Shuru
Apke Nagar Ki App…
బిజినపల్లి మండల ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన మండల విద్యాధికారి బిజినపల్లి మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో, ప్రాథమికోన్నత పాఠశాలలో , ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఈరోజు బిజినపల్లి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ లో పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా శాలువా, మెమొంటో ,ప్రశంసా పత్రాలతో మండల విద్యాధికారి శ్రీ సయ్యద్ మొహినుద్దీన్ గారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి, పి ఆర్ టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, మండలంలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.*
NAVADEEP
బిజినపల్లి మండల ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన మండల విద్యాధికారి బిజినపల్లి మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో, ప్రాథమికోన్నత పాఠశాలలో , ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఈరోజు బిజినపల్లి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ లో పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా శాలువా, మెమొంటో ,ప్రశంసా పత్రాలతో మండల విద్యాధికారి శ్రీ సయ్యద్ మొహినుద్దీన్ గారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి, పి ఆర్ టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, మండలంలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.*
More news from తెలంగాణ and nearby areas
- సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు మార్పు అంటే ఇదేనా రేవంతూ.. తూ.. ఒక్క కల్వకుర్తి నియోజకవర్గం లొనే 308 ఎకరాలు అంటే .. రాష్ట్రo.. పక్క రాష్ట్రo లో ఎంత ఉందొ మొత్తం లెక్కలు వొస్తాయి.. ఎలా సంపాదించావు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసిందన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం అన్నారు.1
- అమృతం కోసం దేవతలు రాక్షసుల క్షీరసాగర మథనంలో ఘననాధుడు శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం (పద్మశాలి) ఆధ్వర్యంలో గద్వాల వినాయక మండపాలను 53 ఏళ్లుగా వినూత్న అలంకరణల్లో పురాణ ఘాతల్లో ఘననాతుని దర్శనం. పురాణ ఘట్టాలతో ఆకట్టుకుంటున్న ఘననాధుడు. జోగులాంబ గద్వాల పట్టణం వేదనగర్ లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం(పద్మశాలి) ఆధ్వర్యంలో 53 ఏళ్లుగా వినాయక చవితి నవరాత్రి బ్రహ్మోస్థవాలు వినూత్న రీతిలో వినాయక మండపాలను అలంకరిస్తున్నారు. 1971లో గద్వాల మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గద్వాలపట్టణంలో తొలిసారిగా వినాయక చవితి వేడుకలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1973 నుంచి శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న రీతులలో పురాణ ఘట్టాలను వివిధ ఆకృతులలో అలంకరణలు చేస్తూ భక్తులకు పురాణాల్లోని ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు మండపాల్లో మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస, ఘాతలను పలురకాలుగా కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తూ చిన్నారులకు , యువతకు , ప్రజలకు పురాణాల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా అలంకరణలు చేస్తున్నారు. ఈ సన్నివేశాలను చూసే వారికి అప్పటి పురాణ కథలు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఈ సంవత్సరం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ ఆధ్వర్యంలో అమృత భాండం కోసం దేవతలు–దానవులు క్షీరసాగర మథనం ఘట్టాన్ని వినూత్నంగా రూపొందించారు. ఈ అలంకరణను గద్వాల పట్టణ ప్రజలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను స్వకులశాలి సమాజం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వకులసాలి యువజన సంఘం ఉపాధ్యక్షుడు దేవుజి రాఘవేందర్, కార్యదర్శి సాక్రె శ్రీనివాస్, దోత్రే సురేంద్రబాబు, కార్యవర్గ సభ్యులు గణప నరేందర్, కాంబ్లే ప్రవీణ్, గచ్చి వీరన్న, దోత్రే ప్రమోద్, సఫారీ అజయ్, సఫారీ సురేష్, జిందే కార్తీక్ తదితరులు కుల బాంధవులు మాజీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.2
- రైతులకు శుభవార్త తెలంగాణలో సెప్టెంబర్ 19న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది1
- ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026. 9వ జాతీయ పోషణ మాసం 2026 ఆత్మకూరు:నంద్యాల జిల్లా. ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21 నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి, P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.1
- ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం BSP అభ్యర్థులు. అట్టలైనీ ఆనందం 🔥 ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం! 🔥 రాజస్థాన్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి 19 మంది అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది కేవలం 19 మంది గెలుపు మాత్రమే కాదు… ఆత్మగౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం నిలబడిన ప్రజల నమ్మకానికి ప్రతీక! అధికార రాజకీయాలకు లొంగకుండా, తమ సిద్ధాంతాలను నమ్ముకుని పోరాడి విజయం సాధించిన ప్రతి BSP అభ్యర్థికి, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. 💙 బహుజనుల స్వాభిమానం చిరస్థాయిగా నిలవాలి… సామాజిక న్యాయం కోసం పోరాటం మరింత బలపడాలి! ✊ జై భీమ్ | జై బహుజన్ | జై BSP 💙1
- జీఎన్ఆర్ హాస్పిటల్‌లో ఘనంగా అన్నదాన వితరణ వినాయక చవితి వేడుకల్లో భాగంగా మూడవ రోజు ప్రత్యేక పూజలు రైతన్నలు బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థన హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో 200 మందికి భోజన సదుపాయం కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద గల జీఎన్ఆర్ హాస్పిటల్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. నాగేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మంది రోగులు, వారి సహాయకులు, స్థానికులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మూడవ రోజున ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజానికి వెన్నెముక అయిన రైతన్న బాగుంటేనే దేశం, సమస్త రంగాలు బాగుంటాయని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నేశ్వరుడు కరుణించి, వరుణ దేవుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, రైతుల కష్టాలు తీరి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ ఛారిటబుల్ సొసైటీ చైర్‌పర్సన్ లక్ష్మీదేవి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె. కళా సౌందర్య, మేనేజర్ శివ, ఇన్‌ఛార్జ్ కుమార్, సిబ్బంది టి. నరసింహ, బాషా, రాము, సతీష్, రేణుకతో పాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.4
- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- బాధిత కుటుంబానికి అండగా ఉంటా: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్ ఛార్జీ డాక్టర్ రఘు ని, వారి కుటుంబ సభ్యులను TRS పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. డాక్టర్ రఘు తల్లి పుస్పలత ఇటీవల మృతి చెందగా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని నివాసానికి వెళ్లి పుస్పలత చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీ పునుగోటి పవన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, ఇస్మాయిల్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.1