logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గిరిజన హక్కుల పరిరక్షణకు బీసీవైపి కృషి గిరిజన హక్కులు, చట్టాల సమర్థ అమలుకు భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపి) నిరంతరం కృషి చేస్తుందని ఆ పార్టీ అల్లూరి జిల్లా కన్వీనర్ కిలో రాజన్ తెలిపారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు.గిరిజన ప్రాంతాల్లో అమలులో ఉన్న చట్టాలను గత పాలకులు విస్మరించారని ఆయన విమర్శించారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని రాజన్ స్పష్టం చేశారు.

3 hrs ago
user_Nava surya
Nava surya
జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

గిరిజన హక్కుల పరిరక్షణకు బీసీవైపి కృషి గిరిజన హక్కులు, చట్టాల సమర్థ అమలుకు భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపి) నిరంతరం కృషి చేస్తుందని ఆ పార్టీ అల్లూరి జిల్లా కన్వీనర్ కిలో రాజన్ తెలిపారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు.గిరిజన ప్రాంతాల్లో అమలులో ఉన్న చట్టాలను గత పాలకులు విస్మరించారని ఆయన విమర్శించారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని రాజన్ స్పష్టం చేశారు.

More news from Alluri Sitharama Raju and nearby areas
  • వై.రామవరంలో జరిగిన ‘సంపూర్ణ అభియాన్’ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయని, పాఠశాలల నిర్వహణ సక్రమంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరైనా తాగునీటి పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. గిరిజన గ్రామాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు.
    1
    వై.రామవరంలో జరిగిన ‘సంపూర్ణ అభియాన్’ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయని, పాఠశాలల నిర్వహణ సక్రమంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరైనా తాగునీటి పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. గిరిజన గ్రామాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services Paderu, Alluri Sitharama Raju•
    38 min ago
  • బొద్దంగ్రామంలో చోరీ జరిగిన ఇంటిని సందర్శించిన డీఎస్పీ మరియు అధికారులు. బొద్దంగ్రామంలో గత ఆదివారం జనపరెడ్డి వెంకటరమణ ఇంట్లో జరిగిన భారీ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మంగళవారం నాడు ఇన్చార్జి డీఎస్పీ ఆర్. గోవిందరావు, ఎస్.కోట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. అప్పలనాయుడు, మరియు ఎస్.కోట ఇన్స్పెక్టర్ నారాయణ మూర్తి ఘటనా స్థలాన్ని స్వయంగా సందర్శించి విచారణ చేపట్టారు. అధికారులు చోరీ జరిగిన గదులను, బీరువాలను మరియు నిందితులు ఇంట్లోకి ప్రవేశించిన మార్గాలను పరిశీలించారు. బాధితుడు వెంకటరమణ మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడి, పోయిన నగదు, నగలు మరియు ఇతర విలువైన వస్తువుల వివరాలను సేకరించారు. క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రలు, స్థానిక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ.. ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో విచారిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
    1
    బొద్దంగ్రామంలో చోరీ జరిగిన ఇంటిని సందర్శించిన డీఎస్పీ మరియు అధికారులు.
బొద్దంగ్రామంలో గత ఆదివారం జనపరెడ్డి వెంకటరమణ ఇంట్లో జరిగిన భారీ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మంగళవారం నాడు ఇన్చార్జి డీఎస్పీ ఆర్. గోవిందరావు, ఎస్.కోట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. అప్పలనాయుడు, మరియు ఎస్.కోట ఇన్స్పెక్టర్ నారాయణ మూర్తి ఘటనా స్థలాన్ని స్వయంగా సందర్శించి విచారణ చేపట్టారు. అధికారులు చోరీ జరిగిన గదులను, బీరువాలను మరియు నిందితులు ఇంట్లోకి ప్రవేశించిన మార్గాలను పరిశీలించారు. బాధితుడు వెంకటరమణ మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడి, పోయిన నగదు, నగలు మరియు ఇతర విలువైన వస్తువుల వివరాలను సేకరించారు. క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రలు, స్థానిక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఈ సందర్భంగా డీఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ.. ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో విచారిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
    user_Giridhar singh
    Giridhar singh
    రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • శ్రీకాకుళం: పోలీసు ఉద్యోగులలో ఐకమత్యం,జట్టు సమన్వయం, శారీరక–మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం లోని తండేవలసలో గల పోలీస్ శిక్షణ కేంద్రం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వార్షిక జిల్లా పోలీసు స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ ప్రారంభ వేడుకలకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ముందుగా ఎస్పీ పోలీసు క్రీడాజ్యోతిని వెలిగించి,గాలిలోకి శాంతికి చిహ్నంగా పావురాలు, బెలూన్లు ఎగురవేసి క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం వివిధ క్రీడా పోటీలకు ప్రారంభ సంకేతం ఇచ్చారు. ఈ వార్షిక క్రీడా పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించనుండగా, శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖకు చెందిన శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్లు, పోలీసు కార్యాలయం, ఆర్మ్డ్ రిజర్వ్, ఎస్‌టిఎఫ్, హోంగార్డ్స్ విభాగాలకు చెందిన మొత్తం ఏడు జట్లు వివిధ క్రీడాంశాల్లో పోటీపడి తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నాయి. ఈ వార్షిక క్రీడా పోటీల ప్రారంభ వేడుకల్లో పురుషుల 400 మీటర్ల పరుగు, పురుషులు – మహిళల 100 మీటర్ల పరుగు,వంటి పోటీలను ప్రారంభించి, విజేతలుగా నిలిచిన పోలీసు అధికారులు, సిబ్బంది క్రీడాకారులకు అభినిందచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు విధులు సాధారణంగా ఒత్తిడితో కూడుకున్నవి. అలాంటి పరిస్థితుల్లో క్రీడలు మనకు శారీరక ఉత్సాహంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తాయిని ప్రతి ఒక్కరూ క్రీడాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.క్రీడా మైదానంలో ఉన్నప్పుడు విధులు,ఒత్తిడి పూర్తిగా మర్చిపోయి, జట్టు స్పూర్తితో విజయం వైపు ముందుకు సాగుతామని తెలిపారు.స్పోర్ట్స్ ద్వారా జట్టు సమన్వయం, పరస్పర అవగాహన, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయిన్నారు. ఇవే లక్షణాలు పోలీసు విధుల్లో కూడా అత్యంత అవసరం అని అన్నారు. ప్రతి సబ్ డివిజన్‌,పోలీసు కార్యాలయంకు చెందిన అధికారులు, సిబ్బంది, ఎస్‌టిఎఫ్, హోంగార్డులు అందరూ ఆసక్తితో పాల్గొని, ఈ క్రీడా పోటీలను స్ఫూర్తిదాయకంగా, విజయవంతంగా నిర్వహించాలి.అలాగే క్రీడాకారులు అందరూ ఆరోగ్యంగా, క్రమశిక్షణతో, స్నేహపూర్వక వాతావరణంలో పోటీల్లో పాల్గొని ఈ మూడు రోజుల క్రీడా సంబరాలను విజయవంతం చేయాలని కోరారు.వార్షిక స్పోర్ట్స్ & గేమ్స్ మీట్‌లో భాగంగా అథ్లెటిక్స్,వాలీబాల్, బ్యాడ్మింటన్,కబాడీ,క్రికెట్, బాస్కెట్‌ బాల్,షాట్‌ పుట్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్,వంటి వివిధ క్రీడా పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.చివరగా ఎస్పీ క్రీడల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేసి, క్రీడా స్ఫూర్తిని నింపారు.
    4
    శ్రీకాకుళం: పోలీసు ఉద్యోగులలో ఐకమత్యం,జట్టు సమన్వయం, శారీరక–మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం లోని తండేవలసలో గల పోలీస్ శిక్షణ కేంద్రం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వార్షిక జిల్లా పోలీసు స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ ప్రారంభ వేడుకలకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ముందుగా ఎస్పీ
పోలీసు క్రీడాజ్యోతిని వెలిగించి,గాలిలోకి శాంతికి చిహ్నంగా పావురాలు, బెలూన్లు ఎగురవేసి క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం వివిధ క్రీడా పోటీలకు ప్రారంభ సంకేతం ఇచ్చారు. ఈ వార్షిక క్రీడా పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించనుండగా, శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖకు చెందిన శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్లు, పోలీసు కార్యాలయం, ఆర్మ్డ్ రిజర్వ్, ఎస్‌టిఎఫ్, హోంగార్డ్స్ విభాగాలకు చెందిన మొత్తం ఏడు జట్లు వివిధ క్రీడాంశాల్లో పోటీపడి తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నాయి. ఈ వార్షిక క్రీడా పోటీల ప్రారంభ వేడుకల్లో  పురుషుల 400 మీటర్ల పరుగు, పురుషులు – మహిళల 100 మీటర్ల పరుగు,వంటి పోటీలను ప్రారంభించి, విజేతలుగా నిలిచిన పోలీసు అధికారులు, సిబ్బంది క్రీడాకారులకు అభినిందచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు విధులు సాధారణంగా ఒత్తిడితో కూడుకున్నవి. అలాంటి పరిస్థితుల్లో క్రీడలు మనకు శారీరక ఉత్సాహంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తాయిని ప్రతి ఒక్కరూ క్రీడాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.క్రీడా మైదానంలో ఉన్నప్పుడు విధులు,ఒత్తిడి పూర్తిగా మర్చిపోయి, జట్టు స్పూర్తితో విజయం వైపు ముందుకు సాగుతామని తెలిపారు.స్పోర్ట్స్ ద్వారా జట్టు సమన్వయం, పరస్పర అవగాహన, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయిన్నారు. ఇవే లక్షణాలు పోలీసు విధుల్లో కూడా అత్యంత అవసరం అని అన్నారు. ప్రతి సబ్ డివిజన్‌,పోలీసు కార్యాలయంకు చెందిన అధికారులు, సిబ్బంది, ఎస్‌టిఎఫ్, హోంగార్డులు అందరూ ఆసక్తితో పాల్గొని, ఈ క్రీడా పోటీలను స్ఫూర్తిదాయకంగా, విజయవంతంగా నిర్వహించాలి.అలాగే క్రీడాకారులు అందరూ ఆరోగ్యంగా, క్రమశిక్షణతో, స్నేహపూర్వక వాతావరణంలో పోటీల్లో పాల్గొని ఈ మూడు రోజుల క్రీడా సంబరాలను విజయవంతం చేయాలని కోరారు.వార్షిక స్పోర్ట్స్ & గేమ్స్ మీట్‌లో భాగంగా అథ్లెటిక్స్,వాలీబాల్, బ్యాడ్మింటన్,కబాడీ,క్రికెట్, బాస్కెట్‌ బాల్,షాట్‌ పుట్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్,వంటి వివిధ క్రీడా పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.చివరగా ఎస్పీ క్రీడల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేసి, క్రీడా స్ఫూర్తిని నింపారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ఫిబ్రవరి 4,టెక్కలి మండలం నర్సింగపల్లి తదితర గ్రామాల్లో బుధవారం ఉదయం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి నలుగురిని గాయపరిచిన విషయం తెలిసిందే. మధ్యాహ్నానానికి ఆ సంఖ్య 9కి చేరింది. గాయపడిన మరో ఐదుగురు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్సకు చేరారు. ఒక రోజులో తొమ్మిది మంది కుక్క కాటుకు గురవ్వడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులు పరిశీలించి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    3
    ఫిబ్రవరి 4,టెక్కలి మండలం నర్సింగపల్లి తదితర గ్రామాల్లో బుధవారం ఉదయం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి నలుగురిని గాయపరిచిన విషయం తెలిసిందే. మధ్యాహ్నానానికి ఆ సంఖ్య 9కి చేరింది. గాయపడిన మరో ఐదుగురు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్సకు చేరారు. ఒక రోజులో తొమ్మిది మంది కుక్క కాటుకు గురవ్వడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులు పరిశీలించి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి టెక్కలి మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో నర్సింగపల్లి మొక్ర. మొఖలింగపురం. కిట్టలపాడు తదితర గ్రామాల్లో పిచ్చుకలు స్వైర విహారం చేస్తూ కనబడిన వారి కల్లా కరిచి గాయాల పాలు చేస్తున్నాయి. దీనితో తెల్లవారి నుండి టెక్కలి జిల్లా ఆసుపత్రికి కుక్కలు కరిచిన బాధితులు చికిత్స కోసం తరలివస్తున్నారు .ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పిచ్చి కుక్కల్ని అరికట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు
    4
    శ్రీకాకుళం జిల్లా 
టెక్కలి 
టెక్కలి మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో నర్సింగపల్లి మొక్ర. మొఖలింగపురం.  కిట్టలపాడు తదితర గ్రామాల్లో పిచ్చుకలు స్వైర విహారం చేస్తూ కనబడిన వారి కల్లా కరిచి గాయాల పాలు చేస్తున్నాయి. దీనితో తెల్లవారి నుండి టెక్కలి జిల్లా ఆసుపత్రికి కుక్కలు కరిచిన  బాధితులు చికిత్స కోసం తరలివస్తున్నారు .ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పిచ్చి కుక్కల్ని అరికట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు
    user_RAJESH VADUGURI
    RAJESH VADUGURI
    Photographer టెక్కలి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    11 hrs ago
  • క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పాడేరు మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సంధ్యా రాణి సూచించారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా బుధవారం పాడేరు మండలం చింతలవీధి సబ్‌సెంటర్ వద్ద లెప్రసీ, క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్యాన్సర్ బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందుబాటులో ఉందన్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించి సకాలంలో చికిత్స పొందాలని సూచించారు. అవగాహనతోనే క్యాన్సర్‌ను ఎదుర్కోవచ్చని ఆమె పేర్కొన్నారు.
    1
    క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పాడేరు మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సంధ్యా రాణి సూచించారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా బుధవారం పాడేరు మండలం చింతలవీధి సబ్‌సెంటర్ వద్ద లెప్రసీ, క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్యాన్సర్ బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందుబాటులో ఉందన్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించి సకాలంలో చికిత్స పొందాలని సూచించారు. అవగాహనతోనే క్యాన్సర్‌ను ఎదుర్కోవచ్చని ఆమె పేర్కొన్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అల్లూరి పాడేరు జిల్లా, రాజవొమ్మంగి మండలం, కొమరాపురం గ్రామంలో అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఓ మహిళను మోసం చేశారు. ​వివరాల్లోకి వెళ్తే.. లోవకుమారి అనే మహిళ వాహనం కోసం వేచి చూస్తుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెకు లిఫ్ట్ ఇచ్చారు. మార్గమధ్యలో మాటలు కలిపి, తమ వద్ద ఉన్న తాయత్తుతో కష్టాలన్నీ తీరుస్తామని ఆమెను నమ్మించారు. ఆ మాయమాటలకు లొంగిపోయిన ఆమె వద్ద నుంచి బంగారు కమ్మలను తీసుకొని నిందితులు పరారయ్యారు. కొంత సమయం తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు లబోదిబోమంది.
    1
    అల్లూరి పాడేరు జిల్లా, రాజవొమ్మంగి మండలం, కొమరాపురం గ్రామంలో అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఓ మహిళను మోసం చేశారు.
​వివరాల్లోకి వెళ్తే.. లోవకుమారి అనే మహిళ వాహనం కోసం వేచి చూస్తుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెకు లిఫ్ట్ ఇచ్చారు. మార్గమధ్యలో మాటలు కలిపి, తమ వద్ద ఉన్న తాయత్తుతో కష్టాలన్నీ తీరుస్తామని ఆమెను నమ్మించారు. ఆ మాయమాటలకు లొంగిపోయిన ఆమె వద్ద నుంచి బంగారు కమ్మలను తీసుకొని నిందితులు పరారయ్యారు. కొంత సమయం తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు లబోదిబోమంది.
    user_Shyam
    Shyam
    Department of Social Services Paderu, Alluri Sitharama Raju•
    3 hrs ago
  • పోలాకి:మండలం సుసరాం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో టెక్కలి డివిజన్ శక్తి టీం హెచ్ సి ఎం గిరిధర్, మహిళ పిసి యమున బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు సెల్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రీల్స్ చూడటంతో పాటు, ఈ యాప్ పై కూడా దృష్టి సారించాలని, ప్రమాద సమయంలో ఇది ఆదుకుంటుందని తెలిపారు.
    1
    పోలాకి:మండలం సుసరాం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో టెక్కలి డివిజన్ శక్తి టీం హెచ్ సి ఎం గిరిధర్, మహిళ పిసి యమున బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు సెల్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రీల్స్ చూడటంతో పాటు, ఈ యాప్ పై కూడా దృష్టి సారించాలని, ప్రమాద సమయంలో ఇది ఆదుకుంటుందని తెలిపారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.