logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ద్వారా తల్లిపాల ప్రాధాన్యంపై విస్తృత అవగాహన మంగళవారం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ద్వారా తల్లిపాల ప్రాధాన్యంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం ఏటూరునాగారం సీహెచ్‌సీ ఆసుపత్రిని పరిశీలించి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి సీజనల్ వ్యాధులు, వైద్య సేవలు, ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఎస్‌డీసీ ప్రతాప్, బీడబ్ల్యూఓ ప్రేమలత, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్, ఆత్మ కమిటీ సభ్యుడు రఘు,స్థానిక సర్పంచ్ శ్రీలత, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

8 hrs ago
user_Chunchu Ramesh
Chunchu Ramesh
Insurance Agent ములుగు, ములుగు, తెలంగాణ•
8 hrs ago

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ద్వారా తల్లిపాల ప్రాధాన్యంపై విస్తృత అవగాహన మంగళవారం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ద్వారా తల్లిపాల ప్రాధాన్యంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం ఏటూరునాగారం సీహెచ్‌సీ ఆసుపత్రిని పరిశీలించి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి సీజనల్ వ్యాధులు, వైద్య సేవలు, ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఎస్‌డీసీ ప్రతాప్, బీడబ్ల్యూఓ ప్రేమలత, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్, ఆత్మ కమిటీ సభ్యుడు రఘు,స్థానిక సర్పంచ్ శ్రీలత, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • హనుమకొండలో ఆర్టీసీ ఎండీ పర్యటన.. స్క్రాబ్ విక్రయాలకు ఆదేశం హనుమకొండ సిటీ బస్ స్టేషన్‌లో వర్షపు నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మంగళవారం పరిశీలించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లోకల్ డిపోను సందర్శించి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డిపోల్లో పేరుకుపోయిన స్క్రాబ్‌ను నెల రోజుల్లో నిబంధనల ప్రకారం విక్రయించాలని సూచించారు. డిపోల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. అలాగే లోకల్ డిపో ఎదురుగా నిర్మాణంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ పనులను పరిశీలించి, నిర్మాణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
    1
    హనుమకొండలో ఆర్టీసీ ఎండీ పర్యటన.. స్క్రాబ్ విక్రయాలకు ఆదేశం
హనుమకొండ సిటీ బస్ స్టేషన్‌లో వర్షపు నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మంగళవారం పరిశీలించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లోకల్ డిపోను సందర్శించి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డిపోల్లో పేరుకుపోయిన స్క్రాబ్‌ను నెల రోజుల్లో నిబంధనల ప్రకారం విక్రయించాలని సూచించారు. డిపోల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. అలాగే లోకల్ డిపో ఎదురుగా నిర్మాణంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ పనులను పరిశీలించి, నిర్మాణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • గీతన్నల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్.. కురవిలో నిర్వహించిన గీతన్నల చైతన్యయాత్ర సభలో కేజికేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రమణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని, కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయడం లేదన్నారు. గీతన్నల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 18న ట్యాంక్‌బండ్‌పై సర్ధార్ సర్వాయిపాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించాలని, లేకుంటే గౌడబిడ్డలే స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేజికేఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.
    1
    గీతన్నల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్..
కురవిలో నిర్వహించిన గీతన్నల చైతన్యయాత్ర సభలో కేజికేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రమణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని, కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయడం లేదన్నారు. గీతన్నల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 18న ట్యాంక్‌బండ్‌పై సర్ధార్ సర్వాయిపాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించాలని, లేకుంటే గౌడబిడ్డలే స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేజికేఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.
    user_మానుకోట వార్తలు
    మానుకోట వార్తలు
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, విద్యార్థులకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీజేవైఎం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని పలు కళాశాలల్లో "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమాన్ని నిర్వహించారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, విద్యార్థులకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీజేవైఎం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని పలు కళాశాలల్లో "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమాన్ని నిర్వహించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    4 hrs ago
  • వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం... 55 శాతం పనులు పూర్తయినట్లు ఆది శ్రీనివాస్ వెల్లడి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పనుల ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
    2
    వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం... 55 శాతం పనులు పూర్తయినట్లు ఆది శ్రీనివాస్ వెల్లడి
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పనుల ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ పరీక్ష కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు... నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ పరీక్ష కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద దవాఖానలో రూమ్ నంబర్‌ 25లో ఒక్క బీపీ పరీక్ష యంత్రం మాత్రమే అందుబాటులో ఉండటంతో 30-40 మంది వరకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. వృద్ధులు నిలబడలేక కింద కూర్చొని తమ వంతు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. మరిన్ని యంత్రాలు ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
    1
    నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ పరీక్ష కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు...
నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ పరీక్ష కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద దవాఖానలో రూమ్ నంబర్‌ 25లో ఒక్క బీపీ పరీక్ష యంత్రం మాత్రమే అందుబాటులో ఉండటంతో 30-40 మంది వరకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. వృద్ధులు నిలబడలేక కింద కూర్చొని తమ వంతు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. మరిన్ని యంత్రాలు ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ద్వారా తల్లిపాల ప్రాధాన్యంపై విస్తృత అవగాహన మంగళవారం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ద్వారా తల్లిపాల ప్రాధాన్యంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం ఏటూరునాగారం సీహెచ్‌సీ ఆసుపత్రిని పరిశీలించి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి సీజనల్ వ్యాధులు, వైద్య సేవలు, ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఎస్‌డీసీ ప్రతాప్, బీడబ్ల్యూఓ ప్రేమలత, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్, ఆత్మ కమిటీ సభ్యుడు రఘు,స్థానిక సర్పంచ్ శ్రీలత, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ద్వారా తల్లిపాల ప్రాధాన్యంపై విస్తృత అవగాహన
మంగళవారం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ద్వారా తల్లిపాల ప్రాధాన్యంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
అనంతరం ఏటూరునాగారం సీహెచ్‌సీ ఆసుపత్రిని పరిశీలించి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి సీజనల్ వ్యాధులు, వైద్య సేవలు, ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఎస్‌డీసీ ప్రతాప్, బీడబ్ల్యూఓ ప్రేమలత, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్, ఆత్మ కమిటీ సభ్యుడు రఘు,స్థానిక సర్పంచ్ శ్రీలత, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Chunchu Ramesh
    Chunchu Ramesh
    Insurance Agent ములుగు, ములుగు, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.