logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గిరిజనులకు వైద్యం అందని ద్రాక్ష: ఎస్టీ కమిషన్ చైర్మన్ వై.రామవరంలో జరిగిన ‘సంపూర్ణ అభియాన్’ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయని, పాఠశాలల నిర్వహణ సక్రమంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరైనా తాగునీటి పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. గిరిజన గ్రామాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు.

3 hrs ago
user_Shyam
Shyam
Department of Social Services Paderu, Alluri Sitharama Raju•
3 hrs ago

గిరిజనులకు వైద్యం అందని ద్రాక్ష: ఎస్టీ కమిషన్ చైర్మన్ వై.రామవరంలో జరిగిన ‘సంపూర్ణ అభియాన్’ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయని, పాఠశాలల నిర్వహణ సక్రమంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరైనా తాగునీటి పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. గిరిజన గ్రామాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • డుంబ్రిగూడ మండలంలోని కించుమండ సంతలో ఎస్సై సురేష్ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
    1
    డుంబ్రిగూడ మండలంలోని కించుమండ సంతలో ఎస్సై సురేష్ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు.
హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • సీతంపేట మండలం శంబం & కోడిశ పంచాయతీ సచివాలయాలను పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ నేడు సీతంపేట మండలం, శంబం పంచాయతీ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ పనితీరును మరియు రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్థిక పారదర్శకత: 15వ ఆర్థిక సంఘం నిధుల జమ, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. నిధుల వినియోగంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.అభివృద్ధిపై సమీక్ష: కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు, పెద్దలకు మరియు కార్యకర్తలకు సిబ్బంది తగిన గౌరవం ఇవ్వాలని, వారి సమస్యలను చిరునవ్వుతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేసి, పాలనను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు
    1
    సీతంపేట మండలం శంబం & కోడిశ పంచాయతీ  సచివాలయాలను 
పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ  నేడు సీతంపేట మండలం, శంబం పంచాయతీ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ పనితీరును మరియు రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్థిక పారదర్శకత: 15వ ఆర్థిక సంఘం నిధుల జమ, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. నిధుల వినియోగంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.అభివృద్ధిపై సమీక్ష: కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు, పెద్దలకు మరియు కార్యకర్తలకు సిబ్బంది తగిన గౌరవం ఇవ్వాలని, వారి సమస్యలను చిరునవ్వుతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేసి, పాలనను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    14 hrs ago
  • పొందూరు: పొందూరు ఖద్దరుకు ఉన్న చారిత్రక విశిష్టతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ స్పష్టం చేశారు. సుమారు రూ. 100 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ క్లస్టర్ యూనిట్ ద్వారా ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఖాదీ–ఖద్దర్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. నియోజకవర్గ పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పొందూరు ఖద్దరుకు గ్లోబల్ గుర్తింపు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి, ‘జీఐ’ ట్యాగ్ సాధించడంలో కీలక పాత్ర పోషించామని గుర్తుచేశారు. ఇప్పుడు రూ. 100 కోట్లతో ఏర్పాటు చేయనున్న క్లస్టర్ ద్వారా ఆధునిక సాంకేతికతను జోడించి ఖాదీ ఉత్పత్తుల తయారీ, శిక్షణ, మార్కెటింగ్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్లు వివరించారు. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే వేలాది మంది స్థానిక మహిళలకు, కార్మికులకు, యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. స్థల విస్తీర్ణం, మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీటి వసతులు, రహదారి అనుసంధానంపై అధికారులతో సమీక్షించిన ఆయన, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగానే ఈ క్లస్టర్ మంజూరైందని, ఇది స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త గుర్తింపునిస్తుందని స్పష్టం చేశారు. క్లస్టర్ యూనిట్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ విభాగం ఉన్నతాధికారులు, కూటమికి చెందిన స్థానిక నాయకులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
    4
    పొందూరు: పొందూరు ఖద్దరుకు ఉన్న చారిత్రక విశిష్టతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ స్పష్టం చేశారు. సుమారు రూ. 100 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ క్లస్టర్ యూనిట్ ద్వారా ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఖాదీ–ఖద్దర్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. నియోజకవర్గ పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పొందూరు ఖద్దరుకు గ్లోబల్ గుర్తింపు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.  కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి, ‘జీఐ’ ట్యాగ్ సాధించడంలో కీలక పాత్ర పోషించామని గుర్తుచేశారు. ఇప్పుడు రూ. 100 కోట్లతో ఏర్పాటు చేయనున్న క్లస్టర్ ద్వారా ఆధునిక సాంకేతికతను జోడించి ఖాదీ ఉత్పత్తుల తయారీ, శిక్షణ, మార్కెటింగ్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్లు వివరించారు.
ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే వేలాది మంది స్థానిక మహిళలకు, కార్మికులకు, యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. స్థల విస్తీర్ణం, మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీటి వసతులు, రహదారి అనుసంధానంపై అధికారులతో సమీక్షించిన ఆయన, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగానే ఈ క్లస్టర్ మంజూరైందని, ఇది స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త గుర్తింపునిస్తుందని స్పష్టం చేశారు.
క్లస్టర్ యూనిట్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ విభాగం ఉన్నతాధికారులు, కూటమికి చెందిన స్థానిక నాయకులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    22 min ago
  • వైసీపీ బలోపేతానికి కలిసికట్టుగా పని చేయాలి గ్రామస్థాయిలో వైసీపీ బలోపేతానికి నాయకులు ,కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కోరారు. బుధవారం పాతపట్నం మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు కలిసి కట్టుగా పని చేయాలని అన్నారు. అన్ని గ్రామాలలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే విధంగా సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    వైసీపీ బలోపేతానికి కలిసికట్టుగా పని చేయాలి
గ్రామస్థాయిలో వైసీపీ బలోపేతానికి నాయకులు ,కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కోరారు. బుధవారం
పాతపట్నం మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు కలిసి కట్టుగా పని చేయాలని అన్నారు. అన్ని గ్రామాలలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే విధంగా సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పొందూరు మండలంలో రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించబోయే ఖాదీ–ఖద్దర్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం స్థలాన్ని పరిశీలించారు. ఖద్దరు కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు లభిస్తుందని ఆయన వివరించారు.
    1
    పొందూరు మండలంలో రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించబోయే ఖాదీ–ఖద్దర్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం  స్థలాన్ని  పరిశీలించారు. ఖద్దరు కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు లభిస్తుందని ఆయన వివరించారు.
    user_Karri Sankara Reddy
    Karri Sankara Reddy
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అల్లూరి పాడేరు జిల్లా, రాజవొమ్మంగి మండలం, కొమరాపురం గ్రామంలో అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఓ మహిళను మోసం చేశారు. ​వివరాల్లోకి వెళ్తే.. లోవకుమారి అనే మహిళ వాహనం కోసం వేచి చూస్తుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెకు లిఫ్ట్ ఇచ్చారు. మార్గమధ్యలో మాటలు కలిపి, తమ వద్ద ఉన్న తాయత్తుతో కష్టాలన్నీ తీరుస్తామని ఆమెను నమ్మించారు. ఆ మాయమాటలకు లొంగిపోయిన ఆమె వద్ద నుంచి బంగారు కమ్మలను తీసుకొని నిందితులు పరారయ్యారు. కొంత సమయం తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు లబోదిబోమంది.
    1
    అల్లూరి పాడేరు జిల్లా, రాజవొమ్మంగి మండలం, కొమరాపురం గ్రామంలో అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఓ మహిళను మోసం చేశారు.
​వివరాల్లోకి వెళ్తే.. లోవకుమారి అనే మహిళ వాహనం కోసం వేచి చూస్తుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెకు లిఫ్ట్ ఇచ్చారు. మార్గమధ్యలో మాటలు కలిపి, తమ వద్ద ఉన్న తాయత్తుతో కష్టాలన్నీ తీరుస్తామని ఆమెను నమ్మించారు. ఆ మాయమాటలకు లొంగిపోయిన ఆమె వద్ద నుంచి బంగారు కమ్మలను తీసుకొని నిందితులు పరారయ్యారు. కొంత సమయం తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు లబోదిబోమంది.
    user_Shyam
    Shyam
    Department of Social Services Paderu, Alluri Sitharama Raju•
    5 hrs ago
  • గిరిజన హక్కులు, చట్టాల సమర్థ అమలుకు భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపి) నిరంతరం కృషి చేస్తుందని ఆ పార్టీ అల్లూరి జిల్లా కన్వీనర్ కిలో రాజన్ తెలిపారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు.గిరిజన ప్రాంతాల్లో అమలులో ఉన్న చట్టాలను గత పాలకులు విస్మరించారని ఆయన విమర్శించారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని రాజన్ స్పష్టం చేశారు.
    1
    గిరిజన హక్కులు, చట్టాల సమర్థ అమలుకు భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపి) నిరంతరం కృషి చేస్తుందని ఆ పార్టీ అల్లూరి జిల్లా కన్వీనర్ కిలో రాజన్ తెలిపారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు.గిరిజన ప్రాంతాల్లో అమలులో ఉన్న చట్టాలను గత పాలకులు విస్మరించారని ఆయన విమర్శించారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని రాజన్ స్పష్టం చేశారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.