Shuru
Apke Nagar Ki App…
లక్షెట్టిపేట మండలంలో ముమ్మరంగా జన గణన సర్వే, వివరాల సేకరణ... లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో జన గణన సర్వే ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జన గణన సర్వే సూపర్వైజర్లు ఎన్యూమారేటర్లు మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో సోమవారం సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలోని ప్రతి ఇంటికి వెళ్లి వారు కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. జూన్ 9 వరకు జనగణన సర్వే జరుగుతుందని తాసిల్దార్ దిలీప్ తెలిపారు సర్వేకు అందరూ సహకరించాలని సర్వే సిబ్బంది సూచించారు.
P.G. Murthy
లక్షెట్టిపేట మండలంలో ముమ్మరంగా జన గణన సర్వే, వివరాల సేకరణ... లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో జన గణన సర్వే ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జన గణన సర్వే సూపర్వైజర్లు ఎన్యూమారేటర్లు మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో సోమవారం సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలోని ప్రతి ఇంటికి వెళ్లి వారు కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. జూన్ 9 వరకు జనగణన సర్వే జరుగుతుందని తాసిల్దార్ దిలీప్ తెలిపారు సర్వేకు అందరూ సహకరించాలని సర్వే సిబ్బంది సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.2
- మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ దీక్ష చేపట్టారు. వారు కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.1
- ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన కలిసే ప్రతిపాదన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. "నువ్వు నన్ను కలవకుంటే, నువ్వు వెళ్లాలనుకున్న చోటుకు నేను నిన్ను తీసుకెళ్తాను" అని మోడీ చెప్పినట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తీవ్ర కుదుపు సృష్టించాయి. ఈ సమావేశం జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.1
- కొమురం భీం ఆసిఫాబాద్ నుండి ప్రత్యేక రైలులో వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం వారు పరేడ్ గ్రౌండ్‌కు ర్యాలీగా చేరుకున్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.1
- మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని నిన్న రాత్రి డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన1
- *ఘనంగా జనగణన-2027 'సెన్సస్ వాక్' : ప్రారంభించి పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా* పత్రికా ప్రకటన మే 11, 2026_ఆదిలాబాద్: వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా సాగుతున్న జనగణన-2027 ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన సెన్సస్ వాక్/మారథాన్', అవగాహన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించి పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ముగిసిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ద్వారా సుమారు 12,000 కుటుంబాలు తమ వివరాలను తామే నమోదు చేసుకున్నాయని వెల్లడించారు. నేటి నుండి జూన్ 9 వరకు జరిగే మొదటి దశ హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ అత్యంత కీలకమని, జిల్లాలోని 1,293 బ్లాకుల్లో ఎన్యుమరేటర్లు వివరాలు సేకరిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వచ్చే సిబ్బందికి ప్రజలు ఎటువంటి భయం లేకుండా సమాచారం అందించాలని సేకరించిన సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం అత్యంత గోప్యంగా ఉంటుందని, ఇది కేవలం ప్రభుత్వ అభివృద్ధి పథకాల రూపకల్పనకే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఎన్యుమరేటర్లు అడిగే 34 ప్రశ్నలకు యదార్థమైన సమాధానాలు చెప్పాలని, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారు తమ SE-ID ని చూపిస్తే ప్రక్రియ వేగవంతం అవుతుందని సూచించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న ఈ జాతీయ యజ్ఞంలో ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ అధికారులను ప్రజలను కోరారు. ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్లు ఆర్. ఎస్.చిత్రు, రాజేశ్వర్, డిఆర్ఓ స్రవంతి, డివైఎస్ఓ శ్రీనివాస్, ఈడి మనోహర్, మెప్మా పిడి రాజు, పర్యవేక్షకురాలు నలంద ప్రియ, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, ప్రజలు, ఉద్యోగులు, యువత, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.3
- తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మిల్లర్ల దోపిడీ కారణంగా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. క్వింటాల్‌కు ₹500 నష్టపోవడంతో పాటు, 12.5 కిలోల తరుగు పేరుతో దోపిడీకి గురవుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు మోర్తాడ్‌లో భారీ నిరసనకు ఆయన పిలుపునిచ్చారు.1
- మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో ఇందూర్ పోచమ్మ బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు బోనాలు సమర్పించగా, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు తమ కుటుంబాలు, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.1