logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వార్తకు స్పందించిన అటవీశాఖ.. కవ్వాల్ టైగర్ జోన్‌లో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో బారికేడ్లు రాత్రివేళ కనిపించక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందంటూ ఇటీవల ప్రచురితమైన వార్తకు అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు బారికేడ్ల వద్ద అవసరమైన సూచికలను ఏర్పాటు చేసే చర్యలు చేపట్టారు. గతంలో బారికేడ్ల వద్ద ముందస్తు హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు లేకపోవడంతో రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చీకటిలో బారికేడ్లు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై వార్త వెలువడిన వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ప్రధాన రహదారి వెంట "GO SLOW", "అడవి జంతువుల కోసం నెమ్మదిగా వెళ్లండి" వంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే బారికేడ్లు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ సూచికలు ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోందని సమాచారం. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడంపై స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా టైగర్ జోన్ పరిధిలోని అన్ని బారికేడ్ల వద్ద భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రమాదాలకు అవకాశం లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.

1 day ago
user_తుడుం జితేందర్
తుడుం జితేందర్
Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
1 day ago

వార్తకు స్పందించిన అటవీశాఖ.. కవ్వాల్ టైగర్ జోన్‌లో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో బారికేడ్లు రాత్రివేళ కనిపించక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందంటూ ఇటీవల ప్రచురితమైన వార్తకు అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు బారికేడ్ల వద్ద అవసరమైన సూచికలను ఏర్పాటు చేసే చర్యలు చేపట్టారు. గతంలో బారికేడ్ల వద్ద ముందస్తు హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు లేకపోవడంతో రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చీకటిలో బారికేడ్లు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై వార్త వెలువడిన వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ప్రధాన రహదారి వెంట "GO SLOW", "అడవి జంతువుల కోసం నెమ్మదిగా వెళ్లండి" వంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే బారికేడ్లు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ సూచికలు ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోందని సమాచారం. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడంపై స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా టైగర్ జోన్ పరిధిలోని అన్ని బారికేడ్ల వద్ద భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రమాదాలకు అవకాశం లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • తపాల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద ప్రమాదకర కొమ్మ.. అటవీ శాఖ స్పందించాలంటున్న ప్రజలు జన్నారం–లక్షెట్టిపేట ప్రధాన రహదారిపై తపాల్‌పూర్ చెక్‌పోస్ట్ సమీపంలో విరిగిన భారీ చెట్టు కొమ్మ రోడ్డుపై ప్రమాదకరంగా వేలాడుతోంది. నిత్యం వందలాది వాహనాలు, ఆర్టీసీ, పాఠశాల బస్సులు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెక్‌పోస్ట్‌కు సమీపంలోనే ఈ పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. తక్షణమే కొమ్మను తొలగించి ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    తపాల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద ప్రమాదకర కొమ్మ.. అటవీ శాఖ స్పందించాలంటున్న ప్రజలు
జన్నారం–లక్షెట్టిపేట ప్రధాన రహదారిపై తపాల్‌పూర్ చెక్‌పోస్ట్ సమీపంలో విరిగిన భారీ చెట్టు కొమ్మ రోడ్డుపై ప్రమాదకరంగా వేలాడుతోంది. నిత్యం వందలాది వాహనాలు, ఆర్టీసీ, పాఠశాల బస్సులు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెక్‌పోస్ట్‌కు సమీపంలోనే ఈ పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. తక్షణమే కొమ్మను తొలగించి ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ మద్దతు | హైదరాబాద్ | ఆగస్టు 04: తెలంగాణ రక్షణ సేన నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ నిరంతరం అండగా నిలిచి, వారి డిమాండ్లు నెరవేరే వరకు పోరాటానికి పూర్తి మద్దతు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి గణేష్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ మద్దతు
| హైదరాబాద్ | ఆగస్టు 04:
తెలంగాణ రక్షణ సేన నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ నిరంతరం అండగా నిలిచి, వారి డిమాండ్లు నెరవేరే వరకు పోరాటానికి పూర్తి మద్దతు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి గణేష్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • బంకీపూర్ ఉప ఎన్నికల్లో ఓటమి బిజెపి కి గుణపాఠం., CPI ml మాస్ లైన్ ప్రజాపంథా నేత జూపాక శ్రీనివాస్ బంకిపూర్ ఉప ఎన్నికలో బీజేపీకి ఎదురైన ఓటమి దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పరిణామమని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పేర్కొన్నారు.
    1
    బంకీపూర్  ఉప ఎన్నికల్లో ఓటమి బిజెపి కి గుణపాఠం., CPI ml మాస్ లైన్ ప్రజాపంథా నేత జూపాక శ్రీనివాస్
బంకిపూర్ ఉప ఎన్నికలో బీజేపీకి ఎదురైన ఓటమి దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పరిణామమని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పేర్కొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    11 hrs ago
  • నిర్మల్‌లో రహదారి ప్రమాదాల నివారణకు మున్సిపల్ చర్యలు.... నిర్మల్ పట్టణంలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు నిర్మల్ మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారులపై సంచరిస్తున్న పశువులను తొలగించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. రహదారులపై పశువులు వదలకుండా ఉండాలని పశువుల యజమానులకు గతంలోనే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ పశువులను రోడ్లపైకి వదులుతున్న యజమానులపై చర్యలు తీసుకుంటున్నారు. రహదారిపై పశువులను వదిలిన ప్రతి యజమానికి రూ.500 చొప్పున జరిమానా విధించారు. ఇకపై పశువులు రహదారులపైకి వస్తే వాటిని స్వాధీనం చేసుకుని గోశాలకు తరలిస్తామని యజమానులను హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
    1
    నిర్మల్‌లో రహదారి ప్రమాదాల నివారణకు మున్సిపల్ చర్యలు....
నిర్మల్ పట్టణంలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు నిర్మల్ మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారులపై సంచరిస్తున్న పశువులను తొలగించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. రహదారులపై పశువులు వదలకుండా ఉండాలని పశువుల యజమానులకు గతంలోనే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ పశువులను రోడ్లపైకి వదులుతున్న యజమానులపై చర్యలు తీసుకుంటున్నారు. రహదారిపై పశువులను వదిలిన ప్రతి యజమానికి రూ.500 చొప్పున జరిమానా విధించారు. ఇకపై పశువులు రహదారులపైకి వస్తే వాటిని స్వాధీనం చేసుకుని గోశాలకు తరలిస్తామని యజమానులను హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    12 hrs ago
  • ఖానాపూర్ నారు మడిని సిద్ధం చేసుకుంటున్న మహిళా రైతు ఖానాపూర్ గత వానకాలం యాసంకగి కాలం పంటలు దిగుబడి రాలేక నష్టపోయామని మహిళ రైతు తెలియజేశారు ఇప్పుడైనా సదర్ మార్ట్ కెనాల్ ద్వారా తొందరగా నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే గారిని నీటిపారుదల శాఖ అధికారులను మహిళ రైతు పేర్కొన్నారు
    1
    ఖానాపూర్       
   నారు మడిని సిద్ధం చేసుకుంటున్న మహిళా రైతు 
ఖానాపూర్  గత వానకాలం యాసంకగి కాలం పంటలు దిగుబడి రాలేక నష్టపోయామని మహిళ రైతు  తెలియజేశారు ఇప్పుడైనా సదర్ మార్ట్ కెనాల్ ద్వారా  తొందరగా నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే గారిని నీటిపారుదల శాఖ అధికారులను మహిళ రైతు పేర్కొన్నారు
    user_ఆకుల  శ్రీనివాస్
    ఆకుల శ్రీనివాస్
    Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    19 hrs ago
  • సదర్ మార్ట్ నీళ్ల కోసం రైతులు ఎదురుచూపులు ఇప్పటికే నాలుగు మడలు సిద్ధం చేసుకుని నీరు కోసం ఎదురుచూస్తున్న సదర్ మార్ట్ రైతంగం రైతంగం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని మేడమ్ పెళ్లి సదర్ మార్ట్ బ్యారేజ్ నుండి నీటిని ఎప్పుడు విడుదల చేస్తారని రైతులు వేచి చూస్తున్నారు వానకాలం ప్రారంభమై నెలకు పై కావడంతో వరి సాగు పంటకు ఆలస్యం అవుతుందని ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి ఆయకట్టు కు నిరంతంచాలని కోరుతున్నారు ఆయకట్టుకు సుమారు 15 వేల ఎకరాలు ఉండటంతో ఇప్పటికే నారుమండలం సైతం సిద్ధం చేసుకున్నారు నీటిని విడుదల చేస్తే పంట సాగు చేసుకుంటామని రైతన్నలు వేడుకుంటున్నారు
    1
    సదర్ మార్ట్ నీళ్ల కోసం రైతులు ఎదురుచూపులు 
ఇప్పటికే నాలుగు మడలు సిద్ధం చేసుకుని నీరు కోసం ఎదురుచూస్తున్న సదర్ మార్ట్ రైతంగం రైతంగం
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని మేడమ్ పెళ్లి సదర్ మార్ట్ బ్యారేజ్ నుండి నీటిని ఎప్పుడు విడుదల చేస్తారని రైతులు వేచి చూస్తున్నారు వానకాలం ప్రారంభమై నెలకు పై కావడంతో వరి సాగు పంటకు ఆలస్యం అవుతుందని ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి ఆయకట్టు కు నిరంతంచాలని కోరుతున్నారు ఆయకట్టుకు సుమారు 15 వేల ఎకరాలు ఉండటంతో ఇప్పటికే నారుమండలం సైతం సిద్ధం చేసుకున్నారు నీటిని విడుదల చేస్తే పంట సాగు చేసుకుంటామని రైతన్నలు వేడుకుంటున్నారు
    user_Dasari krishna murthy
    Dasari krishna murthy
    ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    21 hrs ago
  • ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరిన సర్పంచులు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక సమస్యను పరిష్కరించాలని జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామ సర్పంచ్ దినేష్ నాయక్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆయన సమస్యలు తెలిపారు. వాగులు నుండి ఇసుకను అటవీ అధికారులు తెనీయడం లేదని, దీంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను పలువురు సర్పంచులు కోరారు.
    1
    ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరిన సర్పంచులు
గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక సమస్యను పరిష్కరించాలని జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామ సర్పంచ్ దినేష్ నాయక్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆయన సమస్యలు తెలిపారు. వాగులు నుండి ఇసుకను అటవీ అధికారులు తెనీయడం లేదని, దీంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను పలువురు సర్పంచులు కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    17 hrs ago
  • ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలు., పట్టణంలో సందడి చేసిన మహిళామణులు పవర్ హౌజ్ కాలనీలో ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కౌశిక లత మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆషాఢ మాస గోరింటాకు వేడుకల్లో మహిళామణులు పాల్గొనడం అభినందనీయమన్నారు.
    1
    ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలు., పట్టణంలో సందడి చేసిన మహిళామణులు
పవర్ హౌజ్ కాలనీలో ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా  మాజీ కార్పొరేటర్ కౌశిక లత మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆషాఢ మాస గోరింటాకు వేడుకల్లో మహిళామణులు పాల్గొనడం అభినందనీయమన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    11 hrs ago
  • ఖానాపూర్ పొడి వడ్ల చల్లుతూ నరు మడి సిద్ధం చేసుకుంటున్న మహిళ రైతు ఖానపూర్ ‌సదర్ మార్ట్ అయీ కిందా పోయినవా నా కలం మొన్న టి యాసంగి పెట్టిన పెట్టుబడి రాలేక పోయమని ఇప్పుడైనా సదర్ మార్ట్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని తొందరగా నీటిని వదులుతే దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే గారిని నీటి శాఖ అధికారులను మహిళా రైతు కోరుకుంటున్నారు
    1
    ఖానాపూర్      పొడి వడ్ల చల్లుతూ నరు  మడి సిద్ధం చేసుకుంటున్న మహిళ రైతు 
ఖానపూర్  ‌సదర్ మార్ట్  అయీ కిందా   పోయినవా నా కలం మొన్న టి యాసంగి  పెట్టిన పెట్టుబడి రాలేక  పోయమని  ఇప్పుడైనా సదర్ మార్ట్  కెనాల్  ద్వారా నీటిని విడుదల చేయాలని  తొందరగా నీటిని వదులుతే దిగుబడి వచ్చే అవకాశం ఉందని    ఎమ్మెల్యే గారిని  నీటి  శాఖ అధికారులను మహిళా రైతు కోరుకుంటున్నారు
    user_ఆకుల  శ్రీనివాస్
    ఆకుల శ్రీనివాస్
    Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.