Shuru
Apke Nagar Ki App…
కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు
MD. YOUSUF ALI KHAN
కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు
More news from తెలంగాణ and nearby areas
- సోమవారం సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించిన ఈవో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి ఆలయ ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దర్శనం ముగించుకుని వస్తున్న ఓ దివ్యాంగ భక్తిని పలకరించి, దర్శనం సక్రమంగా జరిగిందా, ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఆరా తీశారు. భక్తులకు అందుతున్న సేవలపై ప్రత్యక్షంగా తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.అనంతరం ఆలయంలోని కోడె టికెట్ కౌంటర్లు, దీపాలు వెలిగించే కౌంటర్లు, రెండు చెక్‌పోస్టులు తదితర ప్రాంతాలను పరిశీలించారు. కోడె టికెట్ల జారీ విధానాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఆలయ ప్రాంగణంలో భక్తులు కొబ్బరి కాయలు కొట్టిన అనంతరం వాటి పెంకులు, చిన్న ముక్కలను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల ఇతర భక్తుల కాళ్లకు గుచ్చుకుని గాయాలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ఈవో తెలిపారు. కొబ్బరి వ్యర్థాలను తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లలో వేయాలని భక్తులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలోఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని నిర్వహిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.మొత్తం ఆలయ పరిసరాలను పర్యవేక్షించిన ఈవో రమాదేవి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.2
- ఖానాపూర్ మున్సిపాలిటీ రోడ్ల వెడల్పులకు ఇంకా ఎన్నాళ్లు ఖానాపూర్ మున్సిపాలిటీ రహదారుల వెడల్పుకు ఇంకా ఎన్నాళ్ల. ఇరుకైన రోడ్డులో గుంతలు ఏర్పడడంతో సిమెంటుతో పైన పైన పూతల పూసీ చేతులు దులుపు కోవడం అధికార యంత్రాంగం పైన ఇదేనా అన్ని స్థానికులు ప్రజలు వాహనదారులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా రోడ్ల వెడల్పు డ్రైనేజీ పనులను పూర్తిచేయాలని ప్రజలు వానదరులు కోరుకుంటున్నారు1
- ఎఫ్‌ఆర్‌ఓ సస్పెన్షన్‌కు ఎమ్మెల్యే డిమాండ్.. 24 గంటల్లో చర్యలు లేకపోతే ఉద్యమం హెచ్చరిక జన్నారం మండలం ఇంధన్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఫారెస్ట్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మీనారాయణ స్థానికులపై దాడి చేయడం, జక్కు భూమేష్ ఇంటికి 50 మందికిపైగా సిబ్బంది వెళ్లి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం చట్టవిరుద్ధమన్నారు. వెంటనే ఎఫ్‌ఆర్‌ఓను సస్పెండ్ చేసి, 24 గంటల్లో పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీ అధికారులను డిమాండ్ చేశారు.1
- సిరిసిల్ల అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆకస్మిక తనిఖీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్ లో బియ్యం, పప్పులు, గుడ్లు ఇతర నిలువ పదార్థాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడాడు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం భోజనం పెడుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. సైన్స్ పాఠ్యాంశానికి సంబంధించిన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతి సబ్జెక్టులోని అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రణాళిక ప్రకారం చదివితే భవిష్యత్తు లో ఎంతో మేలు చేస్తుందని వివరించారు. విరామ సమయంలో విద్యార్థులు ఆటలు ఆడాలని సూచించారు.1
- నందిపేట్ ZPHSలో బాల గ్రామ సభ - విద్యార్థుల సమస్యలపై స్పందించిన సర్పంచ్ నందిపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో సోమవారం బాల గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ పాఠశాలలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలను నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు వివరించిన సమస్యలను సర్పంచ్ శ్రద్ధగా నోట్ చేసుకుని, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉప సర్పంచ్ చందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యులు పాషా, పెట్ల శ్రీనివాస్, చింత శ్రీనివాస్, కంఠం చిన్నయ్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.1
- *ఆదివాసీలపై అటవీఅధికారుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం* *దాడి చేసిన అధికారులపై సత్వరమే తగు చర్యలు చేపట్టాలి* *దాడిలో గాయపడిన యువకులకు ప్రభుత్వమే వైద్యం అందించాలి* *గాయపడిన యువకులకు తగిన నష్ట పరిహారం చెల్లించాలి *ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్? *ఆదివాసీలపై అటవీఅధికారుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం* *దాడి చేసిన అధికారులపై సత్వరమే తగు చర్యలు చేపట్టాలి* *దాడిలో గాయపడిన యువకులకు ప్రభుత్వమే వైద్యం అందించాలి* *గాయపడిన యువకులకు తగిన నష్ట పరిహారం చెల్లించాలి* *ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్* తేది: 03-08-2026(సోమవారం): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధన్ పల్లి అటవీ ప్రాంతం పరిధిలో ఆదివాసి యువకులపై కొంత మంది అటవీ అధికారులు పాశవికంగా దాడి చేసి వారిని ఎవరికీ తెలియని రహస్య ప్రదేశంలో నిర్బంధించి ఉంచటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటి ఒక ప్రకటనలో తెలిపినది. ఈ సందర్భంగా ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి మాట్లాడుతూ గతంలో నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామస్థులపై కూడా అటవీ అధికారులు దాడులు చేసినారని, ఇప్పుడు ఇంధన్ పల్లి అటవీ ప్రాంతంలో చేపలు పట్టటానికి వెళ్ళిన ఆదివాసి యువకులపై దాడి చేసి నిర్బంధించటం సిగ్గు చేటని, ఇలాంటి సంఘటనలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని, ఇవి భవిష్యత్తులో మరో ఉద్యమానికి దారి తీస్తాయని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దాడి చేసిన అధికారులపై సత్వరమే చర్యలు చేపట్టాలని, గాయపడిన యువకులకు ప్రభుత్వమే వైద్యం అందించి తగిన నష్ట పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే తగు ఆదేశాలు జారీచేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆదివాసి సంఘాలు, అన్ని వర్గాలతో కలిసి ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.1
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నప్రసాద సత్రంలో ఈవో ఆకస్మిక తనిఖీలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నప్రసాద సత్రంలో భక్తులకు ఉచితంగా అందిస్తున్న అన్నప్రసాద సేవలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సత్రంలో నిల్వ ఉంచిన బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర ఆహార సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే వంటశాలను సందర్శించి, వంటకు వినియోగిస్తున్న బండలు, స్టవ్‌లు, వంట పాత్రలు, ఇతర సామగ్రి పరిశుభ్రతను తనిఖీ చేశారు.అన్నప్రసాద సత్రంలో భోజనం చేస్తున్న భక్తులకు ఈవో స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి, ఆహారం నాణ్యత, రుచి, సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో సేవలను మరింత మెరుగు పరచాలని అధికారులకు సూచించారు.అదే విధంగా, పాత్రలు శుభ్రం చేసే సిబ్బందితో మాట్లాడి ప్రతి పాత్రను పరిశుభ్రంగా కడగాలని, వంటశాల పరిసరాల్లో ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు.సత్రంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఈవో, అన్నప్రసాద పర్యవేక్షకులు ఒన్నారం భాస్కర్ తో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. సత్రానికి వచ్చే ప్రతి భక్తితో మర్యాదగా వ్యవహరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు, అవసరాలు లేదా సూచనలు ఉన్నా వెంటనే తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.భక్తులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన అన్నప్రసాదాన్ని అందించడం దేవస్థానం ప్రధాన బాధ్యత అని పేర్కొన్న ఈవో ఎల్. రమాదేవి, అన్నప్రసాద సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.1
- బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సిపిఐ ప్రచార యాత్ర సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్. కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకే సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర నిర్వహిస్తున్నామని జిల్లా వ్యాప్తంగా ఈనెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రచార యాత్ర కొనసాగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల మండల కార్యదర్శుల సంయుక్త సమావేశం బండ రాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు నిరాశ నిస్పృహలు పెరిగిపోయి ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారని, బీజేపీ ప్రభుత్వ వైఫల్యంలో అతి పెద్దది నిరుద్యోగమని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు,డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందని, ధరల పెరుగుదలను నియంత్రించలేని మోడీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. దేశానికి వెన్నెముక లాంటి అన్నదాతలను ఆదుకోవడం లేదని, వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కి చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ ఇంకా పరిష్కారం కాలేదన్నారు. విద్య,వైద్యం కార్పొరేట్ శక్తుల్లో మగ్గుతుందని, కార్మికులు చెమటోడ్చి సంపాదించిన దేశ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని, మహిళా సాధికారత గురించి పదేపదే మాట్లాడే బిజెపి నేతలు వారి రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని శ్రీనివాస్ ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలనను నిరసిస్తూ బద్లావ్ జరూరీ హై - మార్పు కావాలని సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జిల్లాలో ప్రచార యాత్ర నిర్వహిస్తున్నామని దానిని జయప్రదం చేయాలని సిపిఐ శ్రేణులకు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సమావేశములో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి,నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి,పిట్టల సమ్మయ్య మండల కార్యదర్శులు బండ రాజిరెడ్డి,గోవిందుల రవి, చొక్కల్ల శ్రీశైలం,లంకదాసరి కల్యాణ్,ఎస్. కే .మౌలానా తదితరులు పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో కుక్కల సంచారం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది1