వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం... 55 శాతం పనులు పూర్తయినట్లు ఆది శ్రీనివాస్ వెల్లడి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పనుల ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం... 55 శాతం పనులు పూర్తయినట్లు ఆది శ్రీనివాస్ వెల్లడి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పనుల ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
- ఆటో డ్రైవర్ల నిరసన ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్ల నిరసన... ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓలా ఉబర్ ఆటోల వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉందని కరీంనగర్ ఆటో డ్రైవర్స్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం వల్ల ఇప్పటికే సగం ఉపాధి కోల్పోయామని, ఆటో ఓలా ఉబర్, బైక్ రైడింగ్ వల్ల పూర్తిస్థాయిలో ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పి ఇప్పటికీ ఎలాంటి అవకాశాలు కల్పించక మా పొట్ట కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఉన్న ఆటో ఓలా ఉబర్ వంటి వాటిని నిషేధించాలని ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల రాబోవు రోజుల్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆటో కార్మికులను ఆదుకోవాలని భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు.1
- శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు.బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం చేశారు.1
- జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని దేశాయి బీడీ కంపెనీ బచ్చన్నపేట మండలం నుంచి తరలించొద్దు : దేశాయి బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి బచ్చన్నపేట మండల కేంద్రంలోని దేశాయి బీడీ కంపెనీ యజమానము దుద్దెడకు తరలిస్తున్న కంపెనీ యజమానాన్ని విరమించుకోవాలని దేశాయి బీడీ కార్మికుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు గత 30 సంవత్సరాల క్రితం ఇందులో ఉపాధి పొందుతున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్న సందర్భంగా రిలే నిరాహార దీక్షని కంటిన్యూ చేస్తూ అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా సిద్ధమని కార్మికులు తెలిపారు ఇందులో మినిమం 1000 కుటుంబాలు ఉన్నాయి దేశాయి బీడీ కంపెనీ తీసివేయడం వల్ల వేల కుటుంబాలు రోడ్డుపాలయ్యే పరిస్థితికి వచ్చింది యజమాన్యం ఇప్పటికైనా స్పందించి సరైన నిర్ణయం తీసుకోకుంటే మంచిదని లేకుంటే ఆమరణ నిరాహార దీక్షచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు తెలిపారు2
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, విద్యార్థులకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీజేవైఎం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని పలు కళాశాలల్లో "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమాన్ని నిర్వహించారు.1
- హనుమకొండలో ఆర్టీసీ ఎండీ పర్యటన.. స్క్రాబ్ విక్రయాలకు ఆదేశం హనుమకొండ సిటీ బస్ స్టేషన్‌లో వర్షపు నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మంగళవారం పరిశీలించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లోకల్ డిపోను సందర్శించి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డిపోల్లో పేరుకుపోయిన స్క్రాబ్‌ను నెల రోజుల్లో నిబంధనల ప్రకారం విక్రయించాలని సూచించారు. డిపోల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. అలాగే లోకల్ డిపో ఎదురుగా నిర్మాణంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ పనులను పరిశీలించి, నిర్మాణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.1
- సిరిసిల్లలో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు...బాలింతలకు పండ్ల పంపిణీ చేసిన కలెక్టర్ తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 01 నుంచి 07 వ తేదీ వరకు కొనసాగుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో బాలింతలకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పలు అనుమానాలు, అపోహలను వీడేలా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. తల్లి పాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని స్పష్టం చేశారు. పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగప డుతాయని తెలిపారు. దీంతో బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలింతలు పోషకాహారం, డ్రై ఫ్రూట్, తినాలని సూచించారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.1
- పగటివేళా వెలుగుతున్న వీధిదీపాలు కరీంనగర్ నగరంలోని కట్ట రాంపూర్ భవాని నగర్‌లో మధ్యాహ్నమవుతున్నా వీధిదీపాలు వెలుగుతూనే ఉన్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంతో రోజూ ఇక్కడే ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఒకవైపు విద్యుత్ పొదుపు చేయాలని అధికారులు ప్రచారం చేస్తున్నా, తమ పరిధిలోని దీపాలను ఆర్పడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.2
- తల్లి పాలలోనే పూర్తి పోషకాలు డెలివరీ అయిన గంటలో తల్లి వద్దకు బిడ్డను చేర్చాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి లో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు బాలింతలకు పండ్ల పంపిణీ తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 01 నుంచి 07 వ తేదీ వరకు కొనసాగుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో మంగళవారం బాలింతలకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పలు అనుమానాలు, అపోహలను వీడేలా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. తల్లి పాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని స్పష్టం చేశారు. పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగప డుతాయని తెలిపారు. దీంతో బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలింతలు పోషకాహారం, డ్రై ఫ్రూట్, తినాలని సూచించారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. తల్లిపాల వారోత్సవాలు జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఆశ వర్కర్లు తమ పరిధిలోని బాలింతలను కలిసి.. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పాలు ఇవ్వడం మందులు క్రమం తప్పకుండా తీసుకోవడంపై అవగాహన కల్పిస్తూ.. అందుబాటులో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ మహేష్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, వార్డు కౌన్సిలర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- అప్పుల బాధతో ఉర్సు కరీంబాద్‌కు చెందిన మెరుగు పవన్ ఆత్మహత్యాయత్నం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం అమ్మవారిపేటలో అప్పుల బాధతో ఉర్సు కరీంబాద్‌కు చెందిన మెరుగు పవన్ మంగళవారం సాయినాథ్ వెంచర్ సమీపంలో తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న మడికొండ పెట్రోలింగ్ సిబ్బంది కొండపల్లి సంపత్, ధారా గోవర్ధన్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పి అతడిని చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.1