logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత : డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భారీ నిరసన కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పెద్దఎత్తున జరిగిన అవకతవకలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేతలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు శాప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా నిరసనకారులు డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైసీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు బారికేడ్లు పెట్టి అమానుషంగా అడ్డుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను అడ్డం పెట్టి రాకపోకలను పూర్తిగా నిలిపివేయడమే కాకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసే హక్కును కాలరాసేలా పోలీసులు వ్యవహరించడంపై పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ప్రభుత్వ వైఫల్యాలను, డీఎస్సీ స్కామ్‌ను కప్పిపుచ్చుకోవడానికే పోలీసులను ముందుంచి ప్రభుత్వం ఈ విధమైన అణచివేత చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము.

7 hrs ago
user_దాసరి నటరాజు
దాసరి నటరాజు
ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago

విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత : డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భారీ నిరసన కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పెద్దఎత్తున జరిగిన అవకతవకలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేతలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు శాప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా నిరసనకారులు డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైసీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు బారికేడ్లు పెట్టి అమానుషంగా అడ్డుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను అడ్డం పెట్టి రాకపోకలను పూర్తిగా నిలిపివేయడమే కాకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసే హక్కును కాలరాసేలా పోలీసులు వ్యవహరించడంపై పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ప్రభుత్వ వైఫల్యాలను, డీఎస్సీ స్కామ్‌ను కప్పిపుచ్చుకోవడానికే పోలీసులను ముందుంచి ప్రభుత్వం ఈ విధమైన అణచివేత చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము.

More news from Bapatla and nearby areas
  • గొర్రెల మంద పైకి దూసుకు వెళ్లిన లారి 30 గొర్రెలు మృతి పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనగర్‌–పొందుగుల మధ్య రహదారిపై రోడ్డు దాటుతున్న గొర్రెల మందపై లారీ ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంతో రహదారిపై గొర్రెల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న దాచేపల్లి సీఐ, ఎస్‌ఐ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన గొర్రెలను రోడ్డుపై నుంచి పక్కకు తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు అదుపులోకి తీసుకుని దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    1
    గొర్రెల  మంద పైకి దూసుకు వెళ్లిన లారి 30 గొర్రెలు  మృతి 
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 
శ్రీనగర్‌–పొందుగుల మధ్య రహదారిపై రోడ్డు దాటుతున్న గొర్రెల మందపై లారీ ఒక్కసారిగా దూసుకెళ్లింది. 
ఈ ఘటనలో సుమారు 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. 
ప్రమాదంతో రహదారిపై గొర్రెల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 
సమాచారం అందుకున్న దాచేపల్లి సీఐ, ఎస్‌ఐ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 
మృతి చెందిన గొర్రెలను రోడ్డుపై నుంచి పక్కకు తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. 
ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు అదుపులోకి తీసుకుని దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    13 hrs ago
  • ఒరాకిల్ లేఆఫ్స్ ఉద్యోగాలు కోల్పోయిన వారి ఆవేదన ⚡ వాడుకున్నంత కాలం వాడుకుని ఇష్టమొచ్చినట్లు ఉద్యోగాల్లోంచి తీసేస్తే తమ పరిస్థితి ఏంటని ఒరాకిల్ లేఆఫ్స్‌లో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    1
    ఒరాకిల్ లేఆఫ్స్ ఉద్యోగాలు కోల్పోయిన వారి ఆవేదన
⚡ వాడుకున్నంత కాలం వాడుకుని ఇష్టమొచ్చినట్లు ఉద్యోగాల్లోంచి తీసేస్తే తమ పరిస్థితి ఏంటని ఒరాకిల్ లేఆఫ్స్‌లో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తొలి దశలో 25 లేబర్ అడ్డాలను ఏర్పాటు ,.రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ మరో 200 లేబర్ అడ్డాలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం తాడేపల్లిగూడెం , గణేష్ నగర్ లో రూ.26లక్షలు ఏర్పాటు చేస్తున్న లేబర్ అడ్డా పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే, తాడేపల్లిగూడెంలో ఎక్కువ మంది కార్మికులు ఉండటంతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాపీ, వడ్రంగి, ప్లంబర్, ఎలక్ట్రికల్ కార్మికులంతా ఒక్క చోటకు చేరుకునే ప్రాంతమే లేబర్ అడ్డా అని పేర్కొన్నారు. లేబర్ అడ్డా ముఖ్యోద్దేశాన్ని లేబర్ కమిషనర్, ఇతర అధికారులు రూపొందించడం జరిగిందన్నారు. తమిళనాడులో ముందుగా 50 లేబర్ అడ్డాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లేబర్ అడ్డా నమూనాకు సీఎం చంద్రబాబు రూపకల్పన చేశారన్నారు. మరో 200 లేబర్ అడ్డాలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. లేబర్ అడ్డాలలో ఒక కంప్యూటర్ ఆపరేటర్, కోఆర్డినేటర్, ముగ్గురు వాచ్ మెన్ , వ్యాను, డ్రైవర్, స్వీపర్ ఉంటారన్నారు. లేబర్ అడ్డాకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు తమ అవసరాలకు యాప్ ద్వారా కార్మికులను వినియోగించుకోవచ్చన్నారు. లేబర్ అడ్డా ప్రారంభానికి ముందుగానే విధివిధానాలు త్వరలో తెలియజేస్తామన్నారు. సీఎం సమక్షంలో జరిగే సమీక్ష సమావేశంలో విషయాలను వెల్లడిస్తారన్నారు. రాజమహేంద్రవరం, మంగళగిరిలో లేబర్ అడ్డాలు సిద్ధమయ్యాయని బాబ్జీ వివరించారు. సీఎం అపాయింట్ మెంట్ రాగానే 25 లేబర్ అడ్డాలను ప్రారంభిస్తామన్నారు. ప్రధానంగా లేబర్ అడ్డాలలో రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాలు, కార్మికుల గుర్తింపు కార్డు నవీకరణ, నైపుణ్య శిక్షణ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడును స్పూర్తిగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో లేబర్ అడ్డాలు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారన్నారు. లేబర్ అడ్డాల ద్వారా తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలు మన రాష్ట్రం అమలుకు ఏపీబీవోసీడబ్ల్యూడబ్ల్యూ బోర్డు, కార్మిక శాఖ మంత్రి సుభాష్, కమిషనర్, సెక్రటరీ తరపున కృషి చేస్తామన్నారు. ఇక్కడ మంచి స్థలం సమకూర్చిన తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక శాఖ అధికారి గోపి కుమార్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, లీల, వాసు, పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
    2
    రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తొలి దశలో 25 లేబర్ అడ్డాలను ఏర్పాటు ,.రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ
మరో 200 లేబర్ అడ్డాలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం
తాడేపల్లిగూడెం , గణేష్ నగర్ లో రూ.26లక్షలు ఏర్పాటు చేస్తున్న లేబర్ అడ్డా పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే, తాడేపల్లిగూడెంలో ఎక్కువ మంది కార్మికులు ఉండటంతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాపీ, వడ్రంగి, ప్లంబర్, ఎలక్ట్రికల్ కార్మికులంతా ఒక్క చోటకు చేరుకునే ప్రాంతమే లేబర్ అడ్డా అని పేర్కొన్నారు. లేబర్ అడ్డా ముఖ్యోద్దేశాన్ని లేబర్ కమిషనర్, ఇతర అధికారులు రూపొందించడం జరిగిందన్నారు. తమిళనాడులో ముందుగా 50 లేబర్ అడ్డాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లేబర్ అడ్డా నమూనాకు సీఎం చంద్రబాబు రూపకల్పన చేశారన్నారు. మరో 200 లేబర్ అడ్డాలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. లేబర్ అడ్డాలలో ఒక కంప్యూటర్ ఆపరేటర్, కోఆర్డినేటర్, ముగ్గురు వాచ్ మెన్ , వ్యాను, డ్రైవర్, స్వీపర్ ఉంటారన్నారు. లేబర్ అడ్డాకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు తమ అవసరాలకు యాప్ ద్వారా కార్మికులను వినియోగించుకోవచ్చన్నారు. లేబర్ అడ్డా ప్రారంభానికి ముందుగానే విధివిధానాలు త్వరలో తెలియజేస్తామన్నారు. సీఎం సమక్షంలో జరిగే సమీక్ష సమావేశంలో విషయాలను వెల్లడిస్తారన్నారు. రాజమహేంద్రవరం, మంగళగిరిలో లేబర్ అడ్డాలు సిద్ధమయ్యాయని బాబ్జీ వివరించారు. సీఎం అపాయింట్ మెంట్ రాగానే 25 లేబర్ అడ్డాలను ప్రారంభిస్తామన్నారు. ప్రధానంగా లేబర్ అడ్డాలలో రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాలు, కార్మికుల గుర్తింపు కార్డు నవీకరణ, నైపుణ్య శిక్షణ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడును స్పూర్తిగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో లేబర్ అడ్డాలు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారన్నారు. లేబర్ అడ్డాల ద్వారా తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలు మన రాష్ట్రం అమలుకు ఏపీబీవోసీడబ్ల్యూడబ్ల్యూ బోర్డు, కార్మిక శాఖ మంత్రి సుభాష్, కమిషనర్, సెక్రటరీ తరపున కృషి చేస్తామన్నారు. ఇక్కడ మంచి స్థలం సమకూర్చిన తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక శాఖ అధికారి గోపి కుమార్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, లీల, వాసు, పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
    user_అయితం ప్రసాద్
    అయితం ప్రసాద్
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ఎన్టీఆర్ కాలనీలో అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కేవలం మూడు రోజుల్లో నేర్చుకున్న నృత్యాలను ప్రదర్శించి.. మేమేమీ తక్కువ కాదు అంటూ ఆటపాటలతో అలరించారు. విద్యార్థినీల నృత్యాలను చూసిన స్థానికులు చప్పట్లతో వారిని అభినందిస్తూ ఉత్సాహపరిచారు. విద్యార్థినీల ప్రతిభకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు స్థానిక ఉపాధ్యాయుడు నరసింహారావు విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నారు. చదువుతో పాటు ఆటపాటలు.. ప్రతిభకు ప్రోత్సాహం అనే విధంగా ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్న నరసింహారావు ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
    3
    ఎన్టీఆర్ కాలనీలో అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కేవలం మూడు రోజుల్లో నేర్చుకున్న నృత్యాలను ప్రదర్శించి.. మేమేమీ తక్కువ కాదు అంటూ ఆటపాటలతో అలరించారు.
విద్యార్థినీల నృత్యాలను చూసిన స్థానికులు చప్పట్లతో వారిని అభినందిస్తూ ఉత్సాహపరిచారు.
విద్యార్థినీల ప్రతిభకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు స్థానిక ఉపాధ్యాయుడు నరసింహారావు విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నారు.
చదువుతో పాటు ఆటపాటలు.. ప్రతిభకు ప్రోత్సాహం అనే విధంగా ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్న నరసింహారావు ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • మారెళ్లపాడు లిఫ్ట్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారు •ఈ నెల 23 న మంత్రుల చేతుల మీదగా ప్రారంభోత్సవం •16,180 ఎకరాలకు సాగునీరు.. •తీరనున్న దశాబ్దాల రైతుల కల •ఎమ్మెల్యే పాయం ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవం లో పాల్గొననున్న మంత్రి తుమ్మల •ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు: మణుగూరు, అశ్వాపురం మండలాల రైతుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. గోదావరి జలాలను ఆయకట్టుకు తరలించే మారెళ్లపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. . స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు పాల్గొనున్నారు..రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇప్పటికే ట్రయల్‌రన్‌ విజయవంతం కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వరప్రదాయినిగా మారెళ్లపాడు సీతారామ ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సీతారామ ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి ఆయకట్టుకు అందించేలా ఈ పథకాన్ని చేపట్టారు. మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని సుమారు 16,180 ఎకరాలకు సాగునీరు అందనుంది. పథకంలో భాగంగా హెడ్‌వర్క్స్‌కు రూ.25 కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.113.17 కోట్లు, భూసేకరణకు రూ.42.30 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రూ.25 కోట్లతో పంప్‌హౌస్‌ మెఘా ఇంజినీరింగ్‌ సంస్థ రూ.25 కోట్లతో పంప్‌హౌస్‌ నిర్మాణాన్ని చేపట్టగా, పనులు దాదాపు పూర్తయ్యాయి. 1.80 మెగావాట్ల సామర్థ్యం గల రెండు మోటార్ల ద్వారా 46 మీటర్ల ఎత్తు నుంచి 85 మీటర్ల ఎత్తు వరకు, అంటే సుమారు 39 మీటర్ల మేర 180 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. పంప్‌హౌస్‌ నుంచి 2.4 కి.మీ. దూరంలో కొండ కింద డెలివరీ సిస్టర్న్‌ను నిర్మించారు. అక్కడి నుంచి నీరు కాలువల్లోకి చేరుతుంది. కాలువలు.. ఆయకట్టు వివరాలు సిస్టర్న్‌ నుంచి 10.070 కి.మీ. మేర రెండు ప్రధాన కాలువలు నిర్మించాల్సి ఉంది. 9.650 కి.మీ. పొడవైన కుడి కాలువ ద్వారా 11,915 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 420 మీటర్ల ఎడమ కాలువ ద్వారా తుమ్మల చెరువు నిండనుండగా, దాని కింద ఇప్పటికే ఉన్న 4,266 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మొత్తం 16,180 ఎకరాల్లో సుమారు 11 వేల ఎకరాలు కొత్త ఆయకట్టు కావడం విశేషం. తొలిదశలో 7 వేల ఎకరాలు ప్రధాన కాలువ పనులు ప్రస్తుతం టెండర్‌ దశలో ఉన్నాయి. అందుకే తొలిదశలో లిఫ్ట్‌ ద్వారా తుమ్మల చెరువుకు నీటిని తరలించి, ఆ చెరువు కింద 5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. మరో 2 వేల ఎకరాలకు కూడా నీరందుతుంది. కాలువ పనులు పూర్తయితే మొత్తం 16,180 ఎకరాలకు నీరు అందుతుంది. తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు లబ్ధి ఈ పథకం ద్వారా తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు ప్రయోజనం చేకూరనుంది. అమెర్దాలో 1,877, అమ్మగారిపల్లిలో 958, అశ్వాపురంలో 2,474, గొందిగూడెంలో 8, కేశవాపురంలో 23, కుమ్మరిగూడెంలో 90, నెల్లిపాకలో 4,281 ఎకరాలకు సాగునీరు అందనుంది. మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ ప్రాజెక్టు ప్రతిపాదనల దశ నుంచి పనుల పురోగతి వరకు మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ చూపారు. పనుల పరిశీలనకు ఇప్పటివరకు అనేక సార్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆయన చొరవతో పనులు వేగంగా పూర్తయి ట్రయల్‌రన్‌ సఫలమైంది. ఎమ్మెల్యే పాయం పర్యవేక్షణ మంత్రి సూచనల మేరకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పనులను నిరంతరం పర్యవేక్షించారు. దాదాపు 20 రోజుల పాటు రేయింబవళ్లు ప్రాజెక్టు వద్దే ఉండి, ఎదురైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. దీంతో నిర్దేశిత గడువులోగా ట్రయల్‌రన్‌ పూర్తయింది. రైతన్నల్లో హర్షం గోదావరి జలాలు కాలువల్లోకి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలతో బీడు భూములు పచ్చని పొలాలుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
    1
    మారెళ్లపాడు లిఫ్ట్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
•ఈ నెల 23 న మంత్రుల చేతుల మీదగా ప్రారంభోత్సవం
•16,180 ఎకరాలకు సాగునీరు.. •తీరనున్న దశాబ్దాల రైతుల కల
•ఎమ్మెల్యే పాయం ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవం లో పాల్గొననున్న మంత్రి తుమ్మల
•ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి..

భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు:


మణుగూరు, అశ్వాపురం మండలాల రైతుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. గోదావరి జలాలను ఆయకట్టుకు తరలించే మారెళ్లపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. . స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు పాల్గొనున్నారు..రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇప్పటికే ట్రయల్‌రన్‌ విజయవంతం కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

వరప్రదాయినిగా మారెళ్లపాడు

సీతారామ ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సీతారామ ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి ఆయకట్టుకు అందించేలా ఈ పథకాన్ని చేపట్టారు. మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని సుమారు 16,180 ఎకరాలకు సాగునీరు అందనుంది. పథకంలో భాగంగా హెడ్‌వర్క్స్‌కు రూ.25 కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.113.17 కోట్లు, భూసేకరణకు రూ.42.30 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.

రూ.25 కోట్లతో పంప్‌హౌస్‌

మెఘా ఇంజినీరింగ్‌ సంస్థ రూ.25 కోట్లతో పంప్‌హౌస్‌ నిర్మాణాన్ని చేపట్టగా, పనులు దాదాపు పూర్తయ్యాయి. 1.80 మెగావాట్ల సామర్థ్యం గల రెండు మోటార్ల ద్వారా 46 మీటర్ల ఎత్తు నుంచి 85 మీటర్ల ఎత్తు వరకు, అంటే సుమారు 39 మీటర్ల మేర 180 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. పంప్‌హౌస్‌ నుంచి 2.4 కి.మీ. దూరంలో కొండ కింద డెలివరీ సిస్టర్న్‌ను నిర్మించారు. అక్కడి నుంచి నీరు కాలువల్లోకి చేరుతుంది.

కాలువలు.. ఆయకట్టు వివరాలు

సిస్టర్న్‌ నుంచి 10.070 కి.మీ. మేర రెండు ప్రధాన కాలువలు నిర్మించాల్సి ఉంది. 9.650 కి.మీ. పొడవైన కుడి కాలువ ద్వారా 11,915 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 420 మీటర్ల ఎడమ కాలువ ద్వారా తుమ్మల చెరువు నిండనుండగా, దాని కింద ఇప్పటికే ఉన్న 4,266 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మొత్తం 16,180 ఎకరాల్లో సుమారు 11 వేల ఎకరాలు కొత్త ఆయకట్టు కావడం విశేషం.

తొలిదశలో 7 వేల ఎకరాలు

ప్రధాన కాలువ పనులు ప్రస్తుతం టెండర్‌ దశలో ఉన్నాయి. అందుకే తొలిదశలో లిఫ్ట్‌ ద్వారా తుమ్మల చెరువుకు నీటిని తరలించి, ఆ చెరువు కింద 5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. మరో 2 వేల ఎకరాలకు కూడా నీరందుతుంది. కాలువ పనులు పూర్తయితే మొత్తం 16,180 ఎకరాలకు నీరు అందుతుంది.

తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు లబ్ధి

ఈ పథకం ద్వారా తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు ప్రయోజనం చేకూరనుంది. అమెర్దాలో 1,877, అమ్మగారిపల్లిలో 958, అశ్వాపురంలో 2,474, గొందిగూడెంలో 8, కేశవాపురంలో 23, కుమ్మరిగూడెంలో 90, నెల్లిపాకలో 4,281 ఎకరాలకు సాగునీరు అందనుంది.

మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ

ప్రాజెక్టు ప్రతిపాదనల దశ నుంచి పనుల పురోగతి వరకు మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ చూపారు. పనుల పరిశీలనకు ఇప్పటివరకు అనేక సార్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆయన చొరవతో పనులు వేగంగా పూర్తయి ట్రయల్‌రన్‌ సఫలమైంది.

ఎమ్మెల్యే పాయం పర్యవేక్షణ

మంత్రి సూచనల మేరకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పనులను నిరంతరం పర్యవేక్షించారు. దాదాపు 20 రోజుల పాటు రేయింబవళ్లు ప్రాజెక్టు వద్దే ఉండి, ఎదురైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. దీంతో నిర్దేశిత గడువులోగా ట్రయల్‌రన్‌ పూర్తయింది.

రైతన్నల్లో హర్షం

గోదావరి జలాలు కాలువల్లోకి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలతో బీడు భూములు పచ్చని పొలాలుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • పెనుబల్లి మండలం లో గంగదేవిపాడు గ్రామంలో సరైన వర్షాలు లేకపోవడం వలన రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులు మర్రికుంట చెరువులో నీరు లేక ఎండిపోయిన పరిస్థితి పంట పొలాలకు సరైన నీరు లేక ఆవేదన చెందుతున్న రైతులు ఆవేదన.. పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా లో గల గంగదేవిపాడు గ్రామంలో గల రైతుల పంట పొలాలకు పంట పొలాల మీద ఆధారపడే రైతులు ఈ సంవత్సరం మరికుంట చెరువు లో సరైన నీరు చేరక సరేనా వర్షాలు లేకపోవడం వలన చెరువు చుట్టూ ప్రక్కల ఉన్న రైతులు ఈ సంవత్సరము పంటలు పండుతాయో లేదో అన్న ఆందోళనతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ప్రభుత్వమే ఆదుకొని వారికి సహాయం అందించాలని రైతులు ఆవేదన చెందుతున్నారు...
    4
    పెనుబల్లి మండలం లో గంగదేవిపాడు గ్రామంలో సరైన వర్షాలు లేకపోవడం వలన రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులు   మర్రికుంట చెరువులో   నీరు లేక ఎండిపోయిన పరిస్థితి పంట పొలాలకు  సరైన నీరు లేక ఆవేదన చెందుతున్న  రైతులు ఆవేదన..
పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా లో గల గంగదేవిపాడు గ్రామంలో గల రైతుల పంట పొలాలకు పంట పొలాల మీద ఆధారపడే రైతులు ఈ సంవత్సరం మరికుంట చెరువు లో సరైన నీరు చేరక సరేనా వర్షాలు లేకపోవడం వలన చెరువు చుట్టూ ప్రక్కల ఉన్న రైతులు ఈ సంవత్సరము పంటలు పండుతాయో లేదో అన్న ఆందోళనతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ప్రభుత్వమే ఆదుకొని వారికి సహాయం అందించాలని రైతులు ఆవేదన చెందుతున్నారు...
    user_K Y RAJU
    K Y RAJU
    Tour Guide పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయిl పొన్నెకల్లు గ్రామానికి చెందిన నెల్లూరు ప్రసాద్‌ ఉంగరం చోరీపై నాగేంద్రమ్‌ ఫిర్యాదు మేరకు ఆగస్టు 25న Cr.No.140/2026 కేసు నమోదు.ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన చీకటి గోపి (30) మృతిపై Cr.No.145/2026గా మరో కేసు నమోదు.చీకటి గోపి మృతికి గల కారణాలపై సమగ్ర విచారణకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాలు జారీ చేశారు.విచారణ అధికారిగా సౌత్‌ డివిజన్‌ ఎస్‌డీపీఓ జి. పూర్ణచంద్రరావు నియామకం. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి గుంటూరు జిల్లా ఎస్పీకి నివేదిక సమర్పిస్తామని గుంటూరు జిల్లా సౌత్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ జి. పూర్ణచంద్రరావు తెలిపారు.
    1
    గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు
గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయిl
పొన్నెకల్లు గ్రామానికి చెందిన నెల్లూరు ప్రసాద్‌ ఉంగరం చోరీపై నాగేంద్రమ్‌ ఫిర్యాదు మేరకు ఆగస్టు 25న Cr.No.140/2026 కేసు నమోదు.ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన చీకటి గోపి (30) మృతిపై Cr.No.145/2026గా మరో కేసు నమోదు.చీకటి గోపి మృతికి గల కారణాలపై సమగ్ర విచారణకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాలు జారీ చేశారు.విచారణ అధికారిగా సౌత్‌ డివిజన్‌ ఎస్‌డీపీఓ జి. పూర్ణచంద్రరావు నియామకం.
వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి గుంటూరు జిల్లా ఎస్పీకి నివేదిక సమర్పిస్తామని గుంటూరు జిల్లా సౌత్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ జి. పూర్ణచంద్రరావు తెలిపారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • వైసీపీ బూతుల బ్రాండ్ అంబాసిడర్.. బెజవాడ 60వ డివిజన్ ప్రెసిడెంట్ గారి లీలలు పేరు: షేక్ ఫాతిమా పదవి: వైసీపీ విజయవాడ 60వ డివిజన్ అధ్యక్షురాలు, పార్టీ స్థాయికి తగ్గ అర్హత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్: భర్తపై పోలీస్ స్టేషన్లలో కేసులు.. పిల్లల చదువులు, ఉద్యోగాలంటూ పబ్లిక్ లో హైడ్రామా మంచితనానికి, సంస్కారానికి వైసీపీలో తావు లేదనడానికి ఈ మేడమే లేటెస్ట్ ఉదాహరణ. పదవి రావాలంటే మినిమమ్ బూతుల బ్యాక్ గ్రౌండ్ ఉండాలనే పార్టీ రూల్‌ను అక్షరాలా పాటిస్తూ రోడ్డెక్కిన ఈ లేడీ లీడర్ అసలు చరిత్రేంటో ఈ వీడియో చూసి మీరే డిసైడ్ చేయండి. మరి ఇలాంటి ఘనత వహించిన నాయకులను భుజాన వేసుకుంటున్న ఆ పార్టీ తీరు చూస్తుంటే నవాబుల కాలం నాటి రౌడీ రాజ్యాంలాగే ఉందిగా.
    1
    వైసీపీ బూతుల బ్రాండ్ అంబాసిడర్.. బెజవాడ 60వ డివిజన్ ప్రెసిడెంట్ గారి లీలలు

 పేరు: షేక్ ఫాతిమా

 పదవి: వైసీపీ విజయవాడ 60వ డివిజన్ అధ్యక్షురాలు, పార్టీ స్థాయికి తగ్గ అర్హత

ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్: భర్తపై పోలీస్ స్టేషన్లలో కేసులు.. పిల్లల చదువులు, ఉద్యోగాలంటూ పబ్లిక్ లో హైడ్రామా

మంచితనానికి, సంస్కారానికి వైసీపీలో తావు లేదనడానికి ఈ మేడమే లేటెస్ట్ ఉదాహరణ. పదవి రావాలంటే మినిమమ్ బూతుల బ్యాక్ గ్రౌండ్ ఉండాలనే పార్టీ రూల్‌ను అక్షరాలా పాటిస్తూ రోడ్డెక్కిన ఈ లేడీ లీడర్ అసలు చరిత్రేంటో ఈ వీడియో చూసి మీరే డిసైడ్ చేయండి. 

మరి ఇలాంటి ఘనత వహించిన నాయకులను భుజాన వేసుకుంటున్న ఆ పార్టీ తీరు చూస్తుంటే నవాబుల కాలం నాటి రౌడీ రాజ్యాంలాగే ఉందిగా.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె ఆర్డీవోకి వినతిపత్రం ఇచ్చిన వీఆర్ఏ సంఘాలు తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం డివిజన్ లోని ఐదు మండలాల వీఆర్ఏలు సమ్మె నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ గోపాలకృష్ణ మాట్లాడుతూ నెలకు రూ.10వేల జీతంతో కుటుంబాన్ని పోషించడం గగనంగా మారుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నామని, అర్హులైన వారికి వీఆర్వోలుగా ప్రమోషన్, నామినీలకు ఉద్యోగావకాశం కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేల్ మాదిరిగా అదే విధంగా మాకు కూడా పే స్కేల్ ఇవ్వాలని కోరారు. ఆర్డిఓ మన్నే సూర్యరావు కి వీఆర్ఏల సంఘం వినతి పత్రాన్ని అందజేశారు. వీఆర్ఏ సంఘ ఐదు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు , మండలాల వారి వీఆర్ఏలు పాల్గొన్నారు.
    3
    కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె 
ఆర్డీవోకి వినతిపత్రం ఇచ్చిన వీఆర్ఏ సంఘాలు
తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం డివిజన్ లోని ఐదు మండలాల వీఆర్ఏలు సమ్మె నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ గోపాలకృష్ణ మాట్లాడుతూ నెలకు రూ.10వేల జీతంతో కుటుంబాన్ని పోషించడం గగనంగా మారుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నామని, అర్హులైన వారికి వీఆర్వోలుగా ప్రమోషన్, నామినీలకు ఉద్యోగావకాశం కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేల్ మాదిరిగా అదే విధంగా మాకు కూడా పే స్కేల్  ఇవ్వాలని కోరారు. ఆర్డిఓ మన్నే సూర్యరావు కి వీఆర్ఏల సంఘం వినతి పత్రాన్ని అందజేశారు. వీఆర్ఏ సంఘ ఐదు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు , మండలాల వారి వీఆర్ఏలు పాల్గొన్నారు.
    user_అయితం ప్రసాద్
    అయితం ప్రసాద్
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.