"భోగి పిడకలు" తయారీలో ఎంతో ఆనందం.. ఇప్పుడంతా రెడీమేడ్ దండలే... రిపోర్టర్ నందికోళ్ల రాజు..... గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా భోగి పిడకల దండలు షాపుల వద్ద వేలాడుతూ కనిపిస్తున్నాయి. పట్టణాల్లో బోగి పిడకలు అమ్ముతున్నారని గతంలో వార్తలు వచ్చేవి. అది ఇప్పుడు పల్లెలకు విస్తరించింది. పట్టణాల్లో ఆన్ లైన్ ద్వారా తెప్పించుకుంటున్నారు. వీటికి ఇప్పుడు స్టైల్ గా కౌడంగ్ కేకులని పేరు పెట్టుకున్నారు. బొత్తిగా పిడకలంటే ఇంగ్లీష్ మీడియం జనాలకు అర్థమయ్యి చావదు కదా అందుకన్న మాట. సంక్రాంతికి సొంతూరు రాలేకపోయేవాళ్లు ఇప్పుడు ఆన్ లైన్లో బోగి పిడకలు తెప్పించుకుంటున్నారు.మన కళా సంస్కృతుల విలువ మాత్రమే కాదు.. సాంస్కృతిలో అవిభాజ్యమైన పిడకల విలువ కూడా వాళ్లకు బాగానే తెలుస్తుందని చెప్పవచ్చు. ఆన్ లైన్లో ఆర్డర్ పెడితే చాలు పిడకల పార్సల్ ఇంటికి వచ్చేస్తుంది. వాటితో అక్కడ సాంప్రదాయానికి లోటు రాకుండా బోగి మంటలో వేసుకుంటున్నారు. ఇక గోదావరి జిల్లాలలో కూడా ఇలా భోగి పిడకలు కొనే సంస్కృత పెరుగుతూ వస్తుంది. పశు సంపద తగ్గిపోవడం.. నేటి పిల్లలు పేడ ముట్టుకోవడాని ఇష్టపడకపోవడం వల్ల దుకాణాల్లో దొరికే బోగి పిడకల దండలను కొని భోగి మంటల్లో వేస్తున్నారు.నిత్యం చదువుతో ఉంటే నేటి బాలలు సంక్రాంతి సెలవులు రావడంతో సెల్ ఫోన్లు తో కాలం గడుపుతున్నారు.అటువంటి పిల్లలను మోటారు సైకిల్ పై భోగి మంట దగ్గరకు తీసుకెళ్లి మంటలో దండ వేసి ఫొటోలు తీయించుకుని స్టేటస్ ఇతర సోషల్ మీడియోలో పెట్టుకుంటున్నారు. అంతే బోగి పండగ అయిపోయిందనుకుంటున్నారు.పేడ ముట్టుకోరు,పిడకలు వేయరు,వాటిని ఎండబెట్టరు.రెడీమేడ్ దండలతోనే భోగి పండగను జరుపుకుంటున్నారు. మా చిన్నప్పడు అంటే ఎనభై దశకంలో బోగి పండగ ఎలా జరిగిందో తెలుసుకుందాం... అప్పుడు పల్లెల్లోనే కాదు పట్నాల్లోనూ పశు సంపద పుష్కలంగా ఉండే రోజులవి. భోగి పండుగ అంటే చిన్నారులకు పట్టరాని ఆనందం. ఎందుకంటే పిడకలు తయారు చేయడానికి. అప్పట్లో ఆవు పేడ సేకరించడం అంటే ఎంతో ఆనందం.జెర్సీ ఆవులు కాకుండా కేవలం దేశీయ ఆవులు వేసిన పేడ తోనే ఈ బోగి పిడకలు తయారు చేయాలని ఆ నాటి అందరి విశ్వాసం. అందుకనే అలా దేశీయ ఆవు పేడను సేకరించి దానితో పిడకలు ఎవరికి వాళ్లే తయారు చేసుకుని గోడలు, చెట్లు పై ఎండబెట్టేవారు. అలా ఎండబెట్టిన పిడకలను జాగ్రత్తగా ఇంటికి తెచ్చి దండగా తయారు చేసేవారు. ఎవరు ఎంత పెద్ద దండ తయారు చేస్తున్నారనేది తెలియకుండా ఎవరికి వారు పోటీ పడే వారు. భోగి రోజు వచ్చిందంటే వాళ్ళు మోహల్లో ఆనందం మామూలుగా ఉండేది కాదు. అమ్మ లేదా అమ్మమ్మ కుంకుడుకాయలతో తలంటి, నలుగు పిండితో స్నానం చేయించేవారు. అప్పట్లో ఇన్ని రకాల షాంపూలు, సబ్బులు ఉండేవి కాదు. అలాగే టైలర్ వద్ద కుట్టించిన బట్టలు వేయించి భోగి మంట వద్దకు బయలుదేరేవారు. కుంకుడుకాయ పులుసు కళ్ళుల్లో పడటం వల్ల ఎర్రబారిన కళ్ళతో కొత్త బట్టలు వేసుకుని, వారు స్వయంగా తయారు చేసిన భోగి దండ పట్టుకుని భోగి మంట వద్దకు నడుచుకుంటూ వెళ్లేవారు. అప్పుడు వాళ్ళ ఆనందం మాటల్లో చెప్పలేము.ఎందుకంటే ఆ దండ వారు తయారు చేసుకున్నది. అంటే ఎవరు బ్రాడ్ కాదు.ఓన్ బ్రాడ్. అందుకనే రెండు చేతులతో దండ పట్టుకుని ఎవరు ఎలాంటి దండలు తెస్తున్నారో చూసుకుంటూ భోగిమంట వద్దకెళ్ళేవారు. అలా పిల్లలంతా అక్కడికి చేరి ఎవరి దండ గొప్పదనేది చర్చించుకుంటూ ఆ మంటల్లో వేసేవారు. ఆ మంటల్లో బూడిదని బొట్టు పెట్టుకుని తెగ ఆనందపడేవారు.దండ గొప్పదనంతో పాటు వారు వేసుకున్న బట్టల గురించి విపరీతమైన చర్చలు జరిగేవి. ఆ రోజు కోసమే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసేవారు. ఇలాంటి అనుభూతులు నేటి కంప్యూటర్ కాలంలో కష్టమే.అలా పేడతో పిడకలు వేయడం కూడా గొప్పేనా అనేసుకోవచ్చు.అలా సొంతంగా పేడ సేకరించి పిడకల దండ తయారు చేయడంలో బోలెడన్ని జీవిత పాఠాలను నేర్చుకోవచ్చు. మార్కెట్ లో ఇప్పుడు దండ కొనుక్కోవడానికి డబ్బులుంటే సరిపోతుంది. అలా కొనడం వల్ల జీవితంలో నేర్చుకునేది ఏమీ ఉండదు.అందుకునే ఇటీవలి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవనే మాట తరుచూ వినబడుతుంది. అవునులేండి ఏ కాలంలో కావలసింది ఆ కాలంలో ఉండాలి. నేటి పిల్లలను పిడకలు వేసుకోమనడం కూడా సరికాదు.
"భోగి పిడకలు" తయారీలో ఎంతో ఆనందం.. ఇప్పుడంతా రెడీమేడ్ దండలే... రిపోర్టర్ నందికోళ్ల రాజు..... గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా భోగి పిడకల దండలు షాపుల వద్ద వేలాడుతూ కనిపిస్తున్నాయి. పట్టణాల్లో బోగి పిడకలు అమ్ముతున్నారని గతంలో వార్తలు వచ్చేవి. అది ఇప్పుడు పల్లెలకు విస్తరించింది. పట్టణాల్లో ఆన్ లైన్ ద్వారా తెప్పించుకుంటున్నారు. వీటికి ఇప్పుడు స్టైల్ గా కౌడంగ్ కేకులని పేరు పెట్టుకున్నారు. బొత్తిగా పిడకలంటే ఇంగ్లీష్ మీడియం జనాలకు అర్థమయ్యి చావదు కదా అందుకన్న మాట. సంక్రాంతికి సొంతూరు రాలేకపోయేవాళ్లు ఇప్పుడు ఆన్ లైన్లో బోగి పిడకలు తెప్పించుకుంటున్నారు.మన కళా సంస్కృతుల విలువ మాత్రమే కాదు.. సాంస్కృతిలో అవిభాజ్యమైన పిడకల విలువ కూడా వాళ్లకు బాగానే తెలుస్తుందని చెప్పవచ్చు. ఆన్ లైన్లో ఆర్డర్ పెడితే చాలు పిడకల పార్సల్ ఇంటికి వచ్చేస్తుంది. వాటితో అక్కడ సాంప్రదాయానికి లోటు రాకుండా బోగి మంటలో వేసుకుంటున్నారు. ఇక గోదావరి జిల్లాలలో కూడా ఇలా భోగి పిడకలు కొనే సంస్కృత పెరుగుతూ వస్తుంది. పశు సంపద తగ్గిపోవడం.. నేటి పిల్లలు పేడ ముట్టుకోవడాని ఇష్టపడకపోవడం వల్ల దుకాణాల్లో దొరికే బోగి పిడకల దండలను కొని భోగి మంటల్లో వేస్తున్నారు.నిత్యం చదువుతో ఉంటే నేటి బాలలు సంక్రాంతి సెలవులు రావడంతో సెల్ ఫోన్లు తో కాలం గడుపుతున్నారు.అటువంటి పిల్లలను మోటారు సైకిల్ పై భోగి మంట దగ్గరకు తీసుకెళ్లి మంటలో దండ వేసి ఫొటోలు తీయించుకుని స్టేటస్ ఇతర సోషల్ మీడియోలో పెట్టుకుంటున్నారు. అంతే బోగి పండగ అయిపోయిందనుకుంటున్నారు.పేడ ముట్టుకోరు,పిడకలు వేయరు,వాటిని ఎండబెట్టరు.రెడీమేడ్ దండలతోనే భోగి పండగను జరుపుకుంటున్నారు. మా చిన్నప్పడు అంటే ఎనభై దశకంలో బోగి పండగ ఎలా జరిగిందో తెలుసుకుందాం... అప్పుడు పల్లెల్లోనే కాదు పట్నాల్లోనూ పశు సంపద పుష్కలంగా ఉండే రోజులవి. భోగి పండుగ అంటే చిన్నారులకు పట్టరాని ఆనందం. ఎందుకంటే పిడకలు తయారు చేయడానికి. అప్పట్లో ఆవు పేడ సేకరించడం అంటే ఎంతో ఆనందం.జెర్సీ ఆవులు కాకుండా కేవలం దేశీయ ఆవులు వేసిన పేడ తోనే ఈ బోగి పిడకలు తయారు చేయాలని ఆ నాటి
అందరి విశ్వాసం. అందుకనే అలా దేశీయ ఆవు పేడను సేకరించి దానితో పిడకలు ఎవరికి వాళ్లే తయారు చేసుకుని గోడలు, చెట్లు పై ఎండబెట్టేవారు. అలా ఎండబెట్టిన పిడకలను జాగ్రత్తగా ఇంటికి తెచ్చి దండగా తయారు చేసేవారు. ఎవరు ఎంత పెద్ద దండ తయారు చేస్తున్నారనేది తెలియకుండా ఎవరికి వారు పోటీ పడే వారు. భోగి రోజు వచ్చిందంటే వాళ్ళు మోహల్లో ఆనందం మామూలుగా ఉండేది కాదు. అమ్మ లేదా అమ్మమ్మ కుంకుడుకాయలతో తలంటి, నలుగు పిండితో స్నానం చేయించేవారు. అప్పట్లో ఇన్ని రకాల షాంపూలు, సబ్బులు ఉండేవి కాదు. అలాగే టైలర్ వద్ద కుట్టించిన బట్టలు వేయించి భోగి మంట వద్దకు బయలుదేరేవారు. కుంకుడుకాయ పులుసు కళ్ళుల్లో పడటం వల్ల ఎర్రబారిన కళ్ళతో కొత్త బట్టలు వేసుకుని, వారు స్వయంగా తయారు చేసిన భోగి దండ పట్టుకుని భోగి మంట వద్దకు నడుచుకుంటూ వెళ్లేవారు. అప్పుడు వాళ్ళ ఆనందం మాటల్లో చెప్పలేము.ఎందుకంటే ఆ దండ వారు తయారు చేసుకున్నది. అంటే ఎవరు బ్రాడ్ కాదు.ఓన్ బ్రాడ్. అందుకనే రెండు చేతులతో దండ పట్టుకుని ఎవరు ఎలాంటి దండలు తెస్తున్నారో చూసుకుంటూ భోగిమంట వద్దకెళ్ళేవారు. అలా పిల్లలంతా అక్కడికి చేరి ఎవరి దండ గొప్పదనేది చర్చించుకుంటూ ఆ మంటల్లో వేసేవారు. ఆ మంటల్లో బూడిదని బొట్టు పెట్టుకుని తెగ ఆనందపడేవారు.దండ గొప్పదనంతో పాటు వారు వేసుకున్న బట్టల గురించి విపరీతమైన చర్చలు జరిగేవి. ఆ రోజు కోసమే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసేవారు. ఇలాంటి అనుభూతులు నేటి కంప్యూటర్ కాలంలో కష్టమే.అలా పేడతో పిడకలు వేయడం కూడా గొప్పేనా అనేసుకోవచ్చు.అలా సొంతంగా పేడ సేకరించి పిడకల దండ తయారు చేయడంలో బోలెడన్ని జీవిత పాఠాలను నేర్చుకోవచ్చు. మార్కెట్ లో ఇప్పుడు దండ కొనుక్కోవడానికి డబ్బులుంటే సరిపోతుంది. అలా కొనడం వల్ల జీవితంలో నేర్చుకునేది ఏమీ ఉండదు.అందుకునే ఇటీవలి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవనే మాట తరుచూ వినబడుతుంది. అవునులేండి ఏ కాలంలో కావలసింది ఆ కాలంలో ఉండాలి. నేటి పిల్లలను పిడకలు వేసుకోమనడం కూడా సరికాదు.
- #sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi1
- 🙏🙏1
- 🙏🙏2
- 🙏🙏1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు1
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- 🙏🙏1