నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన రోడ్డు రోడ్డు పనులను తక్షణమే పూర్తిచేయాలని బీఆర్ఎస్ డిమాండ్ బెజ్జంకి మండల ప్రజల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా బెజ్జంకి – బేగంపేట – గూడెం – చీమలకుంటపల్లి – కొండపూర్ మార్గంలో నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేయడానికే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి తెలిపారు. బెజ్జంకి మండలం నుంచి తల్లారావనిపల్లి, బేగంపేట, వడ్లూరు, గూడెం, చీమలకుంటపల్లి, కొండపూర్ తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సుమారు రూ.8 కోట్ల నిధులతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో ఆర్&బి శాఖ ద్వారా ఈ రోడ్డు నిర్మాణ పనులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఈ పనుల్లో గుగ్గిల్ల బ్రిడ్జి పూర్తయిందని, అలాగే బెజ్జంకి నుంచి బేగంపేట వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర డాంబర్ రోడ్డు పూర్తయిందని తెలిపారు. సింగిల్ రోడ్డుగా మంజూరైన ఈ పనిని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రీ-ఎస్టిమేట్ చేసి డబుల్ రోడ్డుగా మార్చడం వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. అయినప్పటికీ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే ఎర్త్‌వర్క్, కంకర పనులు, మధ్యంతర పనులు పూర్తయ్యాయని, చివరి దశలో ఉన్న సుమారు 10 శాతం బీటీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వివరించారు. 2023 డిసెంబర్‌లో ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తున్నా ఆ పని ఎక్కడ ఆగిందో అక్కడే ఉందని, ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని మండల అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్థానిక ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి, ఆర్&బి శాఖకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామని, బేగంపేట అంబేద్కర్ చౌరస్తా నుంచి బెజ్జంకి వరకు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఈ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారిందని, ఇటీవల బెజ్జంకి మండలానికి చెందిన ఒక విలేకరి ఈ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యారని, అలాగే బేగంపేటకు చెందిన పత్తి వ్యాపారి మహేందర్ రెడ్డి, నారెడ్డి రాజిరెడ్డి తదితరులు కూడా ప్రమాదాల్లో గాయపడ్డారని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ రోడ్డును పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందువల్ల ఇప్పటికే మంజూరైన నిధులను వెంటనే విడుదల చేసి, కాంట్రాక్టర్‌కు చెల్లింపులు జరిపి, మిగిలిన రోడ్డు పనులను పూర్తిచేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తున్నామని పాకాల మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి పది రోజులలోపు పనులు ప్రారంభించి పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి పాదయాత్రలు, ధర్నాలు, నిరసనలు మరియు వివిధ ప్రజా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రోడ్డు పూర్తయ్యే వరకు పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని పాకాల మహిపాల్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి లింగాల లక్ష్మణ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, మానకొండూరు నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ ఎల శేఖర్ బాబు, రామ్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- నంది మేడారం పంప్ హౌజ్ వద్ద సీఎం మంత్రుల చిత్రపటాలకు కాంగ్రెస్ పాలాభిషేకం. ప్రాజెక్టులపై బిఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొడుతు పెద్దపల్లి జిల్లా నందిమేడారం పంప్ హౌస్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి తోపాటు రాష్ట్ర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రాజెక్టులపై నీటి ఎత్తిపోతలపై మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు తీవ్రంగా స్పందించిన ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా నంది పంప్ హౌస్ వద్దకు చేరుకొని ఇవి కాళేశ్వరం నీళ్లు కాదు, గోదావరి జలాలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎల్లంపల్లి నీళ్ళనే మిడ్ మానేర్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ వాస్తవాలను విస్మరించి, ఎల్లంపల్లి నీటిని కాళేశ్వరం నీరుగా చూపిస్తూ బిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని కాళేశ్వరం జలాలుగా ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తమ వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిస్తూ, వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు.1
- సోమవారం సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించిన ఈవో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి ఆలయ ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దర్శనం ముగించుకుని వస్తున్న ఓ దివ్యాంగ భక్తిని పలకరించి, దర్శనం సక్రమంగా జరిగిందా, ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఆరా తీశారు. భక్తులకు అందుతున్న సేవలపై ప్రత్యక్షంగా తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.అనంతరం ఆలయంలోని కోడె టికెట్ కౌంటర్లు, దీపాలు వెలిగించే కౌంటర్లు, రెండు చెక్‌పోస్టులు తదితర ప్రాంతాలను పరిశీలించారు. కోడె టికెట్ల జారీ విధానాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఆలయ ప్రాంగణంలో భక్తులు కొబ్బరి కాయలు కొట్టిన అనంతరం వాటి పెంకులు, చిన్న ముక్కలను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల ఇతర భక్తుల కాళ్లకు గుచ్చుకుని గాయాలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ఈవో తెలిపారు. కొబ్బరి వ్యర్థాలను తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లలో వేయాలని భక్తులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలోఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని నిర్వహిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.మొత్తం ఆలయ పరిసరాలను పర్యవేక్షించిన ఈవో రమాదేవి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.2
- కట్ట రాంపూర్ ప్రధాన రహదారికి మరమ్మత్తులు చేపించిన ఆకుల నర్మదా-నర్సన్న కార్పోరేటర్ స్థానిక కట్ట రాంపూర్ లో ని ప్రధాన రహదారి వర్షాల కారణంగా గుంతల మయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఈ విషయం తెలుసుకొని ప్రజా సమస్యలను తీర్చడంలో ముందుండే 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ ఆకుల నర్మదా నర్సన్న గుంతల మయమైన రోడ్డుని సవరించి తగిన మరమ్మతులు చేయించడం జరిగింది ఈ సందర్భంగా నర్మదా నర్సన్న మాట్లాడుతూ డివిజన్ కు సంబంధించిన ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువచ్చినచో తప్పకుండా వాటిని పరిష్కరించే దిశగా పనులు చేస్తామని 11వ డివిజన్ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు1
- సిరిసిల్ల అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆకస్మిక తనిఖీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్ లో బియ్యం, పప్పులు, గుడ్లు ఇతర నిలువ పదార్థాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడాడు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం భోజనం పెడుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. సైన్స్ పాఠ్యాంశానికి సంబంధించిన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతి సబ్జెక్టులోని అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రణాళిక ప్రకారం చదివితే భవిష్యత్తు లో ఎంతో మేలు చేస్తుందని వివరించారు. విరామ సమయంలో విద్యార్థులు ఆటలు ఆడాలని సూచించారు.1
- కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు1
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నప్రసాద సత్రంలో ఈవో ఆకస్మిక తనిఖీలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నప్రసాద సత్రంలో భక్తులకు ఉచితంగా అందిస్తున్న అన్నప్రసాద సేవలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సత్రంలో నిల్వ ఉంచిన బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర ఆహార సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే వంటశాలను సందర్శించి, వంటకు వినియోగిస్తున్న బండలు, స్టవ్‌లు, వంట పాత్రలు, ఇతర సామగ్రి పరిశుభ్రతను తనిఖీ చేశారు.అన్నప్రసాద సత్రంలో భోజనం చేస్తున్న భక్తులకు ఈవో స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి, ఆహారం నాణ్యత, రుచి, సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో సేవలను మరింత మెరుగు పరచాలని అధికారులకు సూచించారు.అదే విధంగా, పాత్రలు శుభ్రం చేసే సిబ్బందితో మాట్లాడి ప్రతి పాత్రను పరిశుభ్రంగా కడగాలని, వంటశాల పరిసరాల్లో ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు.సత్రంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఈవో, అన్నప్రసాద పర్యవేక్షకులు ఒన్నారం భాస్కర్ తో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. సత్రానికి వచ్చే ప్రతి భక్తితో మర్యాదగా వ్యవహరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు, అవసరాలు లేదా సూచనలు ఉన్నా వెంటనే తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.భక్తులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన అన్నప్రసాదాన్ని అందించడం దేవస్థానం ప్రధాన బాధ్యత అని పేర్కొన్న ఈవో ఎల్. రమాదేవి, అన్నప్రసాద సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.1
- భారతదేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్ రెడ్డిని మనం ముఖ్యమంత్రి చేసుకోవడమే బిగ్గెస్ట్ క్రిమినల్ వేస్ట్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ _*దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న*_ _*రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే బిగ్గెస్ట్ క్రిమినల్ వేస్ట్!*_ *- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్*1
- హైదరాబాదులోని ఇందిరాపార్క్ చౌరస్తాలో నిరుద్యోగుల మెరుపు ధర్నా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగుల మెరుపు ధర్నా 7,437 పోస్టులతో కాకుండా 19 వేల పోలీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలి పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలంటూ డిమాండ్ నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు పోలీస్ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్సై పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ దరఖాస్తు రుసుమును వెంటనే తగ్గించాలని, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నిరుద్యోగుల హెచ్చరిక1