Shuru
Apke Nagar Ki App…
కర్నె అరవింద్‌కు నివాళులు… బీఆర్ఎస్ నేతల ప్రగాఢ సానుభూతి మాజీ ఎమ్మెల్యేలు.. హైదరాబాద్:- ఇటీవల మరణించిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, మాజీ శాసనమండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారి సోదరుని కుమారుడు స్వర్గీయ కర్నె అరవింద్ గారి చిత్రపటానికి పార్టీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు చాడ కిషన్ రెడ్డి పాల్గొని పూలమాలలు వేసి తమ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు కర్నె అరవింద్ కుటుంబ సభ్యులను పరామర్శించి, మాజీ శాసనమండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Nagesh Kothapalli
కర్నె అరవింద్‌కు నివాళులు… బీఆర్ఎస్ నేతల ప్రగాఢ సానుభూతి మాజీ ఎమ్మెల్యేలు.. హైదరాబాద్:- ఇటీవల మరణించిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, మాజీ శాసనమండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారి సోదరుని కుమారుడు స్వర్గీయ కర్నె అరవింద్ గారి చిత్రపటానికి పార్టీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు చాడ కిషన్ రెడ్డి పాల్గొని పూలమాలలు వేసి తమ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు కర్నె అరవింద్ కుటుంబ సభ్యులను పరామర్శించి, మాజీ శాసనమండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
More news from తెలంగాణ and nearby areas
- 👉 రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నల్గొండ ఆర్ & బి శాఖ మాత్యుల క్యాంప్ కార్యాలయం (ఇందిరా భవన్)లో జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. 👉 యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 👉 అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. 👉 రాత్రి, పగలు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. 👉 ఎక్కువగా ధాన్యం వచ్చే గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని సూచించారు. 👉 ఆ గ్రామాలకు అదనపు లారీలు పంపి రవాణా వేగవంతం చేయాలని చెప్పారు. 👉 రోడ్లపై ధాన్యం పేరుకుపోకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్ల వద్ద తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 👉 రైతులు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. 👉 నల్గొండ నియోజకవర్గంలో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోయే అవకాశం ఉందని అంచనా. ➡️ ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.1
- ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.1
- Post by Tagore1
- ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -1
- ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకోండి: మంత్రి పొన్నం ప్రభాకర్1
- Post by JADI RAJU1
- వరంగల్ రంగంపేటలోని శ్రీ భద్రకాళి రోడ్‌పై ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయం, శ్రీ గాయత్రి మాత దేవాలయాల సముదాయంలో ఈ ఉదయం భక్తి వైభవం నెలకొంది. ఆలయ అర్చకులు జి. కార్తిక్ చారి ఆధ్వర్యంలో శ్రీ రామదూత హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం నిర్వహించారు. ఇది 101వ దేవాలయ కార్యక్రమంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆకుతోట బాల కొమురెల్లి స్వామి, మాటేటి సత్యనారాయణ (సత్యం) స్వామి, జగన్మోహన్ రెడ్డి, మూడు నగేష్ స్వామి, లాస్య శ్రీ స్వామి, అరవింద స్వామి, ఎం. రాజేందర్ చారి, జి. కృష్ణ స్వామి, ప్రదీప్, గోపీచంద్, ఆర్. సాత్విక, ఏ. వినయ్, ఈశ్వర్, శిల్ప తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామస్మరణ, రామకీర్తనలు, భజనలు ఘనంగా నిర్వహించబడాయి. ఈ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసా పఠిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.2
- ప్రజలు ప్రాణాల మీద పెట్టుకుని రాకపోకలు... ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాల రద్దీ పెరిగినా సిగ్నల్స్ మాత్రం మూగబోయినట్టే పరిస్థితి... ఎవరికి దారి వారిదే అన్నట్టుగా వాహనాలు దూసుకెళ్తుండడంతో ప్రమాదాల భయం పెరుగుతోంది... పాదచారులు రోడ్డు దాటాలంటే గుండెల్లో గుబులు... చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు... ట్రాఫిక్ పోలీసులు లేకపోతే జంక్షన్ మొత్తం గందరగోళంగా మారుతున్న దృశ్యాలు... ఇప్పటికే ప్రమాదాల నిలయంగా పేరున్న ఈ ప్రాంతంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ప్రజల ఆగ్రహం... మున్సిపల్ అధికారులు గానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం... వెంటనే సిగ్నల్స్ మరమ్మతు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల డిమాండ్... మరెంతమంది ప్రాణాలు పోతే అధికార యంత్రాంగం మేల్కొంటుందో అంటూ ప్రజల ప్రశ్నలు...1