logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు.బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం చేశారు.

2 hrs ago
user_సిరిసిల్ల స్వరం
సిరిసిల్ల స్వరం
సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
2 hrs ago

శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు.బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఈరోజు కామారెడ్డి జిల్లా బివిపేట మండలం లో 9 ఫీట్ల నీళ్లు రావడం జరిగింది ఈ చెరువుకు 14 నుండి 16 వరకు నిండితే రైతులకు కరువు అన్నది ఉండదు కావున ఈ చెరువు పైన సంబంధిత అధికారులు ప్రాజెక్టులు కాలువలు బిబిపేట మండల్ కు తేవాలని ప్రభుత్వం కూడా బిబిపేట్ చెరువు 500 పైచిలుకు ఎకరాల ఉన్నందున ఒక్క టీఎంసీ వాటర్ ఉంటే ఏడు గ్రామాలకు కరువు లేకుండా ఉండడం జరుగుతుంది ప్రభుత్వం తూచా తప్పకుండా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడే ఈ చెరువు నింపుతూ 500 విస్తీర్ణం రైతులు బాగుపడతారు కావున ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజల తరఫున మాజీ ఎంపీటీసీ కోరి నరసింహులు మాట ముచ్చట మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈరోజు కామారెడ్డి జిల్లా బివిపేట మండలం లో 9 ఫీట్ల నీళ్లు రావడం జరిగింది ఈ చెరువుకు 14 నుండి 16 వరకు నిండితే రైతులకు కరువు అన్నది ఉండదు కావున ఈ చెరువు పైన సంబంధిత అధికారులు ప్రాజెక్టులు కాలువలు బిబిపేట మండల్ కు తేవాలని ప్రభుత్వం కూడా బిబిపేట్ చెరువు 500 పైచిలుకు ఎకరాల ఉన్నందున ఒక్క టీఎంసీ వాటర్ ఉంటే ఏడు గ్రామాలకు కరువు లేకుండా ఉండడం జరుగుతుంది ప్రభుత్వం తూచా తప్పకుండా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడే ఈ చెరువు నింపుతూ 500 విస్తీర్ణం రైతులు బాగుపడతారు కావున ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజల తరఫున మాజీ ఎంపీటీసీ కోరి నరసింహులు మాట ముచ్చట మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది
    2
    ఈరోజు కామారెడ్డి జిల్లా బివిపేట మండలం లో 9 ఫీట్ల నీళ్లు రావడం జరిగింది ఈ చెరువుకు 14 నుండి 16 వరకు నిండితే రైతులకు కరువు అన్నది ఉండదు కావున ఈ చెరువు పైన సంబంధిత అధికారులు ప్రాజెక్టులు కాలువలు బిబిపేట మండల్ కు తేవాలని ప్రభుత్వం కూడా బిబిపేట్ చెరువు 500 పైచిలుకు ఎకరాల ఉన్నందున ఒక్క టీఎంసీ వాటర్ ఉంటే ఏడు గ్రామాలకు కరువు లేకుండా ఉండడం జరుగుతుంది ప్రభుత్వం తూచా తప్పకుండా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడే ఈ చెరువు నింపుతూ 500 విస్తీర్ణం  రైతులు బాగుపడతారు కావున ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజల తరఫున మాజీ ఎంపీటీసీ కోరి నరసింహులు మాట ముచ్చట మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది
ఈరోజు కామారెడ్డి జిల్లా బివిపేట మండలం లో 9 ఫీట్ల నీళ్లు రావడం జరిగింది ఈ చెరువుకు 14 నుండి 16 వరకు నిండితే రైతులకు కరువు అన్నది ఉండదు కావున ఈ చెరువు పైన సంబంధిత అధికారులు ప్రాజెక్టులు కాలువలు బిబిపేట మండల్ కు తేవాలని ప్రభుత్వం కూడా బిబిపేట్ చెరువు 500 పైచిలుకు ఎకరాల ఉన్నందున ఒక్క టీఎంసీ వాటర్ ఉంటే ఏడు గ్రామాలకు కరువు లేకుండా ఉండడం జరుగుతుంది ప్రభుత్వం తూచా తప్పకుండా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడే ఈ చెరువు నింపుతూ 500 విస్తీర్ణం  రైతులు బాగుపడతారు కావున ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజల తరఫున మాజీ ఎంపీటీసీ కోరి నరసింహులు మాట ముచ్చట మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది
    user_Korivi Narsimlu
    Korivi Narsimlu
    బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • ఆటో డ్రైవర్ల నిరసన ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్ల నిరసన... ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓలా ఉబర్ ఆటోల వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉందని కరీంనగర్ ఆటో డ్రైవర్స్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం వల్ల ఇప్పటికే సగం ఉపాధి కోల్పోయామని, ఆటో ఓలా ఉబర్, బైక్ రైడింగ్ వల్ల పూర్తిస్థాయిలో ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పి ఇప్పటికీ ఎలాంటి అవకాశాలు కల్పించక మా పొట్ట కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఉన్న ఆటో ఓలా ఉబర్ వంటి వాటిని నిషేధించాలని ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల రాబోవు రోజుల్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆటో కార్మికులను ఆదుకోవాలని భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు.
    1
    ఆటో డ్రైవర్ల నిరసన ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్ల నిరసన...
ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓలా ఉబర్ ఆటోల వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉందని కరీంనగర్ ఆటో డ్రైవర్స్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం వల్ల ఇప్పటికే సగం ఉపాధి కోల్పోయామని,  ఆటో ఓలా ఉబర్, బైక్ రైడింగ్ వల్ల పూర్తిస్థాయిలో ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పి ఇప్పటికీ ఎలాంటి అవకాశాలు కల్పించక మా పొట్ట కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఉన్న ఆటో ఓలా ఉబర్ వంటి వాటిని నిషేధించాలని ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల రాబోవు రోజుల్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. 
అనంతరం ఆటో కార్మికులను ఆదుకోవాలని భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    7 hrs ago
  • మెట్ పల్లిలో కోతకు గురైన చెరువు కట్టను పరిశీలించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్...చెరువు కట్టతో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు నవ్వుకునేలా ఉందని అధికారుల పనితీరు అద్వానంగా మారిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో గత మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు పెద్ద చెరువు కోతకు గురికావడంతో చెరువును ఎమ్మెల్యే పరిశీలించారు. పురపాలక అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు నీటిపై మీకేమైనా అవగాహన ఉందా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఇరు శాఖల అధికారులను రెండు వైపుల నిలబెట్టి సుమారు గంటపాటు అధికారులను ప్రశ్నిస్తూ ముచ్చెమటలు పట్టించాడు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక అధికారులు దిక్కులు చూస్తూ ఉండిపోయారు. చెరువు విషయంపై ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్కేజీ పిల్లలు చదువుకునే సమయంలో బడి కి వెళ్లకుండా తప్పించుకునే విధంగా కడుపు నొస్తుందని అబద్ధాలు చెప్పే విధంగా, అధికారుల సమాధానాలు కూడా అలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కట్ట తెగడంతో మత్స్యకారులు లక్షల రూపాయల చేపలు బయటకు వెళ్లిపోయి నష్టపోయారని, ఇరు శాఖల అధికారులు మత్స్యకారులకు పరిహారం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. చెరువు కట్టకు అభివృద్ధి పనులు చేస్తున్న గుత్తేదారులు పిలిచి పనులపై ఆగ్రహం వ్యక్తం చేసి శాఖల పనితీరుకు తలలు పట్టుకునేలా ఉందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
    1
    మెట్ పల్లిలో కోతకు గురైన చెరువు కట్టను పరిశీలించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్...చెరువు కట్టతో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు నవ్వుకునేలా ఉందని అధికారుల పనితీరు అద్వానంగా మారిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో గత మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు పెద్ద చెరువు కోతకు గురికావడంతో చెరువును ఎమ్మెల్యే పరిశీలించారు. పురపాలక అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు నీటిపై  మీకేమైనా అవగాహన ఉందా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఇరు శాఖల అధికారులను రెండు వైపుల నిలబెట్టి సుమారు గంటపాటు అధికారులను ప్రశ్నిస్తూ ముచ్చెమటలు పట్టించాడు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక అధికారులు దిక్కులు చూస్తూ ఉండిపోయారు. చెరువు విషయంపై  ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్కేజీ పిల్లలు చదువుకునే సమయంలో  బడి కి వెళ్లకుండా తప్పించుకునే విధంగా కడుపు నొస్తుందని అబద్ధాలు చెప్పే విధంగా, అధికారుల సమాధానాలు కూడా అలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కట్ట తెగడంతో మత్స్యకారులు లక్షల రూపాయల చేపలు బయటకు వెళ్లిపోయి నష్టపోయారని, ఇరు శాఖల అధికారులు మత్స్యకారులకు పరిహారం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. చెరువు కట్టకు అభివృద్ధి పనులు చేస్తున్న గుత్తేదారులు పిలిచి పనులపై ఆగ్రహం వ్యక్తం చేసి శాఖల పనితీరుకు తలలు పట్టుకునేలా ఉందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు
    1
    కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • తల్లి పాలలోనే పూర్తి పోషకాలు డెలివరీ అయిన గంటలో తల్లి వద్దకు బిడ్డను చేర్చాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి లో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు బాలింతలకు పండ్ల పంపిణీ తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 01 నుంచి 07 వ తేదీ వరకు కొనసాగుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో మంగళవారం బాలింతలకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పలు అనుమానాలు, అపోహలను వీడేలా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. తల్లి పాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని స్పష్టం చేశారు. పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగప డుతాయని తెలిపారు. దీంతో బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలింతలు పోషకాహారం, డ్రై ఫ్రూట్, తినాలని సూచించారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. తల్లిపాల వారోత్సవాలు జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఆశ వర్కర్లు తమ పరిధిలోని బాలింతలను కలిసి.. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పాలు ఇవ్వడం మందులు క్రమం తప్పకుండా తీసుకోవడంపై అవగాహన కల్పిస్తూ.. అందుబాటులో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ మహేష్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, వార్డు కౌన్సిలర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    తల్లి పాలలోనే పూర్తి పోషకాలు
డెలివరీ అయిన గంటలో తల్లి వద్దకు బిడ్డను చేర్చాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి లో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు
బాలింతలకు పండ్ల పంపిణీ
తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 01 నుంచి 07 వ తేదీ వరకు కొనసాగుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో మంగళవారం బాలింతలకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పలు అనుమానాలు, అపోహలను వీడేలా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. తల్లి పాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని స్పష్టం చేశారు. పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగప డుతాయని తెలిపారు. దీంతో బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. 
వైద్యుల సూచన మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలింతలు పోషకాహారం, డ్రై ఫ్రూట్, తినాలని సూచించారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. తల్లిపాల వారోత్సవాలు జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఆశ వర్కర్లు తమ పరిధిలోని బాలింతలను కలిసి.. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పాలు ఇవ్వడం మందులు క్రమం తప్పకుండా తీసుకోవడంపై అవగాహన కల్పిస్తూ.. అందుబాటులో ఉండాలని తెలిపారు. 
కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ మహేష్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, వార్డు కౌన్సిలర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • పగటివేళా వెలుగుతున్న వీధిదీపాలు కరీంనగర్ నగరంలోని కట్ట రాంపూర్ భవాని నగర్‌లో మధ్యాహ్నమవుతున్నా వీధిదీపాలు వెలుగుతూనే ఉన్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంతో రోజూ ఇక్కడే ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఒకవైపు విద్యుత్ పొదుపు చేయాలని అధికారులు ప్రచారం చేస్తున్నా, తమ పరిధిలోని దీపాలను ఆర్పడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    2
    పగటివేళా వెలుగుతున్న వీధిదీపాలు
కరీంనగర్ నగరంలోని కట్ట రాంపూర్ భవాని నగర్‌లో మధ్యాహ్నమవుతున్నా వీధిదీపాలు వెలుగుతూనే ఉన్నాయి.
సిబ్బంది నిర్లక్ష్యంతో రోజూ ఇక్కడే ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఒకవైపు విద్యుత్ పొదుపు చేయాలని అధికారులు ప్రచారం చేస్తున్నా, తమ పరిధిలోని దీపాలను ఆర్పడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    11 hrs ago
  • సిరిసిల్లలో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు...బాలింతలకు పండ్ల పంపిణీ చేసిన కలెక్టర్ తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 01 నుంచి 07 వ తేదీ వరకు కొనసాగుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో బాలింతలకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పలు అనుమానాలు, అపోహలను వీడేలా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. తల్లి పాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని స్పష్టం చేశారు. పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగప డుతాయని తెలిపారు. దీంతో బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలింతలు పోషకాహారం, డ్రై ఫ్రూట్, తినాలని సూచించారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.
    1
    సిరిసిల్లలో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు...బాలింతలకు పండ్ల పంపిణీ చేసిన కలెక్టర్
తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 01 నుంచి 07 వ తేదీ వరకు కొనసాగుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో బాలింతలకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పలు అనుమానాలు, అపోహలను వీడేలా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. తల్లి పాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని స్పష్టం చేశారు. పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగప డుతాయని తెలిపారు. దీంతో బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. 
వైద్యుల సూచన మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలింతలు పోషకాహారం, డ్రై ఫ్రూట్, తినాలని సూచించారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • భారీ వర్షాల నేపధ్యంలో కామారెడ్డి చెరువు సమీక్షించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, వాగులు కల్వర్టులకు, వేటకు వెళ్లొద్దని ఎస్పీ హెచ్చరిక కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు వద్దకు వెళ్లి నీటి ప్రవాహం, నీటి మట్టాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలు, పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులు, వాగులు, కల్వర్టులు, వరద ప్రవాహ ప్రాంతాల వద్దకు వెళ్లరాదని, సెల్ఫీలు మరియు వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని తీవ్రంగా హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాలు, రద్దీ కూడళ్ల వద్ద అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులందరూ క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉంటూ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం గురు రాఘవేంద్ర కాలనీ బ్రిడ్జి ప్రాంతాని ఎస్పీ పరిశీలించారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కామారెడ్డిలోని సుభాష్ రోడ్ చౌరస్తా వద్ద వరద నీటిలో చిక్కుకున్న పెళ్లి బస్సులోని 45 మంది ప్రయాణికులను పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సమన్వయంతో సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేసి వారి ప్రయాణాన్ని యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి, 45 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పోలీసు, అగ్నిమాపక శాఖ సిబ్బంది అంకితభావాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించి అభినందించారు. భారీ వర్షాలు కొనసాగుతున్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను గానీ లేదా డయల్-100 అత్యవసర సేవలను గానీ సంప్రదించాలని కోరారు. జిల్లా ఎస్పీ వెంట కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్, దేవునిపల్లి ఎస్‌ఐ రంజిత్, కామారెడ్డి ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
    1
    భారీ వర్షాల నేపధ్యంలో కామారెడ్డి చెరువు సమీక్షించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,  వాగులు కల్వర్టులకు,  వేటకు వెళ్లొద్దని ఎస్పీ  హెచ్చరిక
కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు వద్దకు వెళ్లి నీటి ప్రవాహం, నీటి మట్టాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలు, పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులు, వాగులు, కల్వర్టులు, వరద ప్రవాహ ప్రాంతాల వద్దకు వెళ్లరాదని, సెల్ఫీలు మరియు వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని తీవ్రంగా హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాలు, రద్దీ కూడళ్ల వద్ద అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులందరూ క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉంటూ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అనంతరం గురు రాఘవేంద్ర కాలనీ బ్రిడ్జి ప్రాంతాని ఎస్పీ పరిశీలించారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కామారెడ్డిలోని సుభాష్ రోడ్ చౌరస్తా వద్ద వరద నీటిలో చిక్కుకున్న పెళ్లి బస్సులోని 45 మంది ప్రయాణికులను పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సమన్వయంతో సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేసి వారి ప్రయాణాన్ని యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి, 45 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పోలీసు, అగ్నిమాపక శాఖ సిబ్బంది అంకితభావాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించి అభినందించారు. భారీ వర్షాలు కొనసాగుతున్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను గానీ లేదా డయల్-100 అత్యవసర సేవలను గానీ సంప్రదించాలని కోరారు.
జిల్లా ఎస్పీ  వెంట కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్, దేవునిపల్లి ఎస్‌ఐ రంజిత్, కామారెడ్డి ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.