వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నప్రసాద సత్రంలో ఈవో ఆకస్మిక తనిఖీలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నప్రసాద సత్రంలో భక్తులకు ఉచితంగా అందిస్తున్న అన్నప్రసాద సేవలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సత్రంలో నిల్వ ఉంచిన బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర ఆహార సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే వంటశాలను సందర్శించి, వంటకు వినియోగిస్తున్న బండలు, స్టవ్‌లు, వంట పాత్రలు, ఇతర సామగ్రి పరిశుభ్రతను తనిఖీ చేశారు.అన్నప్రసాద సత్రంలో భోజనం చేస్తున్న భక్తులకు ఈవో స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి, ఆహారం నాణ్యత, రుచి, సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో సేవలను మరింత మెరుగు పరచాలని అధికారులకు సూచించారు.అదే విధంగా, పాత్రలు శుభ్రం చేసే సిబ్బందితో మాట్లాడి ప్రతి పాత్రను పరిశుభ్రంగా కడగాలని, వంటశాల పరిసరాల్లో ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు.సత్రంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఈవో, అన్నప్రసాద పర్యవేక్షకులు ఒన్నారం భాస్కర్ తో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. సత్రానికి వచ్చే ప్రతి భక్తితో మర్యాదగా వ్యవహరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు, అవసరాలు లేదా సూచనలు ఉన్నా వెంటనే తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.భక్తులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన అన్నప్రసాదాన్ని అందించడం దేవస్థానం ప్రధాన బాధ్యత అని పేర్కొన్న ఈవో ఎల్. రమాదేవి, అన్నప్రసాద సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నప్రసాద సత్రంలో ఈవో ఆకస్మిక తనిఖీలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నప్రసాద సత్రంలో భక్తులకు ఉచితంగా అందిస్తున్న అన్నప్రసాద సేవలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సత్రంలో నిల్వ ఉంచిన బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర ఆహార సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే వంటశాలను సందర్శించి, వంటకు వినియోగిస్తున్న బండలు, స్టవ్‌లు, వంట పాత్రలు, ఇతర సామగ్రి పరిశుభ్రతను తనిఖీ చేశారు.అన్నప్రసాద సత్రంలో భోజనం చేస్తున్న భక్తులకు ఈవో స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి, ఆహారం నాణ్యత, రుచి, సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో సేవలను మరింత మెరుగు పరచాలని అధికారులకు సూచించారు.అదే విధంగా, పాత్రలు శుభ్రం చేసే సిబ్బందితో మాట్లాడి ప్రతి పాత్రను పరిశుభ్రంగా కడగాలని, వంటశాల పరిసరాల్లో ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు.సత్రంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఈవో, అన్నప్రసాద పర్యవేక్షకులు ఒన్నారం భాస్కర్ తో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. సత్రానికి వచ్చే ప్రతి భక్తితో మర్యాదగా వ్యవహరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు, అవసరాలు లేదా సూచనలు ఉన్నా వెంటనే తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.భక్తులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన అన్నప్రసాదాన్ని అందించడం దేవస్థానం ప్రధాన బాధ్యత అని పేర్కొన్న ఈవో ఎల్. రమాదేవి, అన్నప్రసాద సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
- శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రూ.3.50 లక్షల విలువైన 37 గ్రాముల రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసు విరాళం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఓ భక్త కుటుంబం భక్తిశ్రద్ధలతో సుమారు రూ.3.50 లక్షల విలువైన 37 గ్రాముల రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసును విరాళంగా అందజేసింది.దేవస్థానం రికార్డుల ప్రకారం, వేములవాడ బ్రహ్మంగారి వీధికి చెందిన బై విద్యాసాగర్, సురేఖ దంపతులు సోమవారం స్వామి వారికి ఈ రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసును కానుకగా సమర్పించారు. దేవస్థానం అధికారులు ఈ గొలుసు బరువు 37 గ్రాములు, విలువ సుమారు రూ.3,50,000గా నమోదు చేశారు.ఈ సందర్భంగా దాతలు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవికి బంగారు గొలుసును అందజేయగా, దేవస్థానం తరఫున అధికారిక రసీదును జారీ చేసి విరాళాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) నవీన్ కుమార్, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు దాతల సేవాభావాన్ని అభినందిస్తూ, శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుగ్రహంతో వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. భక్తులు బంగారం, వెండి, నగదు రూపంలో అందించే విరాళాలు దేవస్థానం అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, అలాగే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు వినియోగించబడుతున్నాయని దేవస్థానం అధికారులు తెలిపారు.1
- నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన రోడ్డు రోడ్డు పనులను తక్షణమే పూర్తిచేయాలని బీఆర్ఎస్ డిమాండ్ బెజ్జంకి మండల ప్రజల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా బెజ్జంకి – బేగంపేట – గూడెం – చీమలకుంటపల్లి – కొండపూర్ మార్గంలో నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేయడానికే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి తెలిపారు. బెజ్జంకి మండలం నుంచి తల్లారావనిపల్లి, బేగంపేట, వడ్లూరు, గూడెం, చీమలకుంటపల్లి, కొండపూర్ తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సుమారు రూ.8 కోట్ల నిధులతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో ఆర్&బి శాఖ ద్వారా ఈ రోడ్డు నిర్మాణ పనులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఈ పనుల్లో గుగ్గిల్ల బ్రిడ్జి పూర్తయిందని, అలాగే బెజ్జంకి నుంచి బేగంపేట వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర డాంబర్ రోడ్డు పూర్తయిందని తెలిపారు. సింగిల్ రోడ్డుగా మంజూరైన ఈ పనిని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రీ-ఎస్టిమేట్ చేసి డబుల్ రోడ్డుగా మార్చడం వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. అయినప్పటికీ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే ఎర్త్‌వర్క్, కంకర పనులు, మధ్యంతర పనులు పూర్తయ్యాయని, చివరి దశలో ఉన్న సుమారు 10 శాతం బీటీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వివరించారు. 2023 డిసెంబర్‌లో ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తున్నా ఆ పని ఎక్కడ ఆగిందో అక్కడే ఉందని, ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని మండల అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్థానిక ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి, ఆర్&బి శాఖకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామని, బేగంపేట అంబేద్కర్ చౌరస్తా నుంచి బెజ్జంకి వరకు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఈ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారిందని, ఇటీవల బెజ్జంకి మండలానికి చెందిన ఒక విలేకరి ఈ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యారని, అలాగే బేగంపేటకు చెందిన పత్తి వ్యాపారి మహేందర్ రెడ్డి, నారెడ్డి రాజిరెడ్డి తదితరులు కూడా ప్రమాదాల్లో గాయపడ్డారని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ రోడ్డును పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందువల్ల ఇప్పటికే మంజూరైన నిధులను వెంటనే విడుదల చేసి, కాంట్రాక్టర్‌కు చెల్లింపులు జరిపి, మిగిలిన రోడ్డు పనులను పూర్తిచేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తున్నామని పాకాల మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి పది రోజులలోపు పనులు ప్రారంభించి పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి పాదయాత్రలు, ధర్నాలు, నిరసనలు మరియు వివిధ ప్రజా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రోడ్డు పూర్తయ్యే వరకు పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని పాకాల మహిపాల్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి లింగాల లక్ష్మణ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, మానకొండూరు నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ ఎల శేఖర్ బాబు, రామ్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌ను శుద్ధి చేసిన కాంగ్రెస్ శ్రేణులు కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌ను కాంగ్రెస్ శ్రేణులు నీళ్లతో కడిగి శుద్ధి చేశాయి. నిన్నటి బిఆర్‌ఎస్ నాయకుల పర్యటనతో పంప్‌హౌస్ అపవిత్రమైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయ గౌడ్ మండిపడ్డారు. ఇక్కడికి వస్తున్నది ఎల్లంపల్లి నీళ్లేనని, కాళేశ్వరం నీళ్లంటూ బిఆర్‌ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బిఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఇకపైనా డ్రామాలు ఆడితే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు.1
- బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సిపిఐ ప్రచార యాత్ర సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్. కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకే సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర నిర్వహిస్తున్నామని జిల్లా వ్యాప్తంగా ఈనెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రచార యాత్ర కొనసాగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల మండల కార్యదర్శుల సంయుక్త సమావేశం బండ రాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు నిరాశ నిస్పృహలు పెరిగిపోయి ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారని, బీజేపీ ప్రభుత్వ వైఫల్యంలో అతి పెద్దది నిరుద్యోగమని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు,డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందని, ధరల పెరుగుదలను నియంత్రించలేని మోడీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. దేశానికి వెన్నెముక లాంటి అన్నదాతలను ఆదుకోవడం లేదని, వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కి చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ ఇంకా పరిష్కారం కాలేదన్నారు. విద్య,వైద్యం కార్పొరేట్ శక్తుల్లో మగ్గుతుందని, కార్మికులు చెమటోడ్చి సంపాదించిన దేశ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని, మహిళా సాధికారత గురించి పదేపదే మాట్లాడే బిజెపి నేతలు వారి రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని శ్రీనివాస్ ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలనను నిరసిస్తూ బద్లావ్ జరూరీ హై - మార్పు కావాలని సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జిల్లాలో ప్రచార యాత్ర నిర్వహిస్తున్నామని దానిని జయప్రదం చేయాలని సిపిఐ శ్రేణులకు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సమావేశములో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి,నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి,పిట్టల సమ్మయ్య మండల కార్యదర్శులు బండ రాజిరెడ్డి,గోవిందుల రవి, చొక్కల్ల శ్రీశైలం,లంకదాసరి కల్యాణ్,ఎస్. కే .మౌలానా తదితరులు పాల్గొన్నారు.1
- కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు1
- సోమవారం సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించిన ఈవో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి ఆలయ ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దర్శనం ముగించుకుని వస్తున్న ఓ దివ్యాంగ భక్తిని పలకరించి, దర్శనం సక్రమంగా జరిగిందా, ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఆరా తీశారు. భక్తులకు అందుతున్న సేవలపై ప్రత్యక్షంగా తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.అనంతరం ఆలయంలోని కోడె టికెట్ కౌంటర్లు, దీపాలు వెలిగించే కౌంటర్లు, రెండు చెక్‌పోస్టులు తదితర ప్రాంతాలను పరిశీలించారు. కోడె టికెట్ల జారీ విధానాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఆలయ ప్రాంగణంలో భక్తులు కొబ్బరి కాయలు కొట్టిన అనంతరం వాటి పెంకులు, చిన్న ముక్కలను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల ఇతర భక్తుల కాళ్లకు గుచ్చుకుని గాయాలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ఈవో తెలిపారు. కొబ్బరి వ్యర్థాలను తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లలో వేయాలని భక్తులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలోఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని నిర్వహిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.మొత్తం ఆలయ పరిసరాలను పర్యవేక్షించిన ఈవో రమాదేవి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.2
- జగిత్యాల జిల్లా మల్యాల బిసి బాలుర వసతి గృహంలో విషాదం...నీటికుంటలో ఈతకు వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని బిసి బాలుర వసతి గృహాంలో విషాదం అలుముకుంది. హాస్టల్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు హాస్టల్ వెనుక ఉన్న నీటి కుంటలో ఈతకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఐదవ తరగతి విద్యార్థి వనం విష్ణు, నాల్గవ తరగతి విద్యార్థి సుశాంత్. విష్ణు స్వస్థలం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ కాగ, సుశాంత్ ది జగిత్యాలలోని టీఆర్ నగర్. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులు, హాస్టల్ వెనక భాగంలో ఉన్న నీటి కుంటలోకి ఈతకు వెళ్లి నీటమునిగారు. స్థానికులు, హాస్టల్ సిబ్బంది వెంటనే నీటి కుంటలో గాలించగా ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించగా, కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆసుపత్రిని సందర్శించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. హాస్టల్ నిర్వాహకులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వల్లే విద్యార్థులు బయటికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.1