Shuru
Apke Nagar Ki App…
కూతురు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళీ వరంగల్: తన కూతురు చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని కొండా మురళీ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఈ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తెలిపారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని కొండా మురళీ పేర్కొన్నారు.
M D Azizuddin
కూతురు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళీ వరంగల్: తన కూతురు చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని కొండా మురళీ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఈ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తెలిపారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని కొండా మురళీ పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కమలాపూర్‌లో కొండచిలువ కలకలం.. సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. పొలంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు జాగ్రత్తగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను జూ పార్క్‌కు తరలించారు. వ్యవసాయ పొలాల్లో కొండచిలువ కనిపించడంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ప్రమాదం జరగలేదు.2
- మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు హైదరాబాద్ (ఆగస్టు 26): మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.3
- జనగామ జిల్లా బస్టాండ్లో దొంగల చేతివాటం, పోలీసుల తనిఖీలు జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద రూ.20,600 నగదు అపహరణకు గురైంది. లింగాలఘణపురం మండలం కుందారానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- జనగామ స్టేషన్ మీదుగా జేసీబీ లను రవాణా చేస్తున్న క్యారియర్ రైలు జేసీబీ వాహనాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెద్ద ఎత్తున రవాణా చేయడానికి ఉపయోగించే ప్రత్యేక రైలు ఆటోమొబైల్ క్యారియర్ రైలు(న్యూ మాడిఫైడ్ గూడ్స్) కాజీపేట జంక్షన్ మీదుగా వస్తూ జిల్లా కేంద్రమైన జనగామ రైల్వే స్టేషన్ లో ఆగడంతో వివిధ రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రజా రవాణా రైళ్ల కోసం జనగామ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఇవ్వడంతో ఈ గూడ్స్ ను నిలిపివేసినట్లు రైల్వే సిబ్బంది వివరించారు.ఆటోమొబైల్ కొరియర్ ట్రైన్ గా పిలువబడే ఈ గూడ్స్ రైలు కు 33 రేక్స్ ఉండగా ఒక రేక్స్ లో మూడు జెసిబి వాహనాలతో మొత్తంగా దాదాపు ఒక వంద జేసీబీ వాహనాలను సరఫరా చేసే ఈ రైలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మౌలాలి స్టేషన్ వరకు తీసుకువెళ్ళి అన్ లోడ్ చేయనున్నట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు.1
- రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు ఎందుకు.. ఏందీ గలీజ్ యవ్వారం? ఎన్నడన్నా చూసామా రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు వేయడం? రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు ఎందుకు.. ఏందీ గలీజ్ యవ్వారం? ఎన్నడన్నా చూసామా రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు వేయడం? రేపు రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్ల మీద అతని ఫొటోలు వేస్తారా? మొత్తం ఖమ్మం మంత్రుల అందరి ఫోటోలు వెయ్యకపోయారా – నిలదీసిన ఖమ్మం మహిళ1
- వర్షాల కోసం కప్పతల్లి ఆటలు.. కప్పలకు పెళ్లి చేసి చెరువులో వదిలిన రైతులు ములుగు: పొలాల్లో నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా సరైన వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా లక్నవరం చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వర్షాలు కురవాలని వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు రైతులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన ‘కప్పతల్లి ఆటలు’ నిర్వహించారు. ఇందులో భాగంగా రెండు కప్పలను పట్టుకొచ్చి పసుపు, కుంకుమతో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. అనంతరం కప్ప వరుడు, వధువులను డప్పు చప్పుళ్లతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. తర్వాత సమీపంలోని చెరువుకు తీసుకెళ్లి కప్పలను నీటిలో వదిలారు. కప్పలు తడిస్తే మేఘాలు కరిగి వర్షాలు కురుస్తాయని తమ పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకమని గ్రామస్థులు తెలిపారు. వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించి పంటలను కాపాడాలని రైతులు వేడుకున్నారు.1