logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు – హనుమకొండలో బీఆర్‌ఎస్ సంబరాలు హన్మకొండ జిల్లా:కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో హనుమకొండ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ సంబరాలు నిర్వహించింది. మాజీ చీఫ్ విప్ దాస్యం భాస్కర్ పార్టీ శ్రేణులతో కలిసి బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. కేసీఆర్ గారిని రాజకీయంగా బదనాం చేసేందుకు వేసిన కమిషన్ కుట్రపూరితమని ఆయన విమర్శించారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కక్షపూరిత ధోరణికి చెంపపెట్టని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్

9 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
9 hrs ago

కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు – హనుమకొండలో బీఆర్‌ఎస్ సంబరాలు హన్మకొండ జిల్లా:కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో హనుమకొండ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ సంబరాలు నిర్వహించింది. మాజీ చీఫ్ విప్ దాస్యం భాస్కర్ పార్టీ శ్రేణులతో కలిసి బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. కేసీఆర్ గారిని రాజకీయంగా బదనాం చేసేందుకు వేసిన కమిషన్ కుట్రపూరితమని ఆయన విమర్శించారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కక్షపూరిత ధోరణికి చెంపపెట్టని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్:వరంగల్ నగరంలోని ఎంజీఎం సర్కిల్ వద్ద కానిస్టేబుల్ సంగీత మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. పోలీస్ శాఖలోనే మహిళా కానిస్టేబుళ్లకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, పోలీస్ వ్యవస్థలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు.
    1
    వరంగల్:వరంగల్ నగరంలోని ఎంజీఎం సర్కిల్ వద్ద కానిస్టేబుల్ సంగీత మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. పోలీస్ శాఖలోనే మహిళా కానిస్టేబుళ్లకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, పోలీస్ వ్యవస్థలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • వరంగల్ జిల్లా నర్సంపేట మండల బస్ డిపోలో ఆర్టీసీ సమ్మె ప్రభావంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. డిపోలోనే వేల సంఖ్యలో బస్సులు నిలిచిపోవడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో బస్టాండ్లకు చేరుకున్న ప్రజలు గంటల తరబడి పడిగాపులు కాస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ సమ్మె ప్రభావం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు విస్తరించి, రాష్ట్రమంతా రవాణా వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర ప్రయాణాల కోసం వచ్చిన వారు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రైవేట్ వాహనదారులు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో సామాన్య ప్రజలు బేజారవుతున్నారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తేవడానికి అధికారులు అద్దె బస్సులను ఏర్పాటు చేసే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమ్మె ప్రభుత్వ హామీల అమలు కోసం చేపట్టినదేనని ఆర్టీసీ కార్మికుల జేఏసీ స్పష్టం చేసింది. సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
    1
    వరంగల్ జిల్లా నర్సంపేట మండల బస్ డిపోలో ఆర్టీసీ సమ్మె ప్రభావంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. డిపోలోనే వేల సంఖ్యలో బస్సులు నిలిచిపోవడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో బస్టాండ్లకు చేరుకున్న ప్రజలు గంటల తరబడి పడిగాపులు కాస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ఈ సమ్మె ప్రభావం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు విస్తరించి, రాష్ట్రమంతా రవాణా వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర ప్రయాణాల కోసం వచ్చిన వారు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక ప్రైవేట్ వాహనదారులు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో సామాన్య ప్రజలు బేజారవుతున్నారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తేవడానికి అధికారులు అద్దె బస్సులను ఏర్పాటు చేసే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సమ్మె ప్రభుత్వ హామీల అమలు కోసం చేపట్టినదేనని ఆర్టీసీ కార్మికుల జేఏసీ స్పష్టం చేసింది. సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    15 hrs ago
  • గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000 రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు. మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు. ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.
    1
    గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000  రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు.
మహబూబాబాద్ జిల్లా:
తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో  సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ 
గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు.
ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • కరీంనగర్ లోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    కరీంనగర్ లోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
  • నవనారసింహ స్వామి క్షేత్రాలలో ఒక్కటైన జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలతో అర్చకులు గోదావరినదికి వెళ్ళి బిందె తీర్థం ఆలయానికి తీసుకు వచ్చారు. శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి…శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలలో లోకకళ్యాణం కొరకువేద పండితుల వేదమంత్రోచ్చరణల మధ్య సంకల్ప పూజలు…కలశగణపతి విశ్వక్షేణ ఆరాధన… కలశ స్థాపన…. పంచామృతాలతో శ్రీ యోగానంద…శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి మూల మూర్తులకు పంచోపనిషత్తులతో అభిషేకము శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలంకర అష్టోత్తర శతనామర్చనలు, దూప, దీప నివేదన సప్త హారతులు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రధాన కార్యక్రమాలు ఈనెల 25న అన్నకూటోత్సవము, 26న సహస్ర కలశాభిషేకం, 27న చందనోత్సవం, 28న పల్లవ ఉత్సవం, వసంతోత్సవం, 29న లక్ష తులసి అర్చన, 30న శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలు కొనసాగనున్నాయని ఆలయ అర్చకులు నంబి అరుణ్ కుమార్ చార్య, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
    1
    నవనారసింహ స్వామి క్షేత్రాలలో ఒక్కటైన జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలతో అర్చకులు గోదావరినదికి వెళ్ళి బిందె తీర్థం ఆలయానికి తీసుకు వచ్చారు. శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి…శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలలో  లోకకళ్యాణం కొరకువేద పండితుల వేదమంత్రోచ్చరణల మధ్య సంకల్ప పూజలు…కలశగణపతి విశ్వక్షేణ ఆరాధన… కలశ స్థాపన…. పంచామృతాలతో  శ్రీ యోగానంద…శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి మూల మూర్తులకు పంచోపనిషత్తులతో అభిషేకము శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలంకర అష్టోత్తర శతనామర్చనలు, దూప, దీప నివేదన సప్త హారతులు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రధాన కార్యక్రమాలు ఈనెల 25న అన్నకూటోత్సవము, 
26న సహస్ర కలశాభిషేకం, 
27న చందనోత్సవం,
28న పల్లవ ఉత్సవం, వసంతోత్సవం, 29న లక్ష తులసి అర్చన, 30న శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలు కొనసాగనున్నాయని ఆలయ అర్చకులు నంబి అరుణ్ కుమార్ చార్య, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించి, తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే, నేడు అదే వేముల వీరేశం పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ గార్లను విమర్శించడం అత్యంత దారుణమని, ఆయనకు ఆ స్థాయి లేదని మండిపడ్డారు. పార్టీ అండతో రాజకీయంగా ఎదిగి, కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్న వేముల వీరేశం తీరును ఆయన తప్పుబడుతూ, చేసిన మేలును మరచి అధినేతలపై అవాకులు చెవాకులు పేలడం తగదని హెచ్చరించారు.
    1
    నకిరేకల్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించి, తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే, నేడు అదే వేముల వీరేశం పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ గార్లను విమర్శించడం అత్యంత దారుణమని, ఆయనకు ఆ స్థాయి లేదని మండిపడ్డారు. పార్టీ అండతో రాజకీయంగా ఎదిగి, కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్న వేముల వీరేశం తీరును ఆయన తప్పుబడుతూ, చేసిన మేలును మరచి అధినేతలపై అవాకులు చెవాకులు పేలడం తగదని హెచ్చరించారు.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
  • బెజ్జంకి మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో బుధవారం UKG విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ల తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమం అరుదని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు జంగోని శ్రీనివాస్, శిరీష, హరీష పాల్గొన్నారు. తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
    1
    బెజ్జంకి మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో బుధవారం UKG విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ల తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమం అరుదని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు జంగోని శ్రీనివాస్, శిరీష, హరీష పాల్గొన్నారు. తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
  • హన్మకొండ జిల్లా:కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో హనుమకొండ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ సంబరాలు నిర్వహించింది. మాజీ చీఫ్ విప్ దాస్యం భాస్కర్ పార్టీ శ్రేణులతో కలిసి బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. కేసీఆర్ గారిని రాజకీయంగా బదనాం చేసేందుకు వేసిన కమిషన్ కుట్రపూరితమని ఆయన విమర్శించారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కక్షపూరిత ధోరణికి చెంపపెట్టని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్
    1
    హన్మకొండ జిల్లా:కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో హనుమకొండ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ సంబరాలు నిర్వహించింది. మాజీ చీఫ్ విప్ దాస్యం భాస్కర్  పార్టీ శ్రేణులతో కలిసి బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు.
కేసీఆర్ గారిని రాజకీయంగా బదనాం చేసేందుకు వేసిన కమిషన్ కుట్రపూరితమని ఆయన విమర్శించారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కక్షపూరిత ధోరణికి చెంపపెట్టని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.