Shuru
Apke Nagar Ki App…
ఉపాధి హామీ కార్మికుల 95% ఈ కేవైసీ ని పూర్తి చేయడం జరిగింది జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ఉపాధి హామీ కార్మికుల 95 శాతం ఈ కేవైసీ పూర్తయిందని స్థానిక ఈజిఎస్ ఏపీవో రవీందర్ తెలిపారు. సోమవారం మాట్లాడుతూ మండలంలోని 29 గ్రామపంచాయతీలో పరిధిలో నిర్వహిస్తున్న ఉపాధి పనులలో 10,805 మంది ఉపాధి కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో 10,300 మంది ఈ కేవైసిని పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారు స్థానికంగా అందుబాటులో లేరని, వారి కోసం కూడా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
P.G. Murthy
ఉపాధి హామీ కార్మికుల 95% ఈ కేవైసీ ని పూర్తి చేయడం జరిగింది జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ఉపాధి హామీ కార్మికుల 95 శాతం ఈ కేవైసీ పూర్తయిందని స్థానిక ఈజిఎస్ ఏపీవో రవీందర్ తెలిపారు. సోమవారం మాట్లాడుతూ మండలంలోని 29 గ్రామపంచాయతీలో పరిధిలో నిర్వహిస్తున్న ఉపాధి పనులలో 10,805 మంది ఉపాధి కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో 10,300 మంది ఈ కేవైసిని పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారు స్థానికంగా అందుబాటులో లేరని, వారి కోసం కూడా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.2
- మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ దీక్ష చేపట్టారు. వారు కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.1
- కొండగట్టు అంజన్న సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అంజన్న సేవలో పాల్గొన్నారు.మంత్రి ఆలయానికి చేరుకోగానే ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ దినేష్, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, స్థానిక సీఐ నీలం రవి, సర్పంచ్ ఆదిరెడ్డి, ఏఈఓ గుండి హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.1
- ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన కలిసే ప్రతిపాదన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. "నువ్వు నన్ను కలవకుంటే, నువ్వు వెళ్లాలనుకున్న చోటుకు నేను నిన్ను తీసుకెళ్తాను" అని మోడీ చెప్పినట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తీవ్ర కుదుపు సృష్టించాయి. ఈ సమావేశం జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.1
- కొమురం భీం ఆసిఫాబాద్ నుండి ప్రత్యేక రైలులో వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం వారు పరేడ్ గ్రౌండ్‌కు ర్యాలీగా చేరుకున్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.1
- మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసనకు దిగారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం తాగకున్నా అధిక రీడింగ్ రావడంతో విధుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ యంత్రాలను మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.1
- మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి కోనుగోలు కేంద్రాల్లో దోపిడీని అరికట్టాలి కలెక్టరేట్ ఎదుట సిపిఎం ధర్నా* *రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థల ద్వారా మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోళ్ళు వేగవంతం చేయకపోవడం మూలంగా అన్నదాతలు అరి గోస పడుతున్నారని, కొనుగోలు వేగవంతం చేయాలని, కొనుగోలు సెంటర్లలో దోపిడీని అరికట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రోజున సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ధర్నాను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారులు, అట్టహాసంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కొనుగోళ్ళు వేగవంతం చేయకపోవడం మూలంగా నెల రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. తేమ,తాలు పేరుతో క్వింటాల్కు అదనంగా 5 నుండి 8 కిలోలు కోత విధిస్తున్నారన్నారు. ఏ వన్ గ్రేట్ ధాన్యాన్ని కామన్ గ్రేడ్ గా సెంటర్ నిర్వాహకులు రైస్ మిల్లులకు పంపుతున్నారని, దీంతో రైతులు క్వింటాలకు 20 రూపాయలు నష్టపోతున్నారన్నారు. సెంటర్ నిర్వాహకులు, రైస్ మిల్లర్లు, కొందరు కిందిస్థాయి అధికారులు కుమ్మక్కై రైతును నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు అయిన మంచినీరు, టెంట్, టార్పాలిన్లు, మహిళలకు వాష్ రూమ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమయానికి దిగుమతి కాకపోవడంతో రైస్ మిల్లుల దగ్గర ఎండలో బార్లు తీరిన ట్రాక్టర్లు నిలిచి ఉంటున్నాయని, దిగుమతులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు సెంటర్లలో రెవెన్యూ,పోలీస్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో సెంటర్ నిర్వాహకులు కొనుగోళ్ళు జరపకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గి వారు సూచించిన రైతులేవే పంట కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. లారీల కొరత సాకుతో సెంటర్ నిర్వాహకులు, లారీ యజమానులు క్వింటాల్కు రైతుల దగ్గర 15 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు సెంటర్లలో గన్ని సంచులు కొరత తీవ్రంగా ఉందని సెంటర్ నిర్వాహకులు రైతులనే గన్నీ సంచులు తెచ్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. రైతుల దిగుబడులకు సరిపడా గన్ని సంచులు అందించాలన్నారు. అకాల వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ కొనుగోళ్ళు వేగవంతం కాకపోవడం మూలంగా రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. క్వింటాల్కు రూపాయలు 500 బోనస్ డబ్బులు వెంటనే రైతులు అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు యాసంగి ప్రారంభానికి ముందు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ యాసంగి పంట చేతికి వచ్చినప్పటికీ కూడా రైతు భరోసా నిధులు కేవలం ఎకరానికి మాత్రమే జమ చేశారని వెంటనే రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కౌలుభరోసా ఎకరానికి 15 వేల రూపాయలు జమ చేయాలన్నారు. జిల్లాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చేతికొచ్చిన మొక్కజొన్న పంటలు దగ్ధం అయ్యాయని, నష్టపోయిన రైతులకు క్వింటాల్కు 70 వేల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని సేకరించకపోవడం మూలంగా మిల్లులో నిల్వలు పేరుకుపోయాయని, కేంద్ర ప్రభుత్వం వెంటనే బియ్యం సేకరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునుటి శ్రీనివాస్, సుంకర సంపత్, ఎడ్ల రమేష్, జి రాజేశం, డి నరేష్ పటేల్, జిల్లా నాయకులు శాతరాజు భద్రయ్య, గజ్జల శ్రీకాంత్, రాయి కంటి శ్రీనివాస్, పున్నం రవి, కాంపెల్లి అరవింద్, పుల్లెల మల్లయ్య, ప్రభాకర్, కండె రాజు,శివ, భోగేష్, సతీష్, కిషోర్, చక్రపాణి, కరీం తదితరులు పాల్గొన్నారు.2
- మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో ఇందూర్ పోచమ్మ బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు బోనాలు సమర్పించగా, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు తమ కుటుంబాలు, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.1