Shuru
Apke Nagar Ki App…
ఎఫ్‌ఆర్‌ఓ సస్పెన్షన్‌కు ఎమ్మెల్యే డిమాండ్.. 24 గంటల్లో చర్యలు లేకపోతే ఉద్యమం హెచ్చరిక జన్నారం మండలం ఇంధన్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఫారెస్ట్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మీనారాయణ స్థానికులపై దాడి చేయడం, జక్కు భూమేష్ ఇంటికి 50 మందికిపైగా సిబ్బంది వెళ్లి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం చట్టవిరుద్ధమన్నారు. వెంటనే ఎఫ్‌ఆర్‌ఓను సస్పెండ్ చేసి, 24 గంటల్లో పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీ అధికారులను డిమాండ్ చేశారు.
తుడుం జితేందర్
ఎఫ్‌ఆర్‌ఓ సస్పెన్షన్‌కు ఎమ్మెల్యే డిమాండ్.. 24 గంటల్లో చర్యలు లేకపోతే ఉద్యమం హెచ్చరిక జన్నారం మండలం ఇంధన్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఫారెస్ట్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మీనారాయణ స్థానికులపై దాడి చేయడం, జక్కు భూమేష్ ఇంటికి 50 మందికిపైగా సిబ్బంది వెళ్లి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం చట్టవిరుద్ధమన్నారు. వెంటనే ఎఫ్‌ఆర్‌ఓను సస్పెండ్ చేసి, 24 గంటల్లో పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీ అధికారులను డిమాండ్ చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- వార్తకు స్పందించిన అటవీశాఖ.. కవ్వాల్ టైగర్ జోన్‌లో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో బారికేడ్లు రాత్రివేళ కనిపించక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందంటూ ఇటీవల ప్రచురితమైన వార్తకు అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు బారికేడ్ల వద్ద అవసరమైన సూచికలను ఏర్పాటు చేసే చర్యలు చేపట్టారు. గతంలో బారికేడ్ల వద్ద ముందస్తు హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు లేకపోవడంతో రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చీకటిలో బారికేడ్లు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై వార్త వెలువడిన వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ప్రధాన రహదారి వెంట "GO SLOW", "అడవి జంతువుల కోసం నెమ్మదిగా వెళ్లండి" వంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే బారికేడ్లు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ సూచికలు ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోందని సమాచారం. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడంపై స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా టైగర్ జోన్ పరిధిలోని అన్ని బారికేడ్ల వద్ద భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రమాదాలకు అవకాశం లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.1
- కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు1
- సనాతన ధర్మ పరిరక్షణకు సమాజమంతా ఏకం కావాలి : BJP కందుల సంధ్యారాణి వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రామాలయ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అతిథిగా వచ్చిన బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.1
- ఖానాపూర్ మున్సిపాలిటీ రోడ్ల విస్తరణ పనులకు మోక్షం ఎప్పుడు కలుగును ఖానాపూర్ మున్సిపాలిటీ పేరుకే మున్సిపాలి టీ రోడ్ల విస్తరణ పనులు చేయకపోగా వాహనదారులకు ఇబ్బందిగా మారిన ఇరుకైన రోడ్లు గుంత గుంతలు ఇప్పుడు అ గుంతలో సిమెంట్తో పూతలు పూసి చేతులు అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు వాహనదారులు ఆరోపిస్తున్నారు1
- కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌ను శుద్ధి చేసిన కాంగ్రెస్ శ్రేణులు కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌ను కాంగ్రెస్ శ్రేణులు నీళ్లతో కడిగి శుద్ధి చేశాయి. నిన్నటి బిఆర్‌ఎస్ నాయకుల పర్యటనతో పంప్‌హౌస్ అపవిత్రమైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయ గౌడ్ మండిపడ్డారు. ఇక్కడికి వస్తున్నది ఎల్లంపల్లి నీళ్లేనని, కాళేశ్వరం నీళ్లంటూ బిఆర్‌ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బిఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఇకపైనా డ్రామాలు ఆడితే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు.1
- అక్రమ వడ్డీ వ్యాపారి అరెస్ట్: టూ టౌన్ సీఐ నాగరాజు..... ADB: అధిక వడ్డీలకు అక్రమంగా రుణాలు ఇస్తున్న దినేష్ కుమార్ తో పాటు ఆయనకు సహకరిస్తున్న కిషోర్‌ను అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 20 మొబైల్ ఫోన్లు, 4 బైకులు, 6 ఆర్‌సీలు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై మనీ లెండర్స్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.1
- ఎఫ్‌ఆర్‌ఓ సస్పెన్షన్‌కు ఎమ్మెల్యే డిమాండ్.. 24 గంటల్లో చర్యలు లేకపోతే ఉద్యమం హెచ్చరిక జన్నారం మండలం ఇంధన్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఫారెస్ట్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మీనారాయణ స్థానికులపై దాడి చేయడం, జక్కు భూమేష్ ఇంటికి 50 మందికిపైగా సిబ్బంది వెళ్లి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం చట్టవిరుద్ధమన్నారు. వెంటనే ఎఫ్‌ఆర్‌ఓను సస్పెండ్ చేసి, 24 గంటల్లో పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీ అధికారులను డిమాండ్ చేశారు.1
- నడుచుకుంటూ వెళ్తూ. వేములవాడలో గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఓ యువకుడు కుప్పకూలి మృతి చెందిన ఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన కోరేపు దుర్గప్రసాద్ (31) అనే యువకుడు ఈరోజు సోమవారం మధ్యాహ్నం తన ద్విచక్రవాహనాన్ని పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. గమనించిన చుట్టుపక్కల ప్రజలు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు దుర్గప్రసాద్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. వృత్తిరీత్యా పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న దుర్గప్రసాద్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న యువకుడు హఠాత్తుగా మృతి చెందడంతో వేములవాడలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.1