*అతి త్వరలో అమరావతి అనే మహా నగరాన్ని మనం చూడబోతున్నాం* *జగన్ మరింత దిగజారిపోయి.. జోకర్ గా మారిపోయాడు* *అమరావతికి చట్టబద్ధతపై సంబరాల్లో పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలు* *చేనేతలకు ఉచిత విద్యుత్ ధ్రువపత్రాలు అందజేసిన శ్రీరామ్* *ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ చిత్రపటాలకు రాష్ట్ర ప్రజలు అతి త్వరలో అమరావతి అనే ఒక మహా నగరాన్ని చూడబోతున్నారని.. ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం పట్టణంలోని 35వ వార్డు లక్ష్మీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చేనేతలకు ఉచిత విద్యుత్ ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు వందలాదిమంది చేనేతలు పాల్గొన్నారు. ముందుగా పార్లమెంటులో అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించడంతో పాటు చేనేతలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం చేనేతలకు ఉచిత విద్యుత్ ధ్రువపత్రాలను శ్రీరామ్ అందజేశారు. ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత వస్త్రాల డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత నాగరాజుకు ఇదే వేదికపై శ్రీరామ్ సన్మానం చేశారు. చైనాలోని బీజింగ్లో జరిగిన వసంత్ మేళాలో ధర్మవరం ఖ్యాతిని చాటారని శ్రీరామ్ నాగరాజును ప్రత్యేకంగా అభినందించారు. ఈసందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ఐదున్నర కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఇక శాశ్వత రాజధానిగా ఉండబోతుందన్నారు. 2014 నుంచి 2019 సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ... రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాట పేరుతో రియల్ ఎస్టేట్ చేయాలని చూశారన్నారు. ఆరోజు రైతులను, మహిళలను రోడ్డు మీదకు లాగి ఎంతగా హింసించారో ప్రతి ఒక్కరూ చూశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమరావతి రైతులు నిర్వహించిన యాత్రకు ప్రతి ఒక్కరూ మద్దతు పలికారన్నారు. రైతులు చేసిన పోరాటం, వారి విషయంలో జగన్ వ్యవహరిస్తున్న దుర్మార్గపు వైఖరి గురించి అందరూ అర్థం చేసుకున్నారన్నారు. ఇప్పుడు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక బద్ధంగా అమరావతి నిర్మాణం చేస్తున్నారన్నారు. ఇప్పటికీ కీలకమైన ల్యాండ్ మార్క్స్, రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నారన్నారు. అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతోందన్నది చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమరావతికి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించారన్నారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. కనీసం ఈ రెండేళ్లలో అయినా జగన్ బుద్ధి తెచ్చుకోకుండా మరింత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. అప్పట్లో మూడు రాజధానులని.. ఇప్పుడు కొత్తగా మావిగన్ పేరుతో ఒక రాష్ట్ర రాజధానిని అపహస్యం చేసే విధంగా మాట్లాడుతూ జోకర్ గా మారిపోయారన్నారు. అమరావతి రాజధానిగా చరిత్రలో నిలిచిపోతుందని.. ఇందులో మనమంతా ఉన్నందుకు గర్వపడాల్సిన విషయం అని పరిటాల శ్రీరామ్ అన్నారు. *చేనేతల పక్షాన నిలబడింది.. ఆ ఇద్దరు మాత్రమే* రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా చేనేత వృత్తిపై ఆధారపడ్డారని గుర్తించిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. అందుకే జనతా వస్త్రాలను అప్పట్లోనే ప్రోత్సహించారన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా చేనేతలను అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. దీనివలన హ్యాండ్లూమ్ వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు ఉంటుందని.. దీని ద్వారా ఏడాదికి 8500 రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. అదే పవర్ లూమ్ వారికి 500 యూనిట్లు చొప్పున ఏడాదికి 60 వేల రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. ధర్మవరంలో 5600 మంది హ్యాండ్లూమ్ కార్మికులకు, 780 మంది పవర్ లూమ్ కార్మికులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారన్నారు. అయితే ఈ పథకం ఇంకా ఎవరికైనా వర్తించకపోతే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. నిబంధనల ప్రకారం మరోసారి వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మందికి పథకం వర్తించేందుకు తాను కూడా కృషి చేస్తానన్నారు. చేనేతలకు పింఛన్ సౌకర్యాన్ని కూడా మరింత ఎక్కువ మందికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక అందమైన చీర తయారీ వెనుక చేనేత కార్మికుని శ్రమ ఎంత ఉందో తాను కూడా ప్రత్యక్షంగా చూశానన్నారు. కచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికునికి పింఛన్ వచ్చేలా కూడా చూస్తామన్నారు. మరోవైపు చేనేత కార్మికుడు సొంతంగా తయారు చేసుకున్న చీరను.. వారే ధర నిర్ణయించుకుని.. విక్రయించుకునే విధంగా ప్రభుత్వ సహకారంతో ఒక దుకాణాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందన్నారు. ఇప్పటికే మంత్రి సవిత దృష్టికి దానిని తీసుకెళ్లామన్నారు. భవిష్యత్తులో షోరూం అది స్థాయికి కూడా ఎదిగే విధంగా చూస్తామన్నారు. మరోవైపు చేనేత క్లస్టర్ ద్వారా సామాన్య చేనేతలకు, భవిష్యత్తులో ఈ రంగంలోకి రావాలనుకునే వారిని ప్రోత్సహించే విధంగా ఉంటుందన్నారు. ఇక్కడ అత్యాధునిక డిజైన్లతో చీరలు తయారు చేయడం, సాంకేతికతను మరింత దగ్గర చేసే విధంగా శిక్షణ ఉంటుందన్నారు. ఈ క్లస్టర్ ద్వారా ధర్మవరం ప్రాంతం ఒక టూరిజం ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు..
*అతి త్వరలో అమరావతి అనే మహా నగరాన్ని మనం చూడబోతున్నాం* *జగన్ మరింత దిగజారిపోయి.. జోకర్ గా మారిపోయాడు* *అమరావతికి చట్టబద్ధతపై సంబరాల్లో పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలు* *చేనేతలకు ఉచిత విద్యుత్ ధ్రువపత్రాలు అందజేసిన శ్రీరామ్* *ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ చిత్రపటాలకు రాష్ట్ర ప్రజలు అతి త్వరలో అమరావతి అనే ఒక మహా నగరాన్ని చూడబోతున్నారని.. ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం పట్టణంలోని 35వ వార్డు లక్ష్మీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చేనేతలకు ఉచిత విద్యుత్ ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు వందలాదిమంది చేనేతలు పాల్గొన్నారు. ముందుగా పార్లమెంటులో అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించడంతో పాటు చేనేతలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం చేనేతలకు ఉచిత విద్యుత్ ధ్రువపత్రాలను శ్రీరామ్ అందజేశారు. ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత వస్త్రాల డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత నాగరాజుకు ఇదే వేదికపై శ్రీరామ్ సన్మానం చేశారు. చైనాలోని బీజింగ్లో జరిగిన వసంత్ మేళాలో ధర్మవరం ఖ్యాతిని చాటారని శ్రీరామ్
నాగరాజును ప్రత్యేకంగా అభినందించారు. ఈసందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ఐదున్నర కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఇక శాశ్వత రాజధానిగా ఉండబోతుందన్నారు. 2014 నుంచి 2019 సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ... రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాట పేరుతో రియల్ ఎస్టేట్ చేయాలని చూశారన్నారు. ఆరోజు రైతులను, మహిళలను రోడ్డు మీదకు లాగి ఎంతగా హింసించారో ప్రతి ఒక్కరూ చూశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమరావతి రైతులు నిర్వహించిన యాత్రకు ప్రతి ఒక్కరూ మద్దతు పలికారన్నారు. రైతులు చేసిన పోరాటం, వారి విషయంలో జగన్ వ్యవహరిస్తున్న దుర్మార్గపు వైఖరి గురించి అందరూ అర్థం చేసుకున్నారన్నారు. ఇప్పుడు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక బద్ధంగా అమరావతి నిర్మాణం చేస్తున్నారన్నారు. ఇప్పటికీ కీలకమైన ల్యాండ్ మార్క్స్, రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నారన్నారు. అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతోందన్నది చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమరావతికి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించారన్నారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేకంగా
కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. కనీసం ఈ రెండేళ్లలో అయినా జగన్ బుద్ధి తెచ్చుకోకుండా మరింత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. అప్పట్లో మూడు రాజధానులని.. ఇప్పుడు కొత్తగా మావిగన్ పేరుతో ఒక రాష్ట్ర రాజధానిని అపహస్యం చేసే విధంగా మాట్లాడుతూ జోకర్ గా మారిపోయారన్నారు. అమరావతి రాజధానిగా చరిత్రలో నిలిచిపోతుందని.. ఇందులో మనమంతా ఉన్నందుకు గర్వపడాల్సిన విషయం అని పరిటాల శ్రీరామ్ అన్నారు. *చేనేతల పక్షాన నిలబడింది.. ఆ ఇద్దరు మాత్రమే* రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా చేనేత వృత్తిపై ఆధారపడ్డారని గుర్తించిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. అందుకే జనతా వస్త్రాలను అప్పట్లోనే ప్రోత్సహించారన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా చేనేతలను అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. దీనివలన హ్యాండ్లూమ్ వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు ఉంటుందని.. దీని ద్వారా ఏడాదికి 8500 రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. అదే పవర్ లూమ్ వారికి 500 యూనిట్లు చొప్పున ఏడాదికి 60 వేల రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. ధర్మవరంలో 5600 మంది హ్యాండ్లూమ్ కార్మికులకు, 780 మంది పవర్ లూమ్ కార్మికులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారన్నారు. అయితే ఈ పథకం
ఇంకా ఎవరికైనా వర్తించకపోతే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. నిబంధనల ప్రకారం మరోసారి వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మందికి పథకం వర్తించేందుకు తాను కూడా కృషి చేస్తానన్నారు. చేనేతలకు పింఛన్ సౌకర్యాన్ని కూడా మరింత ఎక్కువ మందికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక అందమైన చీర తయారీ వెనుక చేనేత కార్మికుని శ్రమ ఎంత ఉందో తాను కూడా ప్రత్యక్షంగా చూశానన్నారు. కచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికునికి పింఛన్ వచ్చేలా కూడా చూస్తామన్నారు. మరోవైపు చేనేత కార్మికుడు సొంతంగా తయారు చేసుకున్న చీరను.. వారే ధర నిర్ణయించుకుని.. విక్రయించుకునే విధంగా ప్రభుత్వ సహకారంతో ఒక దుకాణాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందన్నారు. ఇప్పటికే మంత్రి సవిత దృష్టికి దానిని తీసుకెళ్లామన్నారు. భవిష్యత్తులో షోరూం అది స్థాయికి కూడా ఎదిగే విధంగా చూస్తామన్నారు. మరోవైపు చేనేత క్లస్టర్ ద్వారా సామాన్య చేనేతలకు, భవిష్యత్తులో ఈ రంగంలోకి రావాలనుకునే వారిని ప్రోత్సహించే విధంగా ఉంటుందన్నారు. ఇక్కడ అత్యాధునిక డిజైన్లతో చీరలు తయారు చేయడం, సాంకేతికతను మరింత దగ్గర చేసే విధంగా శిక్షణ ఉంటుందన్నారు. ఈ క్లస్టర్ ద్వారా ధర్మవరం ప్రాంతం ఒక టూరిజం ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు..
- ఆకలి కడుపులు నింపుటకై పెట్టిన కార్యక్రమం అన్న క్యాంటీన్. దయచేసి ఒక టోకెన్ మాత్రమే తీసుకోవాలి అని మనవి.మీ వెనకాల ఉన్న పేద వాడి కడుపు కూడా నిండాలి అంటే ..1
- కదిరి మండల పరిధిలోని ముత్యాల చెరువు గ్రామంలో శుక్రవారం మన ఊరు మన నీరు మన అందరి బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సాగునీటి చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సీనియర్ టిడిపి నాయకుడు న్యాయవాది వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఓటమి నాయకులు పాల్గొన్నారు.1
- కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల బైక్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో కళ్యాణదుర్గం టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీ సర్కిల్లో బాణసంచా పేల్చి, సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మోరేపల్లి మల్లికార్జున, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని రథోత్సవం పై కొలువు తీర్చి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మడుగుతేరు కార్యక్రమం నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రథోత్సవ వేడుకల్లో పాల్గొని రథాన్నిలాగి మొక్కలు తీర్చుకున్నారు.1
- వైరల్: కారు ఢీకొనడంతో మహిళ గాలిలోకి విసిరివేయబడింది *రోడ్డు దాటేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన తెలియజేస్తుంది. కర్ణాటకలోని బంట్వాల్‌లో భారతి(48) అనే యువతి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. మధ్యలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనం వేగాన్ని అంచనా వేయకుండా ముందుకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఆమెను బలంగా ఢీకొట్టడంతో గాలిలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన భారతిని ఆస్పత్రికి తరలించారు. గత నెల 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.*1
- బద్వేలు:రాజధాని అమరావతి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో రాజధానిపై కమ్ముకున్న అనిశ్చితి, చీకట్లు పూర్తిగా తొలగిపోయాయని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు నిర్వహించారు. అమరావతికి వెలుగులు వచ్చినట్లుగా సంకేతంగా దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు., “ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఇక శాశ్వత రాజధానిగా నిలవనుంది” అని అన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు తమ సొంత భూములను త్యాగంగా సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ కాలంలో రాజధాని అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆ పరిస్థితులను అర్థం చేసుకుని తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇకపై ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా అమరావతిని ఎవరూ కదిలించలేరని, ఇది రాష్ట్ర ప్రజల సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తరఫున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,చెరుకూరి రవికుమార్, పరిటాల వెంకట సుబ్బయ్య,బీరం జయ రామి రెడ్డి, పాలకొండు రాజశేఖర్ రెడ్డి,గాజులపల్లె శంకర్ రెడ్డి కొంకుల రాంబాబు, కల్వపల్లె వీర రెడ్డి, జహంగీర్ భాష,బోవిళ్ళ నరసింహ రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి, పఠాన్ మౌలాలి, రసూల్, ఉపత్తి సుబ్బారెడ్డి,గోపి రెడ్డి, సుబ్బా రాయుడు,రాము,గురు ప్రసాద్ రెడ్డి,కోటపాటి పెంచలయ్య,చిన్నప్ప రెడ్డి, గంగాధర్ రెడ్డి, వెంకటేష్ తదితరు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఎమ్మిగనూరు నుండి ముఖ్య వార్త… అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక ఘట్టంగా మారడంతో ఎమ్మిగనూరులో ఘనంగా సంబరాలు నిర్వహించారు. రైతుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలు ఈ విజయాన్ని పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.1
- గాండ్లపెంట మండలo క ఠారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించి, ముగింపుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి ఉత్సవాలు ముగింపు కావడంతో యోగివేమన గొడుగుకి వేమన పీఠాధిపతులు నందవేమారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలు చేశారు. వేమన సమాధిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన నందవేమారెడ్డికి భక్తులు ప్రశంసిస్తున్నారు.1