logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

​రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం... సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పిలుపు -​పిఠాపురంలో జిల్లా సదస్సు – సుప్రీంకోర్టు తీర్పుపై పునఃసమీక్షకు డిమాండ్ ​పిఠాపురం: దేశంలో సంఘ్ పరివార్ శక్తులు రాజ్యాంగంపై చేస్తున్న దాడులను అడ్డుకుని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు పిలుపునిచ్చారు. శనివారం పిఠాపురంలోని లైన్స్ క్లబ్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని పార్టీ జిల్లా నాయకులు గొడుగు సత్యనారాయణ అధ్యక్షతన రాజ్యాంగాన్ని కాపాడండి - ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బంగార్రాజు మరియు ఐలాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఎస్. అజయ్ కుమార్ మాట్లాడుతూ.. మార్చి 24, 2026న సుప్రీంకోర్టు ఆర్టికల్ 341ని పక్కనపెట్టి మతం మారితే ఎస్సీ హోదా కోల్పోతారని ఇచ్చిన తీర్పుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోదని,దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం పార్లమెంటులో మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని,డిలిమిటేషన్ ద్వారా తమ ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవాలని చూస్తోందని వారు విమర్శించారు. అయితే నిన్న పార్లమెంటులో డిలిమిటేషన్ బిల్లు వీగిపోవడం నిరంకుశత్వానికి తగిలిన ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అధికార,ప్రతిపక్ష పార్టీలు కేంద్రం ప్రవేశపెట్టే ప్రజావ్యతిరేక బిల్లులకు మద్దతు తెలపడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ సదస్సులో పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ​మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే పునఃసమీక్షించాలని, ​రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చెయ్యాలని, ​దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను యథాతథంగా కొనసాగించాలని, ​దళితులు,మైనారిటీలు,మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వామపక్ష,ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా పోరాడాలని అన్నారు. ​ఈ కార్యక్రమంలో అయార్ల రాష్ట్ర కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు,జిల్లా కార్యదర్శి కె. జనార్ధన్, ఎస్. అప్పలరాజు,అడ్వకేట్ పి.వి. రావు, ఆర్. సింహాచలం, థామస్, సాకా రామకృష్ణ తదితర నాయకులు,జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

23 hrs ago
user_Prasanna kumar Rowthu
Prasanna kumar Rowthu
Local News Reporter Pithapuram, Kakinada•
23 hrs ago
49c34a62-49de-4475-855f-fcd0c35096dd

​రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం... సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పిలుపు -​పిఠాపురంలో జిల్లా సదస్సు – సుప్రీంకోర్టు తీర్పుపై పునఃసమీక్షకు డిమాండ్ ​పిఠాపురం: దేశంలో సంఘ్ పరివార్ శక్తులు రాజ్యాంగంపై చేస్తున్న దాడులను అడ్డుకుని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు పిలుపునిచ్చారు. శనివారం పిఠాపురంలోని లైన్స్ క్లబ్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని పార్టీ జిల్లా నాయకులు గొడుగు సత్యనారాయణ అధ్యక్షతన రాజ్యాంగాన్ని కాపాడండి - ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బంగార్రాజు మరియు ఐలాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఎస్. అజయ్ కుమార్ మాట్లాడుతూ.. మార్చి 24, 2026న సుప్రీంకోర్టు ఆర్టికల్ 341ని పక్కనపెట్టి మతం మారితే ఎస్సీ హోదా కోల్పోతారని ఇచ్చిన తీర్పుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోదని,దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం

a2b28c3f-57b4-4dc5-ac38-f348925fe15f

పార్లమెంటులో మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని,డిలిమిటేషన్ ద్వారా తమ ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవాలని చూస్తోందని వారు విమర్శించారు. అయితే నిన్న పార్లమెంటులో డిలిమిటేషన్ బిల్లు వీగిపోవడం నిరంకుశత్వానికి తగిలిన ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అధికార,ప్రతిపక్ష పార్టీలు కేంద్రం ప్రవేశపెట్టే ప్రజావ్యతిరేక బిల్లులకు మద్దతు తెలపడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ సదస్సులో పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ​మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే పునఃసమీక్షించాలని, ​రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చెయ్యాలని, ​దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను యథాతథంగా కొనసాగించాలని, ​దళితులు,మైనారిటీలు,మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వామపక్ష,ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా పోరాడాలని అన్నారు. ​ఈ కార్యక్రమంలో అయార్ల రాష్ట్ర కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు,జిల్లా కార్యదర్శి కె. జనార్ధన్, ఎస్. అప్పలరాజు,అడ్వకేట్ పి.వి. రావు, ఆర్. సింహాచలం, థామస్, సాకా రామకృష్ణ తదితర నాయకులు,జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    22 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    19 min ago
  • ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations5191
    1
    ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆
id:cryancreations5191
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Visakhapatnam (Urban), Visakhapatanam•
    10 hrs ago
  • డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది.
ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear
    1
    So light… it floats down! 🪂
Experience feather-light comfort with MGM Vests.
#MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.