన! BREAKING NEWS: రైల్వే ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి ఘటనల్లో మొత్తం రైలుకు విద్యుత్ ప్రవహించి భారీ ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందా అనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదాలను నివారించడానికి ఇప్పటికే పటిష్టమైన భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల పూర్తి రక్షణ కోసం రైల్వే శాఖ అత్యవసరంగా మరిన్ని అదనపు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. #IndianRailways #TrainSafety #OverheadWire #ShortCircuit #RailNews1
- ఎడతెరిపి వర్షాలు.. ఉప్పొంగుతున్న వాగులు, అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక చిన్నశంకరంపేట మండలంలో కురుస్తున్న ఎడతెరిపి వర్షాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. సూరారం, బాగిరెడ్డిపల్లి, చెన్నైపల్లి తదితర గ్రామాల పరిసరాల్లో వాగులు, కుంటలు నిండుకుండలా మారి పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల దృష్ట్యా వాగులు, కాల్వలను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, చిన్నారులు నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు.1
- అక్రమ ఎయిర్‌టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి మల్కాజిగిరి డివిజన్ సర్దార్‌పటేల్ నగర్‌లో అనుమతులు లేకుండా ఎయిర్‌టెల్ టవర్ నిర్మిస్తున్నారని కాలనీవాసులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో సమస్యను వివరించారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారని, అక్రమ నిర్మాణంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.1