చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. జలవనరుల హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలి. :: జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. జిల్లాలోని చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, జలవనరుల హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా చిత్తడి నేలల కమిటీ చైర్మన్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి చిత్తడి నేలల కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చిత్తడి నేలల గుర్తింపు, సర్వే, హద్దుల నిర్ధారణ, తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తడి నేలలు, జలవనరుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని జలవనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి విస్తీర్ణం, హద్దులకు సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సర్వే, హద్దుల నిర్ధారణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, సమగ్ర నివేదికను రాష్ట్ర చిత్తడి నేలల ప్రాధికార సంస్థకు పంపించాలని ఆదేశించారు. జలవనరుల పరిశీలనలో నీటిపారుదల, అటవీ, రెవెన్యూ శాఖలు ప్రధాన బాధ్యత వహించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పురపాలక, కాలుష్య నియంత్రణ మండలి, మత్స్య, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం లోపించకుండా క్షేత్రస్థాయి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి జలవనరును స్వయంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితుల ఆధారంగా వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సంబంధిత శాఖల సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ సంపత్, డి పి ఓ వెంకయ్య, డి ఏ ఓ సురేష్ కుమార్, జిల్లా ఉద్యానవ శాఖ అధికారి సంజీవరావు, డి ఆర్ డి ఓ రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. జలవనరుల హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలి. :: జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. జిల్లాలోని చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, జలవనరుల హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా చిత్తడి నేలల కమిటీ చైర్మన్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి చిత్తడి నేలల కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చిత్తడి నేలల గుర్తింపు, సర్వే, హద్దుల నిర్ధారణ, తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తడి నేలలు, జలవనరుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని జలవనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి విస్తీర్ణం, హద్దులకు సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సర్వే, హద్దుల నిర్ధారణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, సమగ్ర నివేదికను
రాష్ట్ర చిత్తడి నేలల ప్రాధికార సంస్థకు పంపించాలని ఆదేశించారు. జలవనరుల పరిశీలనలో నీటిపారుదల, అటవీ, రెవెన్యూ శాఖలు ప్రధాన బాధ్యత వహించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పురపాలక, కాలుష్య నియంత్రణ మండలి, మత్స్య, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం లోపించకుండా క్షేత్రస్థాయి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి జలవనరును స్వయంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితుల ఆధారంగా వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సంబంధిత శాఖల సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ సంపత్, డి పి ఓ వెంకయ్య, డి ఏ ఓ సురేష్ కుమార్, జిల్లా ఉద్యానవ శాఖ అధికారి సంజీవరావు, డి ఆర్ డి ఓ రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి కలెక్టర్ హేమంత్ బోర్కాడే. ములుగు జిల్లా. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి. మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పాటుపడాలని, మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా మంగళవారం గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ పైలాన్ ఆవరణలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్‌డీఓ సత్తయ్య, జాకారం సర్పంచ్, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- మహాదేవపూర్ బీఆర్‌ఎస్ మాజీ ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్ మృతి.. కన్నీటి వీడ్కోలు పలికిన నాయకులు, అభిమానులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మాజీ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు సల్మాన్ ఖాన్ మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, స్థానిక నాయకుల్లో విషాదం నెలకొంది. మంథని నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్ట మధుకర్ సల్మాన్ ఖాన్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. సల్మాన్ ఖాన్ మృతి పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటని పుట్ట మధుకర్ పేర్కొన్నారు. అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- సారు.. పింఛను ఇప్పించండి..?* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* *సెంటర్:- అశ్వారావుపేట* *స్లగ్: సారు.. పింఛను ఇప్పించండి..?* *యాంకర్ వాయిస్:* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. కూలి పనులు చేసుకుంటూ ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి.. తండ్రి చిన్నతనంలోనే మృతి.. సదరం సర్టిఫికెట్ లేక పదేళ్లుగా పింఛన్‌కు దూరం.. కనీసం ఉండేందుకు సురక్షితమైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. *వాయిస్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారిగూడెం గ్రామానికి చెందిన ఊకె నందిని.. వయసు 14 ఏళ్లు. పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో జన్మించింది. నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై.. నిత్యం ఇతరులపై ఆధారపడుతూ జీవనం సాగిస్తోంది. నందిని తండ్రి ఊకె బాలరాజు చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి ఊకె లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడమే కాకుండా.. అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన కుమార్తెకు సపర్యలు చేస్తోంది. *వాయిస్* నందినికి సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో ఇప్పటివరకు వికలాంగ పింఛన్ అందడం లేదు. నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా సదరం కోసం దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో దాదాపు పదేళ్లుగా ప్రభుత్వ పింఛన్‌కు ఈ కుటుంబం దూరమైంది.. కుమార్తె తోపాటు తల్లి లక్ష్మీ కూడా 10ఏళ్లుగా భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రభుత్వం నుండి అందుకోవాల్సిన వితంతు పింఛను పొందటం లేదంటే వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందే ఇట్టే తెలిసిపోతుంది..ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులంతా పింఛను ఇప్పిస్తాం అని చెప్పే మాటలు గుడ్డిగా నమ్మటమే తప్ప గొంతెత్తి నాకు పింఛను ఇప్పించని అడగలేని పేదరికం ఆమెది. ఇటీవల సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు నందినికి ప్రతినెలా అవసరమయ్యే మందుల ఖర్చు కూడా తల్లికి అదనపు భారంగా మారింది. *వాయిస్* కుటుంబం ఉంటున్న ఇల్లు పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటి స్లాబ్ నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నా.. ఇప్పటివరకు ఆ కుటుంబానికి సొంతంగా సురక్షితమైన ఇల్లు దక్కలేదు. *వాయిస్* నందిని పరిస్థితి కారణంగా ఆమెను 24 గంటలూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సిందే. దీంతో నాయనమ్మ లక్ష్మి కూడా చిన్నారికి తోడుగా నిరంతరం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కూలి పనులు.. మరోవైపు చిన్నారి సంరక్షణ.. మందుల ఖర్చులు.. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఇల్లు.. ఇలా అన్ని విధాలుగా ఈ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోంది. *వాయిస్ ఓవర్* నందిని పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే సదరం సర్టిఫికెట్, వికలాంగ పింఛన్ అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే సురక్షితమైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి.. వైద్యం, మందుల విషయంలోనూ సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఈ 14 ఏళ్ల చిన్నారి దీనస్థితిపై ప్రభుత్వ అధికారులు, ఐటీడీఏ పీఓ, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పందించి.. నందినికి అండగా నిలుస్తారా? పింఛన్, ఇల్లు, వైద్య సహాయం అందించి ఆ కుటుంబంలో వెలుగులు నింపుతారా? అనేది వేచి చూడాలి..1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- యూపీఐ లావాదేవీలకు పదేళ్ళు ...టీ తాగి యుపిఐ పేమెంట్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ దేశంలో యూపీఐ లావాదేవీలు ప్రారంభమై పదేళ్ళు అయింది. యూపిఐ పేమెంట్లకు దశాబ్దం పూర్తికావడంతో కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ ప్రవీణ్ రావుతో పాటు పలువురు బిజెపి నాయకులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ టీ తాగి యూపీఐ పేమెంట్ చేశారు. నగదు రహిత లావాదేవీలతో దేశం పురోగతి సాధిస్తుందని తెలిపారు.1
- ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి : జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పెద్దపల్లి జిల్లాలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి అని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, నిర్మాణం పూర్తయిన 2బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో* కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో నిర్మాణం పూర్తయి ఇంకా కేటాయించని 2బీహెచ్‌కే ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కేటాయించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇళ్లను కేటాయించే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందేందుకు అవసరమైన లబ్ధిదారుల వివరాలన్నింటినీ సెప్టెంబర్ 5, 2026లోగా ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారుల వివరాల నమోదు, డేటా అప్‌లోడ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పథకాల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ పి. పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- ములుగు జిల్లా : మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి నడిరోడ్డుపై పశువులు.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ములుగు జిల్లా : మున్సిపాలిటీ పరిధిలో నడిరోడ్డుపై పశువులు.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ములుగు టౌన్ :మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారులపై పశువులు నడిరోడ్డుపై సంచరిస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువుల కారణంగా తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాల భయం నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి రహదారులపై పశువులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.2