సిరిసిల్లలో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు...బాలింతలకు పండ్ల పంపిణీ చేసిన కలెక్టర్ తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 01 నుంచి 07 వ తేదీ వరకు కొనసాగుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో బాలింతలకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పలు అనుమానాలు, అపోహలను వీడేలా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. తల్లి పాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని స్పష్టం చేశారు. పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగప డుతాయని తెలిపారు. దీంతో బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలింతలు పోషకాహారం, డ్రై ఫ్రూట్, తినాలని సూచించారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.
సిరిసిల్లలో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు...బాలింతలకు పండ్ల పంపిణీ చేసిన కలెక్టర్ తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 01 నుంచి 07 వ తేదీ వరకు కొనసాగుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో బాలింతలకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, పలు అనుమానాలు, అపోహలను వీడేలా నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం పలువురు బాలింతలకు జిల్లా కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని తెలిపారు. తల్లి పాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు ఇవ్వాలని సూచించారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని స్పష్టం చేశారు. పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగప డుతాయని తెలిపారు. దీంతో బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలింతలు పోషకాహారం, డ్రై ఫ్రూట్, తినాలని సూచించారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.
- వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం... 55 శాతం పనులు పూర్తయినట్లు ఆది శ్రీనివాస్ వెల్లడి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పనుల ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.2
- మండల కేంద్రం బెజ్జంకిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సీజనల్ వ్యాధుల నివారణకు పరిశుభ్రతయే మార్గమని తెలిపిన ఆశా వర్కర్లు సీజనల్ వ్యాధుల నివారణకు పరిశుభ్రతే మార్గం బేజ్జంకి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ చేతులను భోజనానికి ముందు, అనంతరం సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ఆహారం, తాగునీటిని వినియోగించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చని వివరించారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లం శ్రీధర్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ప్రణీత్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.2
- సామాజిక న్యాయం మాకు నినాదం కాదు అది మా విధానం. జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన ఈ రాష్ట్ర కేవలం కవితమ్మ ఒక్కతే బడుగు బలహీన వర్గాల గొంతుకగాఉంది. అరోవ తేదీన జరిగే సమాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను విజయవంతం చేద్దాం. కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ రక్షణ సేన అసెంబ్లీ సమావేశం ఈరోజు నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని ఎర్పాటు చేయడం జరిగింది. ఈసమావేశానికి హజరైన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ ఆద్వర్యంలో ఈనెల 6వ తేదీన హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ కు విజయవంతం చెయ్యాలని కోరారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితమ్మ సామాజిక న్యాయం మా పార్టీ నినాదం కాదు అది మా విధానం అని ప్రకటించిన గొప్ప నాయకురాలు అని, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టంగా చెబుతోంది. ఇప్పటివరకు మనల్ని పాలించిన పాలకుల వివక్ష కారణంగా ఇప్పటికీ సమాజంలోని అనేక వర్గాల ప్రజలు సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని సామాజిక న్యాయం అంటే కేవలం సంక్షేమ పథకాలు ప్రకటించడం కాదు. అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, భూమి, ఆరోగ్యం, ఇలా అన్ని వర్గాల ప్రజలతో సమానంగా నాణ్యమైన జీవన విధానాన్ని అందించడంలో ఈ పాలకులు వివక్ష చుపించినారు. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, దివ్యాంగులు ఇలా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలి. కానీ రిజర్వేషన్ల అమలులో కానీ సంక్షేమ నిధుల పారదర్శక వినియోగించాడంలో కానీ అనాగరిక వర్గాల ప్రజల కోసం చట్టాల సమర్థవంతంగా అమలు చేయడంలో కానీ పూర్తిగా విఫలం కావడంతోనే సమాజం ఇప్పటికీ ఇల్లు లేని పేదలు, చదువు లేని వర్గాలు, కనీసం రొడ్డు కరెంటు లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి అంటే అది పూర్తిగా పాలకుల వైఫల్యం అని వారు అన్నారు. అందుకే తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ సామాజిక న్యాయం మా విధానం అని ప్రకటించి సమాజం వివక్షకు గురైన ప్రజల కోసం వారు తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించారు పాంచజన్యంలో ప్రదానంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగ పడేవిధంగా సమాజిక న్యాయం, అందరికీ సమాన అవకాశాలు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అని రాజకీయ నినాదంగా కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యాచరణను కవితమ్మ ఈనెల అరోవ తేదీన సరూర్‌నగర్ ప్రకటించాబోతున్నారు. అందుకే కరీంనగర్ నియోజకవర్గం నుండి కూడ పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, కవితమ్మ అభిమానులు పెద్దఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈకార్యక్రమంలోకరింనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజ్, మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, బీసీ సెల్ అధ్యక్షులు శ్రీరాముల రమేష్, ఆదివాసి విభాగం అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాలి పెళ్లి రత్నాకర్, రంగరవేణి లక్ష్మణ్, యండి రాజీ, పూసల పవన్, గర్షకుర్తి విద్యాసాగర్, భాసవేణి రాజేందర్, ఎండి హుస్సేన్, ఉమార్, మడిపల్లి వినీత్, పూసాల రణధీర్ నూతి సాయిచరణ్, మహిళ విభాగం నాయకురాలు పిన్నింటి సంగీత రెడ్డి, జంగా అపర్ణ, కృష్ణవేణి, కొరిమి పద్మ, పల్లె శారద తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌ను శుద్ధి చేసిన కాంగ్రెస్ శ్రేణులు కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌ను కాంగ్రెస్ శ్రేణులు నీళ్లతో కడిగి శుద్ధి చేశాయి. నిన్నటి బిఆర్‌ఎస్ నాయకుల పర్యటనతో పంప్‌హౌస్ అపవిత్రమైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయ గౌడ్ మండిపడ్డారు. ఇక్కడికి వస్తున్నది ఎల్లంపల్లి నీళ్లేనని, కాళేశ్వరం నీళ్లంటూ బిఆర్‌ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బిఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఇకపైనా డ్రామాలు ఆడితే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు.1
- శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు.బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం చేశారు.1
- పెద్ది సుదర్శన్ రెడ్డి కి ఘనంగా బిఆర్ఎస్ నేతల నివాళులు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఇటీవల ఆకస్మిక మృతి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కి ఘనంగా నివాళులర్పించారు.మంగళవారం బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు సమావేశమై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా సేవలను, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను,పార్టీ కోసం చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.ఆయన మృతి పార్టీకి,తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు.1
- రాష్ట్రంలో అసలు క్రిమినల్ వేస్ట్ ఎవరంటే అది మన ముఖ్యమంత్రి:డా. పాల్వాయి హరీష్ బాబు MLA సిర్పూర్ *రాష్ట్రంలో అసలైన క్రిమినల్ వేస్ట్ ఎవరంటే అది మన ముఖ్యమంత్రే! తన దగ్గర ఉన్న శాఖలను కూడా సరిగ్గా నిర్వహించలేని చేతకానితనంతో ముఖ్యమంత్రి గారు కాలయాపన చేస్తున్నారు.* నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే ఉద్దేశమే లేదు కానీ ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని మభ్యపెడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని చూస్తే సిగ్గేస్తోంది. రేపు విద్యార్థులు కనుక రోడ్డెక్కి తిరగబడితే ఈ ప్రభుత్వానికి పుట్టగతులుండవు. *డా.పాల్వాయి హరీష్ బాబు గారు,* సిర్పూర్ శాసనసభ సభ్యులు1
- మెట్ పల్లిలో కోతకు గురైన చెరువు కట్టను పరిశీలించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్...చెరువు కట్టతో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు నవ్వుకునేలా ఉందని అధికారుల పనితీరు అద్వానంగా మారిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో గత మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు పెద్ద చెరువు కోతకు గురికావడంతో చెరువును ఎమ్మెల్యే పరిశీలించారు. పురపాలక అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు నీటిపై మీకేమైనా అవగాహన ఉందా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఇరు శాఖల అధికారులను రెండు వైపుల నిలబెట్టి సుమారు గంటపాటు అధికారులను ప్రశ్నిస్తూ ముచ్చెమటలు పట్టించాడు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక అధికారులు దిక్కులు చూస్తూ ఉండిపోయారు. చెరువు విషయంపై ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్కేజీ పిల్లలు చదువుకునే సమయంలో బడి కి వెళ్లకుండా తప్పించుకునే విధంగా కడుపు నొస్తుందని అబద్ధాలు చెప్పే విధంగా, అధికారుల సమాధానాలు కూడా అలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కట్ట తెగడంతో మత్స్యకారులు లక్షల రూపాయల చేపలు బయటకు వెళ్లిపోయి నష్టపోయారని, ఇరు శాఖల అధికారులు మత్స్యకారులకు పరిహారం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. చెరువు కట్టకు అభివృద్ధి పనులు చేస్తున్న గుత్తేదారులు పిలిచి పనులపై ఆగ్రహం వ్యక్తం చేసి శాఖల పనితీరుకు తలలు పట్టుకునేలా ఉందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.1