Shuru
Apke Nagar Ki App…
కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌ను శుద్ధి చేసిన కాంగ్రెస్ శ్రేణులు కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌ను కాంగ్రెస్ శ్రేణులు నీళ్లతో కడిగి శుద్ధి చేశాయి. నిన్నటి బిఆర్‌ఎస్ నాయకుల పర్యటనతో పంప్‌హౌస్ అపవిత్రమైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయ గౌడ్ మండిపడ్డారు. ఇక్కడికి వస్తున్నది ఎల్లంపల్లి నీళ్లేనని, కాళేశ్వరం నీళ్లంటూ బిఆర్‌ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బిఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఇకపైనా డ్రామాలు ఆడితే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు.
RITHIK
కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌ను శుద్ధి చేసిన కాంగ్రెస్ శ్రేణులు కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌ను కాంగ్రెస్ శ్రేణులు నీళ్లతో కడిగి శుద్ధి చేశాయి. నిన్నటి బిఆర్‌ఎస్ నాయకుల పర్యటనతో పంప్‌హౌస్ అపవిత్రమైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయ గౌడ్ మండిపడ్డారు. ఇక్కడికి వస్తున్నది ఎల్లంపల్లి నీళ్లేనని, కాళేశ్వరం నీళ్లంటూ బిఆర్‌ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బిఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఇకపైనా డ్రామాలు ఆడితే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు.
More news from తెలంగాణ and nearby areas
- సిరిసిల్ల అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆకస్మిక తనిఖీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్ లో బియ్యం, పప్పులు, గుడ్లు ఇతర నిలువ పదార్థాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడాడు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం భోజనం పెడుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. సైన్స్ పాఠ్యాంశానికి సంబంధించిన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతి సబ్జెక్టులోని అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రణాళిక ప్రకారం చదివితే భవిష్యత్తు లో ఎంతో మేలు చేస్తుందని వివరించారు. విరామ సమయంలో విద్యార్థులు ఆటలు ఆడాలని సూచించారు.1
- నంది మేడారం పంప్ హౌజ్ వద్ద సీఎం మంత్రుల చిత్రపటాలకు కాంగ్రెస్ పాలాభిషేకం. ప్రాజెక్టులపై బిఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొడుతు పెద్దపల్లి జిల్లా నందిమేడారం పంప్ హౌస్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి తోపాటు రాష్ట్ర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రాజెక్టులపై నీటి ఎత్తిపోతలపై మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు తీవ్రంగా స్పందించిన ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా నంది పంప్ హౌస్ వద్దకు చేరుకొని ఇవి కాళేశ్వరం నీళ్లు కాదు, గోదావరి జలాలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎల్లంపల్లి నీళ్ళనే మిడ్ మానేర్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ వాస్తవాలను విస్మరించి, ఎల్లంపల్లి నీటిని కాళేశ్వరం నీరుగా చూపిస్తూ బిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని కాళేశ్వరం జలాలుగా ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తమ వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిస్తూ, వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు.1
- ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లతో నీటి సంరక్షణకు రైతులు ముందుకు రావాలి బెజ్జంకి, ఆగస్టు 3: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నీటి సంరక్షణ చర్యలకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని బెజ్జంకి ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంతో పాటు రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్లు నిర్మించుకోవాలని సూచించారు. వి.బి.జి. రామ్ ఉపాధి హామీ పథకం ద్వారా 20×20 లేదా 12×12 పరిమాణంలో ఫామ్ పాండ్లను తవ్వించుకోవచ్చని తెలిపారు. ఈ ఫామ్ పాండ్ల ద్వారా వర్షపు నీరు నిల్వై భూగర్భ జలాలు పెరుగుతాయని, సాగునీటి సమస్య కొంతవరకు తగ్గుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫామ్ పాండ్లలో చేపల పెంపకం చేపట్టి, చుట్టూ కూరగాయల సాగు చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. నీటి వనరుల పరిరక్షణతో పాటు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ప్రవీణ్ కోరారు.1
- సోమవారం సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించిన ఈవో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి ఆలయ ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దర్శనం ముగించుకుని వస్తున్న ఓ దివ్యాంగ భక్తిని పలకరించి, దర్శనం సక్రమంగా జరిగిందా, ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఆరా తీశారు. భక్తులకు అందుతున్న సేవలపై ప్రత్యక్షంగా తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.అనంతరం ఆలయంలోని కోడె టికెట్ కౌంటర్లు, దీపాలు వెలిగించే కౌంటర్లు, రెండు చెక్‌పోస్టులు తదితర ప్రాంతాలను పరిశీలించారు. కోడె టికెట్ల జారీ విధానాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఆలయ ప్రాంగణంలో భక్తులు కొబ్బరి కాయలు కొట్టిన అనంతరం వాటి పెంకులు, చిన్న ముక్కలను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల ఇతర భక్తుల కాళ్లకు గుచ్చుకుని గాయాలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ఈవో తెలిపారు. కొబ్బరి వ్యర్థాలను తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లలో వేయాలని భక్తులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలోఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని నిర్వహిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.మొత్తం ఆలయ పరిసరాలను పర్యవేక్షించిన ఈవో రమాదేవి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.2
- సనాతన ధర్మ పరిరక్షణకు సమాజమంతా ఏకం కావాలి : BJP కందుల సంధ్యారాణి వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రామాలయ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అతిథిగా వచ్చిన బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.1
- కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు1
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నప్రసాద సత్రంలో ఈవో ఆకస్మిక తనిఖీలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నప్రసాద సత్రంలో భక్తులకు ఉచితంగా అందిస్తున్న అన్నప్రసాద సేవలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సత్రంలో నిల్వ ఉంచిన బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర ఆహార సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే వంటశాలను సందర్శించి, వంటకు వినియోగిస్తున్న బండలు, స్టవ్‌లు, వంట పాత్రలు, ఇతర సామగ్రి పరిశుభ్రతను తనిఖీ చేశారు.అన్నప్రసాద సత్రంలో భోజనం చేస్తున్న భక్తులకు ఈవో స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి, ఆహారం నాణ్యత, రుచి, సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో సేవలను మరింత మెరుగు పరచాలని అధికారులకు సూచించారు.అదే విధంగా, పాత్రలు శుభ్రం చేసే సిబ్బందితో మాట్లాడి ప్రతి పాత్రను పరిశుభ్రంగా కడగాలని, వంటశాల పరిసరాల్లో ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు.సత్రంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఈవో, అన్నప్రసాద పర్యవేక్షకులు ఒన్నారం భాస్కర్ తో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. సత్రానికి వచ్చే ప్రతి భక్తితో మర్యాదగా వ్యవహరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు, అవసరాలు లేదా సూచనలు ఉన్నా వెంటనే తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.భక్తులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన అన్నప్రసాదాన్ని అందించడం దేవస్థానం ప్రధాన బాధ్యత అని పేర్కొన్న ఈవో ఎల్. రమాదేవి, అన్నప్రసాద సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.1
- మణుగూరు డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణి కే.. INTUC నేత జనక్ ప్రసాద్ మణుగూరు బొగ్గు బ్లాక్ ను సింగరేణి కే కేటాయించాలని ఎన్నోబ్రకల పోరాటాలు చేసిన ఫలితంగా ఆ బొగ్గు బ్లాక్ ను సింగారం కి కేటాయించారని ఇది కార్మికుల విజయం ఆన్నారు.1
- వేములవాడలో బైకిస్ట్ కు ముంచుకొచ్చిన మృత్యువు... బైక్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిన యువకుడు గుండెపోటుతో హఠాన్మరణం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బైక్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని మృత్యువు కబలించింది. వేములవాడ అంబేద్కర్ నగర్‌కు చెందిన కోరెపు దుర్గప్రసాద్ (31) తన ద్విచక్రవాహనాన్ని పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా కుప్పకూలి పోయాడు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దుర్గ ప్రసాద్ బైక్ తో సహా రోడ్డుపై పడిపోవడం చూసి స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దుర్గప్రసాద్ హఠాన్మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. దుర్గ ప్రసాద్ పడిపోయిన విజువల్స్ సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి.2