logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 3, 4 జోన్ల పోలీసు అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న శాఖాపరమైన సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సింగ్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ రేంజ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది తమ సమస్యలు, వినతులను నేరుగా సీపీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పదోన్నతులు, బదిలీలు, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు, ఇతర పరిపాలనా అంశాలకు సంబంధించిన మొత్తం 16 దరఖాస్తులను సీపీ స్వయంగా పరిశీలించారు. ప్రతి వినతిని శ్రద్ధగా విన్న ఆయన, సమస్యల స్వభావాన్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి కమిషనరేట్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని సీపీ పేర్కొన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను చట్టపరిధిలో, నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా సిబ్బందికి తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుందని, ఇటువంటి కార్యక్రమాలు పోలీసు శాఖలో పారదర్శకత, సమన్వయాన్ని పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

1 hr ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
1 hr ago

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 3, 4 జోన్ల పోలీసు అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న శాఖాపరమైన సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సింగ్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ రేంజ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది తమ సమస్యలు, వినతులను నేరుగా సీపీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పదోన్నతులు, బదిలీలు, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు, ఇతర పరిపాలనా అంశాలకు సంబంధించిన మొత్తం 16 దరఖాస్తులను సీపీ స్వయంగా పరిశీలించారు. ప్రతి వినతిని శ్రద్ధగా విన్న ఆయన, సమస్యల స్వభావాన్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి కమిషనరేట్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని సీపీ పేర్కొన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను చట్టపరిధిలో, నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా సిబ్బందికి తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుందని, ఇటువంటి కార్యక్రమాలు పోలీసు శాఖలో పారదర్శకత, సమన్వయాన్ని పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ అర్చకులు ఆండాల్ అమ్మవారికి వైభవంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అద్దాల మండపంలో అమ్మవారిని ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి, వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి శ్రీ సూక్త పారాయణం చేశారు. సాయంత్రం అమ్మవారికి వెండి జోడు సేవలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ సీతారామ చారి, అర్చకులు సందీప్, ప్రశాంత్, భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ అర్చకులు ఆండాల్ అమ్మవారికి వైభవంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అద్దాల మండపంలో అమ్మవారిని ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి, వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి శ్రీ సూక్త పారాయణం చేశారు. సాయంత్రం అమ్మవారికి వెండి జోడు సేవలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ సీతారామ చారి, అర్చకులు సందీప్, ప్రశాంత్, భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_ARUTLA KISHORE KUMAR
    ARUTLA KISHORE KUMAR
    Teacher ఆలేరు, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    14 hrs ago
  • కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్రమంత్రి బండి సంజయ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆటోలో ప్రయాణించి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీయడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి 'స్వచ్ఛ పాఠశాల శుద్ధి కార్యక్రమం' చేపట్టారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించి 'టిఫిన్ బైఠక్' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రేకొండ నుంచి చిగురుమామిడి వరకు ఆటోలో ప్రయాణించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం చిగురుమామిడి మండలం రేకొండ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పాఠశాల పరిశుభ్రతపై చర్చించారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలను శుభ్రం చేయాలని ఆయన కోరారు, ఎంపీ అయిన తర్వాత సమాజసేవకే ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు. పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకోగా, విద్యార్థులకు డైనింగ్ సౌకర్యం లేదని, ప్రాథమిక పాఠశాలకు తరగతి గదుల సమస్య ఉందని టీచర్లు, స్థానికులు వెల్లడించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల డైనింగ్ కోసం రూ. 5 లక్షలు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి రూ. 20 లక్షలు సాయం చేస్తానని ప్రకటించి, తొలి విడతగా రూ. 10 లక్షలు అందిస్తానని చెప్పారు. రేకొండ పాఠశాలలో టెన్త్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈసారి కూడా టెన్త్ విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందిస్తానని ప్రకటించారు. మోదీ 12 ఏళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానికులకు సూచిస్తూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలు, మోదీ పాలనా విజయాల బుక్ లెట్లను పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్ దిలీప్ తో కూడా మోదీ పాలనా విజయాలపై, ప్రజలకు ఇష్టమైన కార్యక్రమాలపై బండి సంజయ్ ఆరా తీశారు. 'స్వచ్ఛ పాఠశాల'లో భాగంగా శనివారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుద్ధి కార్యక్రమం చేపడుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. సద్ది తెచ్చుకుని స్థానికులతో కలిసి భోజనం చేసిన బండి సంజయ్, రేకొండ ప్రభుత్వ పాఠశాలలో రేపు శుద్ధి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
    4
    కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్రమంత్రి బండి సంజయ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆటోలో ప్రయాణించి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీయడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి 'స్వచ్ఛ పాఠశాల శుద్ధి కార్యక్రమం' చేపట్టారు.

కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించి 'టిఫిన్ బైఠక్' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రేకొండ నుంచి చిగురుమామిడి వరకు ఆటోలో ప్రయాణించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం చిగురుమామిడి మండలం రేకొండ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పాఠశాల పరిశుభ్రతపై చర్చించారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలను శుభ్రం చేయాలని ఆయన కోరారు, ఎంపీ అయిన తర్వాత సమాజసేవకే ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు.

పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకోగా, విద్యార్థులకు డైనింగ్ సౌకర్యం లేదని, ప్రాథమిక పాఠశాలకు తరగతి గదుల సమస్య ఉందని టీచర్లు, స్థానికులు వెల్లడించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల డైనింగ్ కోసం రూ. 5 లక్షలు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి రూ. 20 లక్షలు సాయం చేస్తానని ప్రకటించి, తొలి విడతగా రూ. 10 లక్షలు అందిస్తానని చెప్పారు. రేకొండ పాఠశాలలో టెన్త్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈసారి కూడా టెన్త్ విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందిస్తానని ప్రకటించారు.

మోదీ 12 ఏళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానికులకు సూచిస్తూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలు, మోదీ పాలనా విజయాల బుక్ లెట్లను పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్ దిలీప్ తో కూడా మోదీ పాలనా విజయాలపై, ప్రజలకు ఇష్టమైన కార్యక్రమాలపై బండి సంజయ్ ఆరా తీశారు. 'స్వచ్ఛ పాఠశాల'లో భాగంగా శనివారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుద్ధి కార్యక్రమం చేపడుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. సద్ది తెచ్చుకుని స్థానికులతో కలిసి భోజనం చేసిన బండి సంజయ్, రేకొండ ప్రభుత్వ పాఠశాలలో రేపు శుద్ధి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
  • రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి బండ్రు శోభారాణి గారు ఉమ్మడి నల్గొండ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యపేట జిల్లాల మహిళా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
    1
    రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి బండ్రు శోభారాణి గారు ఉమ్మడి నల్గొండ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యపేట జిల్లాల మహిళా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    13 hrs ago
  • తెలంగాణలో రేవంత్ సర్కార్ పగ్గాలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని రైతు జేఏసీ అధ్యక్షులు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ప్రజా సంఘాల నాయకులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. రైతులకు అన్ని పంటలకు ₹500 బోనస్ ఇస్తామని మాట తప్పిందని, రైతు కూలీలకు ₹12,000, కౌలు రైతులకు ₹15,000 ఇస్తామన్న డబ్బుల ఊసే లేదని రామారావు ఆరోపించారు. రుణమాఫీని అరకొరగా చేసి వదిలేసిందని, ఇప్పటికే రెండు విడతల భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్, యాసంగి సీజన్ ముగిసినా కంటి తుడుపుగా కేవలం రెండు ఎకరాలకు మాత్రమే భరోసా డబ్బులు ఇచ్చి, 80 శాతం నిధులను విడుదల చేయక చేతులెత్తేసిందని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై రైతులు ముమ్మరంగా సాగు పనులు చేస్తుండగా, ఖరీఫ్ రైతు భరోసా నిధుల విడుదలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల్లో 40 రోజులు జాప్యం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి, ప్రైవేట్ దళారులకు మేలు చేసిందని విమర్శించారు. తరుగు, రవాణా పేరుతో రైతుల నుంచి ₹1,200 కోట్ల రూపాయలను నిలువు దోపిడీ చేసిందని ఆరోపించారు. ఎరువుల పంపిణీలో యాప్ పేరుతో రైతులను దగా చేస్తోందని, విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేస్తోందని పోలాడి రామారావు అన్నారు. రెవెన్యూ రంగంలో జవాబుదారీతనం లేకపోవడం వల్ల సామాన్యులు ఇక్కట్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సహకార సంఘాల్లో నామినేషన్ పద్ధతి దారుణమని, రైతుల నీటి వినియోగదారుల వ్యవస్థను మూలన పడేశారని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై కనీస దృష్టి పెట్టకుండా మూలన పడేశారని కూడా విమర్శించారు. తమ డిమాండ్ల సాధనకు కరీంనగర్‌లో తలపెట్టిన రైతు సమర భేరిని విజయవంతం చేయాలని పోలాడి రామారావు పిలుపునిచ్చారు. త్వరలో లక్షలాది మందితో పార్టీలకు అతీతంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర భేరి సభ ద్వారా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ప్రశ్నిస్తామని, డిమాండ్లను ముందుంచి ప్రభుత్వంపై సమర రణ భేరి గర్జన మోగించి కళ్ళు తెరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేదే లేదని, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తెలంగాణ ఉద్యమ తరహాలో ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా ఉద్యమిస్తామని రామారావు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కరివేద సుధాకర్ రెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, అండెం రమణారెడ్డి, విక్రమసింహా రావు, సంపత్ రెడ్డి, జిల్లా అంజయ్య తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణలో రేవంత్ సర్కార్ పగ్గాలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని రైతు జేఏసీ అధ్యక్షులు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ప్రజా సంఘాల నాయకులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు.

రైతులకు అన్ని పంటలకు ₹500 బోనస్ ఇస్తామని మాట తప్పిందని, రైతు కూలీలకు ₹12,000, కౌలు రైతులకు ₹15,000 ఇస్తామన్న డబ్బుల ఊసే లేదని రామారావు ఆరోపించారు. రుణమాఫీని అరకొరగా చేసి వదిలేసిందని, ఇప్పటికే రెండు విడతల భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్, యాసంగి సీజన్ ముగిసినా కంటి తుడుపుగా కేవలం రెండు ఎకరాలకు మాత్రమే భరోసా డబ్బులు ఇచ్చి, 80 శాతం నిధులను విడుదల చేయక చేతులెత్తేసిందని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై రైతులు ముమ్మరంగా సాగు పనులు చేస్తుండగా, ఖరీఫ్ రైతు భరోసా నిధుల విడుదలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల్లో 40 రోజులు జాప్యం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి, ప్రైవేట్ దళారులకు మేలు చేసిందని విమర్శించారు. తరుగు, రవాణా పేరుతో రైతుల నుంచి ₹1,200 కోట్ల రూపాయలను నిలువు దోపిడీ చేసిందని ఆరోపించారు.

ఎరువుల పంపిణీలో యాప్ పేరుతో రైతులను దగా చేస్తోందని, విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేస్తోందని పోలాడి రామారావు అన్నారు. రెవెన్యూ రంగంలో జవాబుదారీతనం లేకపోవడం వల్ల సామాన్యులు ఇక్కట్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సహకార సంఘాల్లో నామినేషన్ పద్ధతి దారుణమని, రైతుల నీటి వినియోగదారుల వ్యవస్థను మూలన పడేశారని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై కనీస దృష్టి పెట్టకుండా మూలన పడేశారని కూడా విమర్శించారు.

తమ డిమాండ్ల సాధనకు కరీంనగర్‌లో తలపెట్టిన రైతు సమర భేరిని విజయవంతం చేయాలని పోలాడి రామారావు పిలుపునిచ్చారు. త్వరలో లక్షలాది మందితో పార్టీలకు అతీతంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర భేరి సభ ద్వారా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ప్రశ్నిస్తామని, డిమాండ్లను ముందుంచి ప్రభుత్వంపై సమర రణ భేరి గర్జన మోగించి కళ్ళు తెరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేదే లేదని, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తెలంగాణ ఉద్యమ తరహాలో ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా ఉద్యమిస్తామని రామారావు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కరివేద సుధాకర్ రెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, అండెం రమణారెడ్డి, విక్రమసింహా రావు, సంపత్ రెడ్డి, జిల్లా అంజయ్య తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ‘‘స్వచ్ఛ పాఠశాల’’ కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామస్తులు, కార్యకర్తలతో కలిసి పాఠశాల ఆవరణలో ‘‘టిఫిన్ బైఠక్’’ నిర్వహించారు. అక్కడికి వచ్చిన వారంతా తమ వెంట తెచ్చుకున్న సద్దిని పంచుకోగా, బండి సంజయ్ సైతం స్వయంగా ఇంటి నుండి తెచ్చుకున్న టిఫిన్ క్యారియన్‌ను తెరిచి వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి రేకొండ స్కూల్ తరగతులను శుభ్రం చేసే అంశంపై చర్చించారు. పేదల చదువుల నిలయమైన ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటూ, వాటిని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. మోదీ పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా పాఠశాలలను క్లీన్ చేయాలని కోరిన బండి సంజయ్, ఈ నెల 16న ప్రతి గ్రామంలో పిల్లలంతా బడిలో చేరాలంటూ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎంపీ అయ్యాక తాను సమాజసేవకే ప్రాధాన్యతనిస్తున్నానని వెల్లడించారు. ఈ సందర్శనలో స్కూల్ సమస్యలను అడిగి తెలుసుకోగా, విద్యార్థులకు డైనింగ్ సౌకర్యం లేదని, పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల సమస్య ఉందని టీచర్లు తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల డైనింగ్ కోసం రూ. 5 లక్షలు, ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం మరియు కుల సంఘాల భవన నిర్మాణానికి రూ. 20 లక్షల సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మొదటి విడతగా రూ. 10 లక్షలు అందిస్తానని తెలిపారు. అనంతరం ఆయన పాఠశాలలోని తరగతి గదులతో పాటు డైనింగ్ హాలును కూడా సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన రేకొండ స్కూల్ విద్యార్థులను అభినందించి, వారితో కలిసి ఫోటో దిగారు. ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందిస్తానని ప్రకటించారు. మోదీ పాలనా విజయాల బుక్‌లెట్లను హెడ్‌మాస్టర్‌కు అందజేసి, మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మరోవైపు, కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి టిఫిన్ బైఠక్ నిర్వహించారు. ఎవరికి వారే తమ వెంట అల్పాహారం క్యారియర్‌లను తెచ్చుకుని పాఠశాల ఆవరణలో కూర్చుని తిన్నారు. ఈ సందర్భంగా వారు ఆయా పాఠశాలల తరగతులను పరిశీలించి, ‘‘స్వచ్ఛ పాఠశాల’’లో భాగంగా వాటిని క్లీన్ చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం వారంతా తమ తమ గ్రామాల్లోని పాఠశాలలను శుభ్రం చేయనున్నారు. అందుకోసం సొంతంగా చీపురు, గుడ్డ, బకెట్‌లను కూడా వెంట తెచ్చుకోనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ‘‘స్వచ్ఛ పాఠశాల’’లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, స్వయంగా చీపురు, గుడ్డ, బకెట్‌లను వెంట తెచ్చుకుని అక్కడికి వచ్చిన కార్యకర్తలు, స్థానికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి తరగతి గదులను శుభ్రం చేయనున్నారు. అనంతరం ఆయన సిరిసిల్ల పట్టణంలోని కొంతమంది ప్రభావశీలురను (ఇన్‌ఫ్లూయన్సర్స్‌ను) కలిసి మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలకు సంబంధించిన పుస్తకాలను అందజేయనున్నారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలను శుభ్రం చేయాలని కోరిన కేంద్ర మంత్రి, ఎంపీ అయ్యాక తాను సమాజసేవకే ప్రాధాన్యతనిస్తున్నానని పునరుద్ఘాటించారు.
    1
    కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ‘‘స్వచ్ఛ పాఠశాల’’ కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామస్తులు, కార్యకర్తలతో కలిసి పాఠశాల ఆవరణలో ‘‘టిఫిన్ బైఠక్’’ నిర్వహించారు. అక్కడికి వచ్చిన వారంతా తమ వెంట తెచ్చుకున్న సద్దిని పంచుకోగా, బండి సంజయ్ సైతం స్వయంగా ఇంటి నుండి తెచ్చుకున్న టిఫిన్ క్యారియన్‌ను తెరిచి వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి రేకొండ స్కూల్ తరగతులను శుభ్రం చేసే అంశంపై చర్చించారు. పేదల చదువుల నిలయమైన ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటూ, వాటిని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. మోదీ పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా పాఠశాలలను క్లీన్ చేయాలని కోరిన బండి సంజయ్, ఈ నెల 16న ప్రతి గ్రామంలో పిల్లలంతా బడిలో చేరాలంటూ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎంపీ అయ్యాక తాను సమాజసేవకే ప్రాధాన్యతనిస్తున్నానని వెల్లడించారు. ఈ సందర్శనలో స్కూల్ సమస్యలను అడిగి తెలుసుకోగా, విద్యార్థులకు డైనింగ్ సౌకర్యం లేదని, పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల సమస్య ఉందని టీచర్లు తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల డైనింగ్ కోసం రూ. 5 లక్షలు, ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం మరియు కుల సంఘాల భవన నిర్మాణానికి రూ. 20 లక్షల సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మొదటి విడతగా రూ. 10 లక్షలు అందిస్తానని తెలిపారు.

అనంతరం ఆయన పాఠశాలలోని తరగతి గదులతో పాటు డైనింగ్ హాలును కూడా సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన రేకొండ స్కూల్ విద్యార్థులను అభినందించి, వారితో కలిసి ఫోటో దిగారు. ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందిస్తానని ప్రకటించారు. మోదీ పాలనా విజయాల బుక్‌లెట్లను హెడ్‌మాస్టర్‌కు అందజేసి, మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మరోవైపు, కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి టిఫిన్ బైఠక్ నిర్వహించారు. ఎవరికి వారే తమ వెంట అల్పాహారం క్యారియర్‌లను తెచ్చుకుని పాఠశాల ఆవరణలో కూర్చుని తిన్నారు. ఈ సందర్భంగా వారు ఆయా పాఠశాలల తరగతులను పరిశీలించి, ‘‘స్వచ్ఛ పాఠశాల’’లో భాగంగా వాటిని క్లీన్ చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం వారంతా తమ తమ గ్రామాల్లోని పాఠశాలలను శుభ్రం చేయనున్నారు. అందుకోసం సొంతంగా చీపురు, గుడ్డ, బకెట్‌లను కూడా వెంట తెచ్చుకోనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ‘‘స్వచ్ఛ పాఠశాల’’లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, స్వయంగా చీపురు, గుడ్డ, బకెట్‌లను వెంట తెచ్చుకుని అక్కడికి వచ్చిన కార్యకర్తలు, స్థానికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి తరగతి గదులను శుభ్రం చేయనున్నారు. అనంతరం ఆయన సిరిసిల్ల పట్టణంలోని కొంతమంది ప్రభావశీలురను (ఇన్‌ఫ్లూయన్సర్స్‌ను) కలిసి మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలకు సంబంధించిన పుస్తకాలను అందజేయనున్నారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలను శుభ్రం చేయాలని కోరిన కేంద్ర మంత్రి, ఎంపీ అయ్యాక తాను సమాజసేవకే ప్రాధాన్యతనిస్తున్నానని పునరుద్ఘాటించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    14 hrs ago
  • ఖమ్మం నగరంలో ఇటీవల జరిగిన 12 ఏళ్ల బాలికపై అత్యంత దారుణమైన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఖమ్మం నగరంలోని ముస్లిం మైనార్టీలు శుక్రవారం నమాజ్ అనంతరం షాది ఖానా వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఖమ్మం ఫోక్సో కేసు నిందితుడు గౌస్, హైదరాబాద్‌లో జరిగిన ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథలను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీలు మాట్లాడుతూ చట్టం ఏ కులానికో, మతానికో కాదని, అది ఎవరికీ చుట్టం కాదని స్పష్టం చేశారు. ఫోక్సో కేసు నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించబడాలని వారు కోరారు. నిందితులను జైలులో పెట్టి కేసును కాలయాపన చేయకుండా, త్వరితగతిన శిక్ష పడేలా చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ ముస్లిం మైనార్టీలు బలంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు.
    1
    ఖమ్మం నగరంలో ఇటీవల జరిగిన 12 ఏళ్ల బాలికపై అత్యంత దారుణమైన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఖమ్మం నగరంలోని ముస్లిం మైనార్టీలు శుక్రవారం నమాజ్ అనంతరం షాది ఖానా వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఖమ్మం ఫోక్సో కేసు నిందితుడు గౌస్, హైదరాబాద్‌లో జరిగిన ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథలను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీలు మాట్లాడుతూ చట్టం ఏ కులానికో, మతానికో కాదని, అది ఎవరికీ చుట్టం కాదని స్పష్టం చేశారు. ఫోక్సో కేసు నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించబడాలని వారు కోరారు. నిందితులను జైలులో పెట్టి కేసును కాలయాపన చేయకుండా, త్వరితగతిన శిక్ష పడేలా చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ ముస్లిం మైనార్టీలు బలంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు.
    user_Fayaz
    Fayaz
    Photography Khammam Urban, Telangana•
    15 hrs ago
  • కుంభం శివకుమార్ రెడ్డిపై నాంపల్లి కోర్టులో కేసు వేసిన ఓ బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎవరో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, గుర్తు తెలియని వ్యక్తులు తనను వీడియోలు తీస్తున్నారని ఆమె వెల్లడించారు. గత నాలుగు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నానని, తన వ్యక్తిగత వివరాలను ఎవరు బయటపెట్టారో తెలియడం లేదని బాధితురాలు ఆవేదనగా తెలిపారు. తనకు ప్రాణ హాని ఉందని పేర్కొంటూ, రక్షణ కల్పించాలని (సెక్యూరిటీ) ఆమె కోరారు.
    1
    కుంభం శివకుమార్ రెడ్డిపై నాంపల్లి కోర్టులో కేసు వేసిన ఓ బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎవరో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, గుర్తు తెలియని వ్యక్తులు తనను వీడియోలు తీస్తున్నారని ఆమె వెల్లడించారు.

గత నాలుగు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నానని, తన వ్యక్తిగత వివరాలను ఎవరు బయటపెట్టారో తెలియడం లేదని బాధితురాలు ఆవేదనగా తెలిపారు. తనకు ప్రాణ హాని ఉందని పేర్కొంటూ, రక్షణ కల్పించాలని (సెక్యూరిటీ) ఆమె కోరారు.
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    17 hrs ago
  • కరీంనగర్ నగరానికి చెందిన చిట్టుమల్ల ఆధ్యా చైతన్య కేవలం 20 నెలల ప్రాయంలోనే అబ్బురపరిచే అద్భుత ప్రదర్శన కనబరిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మనుమరాలు అయిన ఆధ్యా, తన వయసుకు మించిన అసాధారణమైన గ్రహణశక్తి, అద్భుతమైన జ్ఞాపకశక్తి, ఉన్నత అభ్యసన నైపుణ్యాలను ప్రదర్శించింది. చిన్నారి తల్లిదండ్రులు చిట్టుమల్ల అచ్యుత్ చైతన్య మరియు ప్రశాంతి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఆధ్యా 20 నెలల వయసులోనే రవాణా, పక్షులు, జంతువులు, క్రియలు, హిందూ దేవతలు, పండ్లు, కూరగాయలు వంటి వివిధ విభాగాలకు చెందిన 30 ఫ్లాష్‌కార్డులను స్వయంగా గుర్తించి చెప్పడమే కాకుండా, 50కి పైగా ఫ్లాష్‌కార్డులను కచ్చితంగా గుర్తించి తన అద్భుతమైన గ్రహణశక్తిని, భావనాత్మక అవగాహనను నిరూపించిందని తెలిపారు. అంతేకాకుండా, ఆమె 10 శరీర భాగాలను గుర్తించి, 10 ముక్కల ఆకారాల పజిల్‌ను స్వయంగా పరిష్కరించింది. ఇది ఆమె బలమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు, దృశ్య మేధస్సు, సూక్ష్మ చలన సమన్వయాన్ని ప్రతిబింబిస్తుందని వారు పేర్కొన్నారు. ఇంత చిన్న వయసులో సాధించిన ఈ అరుదైన విజయాలు, ఆమెను అసాధారణమైన మేధో సామర్థ్యం గల ప్రతిభావంతురాలైన బాలికగా గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రత్యేక గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తారని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.
    2
    కరీంనగర్ నగరానికి చెందిన చిట్టుమల్ల ఆధ్యా చైతన్య కేవలం 20 నెలల ప్రాయంలోనే అబ్బురపరిచే అద్భుత ప్రదర్శన కనబరిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మనుమరాలు అయిన ఆధ్యా, తన వయసుకు మించిన అసాధారణమైన గ్రహణశక్తి, అద్భుతమైన జ్ఞాపకశక్తి, ఉన్నత అభ్యసన నైపుణ్యాలను ప్రదర్శించింది.

చిన్నారి తల్లిదండ్రులు చిట్టుమల్ల అచ్యుత్ చైతన్య మరియు ప్రశాంతి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఆధ్యా 20 నెలల వయసులోనే రవాణా, పక్షులు, జంతువులు, క్రియలు, హిందూ దేవతలు, పండ్లు, కూరగాయలు వంటి వివిధ విభాగాలకు చెందిన 30 ఫ్లాష్‌కార్డులను స్వయంగా గుర్తించి చెప్పడమే కాకుండా, 50కి పైగా ఫ్లాష్‌కార్డులను కచ్చితంగా గుర్తించి తన అద్భుతమైన గ్రహణశక్తిని, భావనాత్మక అవగాహనను నిరూపించిందని తెలిపారు. అంతేకాకుండా, ఆమె 10 శరీర భాగాలను గుర్తించి, 10 ముక్కల ఆకారాల పజిల్‌ను స్వయంగా పరిష్కరించింది. ఇది ఆమె బలమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు, దృశ్య మేధస్సు, సూక్ష్మ చలన సమన్వయాన్ని ప్రతిబింబిస్తుందని వారు పేర్కొన్నారు.

ఇంత చిన్న వయసులో సాధించిన ఈ అరుదైన విజయాలు, ఆమెను అసాధారణమైన మేధో సామర్థ్యం గల ప్రతిభావంతురాలైన బాలికగా గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రత్యేక గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తారని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలంలోని కాకతీయ వన విహార పార్కు వెనుక భాగంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న చెట్లు, పొదలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో పార్కు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సిబ్బంది సకాలంలో సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం మరింత విస్తరించకుండా నిలువరించగలిగారు. ఈ అగ్నిప్రమాదంలో పార్కు వెనుక భాగంలోని పలు చెట్లు కాలిపోయినట్లు తెలిసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, నిర్లక్ష్యంగా పడేసిన సిగరెట్ లేదా ఇతర కారణాల వల్ల ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించగా, నష్టం వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాద ఘటనతో పార్కు పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
    1
    హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలంలోని కాకతీయ వన విహార పార్కు వెనుక భాగంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న చెట్లు, పొదలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో పార్కు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సిబ్బంది సకాలంలో సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం మరింత విస్తరించకుండా నిలువరించగలిగారు. ఈ అగ్నిప్రమాదంలో పార్కు వెనుక భాగంలోని పలు చెట్లు కాలిపోయినట్లు తెలిసింది.

అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, నిర్లక్ష్యంగా పడేసిన సిగరెట్ లేదా ఇతర కారణాల వల్ల ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించగా, నష్టం వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాద ఘటనతో పార్కు పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.