ఏలేరు సాగునీరు పంపిణీని కట్టుదిట్టంగా అమలు చేయాలి... జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కాకినాడ బ్యూరో /ఆగస్టు 1:- ఏలేరు ఆయకట్టు కింద సాగు నీరు పంపిణీని వంతులు వారి విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలేరు ఆయకట్టు కింద సాగునీరు పంపిణీని వంతులు వారి విధానం అమలు, అధికారుల బృందం నిత్యం పర్యవేక్షణ, రైతులకు ఎల్నినో ప్రభావం, సాగునీరు ఎద్దడి, పంటల భీమా నమోదుపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై సిబ్బందికి జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం, ప్రస్తుత జిల్లాలో సాగునీటి వనరుల లభ్యత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏలేరు జలాశయం కింద ఉన్న ఆయకట్టుకు అలాంటి సమస్యలు తలెత్తకుండా పంతులు వారి విధానాన్ని అత్యంత కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. సాగునీరు పంపిణీ వంతుల వారి విధానం పటిష్టంగా అమలయ్యేలా రెవెన్యూ వ్యవసాయం ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందంలోని అధికారులు నీటి విడుదల సమయంలో అనధికారికంగా సాగునీరు వినియోగించ కుండా నిత్యం పర్యవేక్షణ చేసి, చివరి పంట భూములకు సజావుగా సాగునీరు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.ఇందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని చెప్పారు. రైతులు సాగునీరుపై కంట్రోల్ రూమ్ నెంబర్ 9849903879కు ఫోన్ చేసి తమ సమస్యను తెలియపరచవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రధానంగా రైతులందరూ ఖరీఫ్ సీజన్ కుసంబంధించి పంటల బీమా నమోదు చేసుకునేలాచూడాలన్నారు. ఏలేరు ఆయకట్టు కింద సాగవుతున్న 53 వేల ఎకరాలు పంటల బీమా కింద నమోదయ్యేలా చూడాలన్నారు.ఆగస్టు 15 నాటికి రైతులందరూ తప్పనిసరిగా పంటల బీమా పథకం కింద నమోదు అయ్యేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం, పంటల భీమా నమోదు,రైతులను ఆరుతడి పంటలవైపు ప్రోత్సహించడం వంటి అంశాలపై రైతు సేవా కేంద్రం స్థాయిలో సాగునీటి సంఘాలు, రైతు సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కాకినాడ ఆర్డీవో ఎస్ మల్లిబాబు, వ్యవసాయ శాఖ అధికారి కె రాబర్ట్ పాల్, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, డీఈ రవి కుమార్, ఎల్డీఎం సీహెచ్ఎస్వీ ప్రసాద్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఏలేరు సాగునీరు పంపిణీని కట్టుదిట్టంగా అమలు చేయాలి... జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కాకినాడ బ్యూరో /ఆగస్టు 1:- ఏలేరు ఆయకట్టు కింద సాగు నీరు పంపిణీని వంతులు వారి విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలేరు ఆయకట్టు కింద సాగునీరు పంపిణీని వంతులు వారి విధానం అమలు, అధికారుల బృందం నిత్యం పర్యవేక్షణ, రైతులకు ఎల్నినో ప్రభావం, సాగునీరు ఎద్దడి, పంటల భీమా నమోదుపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై సిబ్బందికి జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం, ప్రస్తుత జిల్లాలో సాగునీటి వనరుల లభ్యత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏలేరు జలాశయం కింద ఉన్న ఆయకట్టుకు అలాంటి సమస్యలు తలెత్తకుండా పంతులు వారి విధానాన్ని అత్యంత కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. సాగునీరు పంపిణీ వంతుల వారి విధానం పటిష్టంగా అమలయ్యేలా రెవెన్యూ వ్యవసాయం ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందంలోని అధికారులు నీటి
విడుదల సమయంలో అనధికారికంగా సాగునీరు వినియోగించ కుండా నిత్యం పర్యవేక్షణ చేసి, చివరి పంట భూములకు సజావుగా సాగునీరు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.ఇందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని చెప్పారు. రైతులు సాగునీరుపై కంట్రోల్ రూమ్ నెంబర్ 9849903879కు ఫోన్ చేసి తమ సమస్యను తెలియపరచవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రధానంగా రైతులందరూ ఖరీఫ్ సీజన్ కుసంబంధించి పంటల బీమా నమోదు చేసుకునేలాచూడాలన్నారు. ఏలేరు ఆయకట్టు కింద సాగవుతున్న 53 వేల ఎకరాలు పంటల బీమా కింద నమోదయ్యేలా చూడాలన్నారు.ఆగస్టు 15 నాటికి రైతులందరూ తప్పనిసరిగా పంటల బీమా పథకం కింద నమోదు అయ్యేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం, పంటల భీమా నమోదు,రైతులను ఆరుతడి పంటలవైపు ప్రోత్సహించడం వంటి అంశాలపై రైతు సేవా కేంద్రం స్థాయిలో సాగునీటి సంఘాలు, రైతు సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కాకినాడ ఆర్డీవో ఎస్ మల్లిబాబు, వ్యవసాయ శాఖ అధికారి కె రాబర్ట్ పాల్, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, డీఈ రవి కుమార్, ఎల్డీఎం సీహెచ్ఎస్వీ ప్రసాద్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Post by Adimlamganash1
- *ఇంస్టాగ్రామ్ లొ ఫేక్ ఐడి తో ఇబ్బంది పెడుతున్న యువకులు. తగరపువలసకు చెందిన సీశెట్టి రాజేశ్వరి అను ఆమె చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక వీడియో కింద ఎవరో ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి అసభ్య కామెంట్లు పెడుతుండడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పద్దానికి ప్రయత్నించింది, ఇంతలో వాళ్ళ అక్క వద్దని చెప్పడం తో వొద్దు అనుకున్నది, అందువల్ల ఏ హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళ లేదు. ఈరోజు ఈ విషయం గురించి పేపర్లో వార్త రావడంతో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పందించి భీమిలి సీఐ దివాకర్ గారికి చెప్పగా, భీమిలి సి. ఐ దివాకర్ గారు వారి సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ తో కలిసి సదరు సీశెట్టి రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఎందు కైనా మంచిది అని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి, చికిత్స చేయించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పినారు మరియు ఫేక్ ఐడి తో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న ఆ వ్యక్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసు వారికి కూడా తెలియపరచడం అయినది. భవిష్యత్తులో బీమిలి పోలీస్ లు అండగా ఉంటారు అనే నమ్మకం తో గౌరవ సీపీ గారికి కృతఙ్ఞతలు తెలియ చేయడమైనది.1
- వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.1
- భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం...... భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.1
- వరదల వేళ మాల్స్ జాతర... ప్రజల భద్రత గాలికేనా..? జీవి మాల్, కసం సేల్‌కు పోటెత్తిన జనం. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుండగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో పట్టణంలో నిర్వహించిన GV మాల్ ఓపెనింగ్ మరియు కసం ఆషాఢం సేల్ ధమాకా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు వరద పరిస్థితులతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వేలాది మంది మహిళలు, చిన్నారులు, యువత షాపింగ్ మాల్స్ వద్దకు చేరుకోవడంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. GV మాల్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్ పరిసర ప్రాంతంలో భారీ జనసందోహం ఏర్పడటంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న సమయంలో ఇలాంటి భారీ కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే ముందు భద్రతా ప్రమాణాలను ఎంత మేర పరిశీలించారనే అంశంపై చర్చ జరుగుతోంది. మరోవైపు కసం ఆషాఢం సేల్ ధమాకా నిర్వహించిన ప్రాంగణంలో కూడా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. జనసమ్మర్థం కారణంగా తోపులాట లేదా తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర బయటపడే దారులు, అగ్నిమాపక భద్రత, తగిన భద్రతా సిబ్బంది వంటి అంశాలు అత్యంత కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు. స్థానికుల దృష్టిని ఆకర్షించిన మరో అంశం GV మాల్ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్. భారీ రద్దీ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు సరిపోతున్నాయా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల వద్ద మరింత పటిష్టమైన రక్షణ చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు ముందస్తుగా సంయుక్తంగా భద్రతా తనిఖీలు నిర్వహించాయా? ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల రాకపోకలు, జనసమ్మర్థ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భద్రాచలంలో వినిపిస్తున్నాయి. అలాగే గోదావరి వరదలతో అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్న ఈ సమయంలో ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాలను మరింత విస్తృతంగా సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికీ ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భారీ ఆఫర్లు, సినీ ప్రముఖుల హాజరు వంటి కారణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు నిర్వాహకులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు కూడా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. వ్యాపార కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో ప్రజల ప్రాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- 🙏🙏1
- Post by Adimlamganash1
- మొరాకో-స్పెయిన్ సరిహద్దులో వలస సంక్షోభం తీవ్రం. 57 మంది మృతి. 🔹 వలసదారులను చట్టబద్ధం చేస్తారనే ఆశతో మొరాకో నుంచి భారీగా స్పెయిన్‌లోకి ప్రవేశం 🔹 కేవలం 24 గంటల్లోనే సుమారు 60 వేల మంది దేశంలోకి వచ్చినట్లు స్పెయిన్ అధికారులు వెల్లడి 🔹 సరిహద్దు దాటే ప్రయత్నాల్లో 57 మంది మృతి 🔹 వలసదారులు-భద్రతా బలగాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు 🔹 పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు1