శంబం & కోడిశ సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సీతంపేట మండలం శంబం & కోడిశ పంచాయతీ సచివాలయాలను పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ నేడు సీతంపేట మండలం, శంబం పంచాయతీ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ పనితీరును మరియు రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్థిక పారదర్శకత: 15వ ఆర్థిక సంఘం నిధుల జమ, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. నిధుల వినియోగంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.అభివృద్ధిపై సమీక్ష: కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు, పెద్దలకు మరియు కార్యకర్తలకు సిబ్బంది తగిన గౌరవం ఇవ్వాలని, వారి సమస్యలను చిరునవ్వుతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేసి, పాలనను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు

- శ్రీకాకుళం: నగరంలో ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జేమ్స్, కిమ్స్ సంస్థలు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ప్రారంభించారు. ముందస్తు అవగాహన, ఆరోగ్యకరమైన ఆహారం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సరు జయించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.1
- సంతబొమ్మాలి ఫిబ్రవరి 4,నియోజకవర్గంలో బూరగాం గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామి ధర్మ శాస్త్ర సన్నిధానం ఆలయంలో అయ్యప్ప స్వామికి బుధవారం నాడు భక్తులు విశేష అభిషేకాలు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామికి 11 రకాల పుష్పాలు చేత పూజించి అలంకారం చేశారు. అలాగే స్వామికి తర్వాత భస్మాభిషేక నిర్వహించి వచ్చిన భక్తులకు అరవణ ప్రసాదం పంచి పెట్టారు ఆలయ అర్చకులు భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ చేసి పంచిపెట్టారు.2
- చాలా మంది రోగులు దంత చికిత్సలను ధరల ఆధారంగా మాత్రమే పోల్చుతారు. కానీ దంతవైద్యంలో, సత్వరమార్గాలు తరచుగా పునరావృత విధానాలు, చిగుళ్ల సమస్యలు లేదా నెలల తర్వాత విఫలమైన పనిగా మారుతాయి. నైతిక దంతవైద్యం నైతిక దంతవైద్యం ఖరీదైనది కాదు. ఇది మీ దీర్ఘకాలిక నోటి ఆరోగ్యానికి సురక్షితమైనది మరియు శాశ్వతమైనది చేయడం గురించి. ఎందుకంటే ఒకే పంటిని రెండుసార్లు సరిచేయడం దీర్ఘకాలంలో ఎప్పుడూ చౌకగా ఉండదు.1
- పెదబయలు (M) తారాబు జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఎత్తైన కొండల మధ్య నుంచి ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న నీరు, చుట్టూ పచ్చని అడవులు, చల్లని వాతావరణం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తున్నాయి. సెలవు దినాల్లో సమీప గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు. అతి కష్టం మీద అక్కడికి చేరుకుని ఆ అందాల దృశ్యాలను చూసి ఆ కష్టాన్ని మరిచిపోతున్నారు.1
- వై.రామవరం: మండలంలోని పనసలపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. వార్డెన్ స్టోర్ రూంకు తాళాలు వేసుకుని నిర్లక్ష్యంగా వెళ్లిపోవడంపై చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదని, వార్డెన్ తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఫిర్యాదులు అందాయని ఆయన పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్డెన్‌ను హెచ్చరించారు.1
- 🙏🙏1
- పొందూరు: మండలం లోని తాడివలస పంచాయతీలో రూ.2.85 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు బీటీ, సిసి రోడ్లను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కూన రవి కుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, రోడ్లు గ్రామాల ప్రగతికి ప్రాణాధారమని ఆయన అన్నారు. రోడ్ల ప్రారంభంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభమై రైతులు, విద్యార్థులు, కార్మికులకు మేలు జరుగుతుందని తెలిపారు.1
- డుంబ్రిగూడ మండలంలోని కించుమండ సంతలో ఎస్సై సురేష్ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.1
- అడ్డతీగల: దుచ్చర్తి వై.జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పోలవరం జిల్లాలో ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మంచు కురుస్తున్నందున వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.1