logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సీఎం చంద్రబాబు బహిరంగ సభ, పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయసునీత వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఈ నెల 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో దోర్నాల మండలం గంటవానిపల్లిలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.పార్కింగ్ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కలెక్టర్, ఉన్నతాధికారులు సుమారు 5 కి.మీ. మేర పొలాల్లో పర్యటించారు. చివరి దశలో ఉన్న ఫీడర్ కెనాల్, క్రషర్ గేట్ల పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. సభా వేదిక, గ్యాలరీలు, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.

9 hrs ago
user_ఏడుకొండలు. జర్నలిస్ట్
ఏడుకొండలు. జర్నలిస్ట్
Local News Reporter పుల్లలచెరువు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago
b2fc099b-6088-4ad5-809e-045fdefe752e
da569afd-2234-4e2b-b21b-87b562602942
e92dcea8-8e3c-4f4c-9a42-06c8c7111c66

సీఎం చంద్రబాబు బహిరంగ సభ, పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయసునీత వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఈ నెల 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో దోర్నాల మండలం గంటవానిపల్లిలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.పార్కింగ్ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కలెక్టర్, ఉన్నతాధికారులు సుమారు 5 కి.మీ. మేర పొలాల్లో పర్యటించారు. చివరి దశలో ఉన్న ఫీడర్ కెనాల్, క్రషర్ గేట్ల పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. సభా వేదిక, గ్యాలరీలు, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు
    1
    రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు 
పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • 18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హ నిర్వాసిత యువతి, యువకుడికి R&R ప్యాకేజీ ఇవ్వాలి. 2019లో కట్‌ఆఫ్ తేదీ ప్రకటించిన తర్వాత కూడా మమ్మల్ని ఖాళీ చేయించకుండా, మా అమ్మానాన్నలకు రావాల్సిన నష్టపరిహారం కూడా పూర్తిగా అందకపోవడం మా తప్పా? ఏళ్లుగా మేము ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మా ఇళ్లను ఖాళీ చేయమంటున్నారు. మరి మా భవిష్యత్తు పరిస్థితి ఏమిటి? మా త్యాగానికి న్యాయం చేయండి. 18+ అర్హ నిర్వాసిత యువతకు R&R విషయంలో న్యాయం చేయండి. 🙏✊
    1
    18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 


18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 
18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హ నిర్వాసిత యువతి, యువకుడికి R&R ప్యాకేజీ ఇవ్వాలి.
2019లో కట్‌ఆఫ్ తేదీ ప్రకటించిన తర్వాత కూడా మమ్మల్ని ఖాళీ చేయించకుండా, మా అమ్మానాన్నలకు రావాల్సిన నష్టపరిహారం కూడా పూర్తిగా అందకపోవడం మా తప్పా?
ఏళ్లుగా మేము ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మా ఇళ్లను ఖాళీ చేయమంటున్నారు. మరి మా భవిష్యత్తు పరిస్థితి ఏమిటి?
మా త్యాగానికి న్యాయం చేయండి.
18+ అర్హ నిర్వాసిత యువతకు R&R విషయంలో న్యాయం చేయండి. 🙏✊
    user_Bollavaram Mallikarjuna
    Bollavaram Mallikarjuna
    పెద అరవీడు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • జాలలపాలెం అటవీ భూముల ఆక్రమణపై చర్యలు కోరుతూ ప్రజా సంఘంగాలు ధర్నా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎర్రచందనం చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి అర్జీ సమర్పించారు.జాలలపాలెం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని, అటవీ భూముల్లో ఎర్రచందనం తదితర చెట్లను నరికివేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకుని అటవీ సంపద, వన్యప్రాణులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.
    1
    జాలలపాలెం అటవీ భూముల ఆక్రమణపై చర్యలు కోరుతూ ప్రజా సంఘంగాలు ధర్నా
వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎర్రచందనం చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి అర్జీ సమర్పించారు.జాలలపాలెం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని, అటవీ భూముల్లో ఎర్రచందనం తదితర చెట్లను నరికివేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకుని అటవీ సంపద, వన్యప్రాణులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.
    user_Orsu Krishna
    Orsu Krishna
    Social worker పిడుగురాళ్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్‌లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.
    1
    స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ  మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్‌లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.
    user_T Shankar Public News Reporter
    T Shankar Public News Reporter
    రిపోర్టర్ Kanagal, Nalgonda•
    12 hrs ago
  • వైసీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ గుంటూరు :పదవిని దుర్వినియోగం చేసే అధికారులు భవిష్యత్తులో ఎక్కడున్నా శిక్ష తప్పదని YCP చీఫ్ జగన్ హెచ్చరించారు. 'తప్పు చేసే వారి పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కించండి. న్యాయంగా ఎన్నికలు జరిపించాలి. లేదు మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది. ఆ తరువాత వచ్చేది మా టైమ్' అని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏకగ్రీవం కారాదని, అలాంటి చోట ఇన్ఛార్జులకు MLA సీటు ఉండదని స్పష్టం చేశారు.
    1
    వైసీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్
గుంటూరు :పదవిని దుర్వినియోగం చేసే అధికారులు భవిష్యత్తులో ఎక్కడున్నా శిక్ష తప్పదని YCP చీఫ్ జగన్ హెచ్చరించారు. 'తప్పు చేసే వారి పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కించండి. న్యాయంగా ఎన్నికలు జరిపించాలి. లేదు మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది. ఆ తరువాత వచ్చేది మా టైమ్' అని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏకగ్రీవం కారాదని, అలాంటి చోట ఇన్ఛార్జులకు MLA సీటు ఉండదని స్పష్టం చేశారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    14 hrs ago
  • **విద్యార్థులలో విద్య సామర్థ్యాలను పెంపొందించాలి*** *- ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి.. *- నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్. *- నల్గొండ జిల్లా కేంద్రంలోని కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. *- విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్. విద్యార్థులలో కనీస విద్య సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ వేశారు. అనంతరం విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం ,రాయడంతో పాటు, తెలుగు ,ఇంగ్లీష్ లలో పదాలకు అర్థాలు తెలిసే విధంగా నేర్పించాలని, ప్రాథమిక స్థాయిలో కనీస విద్యా సామర్ధ్యాలు పెంపొందినప్పుడే పై తరగతులకు వెళ్లిన సందర్భంలో విషయం సులభంగా అర్థమవుతుందని, ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే కొత్త పదాలకు అర్థాలతో పాటు, చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ యూనిఫామ్స్ గురించి అడిగారు. అందరికీ యూనిఫామ్ అందించడం జరుగుతుందని, యూనిఫాం వచ్చినవారు సరైన విధంగా ఉన్నది సరిచూసుకోవాలని, అవసరమైతే పాఠశాలలోనే ఆల్టరేషన్ చేయించేందుకు టైలర్లను పాఠశాలకు పిలిపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మహేశ్వరి తో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సామర్ధ్యాల పెంపుదలకు స తరచు పాఠశాలను సందర్శించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    2
    **విద్యార్థులలో  విద్య సామర్థ్యాలను
పెంపొందించాలి***
*- ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి..
*- నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.
*- నల్గొండ జిల్లా కేంద్రంలోని కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్..

*- విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్.
విద్యార్థులలో  కనీస విద్య సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ వేశారు. అనంతరం  విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు.  ప్రతి విద్యార్థికి చదవడం ,రాయడంతో పాటు, తెలుగు ,ఇంగ్లీష్ లలో  పదాలకు అర్థాలు తెలిసే విధంగా నేర్పించాలని,  ప్రాథమిక స్థాయిలో కనీస విద్యా సామర్ధ్యాలు పెంపొందినప్పుడే పై తరగతులకు వెళ్లిన సందర్భంలో విషయం సులభంగా అర్థమవుతుందని, ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే కొత్త పదాలకు అర్థాలతో పాటు, చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ యూనిఫామ్స్ గురించి అడిగారు. అందరికీ యూనిఫామ్ అందించడం జరుగుతుందని, యూనిఫాం వచ్చినవారు సరైన విధంగా ఉన్నది సరిచూసుకోవాలని, అవసరమైతే పాఠశాలలోనే ఆల్టరేషన్ చేయించేందుకు టైలర్లను పాఠశాలకు పిలిపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మహేశ్వరి తో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సామర్ధ్యాల పెంపుదలకు స  తరచు పాఠశాలను సందర్శించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ఈ  కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Suryapet, Telangana•
    9 hrs ago
  • సమిష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి భక్త మండలి సహకారంతో డి పి యు పి మరియు ఉర్దూ ప్రాథమిక పాఠశాల యందు 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఐదు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలతో పని చేయించుకోవడం చట్టరితే నేరమని, ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని పిల్లలకు మధ్యాహ్న భోజనం, దుస్తులు మరియు పుస్తకాలు,, 15000 నగదు పురస్కారం అందిస్తుందని పిల్లలకు విద్య నేర్పిస్తే ఆస్తులు ఇచ్చిన దానికంటే ఎక్కువ అని బ్రహ్మానంద చారి వివరించారు. డిపియుపి ఇన్చార్జి హెచ్ఎం పుష్పరాజు ఉర్దూ స్కూల్ హెచ్ఎం ఫాతిమా అలియానా మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే సదుపాయాలు వివరించారు. ప్రాత పుస్తకాలు పెన్నులు ఇచ్చిన ఆంజనేయ స్వామి భక్తి మండలి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకోబారావు, నాగేంద్రుడు, కే పుష్పరాజు, మంగళ్ లక్ష్మన్న, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు, అనంతరం 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు బ్రహ్మానందం పంపిణీ చేశారు.
    2
    సమిష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం బ్రహ్మానంద చారి
బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి భక్త మండలి సహకారంతో డి పి యు పి మరియు ఉర్దూ ప్రాథమిక పాఠశాల యందు 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.  బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఐదు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలతో పని చేయించుకోవడం చట్టరితే నేరమని, ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని పిల్లలకు మధ్యాహ్న భోజనం, దుస్తులు మరియు పుస్తకాలు,, 15000 నగదు పురస్కారం అందిస్తుందని పిల్లలకు విద్య నేర్పిస్తే ఆస్తులు ఇచ్చిన దానికంటే ఎక్కువ అని బ్రహ్మానంద చారి వివరించారు. డిపియుపి ఇన్చార్జి హెచ్ఎం పుష్పరాజు ఉర్దూ స్కూల్ హెచ్ఎం ఫాతిమా అలియానా మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే సదుపాయాలు వివరించారు. ప్రాత పుస్తకాలు పెన్నులు ఇచ్చిన ఆంజనేయ స్వామి భక్తి మండలి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకోబారావు, నాగేంద్రుడు, కే పుష్పరాజు, మంగళ్ లక్ష్మన్న, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు, అనంతరం 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు బ్రహ్మానందం పంపిణీ చేశారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • వెలుగొండ ప్రాజెక్ట్ కు కృష్ణా జలాలను విడుదల చేస్తున్న సందర్భంగా కూటమి నాయకులు ట్రాక్టర్స్ ర్యాలీ వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం జిల్లా తో పాటు మరికొన్ని జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కి నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా మార్కాపురం పట్టణ కూటమి నేతల ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆగస్టు 30వ తేదీ సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలు విడుదల చేయబోతున్నట్లు నాయకులు తెలిపారు. అందులో భాగంగా మార్కెట్ యాడ్ నుండి అల్లూరి పోలేరమ్మ ఆలయం వరకు ట్రాక్టర్ ర్యాలీ చేసి, నల్గొండ ప్రాజెక్టు జలాలను ప్రారంభించేందుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని కూటమిన్ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    వెలుగొండ ప్రాజెక్ట్ కు కృష్ణా జలాలను విడుదల చేస్తున్న సందర్భంగా కూటమి నాయకులు ట్రాక్టర్స్ ర్యాలీ 
వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం జిల్లా తో పాటు మరికొన్ని జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కి నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా మార్కాపురం పట్టణ కూటమి నేతల ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆగస్టు 30వ తేదీ సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలు విడుదల చేయబోతున్నట్లు నాయకులు తెలిపారు. అందులో భాగంగా మార్కెట్ యాడ్ నుండి అల్లూరి పోలేరమ్మ ఆలయం వరకు ట్రాక్టర్ ర్యాలీ చేసి, నల్గొండ ప్రాజెక్టు జలాలను ప్రారంభించేందుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని కూటమిన్ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.