logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అంబటి ఇంటి వద్ద పోలీసుల పహారా గుంటూరు నగరం: జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరడంతో అంబటి ఇంటి వద్ద ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. అభిమానులు భారీగా తరలివస్తుండటంతో, జిల్లావ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర నేతలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

2 hrs ago
user_SIVA
SIVA
జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

అంబటి ఇంటి వద్ద పోలీసుల పహారా గుంటూరు నగరం: జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరడంతో అంబటి ఇంటి వద్ద ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. అభిమానులు భారీగా తరలివస్తుండటంతో, జిల్లావ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర నేతలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గుంటూరు నగరం: జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బుధవారం తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయన్నారు.
    1
    గుంటూరు నగరం:
జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బుధవారం తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయన్నారు.
    user_SIVA
    SIVA
    జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • shot News:గుంటూరులో జరిగిన గొడవపై అంబటి కుమార్తె ప్రెస్ మీట్
    1
    shot News:గుంటూరులో జరిగిన గొడవపై అంబటి కుమార్తె ప్రెస్ మీట్
    user_SHOT NEWS
    SHOT NEWS
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • వీళ్ళు నాయకులా? #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
    1
    వీళ్ళు నాయకులా?
#YcpCriminalPolitics 
#PsychoFekuJagan 
#AndhraPradesh
    user_Annapa reddy Siva Nagendra
    Annapa reddy Siva Nagendra
    Sales Manager గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి :మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
    1
    పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి :మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    జర్నలిస్ట్ ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పెద్దవరం గ్రామ శివారులో (తెలంగాణ పరిధి) ఉన్న ఎన్ఎస్పి రావికంపాడు మైనర్ కాల్వకు గండి పడింది. దీంతో నీటి ప్రవాహం బయటకు వెళ్లిపోతుండటంతో చెన్నూరు గ్రామ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
    1
    ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పెద్దవరం గ్రామ శివారులో (తెలంగాణ పరిధి) ఉన్న ఎన్ఎస్పి రావికంపాడు మైనర్ కాల్వకు గండి పడింది. దీంతో నీటి ప్రవాహం బయటకు వెళ్లిపోతుండటంతో చెన్నూరు గ్రామ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
    user_V. sureh
    V. sureh
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన మేడ ఎలమందయ్య భూమిని కబ్జా చేసి చంపుతామని బెదిరిస్తున్న మానం సీతారామయ్య, శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం నకరికల్లు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విచారణలో ఎలమందయ్య తనకు సర్వే నెం. 571/c2, 571/c1c లలో 60 సెంట్లు భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు రికార్డులు సమర్పించారు. బాధితుల పట్ల తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తమైంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని ఎలమందయ్య కుటుంబానికి రక్షణ కల్పించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
    1
    ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన మేడ ఎలమందయ్య భూమిని కబ్జా చేసి చంపుతామని బెదిరిస్తున్న మానం సీతారామయ్య, శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం నకరికల్లు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విచారణలో ఎలమందయ్య తనకు సర్వే నెం. 571/c2, 571/c1c లలో 60 సెంట్లు భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు రికార్డులు సమర్పించారు. బాధితుల పట్ల తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తమైంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని ఎలమందయ్య కుటుంబానికి రక్షణ కల్పించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_Orsu Krishna
    Orsu Krishna
    Social worker పిడుగురాళ్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో మెడికల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ప్రత్యేక బస్సుల ద్వారా 2,000 మందికి పరీక్షలు చేసి 110 మందిలో లక్షణాలు గుర్తించామని తెలిపారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
    1
    ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో మెడికల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ప్రత్యేక బస్సుల ద్వారా 2,000 మందికి పరీక్షలు చేసి 110 మందిలో లక్షణాలు గుర్తించామని తెలిపారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గుంటూరు జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సుమారు 20 వాహనాల భారీ కాన్వాయ్‌తో ఆయన ప్రయాణమయ్యారు. జగన్ రాకను పురస్కరించుకుని గుంటూరులో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
    1
    గుంటూరు జిల్లా:
మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సుమారు 20 వాహనాల భారీ కాన్వాయ్‌తో ఆయన ప్రయాణమయ్యారు. జగన్ రాకను పురస్కరించుకుని గుంటూరులో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
    user_SIVA
    SIVA
    జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.