Shuru
Apke Nagar Ki App…
పగటివేళా వెలుగుతున్న వీధిదీపాలు కరీంనగర్ నగరంలోని కట్ట రాంపూర్ భవాని నగర్‌లో మధ్యాహ్నమవుతున్నా వీధిదీపాలు వెలుగుతూనే ఉన్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంతో రోజూ ఇక్కడే ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఒకవైపు విద్యుత్ పొదుపు చేయాలని అధికారులు ప్రచారం చేస్తున్నా, తమ పరిధిలోని దీపాలను ఆర్పడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
OM NAMSHIVAYA
పగటివేళా వెలుగుతున్న వీధిదీపాలు కరీంనగర్ నగరంలోని కట్ట రాంపూర్ భవాని నగర్‌లో మధ్యాహ్నమవుతున్నా వీధిదీపాలు వెలుగుతూనే ఉన్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంతో రోజూ ఇక్కడే ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఒకవైపు విద్యుత్ పొదుపు చేయాలని అధికారులు ప్రచారం చేస్తున్నా, తమ పరిధిలోని దీపాలను ఆర్పడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మెట్ పల్లిలో కోతకు గురైన చెరువు కట్టను పరిశీలించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్...చెరువు కట్టతో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు నవ్వుకునేలా ఉందని అధికారుల పనితీరు అద్వానంగా మారిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో గత మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు పెద్ద చెరువు కోతకు గురికావడంతో చెరువును ఎమ్మెల్యే పరిశీలించారు. పురపాలక అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు నీటిపై మీకేమైనా అవగాహన ఉందా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఇరు శాఖల అధికారులను రెండు వైపుల నిలబెట్టి సుమారు గంటపాటు అధికారులను ప్రశ్నిస్తూ ముచ్చెమటలు పట్టించాడు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక అధికారులు దిక్కులు చూస్తూ ఉండిపోయారు. చెరువు విషయంపై ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్కేజీ పిల్లలు చదువుకునే సమయంలో బడి కి వెళ్లకుండా తప్పించుకునే విధంగా కడుపు నొస్తుందని అబద్ధాలు చెప్పే విధంగా, అధికారుల సమాధానాలు కూడా అలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కట్ట తెగడంతో మత్స్యకారులు లక్షల రూపాయల చేపలు బయటకు వెళ్లిపోయి నష్టపోయారని, ఇరు శాఖల అధికారులు మత్స్యకారులకు పరిహారం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. చెరువు కట్టకు అభివృద్ధి పనులు చేస్తున్న గుత్తేదారులు పిలిచి పనులపై ఆగ్రహం వ్యక్తం చేసి శాఖల పనితీరుకు తలలు పట్టుకునేలా ఉందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.1
- శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు.బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం చేశారు.1
- బంకీపూర్ ఉప ఎన్నికల్లో ఓటమి బిజెపి కి గుణపాఠం., CPI ml మాస్ లైన్ ప్రజాపంథా నేత జూపాక శ్రీనివాస్ బంకిపూర్ ఉప ఎన్నికలో బీజేపీకి ఎదురైన ఓటమి దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పరిణామమని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పేర్కొన్నారు.1
- *రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడుదాం* *కరపత్రాల ఆవిష్కరణ* బిబిపేట మండల కేంద్రంలోని వాసవి క్లబ్ లో ఈ నెల ఏడవ తేదీ శుక్రవారం రోజున వాసవి క్లబ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవిఎఫ్), మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ వారి సహకారంతో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీబీపేట్ యస్ఐ నవీన్ చంద్ర, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని దీనికి సహకరిస్తున్న వాసవి క్లబ్ బిబిపేట్ మరియు మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వ్యాధి కలిగిన చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం జీవితాంతం అవసరం ఉంటుందని వారి ప్రాణాలను కాపాడాలంటే వారికి రక్తాన్ని అందజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.మండల వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు యువజన సంఘాలు యువకులు ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు ఎండి జమీల్ అహ్మద్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్,వాసవి క్లబ్ వైస్ గవర్నర్ భాశెట్టి నాగేశ్వర్,అధ్యక్షులు మురికి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి రెడీశెట్టి శ్రీనివాస్,కోశాధికారి జోర్రిగల శ్రీనివాస్,వైశ్య సంఘం కార్యదర్శి ఇల్లందుల ఆంజనేయులు, కోశాధికారి తొడుపునూరి శ్రీనివాస్,బచ్చు రామచంద్రం లు పాల్గొనడం జరిగింది. *రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడుదాం* *కరపత్రాల ఆవిష్కరణ* బిబిపేట మండల కేంద్రంలోని వాసవి క్లబ్ లో ఈ నెల ఏడవ తేదీ శుక్రవారం రోజున వాసవి క్లబ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవిఎఫ్), మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ వారి సహకారంతో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీబీపేట్ యస్ఐ నవీన్ చంద్ర, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని దీనికి సహకరిస్తున్న వాసవి క్లబ్ బిబిపేట్ మరియు మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వ్యాధి కలిగిన చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం జీవితాంతం అవసరం ఉంటుందని వారి ప్రాణాలను కాపాడాలంటే వారికి రక్తాన్ని అందజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.మండల వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు యువజన సంఘాలు యువకులు ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు ఎండి జమీల్ అహ్మద్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్,వాసవి క్లబ్ వైస్ గవర్నర్ భాశెట్టి నాగేశ్వర్,అధ్యక్షులు మురికి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి రెడీశెట్టి శ్రీనివాస్,కోశాధికారి జోర్రిగల శ్రీనివాస్,వైశ్య సంఘం కార్యదర్శి ఇల్లందుల ఆంజనేయులు, కోశాధికారి తొడుపునూరి శ్రీనివాస్,బచ్చు రామచంద్రం లు పాల్గొనడం జరిగింది.1
- కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు1
- పగటివేళా వెలుగుతున్న వీధిదీపాలు కరీంనగర్ నగరంలోని కట్ట రాంపూర్ భవాని నగర్‌లో మధ్యాహ్నమవుతున్నా వీధిదీపాలు వెలుగుతూనే ఉన్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంతో రోజూ ఇక్కడే ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఒకవైపు విద్యుత్ పొదుపు చేయాలని అధికారులు ప్రచారం చేస్తున్నా, తమ పరిధిలోని దీపాలను ఆర్పడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.2
- సిరిసిల్లలో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు...బాలింతలకు పండ్ల పంపిణీ చేసిన కలెక్టర్ తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 01 నుంచి 07 వ తేదీ వరకు కొనసాగుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో బాలింతలకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పలు అనుమానాలు, అపోహలను వీడేలా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. తల్లి పాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని స్పష్టం చేశారు. పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగప డుతాయని తెలిపారు. దీంతో బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలింతలు పోషకాహారం, డ్రై ఫ్రూట్, తినాలని సూచించారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.1
- తల్లి పాలలోనే పూర్తి పోషకాలు డెలివరీ అయిన గంటలో తల్లి వద్దకు బిడ్డను చేర్చాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి లో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు బాలింతలకు పండ్ల పంపిణీ తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 01 నుంచి 07 వ తేదీ వరకు కొనసాగుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో మంగళవారం బాలింతలకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పలు అనుమానాలు, అపోహలను వీడేలా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. తల్లి పాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని స్పష్టం చేశారు. పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగప డుతాయని తెలిపారు. దీంతో బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలింతలు పోషకాహారం, డ్రై ఫ్రూట్, తినాలని సూచించారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. తల్లిపాల వారోత్సవాలు జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఆశ వర్కర్లు తమ పరిధిలోని బాలింతలను కలిసి.. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పాలు ఇవ్వడం మందులు క్రమం తప్పకుండా తీసుకోవడంపై అవగాహన కల్పిస్తూ.. అందుబాటులో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ మహేష్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, వార్డు కౌన్సిలర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనుపరావు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో భాజపా ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీసి అనంతరం ఆర్డిఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అనుప్ రావు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థులతో చలగాటమాడుతుందని వెంటనే విడుదల చేయకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు పలువురు నాయకులు పాల్గొన్నారు.1