జిల్లాలో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు సురక్షిత నీటిని సరఫరా చేయాలి ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి నమూనాలను పరీక్షించడంతో పాటు ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాళి కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పత్తికొండ మండలం కొత్తపల్లి గ్రామంలోని పందికోన రిజర్వాయర్ నుండి త్రాగు నీటిని ఫిల్టర్ చేసే మైక్రో ఫిల్టర్ పంప్ హౌస్, గ్యాస్ క్లోరినేషన్ కేంద్రాలలో త్రాగునీటి శుద్ధి ప్రక్రియను, వాటర్ శాంపిల్ పరీక్షల నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా త్రాగు నీటిని ఫిల్టర్ చేసే మైక్రో ఫిల్టర్ పంప్ హౌస్, గ్యాస్ క్లోరినేషన్ కేంద్రాలను పరిశీలిస్తూ వాటి నిర్వహణ ఏ విధంగా ఉంది, ఏమైనా మరమ్మతులు ఉన్నాయా అని పరిశీలించారు. రోజుకు ఎంత మేరకు నీటిని ఫిల్టర్ చేస్తారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. క్లోరినేషన్ పరీక్ష ఏ విధంగా చేస్తున్నారని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఇసుక ఫిల్టర్లు ఉపయోగించి, కార్బన్ సహాయంతో మలినాలను తొలగించి, సెడిమెంటేషన్ ప్రక్రియ తర్వాత క్లోరినేషన్ చేసి గ్రామాలకు ట్యాంకులకు నీటిని సరఫరా చేసే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సురక్షితమైన తాగునీటిని అందించేలా వ్యవస్థను మెరుగుపరచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. జిల్లాలో తాగునీటి సమస్యలు రాకుండా ముందుగానే అప్రమత్తమై, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పత్తికొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న OHSR ట్యాంక్ ను కలెక్టర్ పరిశీలిస్తూ ట్యాంక్ నిర్వహణ విధానాలను, నీటి నాణ్యతను తనిఖీ చేశారు. నీటిలో క్లోరిన్ స్థాయిలను పరీక్షిస్తున్న విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలిస్తూ, శుద్ధి ప్రక్రియ సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి నమూనాలను పరీక్షించాలని (వాటర్ శాంపిల్ టెస్టింగ్) క్రమం తప్పకుండా ట్యాంకులను శుభ్రం చేయించాలని కలెక్టర్ RWS అధికారులను ఆదేశించారు ట్యాంక్ ను క్లోరినేషన్ చేసిన తేదీ, శుభ్రపరచిన తేదీ వివరాలను ఖచ్చితంగా రాయాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం 33 (సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా) పథకాలు, 800 (రక్షిత మంచినీటి సరఫరా) పథకాలు 1200 మినీ PWS పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటితో పాటు దాదాపు 300 బోర్ వెల్స్ మరియు 1000 హ్యాండ్ పంప్స్ (చేతి పంపులు) ఉన్నాయన్నారు. SDS పథకం కింద 53 పనులకు మంజూరు లభించిందని, వీటిని త్వరలోనే ప్రారంభించనున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ మందికి ఉపయోగపడే పనులను గుర్తించడం జరిగిందని, ఇందుకోసం కుడా నిధుల నుండి దాదాపు రూ. 3.5 కోట్ల నుండి 4 కోట్ల రూపాయలను కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.. బి సి వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో త్రాగునీరు మరియు టాయిలెట్ సమస్యల పరిష్కారం కోసం 2.3 కోట్ల రూపాయలు మంజూరు చేసి, సంబంధిత పనులు కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. అనంతరం పందికోన రిజర్వాయర్ ను పరిశీలించారు.. నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుతం నీటి స్థాయి గురించి కలెక్టర్ అధికారులతో ఆరా తీశారు. కార్యక్రమంలో పత్తికొండ ఇంచార్జి ఆర్డీఓ మధుసూదన్ రెడ్డి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

- “నో స్టాక్” బోర్డులతో మంత్రాలయం…1
- *అర్ధరాత్రి రైలులో బంగారందోపిడి* *ప్రయాణికులను కత్తులతో బెదిరించి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు* బెంగుళూరు-నరసాపురం (07154) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో.. 4 కోచ్‌లలో అర్ధరాత్రి దోపిడీ. ప్రధానంగా S7, S11, S12, S13 కోచ్‌లలో ప్రయాణికుల నుంచి సుమారు 11 తులాలు బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు అప్పికట్లలో రైలును ఆపి సుమారు పది మంది దుండగులు దిగి పారిపోయిన వైనం. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నరైల్వే పోలీసులు.1
- ఆలూరు నియోజకవర్గం లో త్రాగునీటి సమస్య పరిష్కారం కోరుతూ ఆలూరు పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే విరుపాక్షి ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు... గత 25 రోజుల నీళ్లు రాకపోవడంతో వైసీపీ నేతలు గ్రామస్తులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు... అధికారులకు పలుమార్లు విన్నవించిన స్పందించలేదని అగ్రహం వ్యక్తం చేశారు.. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది..1
- నాగర్‌కర్నూల్: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో ముందు జేఏసీ నాయకులు, కార్మికులు ధర్నాకు దిగారు. 'జేఏసీ జిందాబాద్' అంటూ నినదిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న 2017 ఏరియర్స్, 2021 నుంచి అమలు కావాల్సిన పే-స్కేల్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. కార్మికుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని, డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.1
- మాజీ MLA కాటసాని రామిరెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటసాని అంటే ఏంటో తెలుసా? అని బీసీని హెచ్చరించగా.. దీనికి ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. రామిరెడ్డి అంటే కాంట్రాక్ట్ మర్డర్లు, కబ్జాలు, దౌర్జన్యాలని ఫైర్ అయ్యారు. అటు, 2014-24 ఎన్నికలలో BPLలో మెజార్టీ తనేదన్నారు. కాగా, మంత్రి బీసీ సింగపూర్ పర్యటనలో ఉండగా, ఆయన కార్యాలయం వీడియో రిలీజ్ చేసింది.1
- రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని మహానంది ఎస్ ఐ ఎన్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి మహానంది మండలం గాజులపల్లె పరిధిలోని నంద్యాల- గిద్దలూరు జాతీయ రహదారి మెట్ట యందు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సరైన ధ్రువపత్రాలు లేని పలువురికి జరిమానాలు విధించారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే )సందర్బంగా బాదంపప్పు బద్ద పై మైక్రో బ్రష్ ల తో వాటర్ కలర్ పెయింటిగ్స్ ద్వారా నలబై సూక్ష్మ చిత్రాలను ఒక గంటలో వేసి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ చిత్రంలో భూమాత భూమిని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అంటూ చేతులు జోడిస్తూ వేదనతో వేడుకున్నట్లు, అలాగే వన్య ప్రాణులు చెట్లు లేక, ఆహారం లేక, నీటి కొరతతో అలమటించి పోయి భూమాతకు మొర పెట్టుకున్నట్లు, ఎండి పోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల,జంతువుల కళే బరాలు వున్నట్లు, అలాగే నీటి బొట్టులో చెట్టు వున్నట్లు అంటే నీరును, చెట్లను కాపాడు కోవాలని అర్థం. ఇలా చిన్న బాదం పప్పు పై ఇన్ని సూక్ష్మ చిత్రాలను వేసానని తెలిపారు .ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ సకల జీవరాశులకు భూమి నిలయం. కాని మానవులు తమ అవసరాల కోసం భూమికి హాని కలిగిస్తున్నారు. పర్యావరణంలో సమతుల్యం లేకనే భూమి అత్యంత వేడిమి వుంది. వాతావరణంలో మార్పు వచ్చింది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది.. భూమి మీద దృష్టి పెట్టకుంటే భవిష్యత్ లో మరెన్నో ప్రమాదాలు జరుగుతాయి. మనిషి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది.అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నీటిని వృధా చేయకూడదు, విపరీతంగా చెట్లను పెంచాలి. పర్యావరణం పచ్చగా వుంటేనే భూమిలోని వేడి తగ్గి చల్ల బరుస్తుంది. ప్రతి జీవరాశికి భూమిలో నివసించే హక్కు వుంది. భూమి రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. ప్రభుత్వం కూడా పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన కల్పించి భూమిని కాపాడుకోవాలని తెలియ చెప్పాలి . భూమి నుండి అన్ని అవసరాలు తీర్చుకొని మనం భూమిని కాపాడుకోలేక పోతున్నాము . నేను వేసిన ఈ బాదం పప్పు కూడా భూమినుండి వచ్చిందే. భూమి అంటే మనకు కావాలిసినది ఇచ్చే అక్షయపాత్ర.మన భూమిని చేయకు - మరు భూమి.అందరూ పర్యావరణాన్ని కాపాడుకొని భూమిని రక్షించు కొందాం అని పిలుపునిచ్చారు.1
- పోలీసులపై ట్రోల్స్ ఆపాలి: రంగయ్య1