Shuru
Apke Nagar Ki App…
కృష్ణాజిల్లాలో 21 మద్యం షాపులకు లాటరీ.. లైసెన్సులు మంజూరు మచిలీపట్నం: జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు లాటరీ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 35 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా, 22 దుకాణాలకు మొత్తం 111 దరఖాస్తులు దాఖలయ్యాయి. నాలుగు కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన 21 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించారు. దరఖాస్తుదారుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ లావణ్య లాటరీ తీశారు. లాటరీలో ఎంపికైన వారికి మద్యం దుకాణాల నిర్వహణకు లైసెన్సులు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పారదర్శకంగా లాటరీ ప్రక్రియను నిర్వహించినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
Arja Durga Prasad
కృష్ణాజిల్లాలో 21 మద్యం షాపులకు లాటరీ.. లైసెన్సులు మంజూరు మచిలీపట్నం: జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు లాటరీ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 35 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా, 22 దుకాణాలకు మొత్తం 111 దరఖాస్తులు దాఖలయ్యాయి. నాలుగు కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన 21 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించారు. దరఖాస్తుదారుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ లావణ్య లాటరీ తీశారు. లాటరీలో ఎంపికైన వారికి మద్యం దుకాణాల నిర్వహణకు లైసెన్సులు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పారదర్శకంగా లాటరీ ప్రక్రియను నిర్వహించినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కృష్ణాజిల్లాలో 21 మద్యం షాపులకు లాటరీ.. లైసెన్సులు మంజూరు మచిలీపట్నం: జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు లాటరీ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 35 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా, 22 దుకాణాలకు మొత్తం 111 దరఖాస్తులు దాఖలయ్యాయి. నాలుగు కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన 21 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించారు. దరఖాస్తుదారుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ లావణ్య లాటరీ తీశారు. లాటరీలో ఎంపికైన వారికి మద్యం దుకాణాల నిర్వహణకు లైసెన్సులు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పారదర్శకంగా లాటరీ ప్రక్రియను నిర్వహించినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.3
- హాయిగా నిద్రపోవడమే పోటీ.. గెలిస్తే రూ.12లక్షలు........ *హాయిగా నిద్రపోవడమే పోటీ.. గెలిస్తే రూ.12లక్షలు* జపాన్లో ఓ వినూత్న పోటీ జరిగింది. నిద్రలేమితో బాధపడుతున్నవారికి అవగాహన పెంచేందుకు ‘కోలా స్లీప్ జపాన్' అనే సంస్థ టోక్యోలో 'మ్యాట్ రేస్' పేరుతో స్లీప్ కాంపిటీషన్ నిర్వహించింది. ఈ పోటీలో పాల్గొన్నవారు 90 నిమిషాలు పరుపులపై నిద్రపోయారు. స్లీప్ ట్రాకింగ్ ద్వారా ఎవరు వేగంగా గాఢ నిద్రలోకి జారుకున్నారనే దాని ఆధారంగా విజేతను నిర్ణయించారు. ఇందులో 'సుయిమీ' అనే మహిళ గెలిచి రూ.12లక్షలు (2M యెన్లు) పొందారు...1
- కృష్ణా : పెడన లో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి ...... బొడ్డు వేణు గోపాల రావు మాట్లాడుతూ గత బ్రిటిష్ కాలం నుండి కూడా హిందూ స్మశాన వాటిక కి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఎంపీ బాలసౌరి గారు కోటి ఎనభై లక్షల ఇరవై రెండు వేల రూపాయలు నిధులు కేటాయించి నందుకు పెడన పట్టణ ప్రజలు ఎప్పుడు తమ వెంట ఉంటామని తెలిపారు. పెడన హిందూ స్మశాన వాటిక పది కాలాల పాటు చిరస్తాయి గా నిలబడేలా తీర్చుదిద్దుతామని ఈ సందర్భం గా తెలిపారు.1
- కృష్ణాజిల్లా, మచిలీపట్నం :సంతానవేణుగోపాల స్వామి ఆలయంలో సామాజిక సామారాశ్యతకు ప్రతీకగా భజన కార్యక్రమాలు భక్తి – సామాజిక సమరసత – సనాతన సంస్కృతి సర్కిల్ పేట గ్రామంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో 07-10-2026 రాత్రి 7 గంటలకు భక్తిశ్రద్ధలతో సాష్టాంగ నమస్కారాలు మరియు భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని భజనలు నిర్వహించారు. మొత్తం 29 మంది మహిళలు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలో భాగస్వాములయ్యారు. భక్తిగీతాలు, భజనలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయ కార్యక్రమాల ద్వారా సమాజంలోని వివిధ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడం, పరస్పర ఆత్మీయతను పెంపొందించడం, సనాతన ధర్మ సంప్రదాయాల పట్ల భక్తి భావాన్ని బలోపేతం చేయడం సామాజిక సమరసతకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆలయం కేవలం పూజా స్థలం మాత్రమే కాకుండా సమాజాన్ని ఏకం చేసే ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలని, మహిళలు, యువత మరియు కుటుంబాలు ఆలయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శ్రీ అయ్యప్ప, శ్రీ కూనపురెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహకరించారు. నూతన వస్త్రాల అందజేత ఈ సందర్భంగా VHP కృష్ణ జిల్లా అధ్యక్షులు డా. బూరగడ్డ శ్రీనాధ్ అమ్మవారికి సమర్పించిన నూతన వస్త్రాలను లక్కీ డ్రా ద్వారా ఎంపికైన శ్రీమతి రజనికి అందజేశారు. భక్తులందరినీ ఆలయ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం, మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, భక్తి కార్యక్రమాల ద్వారా సామాజిక సమరసతను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశ్వహిందూ పరిషత్ కృష్ణ జిల్లా4
- కాలనీ వాసులతో ముట్టడించిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పామర్రు వీరాంజనేయ కాలనీలో తీవ్రమైన తాగునీటి ఎద్దడిపై జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది.కాలనీకి నీటి సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కాలనీవాసులు భారీ ఎత్తున పంచాయతీ కార్యదర్శి కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని శనివారం అధికారులకు గట్టి అల్టిమేటం జారీ చేసినప్పటికీ వారిలో చలనం రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలో ఈ ఘాటైన నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు తాగడానికి నీరు లేక నరకం చూస్తుంటే అధికారులు ఏసీ గదుల్లో నిద్రపోతున్నారా అంటూ ధ్వజమెత్తారు.కనీస వసతులు కల్పించలేని నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించే అధికారుల తీరు మారకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- సులబ్ కాంప్లెక్స్ నిర్వహకుడిపై చర్యలు తీసుకోవాలి రేపల్లె నడిబొడ్డున సులబ్ కాంప్లెక్స్ నుండి మరుగుదొడ్లు సంబంధించిన వ్యర్థాలను సెప్టిక్ ట్యాంకు నిండినప్పుడు తోడించాల్సినటువంటి సులబ్ నిర్వాహకులు పైపుల ద్వారా దుర్వాసన వచ్చే మరుగుదొడ్డి వ్యర్ధాలను డ్రైనేజీలో కలపటం ద్వారా అక్కడనుండి రైల్వే స్టేషన్ ప్రహరీ గోడ వెంబటి ఉన్న డ్రైనేజ్ ద్వారా పార్క్ ఎదురు వరకు వచ్చి ఆగిపోవడంతో ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రజలకు తీవ్రమైనటువంటి వాసన వల్ల అనారోగ్యాలు ఫాలో అవుతున్నారు.ఈ సమస్యను ఈ సంవత్సరం కాలంలో రెండు మూడు సార్లు మున్సిపల్ అధికారులు దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ శాశ్వత పరిష్కారం చూపటం లేదు, వివాహకుడిపై చర్యలు తీసుకోవడం లేదు,ప్రతి మూడో శనివారం స్వచ్ఛభారత్ అని చెబుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రేపల్లెలో అధికారులు మరుగుదొడ్ల వ్యర్థాలను వదలటం వల్ల ప్రజలు ఆరోగ్యాలు గురించి ఆలోచించి, చిత్తశుద్ధితో తక్షణం సెప్టిక్ ట్యాంక్ ను డ్రైనేజీలో కలపకుండా తోడించేలాగా ఏర్పాటుచేయాలి,సులబ్ కాంప్లెక్స్ నిర్వాహకుడినీ తొలగించాలని డిమాండ్ చేశారు.2
- రద్దీ టైమ్‌లో రోడ్డు కుంగి పల్టీ కొట్టిన కారు🤯 🔹 చెన్నై OMR కారిడార్‌లోని తిరువాన్మియూర్ రోడ్డులో ఈ రోజు ఉదయం రోడ్డు ఒక్కసారిగా లోపలికి దిగిపోయి 10 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. 🔹 మెట్రో పనులు, టైడల్ పార్క్ దగ్గర జరిగిన ఈ ఘటనలో ఓ తెల్ల కారు ఆ గొయ్యిలో పడి పైకప్పు కిందికి తిరిగిపోయింది. 🔹 కారులోని వాళ్లంతా స్వల్ప గాయాలతో బయటపడగా, పోలీసులు ఆ ప్రాంతాన్ని కార్డన్ చేశారు, ఈ దృశ్యాల వీడియోను ఓ జర్నలిస్ట్ షేర్ చేశారు.1
- బైండొవర్ కేసు లో కప్పలదొడ్డి గ్రామానికి చెందిన పంతం బలరాం కి 1,00,000 ల జరిమానా... *గూడూరులో రౌడీషీటర్ కు రూ.లక్ష జరిమానా - బైండోవర్ ఉల్లంఘించినందుకు చర్యలు* *గూడూరు, కృష్ణా జిల్లా:* గూడూరు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీ షీట్ హోల్డర్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. అతనికి *రూ.1,00,000/- జరిమానా* విధించారు. *అసలు ఏం జరిగింది?* గూడూరు మండలం, కప్పలదొడ్డి గ్రామానికి చెందిన *పంతం బలరాం (40 సం., తండ్రి సాంబశివరావు, కులం కాపు)* పై గూడూరు PS లో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. దీంతో ఇతనిపై ముందస్తు నేర నివారణ చర్యల్లో భాగంగా *06.06.2026* తేదీన బైండోవర్ చర్యలు చేపట్టారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే 6 నెలల జైలు శిక్ష లేదా రూ.1,00,000/- జరిమానా విధించబడుతుందని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారు *Miscellaneous No.35/2026* ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ సదరు రౌడీ షీట్ హోల్డర్ *08.09.2026* తేదీన బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించడంతో, అతనిపై *09.09.2026* తేదీన *Cr.No.153/2026 U/s 118(1) BNS* కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారి సమక్షంలో హాజరుపరచగా, నిబంధనలు ఉల్లంఘించినందుకు *రూ.1,00,000/- జరిమానా* విధించారు. నిందితుడు ఆ మొత్తాన్ని చెల్లించాడు. *ప్రజలకు విజ్ఞప్తి:* బైండోవర్ లో ఉన్న వ్యక్తులు చట్టపరమైన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు హెచ్చరించారు.1