*తండ్రితో గొడవ… పాపపై ప్రతీకారం తీర్చుకున్న ఆటో డ్రైవర్* *తండ్రితో గొడవ… పాపపై ప్రతీకారం తీర్చుకున్న ఆటో డ్రైవర్* మహారాష్ట్రలోని పాల్ఘర్ పట్టణంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఆటో డ్రైవర్ తన వ్యక్తిగత కోపాన్ని అదుపులో పెట్టుకోలేక, నిరపరాధ నాలుగేళ్ల పాపపై అమానుషంగా దాడి చేయడం సమాజాన్ని కలచివేసింది. ఈ ఘటనకు కారణం, పాప తండ్రితో నిందితుడికి జరిగిన వాగ్వాదమే. చిన్న విషయంగా మొదలైన ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరుకుని, డ్రైవర్‌లో కోపాన్ని రగిలించింది. అయితే ఆ కోపాన్ని తండ్రిపై కాకుండా, అమాయకమైన పాపపై చూపడం అతని క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచింది. దాడి సమయంలో నిందితుడు నాలుగేళ్ల పాపను పట్టుకుని నేలకేసి కొట్టాడు. అంతటితో ఆగకుండా, ఆమెపై తీవ్రంగా దాడి చేస్తూ ఇనుప రాడ్‌తో తలపై కొట్టాడు. ఈ దారుణ ఘటనలో పాప తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన పాపను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స కొనసాగుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

- 1/4/26 బుధవారము పలమనేరు జగమర్ల అటవీ ప్రాంతంలో వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. పెద్దపంజాణి ఎగువ మిద్దపల్లికు చెందిన చంద్రమ్మగా గుర్తించిన పోలీసులు. సోమవారం చంద్రమ్మ మిస్సింగ్ అంటూ పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు. కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు. అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడుతో బైక్ పై వెళ్లినట్లు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. సుబ్రహ్మణ్యం ను విచారించగా వెలుగులోకి వచ్చిన ఘటన. 15 సంవత్సరాల క్రితం వీకోట మండలం నాగిరెడ్డిపల్లి చలపతి అనే అతనితో వివాహం కుటుంబ కలహాలతో ఆరు సంవత్సరాల క్రితం విడిపోయిన భార్య భర్తలు టైలరింగ్ వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్న చీటీల వ్యాపారం నిర్వహిస్తున్న చంద్రమ్మ. చంద్రమ్మను హత్య చేసిన సుబ్రహ్మణ్యం తో పాటు మరో ఇద్దరు యువకులు ప్రమేయం ఉన్నట్లు సమాచారం.పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలవలసి ఉంది1
- కదిరి మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు అనుబంధం మున్సిపల్ కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బ్లాక్ డే గా మున్సిపల్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేశారు. మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జే జనార్దన్, కార్మికులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.1
- పుంగనూరు న్యూస్.. పుంగనూరు నగిరి కాంపౌండ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బల్లి.. భోజనం తిన్న విద్యార్థులలో నలుగురికి వాంతులు.. డాక్టర్లకు సమాచారం తెలిపిన ఉపాద్యాయులు.. పాఠశాల వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. పాఠశాలలోనే విద్యార్థులను పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు.. భోజనాన్ని చెత్తకుండీలో పడేసిన సిబ్బంది..2
- రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం గజేంద్ర వాహనోత్సవం పై స్వయంభు జంబుకేశ్వరుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు. సాయంకాలం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని గజేంద్ర వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు.భక్తులు అడుగడుగునా హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు. రేపటి రోజు స్వామివారి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు.1
- ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3 వేల ఏళ్ల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి… శాతవాహన సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి… సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం అమరావతి… రాజధాని కోసం 34 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు… రైతులకు ఆ భరోసా ఇచ్చిన శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు.1
- Post by PSPK Shiva Jsp1
- గాజువాకలో దారుణం! విశాఖపట్నం గాజువాకలో ఆరుబయట LIC ఏజెంట్ వెంకట అప్పారావు పై మాస్క్ వేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశారు. అక్కిరెడ్డిపాలెం మల్లమ్మ గుడి దగ్గర జరిగిన ఘటనలో బాధితుడు స్థానిక ఆర్.కె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాజువాక పోలీసులు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.1
- రాయదుర్గం పట్టణంలో రోడ్లపై ఆవులు, గాడిదలు సంచారంపై మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పశువుల యజమానులకు వారం రోజులు టైం ఇస్తున్నట్లు తెలిపారు. మరోమారు రోడ్లలో కనిపిస్తే మున్సిపల్ యాక్ట్ ద్వారా వాటిని స్వాధీనం చేసుకుని గోశాలలకు తరలించడం జరుగుతుందని పశువుల యజమానులను హెచ్చరించారు. మున్సిపాలిటీ ఒకసారి స్వాధీనం చేసుకుంటే తిరిగి కావాలనుకుంటే పన్ను కట్టాల్సి ఉంటుందని తెలిపారు.1
- ఇతర రాష్ట్రాల ఎంపీలు, పార్టీలు అమరావతికి ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలిపితే, వైసీపీ సభ్యులు మాత్రం ఈ బిల్లుకు మేము వ్యతిరేకం అంటూ వాకౌట్ చేయడం బాధాకరం.1