logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అయ్యప్ప స్వామికి విశేష అభిషేకాలు పూజలు సంతబొమ్మాలి ఫిబ్రవరి 4,నియోజకవర్గంలో బూరగాం గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామి ధర్మ శాస్త్ర సన్నిధానం ఆలయంలో అయ్యప్ప స్వామికి బుధవారం నాడు భక్తులు విశేష అభిషేకాలు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామికి 11 రకాల పుష్పాలు చేత పూజించి అలంకారం చేశారు. అలాగే స్వామికి తర్వాత భస్మాభిషేక నిర్వహించి వచ్చిన భక్తులకు అరవణ ప్రసాదం పంచి పెట్టారు ఆలయ అర్చకులు భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ చేసి పంచిపెట్టారు.

13 hrs ago
user_Pokala Nagesh Kumar
Pokala Nagesh Kumar
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
13 hrs ago

అయ్యప్ప స్వామికి విశేష అభిషేకాలు పూజలు సంతబొమ్మాలి ఫిబ్రవరి 4,నియోజకవర్గంలో బూరగాం గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామి ధర్మ శాస్త్ర సన్నిధానం ఆలయంలో అయ్యప్ప స్వామికి బుధవారం నాడు భక్తులు విశేష అభిషేకాలు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామికి 11 రకాల పుష్పాలు చేత పూజించి అలంకారం చేశారు. అలాగే స్వామికి తర్వాత భస్మాభిషేక నిర్వహించి వచ్చిన భక్తులకు అరవణ ప్రసాదం పంచి పెట్టారు ఆలయ అర్చకులు భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ చేసి పంచిపెట్టారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సీతంపేట మండలం శంబం & కోడిశ పంచాయతీ సచివాలయాలను పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ నేడు సీతంపేట మండలం, శంబం పంచాయతీ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ పనితీరును మరియు రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్థిక పారదర్శకత: 15వ ఆర్థిక సంఘం నిధుల జమ, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. నిధుల వినియోగంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.అభివృద్ధిపై సమీక్ష: కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు, పెద్దలకు మరియు కార్యకర్తలకు సిబ్బంది తగిన గౌరవం ఇవ్వాలని, వారి సమస్యలను చిరునవ్వుతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేసి, పాలనను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు
    1
    సీతంపేట మండలం శంబం & కోడిశ పంచాయతీ  సచివాలయాలను 
పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ  నేడు సీతంపేట మండలం, శంబం పంచాయతీ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ పనితీరును మరియు రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్థిక పారదర్శకత: 15వ ఆర్థిక సంఘం నిధుల జమ, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. నిధుల వినియోగంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.అభివృద్ధిపై సమీక్ష: కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు, పెద్దలకు మరియు కార్యకర్తలకు సిబ్బంది తగిన గౌరవం ఇవ్వాలని, వారి సమస్యలను చిరునవ్వుతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేసి, పాలనను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • శ్రీకాకుళం: నగరంలో ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జేమ్స్, కిమ్స్ సంస్థలు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ప్రారంభించారు. ముందస్తు అవగాహన, ఆరోగ్యకరమైన ఆహారం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సరు జయించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
    1
    శ్రీకాకుళం: నగరంలో ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జేమ్స్, కిమ్స్ సంస్థలు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ప్రారంభించారు. ముందస్తు అవగాహన, ఆరోగ్యకరమైన ఆహారం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సరు జయించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • చాలా మంది రోగులు దంత చికిత్సలను ధరల ఆధారంగా మాత్రమే పోల్చుతారు. కానీ దంతవైద్యంలో, సత్వరమార్గాలు తరచుగా పునరావృత విధానాలు, చిగుళ్ల సమస్యలు లేదా నెలల తర్వాత విఫలమైన పనిగా మారుతాయి. నైతిక దంతవైద్యం నైతిక దంతవైద్యం ఖరీదైనది కాదు. ఇది మీ దీర్ఘకాలిక నోటి ఆరోగ్యానికి సురక్షితమైనది మరియు శాశ్వతమైనది చేయడం గురించి. ఎందుకంటే ఒకే పంటిని రెండుసార్లు సరిచేయడం దీర్ఘకాలంలో ఎప్పుడూ చౌకగా ఉండదు.
    1
    చాలా మంది రోగులు దంత చికిత్సలను ధరల ఆధారంగా మాత్రమే పోల్చుతారు. 
కానీ దంతవైద్యంలో, సత్వరమార్గాలు తరచుగా పునరావృత విధానాలు, చిగుళ్ల సమస్యలు లేదా నెలల తర్వాత విఫలమైన పనిగా మారుతాయి.
నైతిక దంతవైద్యం నైతిక దంతవైద్యం ఖరీదైనది కాదు. ఇది మీ దీర్ఘకాలిక నోటి ఆరోగ్యానికి సురక్షితమైనది మరియు శాశ్వతమైనది చేయడం గురించి.
ఎందుకంటే ఒకే పంటిని రెండుసార్లు సరిచేయడం దీర్ఘకాలంలో ఎప్పుడూ చౌకగా ఉండదు.
    user_కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్
    కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్
    Dental Clinic విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • 'రాష్ట్రీయ సేవా సమ్మాన్' పురస్కారంతో మరింత బాధ్యత పెరిగింది విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, విజయనగరం మండలం గుంకలాం జెడ్.పి.హైస్కూలులో హెడ్ మాస్టరుగా పని చేస్తున్న వెలమల శ్రీనివాస రావు 'రాష్ట్రీయ సేవా సమ్మాన్ 2026' అవార్డు అందుకోవడంపట్ల జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హర్షం వ్యక్తం చేసి, జిల్లా పోలీసు కార్యాలయంలో వెలమల శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభిందించి, మిఠాయి తినిపించి, సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన శ్రీనివాసరావు మాస్టరు  జాతీయ పురస్కారం లభించడం అభినందనీయమన్నారు. శ్రీనివాసరావు మాస్టరు ఒక వైపు హెడ్ మాస్టరుగా విధులు నిర్వహిస్తూ, మరోవైపు వలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ, వ్యాఖ్యానం అందిస్తూ, ప్రజలందరికీ చేరువయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషను ఆధ్వర్యంలో ఎంపికైన ఉద్యోగులకు భారతీయ వారసత్వం సంస్కృతి గొప్పదనాన్ని వివిరిస్తూ తరగతులు నిర్వహించడం, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం, పలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడంతో నీతి అయోగ్ ఆధ్వర్యంలోని బృందం వెలమల శ్రీనివాసరావు సేవలను జాతీయ స్థాయిలో గుర్తించి 'రాష్ట్రీయ సేవా సమ్మాన్ 2026' అవార్డును జనవరి 25న న్యూఢిల్లీలో ప్రదానం చేసిందన్నారు. ఈ అవార్డు అందుకోవడంతో శ్రీనివాసరావు మాస్టరు పై మరింత బాధ్యత పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అకాంక్షించారు. జాతీయ పురస్కారం పొందిన వెలమల శ్రీనివాసరావు ఫిబ్రవరి 3న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించి, మిఠాయిలు తినిపించి, సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, రిజర్వు ఇన్స్పెక్టరు ఎన్.గోపాల నాయుడు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, శ్రీనివాసరావు మాస్టరును  అభినందించారు.
    1
    'రాష్ట్రీయ సేవా సమ్మాన్' పురస్కారంతో మరింత బాధ్యత పెరిగింది
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,
విజయనగరం మండలం గుంకలాం జెడ్.పి.హైస్కూలులో హెడ్ మాస్టరుగా పని చేస్తున్న వెలమల శ్రీనివాస రావు 'రాష్ట్రీయ సేవా సమ్మాన్ 2026' అవార్డు అందుకోవడంపట్ల జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హర్షం వ్యక్తం చేసి, జిల్లా పోలీసు కార్యాలయంలో వెలమల శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభిందించి, మిఠాయి తినిపించి, సాలువతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన శ్రీనివాసరావు మాస్టరు  జాతీయ పురస్కారం లభించడం అభినందనీయమన్నారు. శ్రీనివాసరావు మాస్టరు ఒక వైపు హెడ్ మాస్టరుగా విధులు నిర్వహిస్తూ, మరోవైపు వలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ, వ్యాఖ్యానం అందిస్తూ, ప్రజలందరికీ చేరువయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషను ఆధ్వర్యంలో ఎంపికైన ఉద్యోగులకు భారతీయ వారసత్వం సంస్కృతి గొప్పదనాన్ని వివిరిస్తూ తరగతులు నిర్వహించడం, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం, పలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడంతో నీతి అయోగ్ ఆధ్వర్యంలోని బృందం వెలమల శ్రీనివాసరావు సేవలను జాతీయ స్థాయిలో గుర్తించి 'రాష్ట్రీయ సేవా సమ్మాన్ 2026' అవార్డును జనవరి 25న న్యూఢిల్లీలో ప్రదానం చేసిందన్నారు. ఈ అవార్డు అందుకోవడంతో శ్రీనివాసరావు మాస్టరు పై మరింత బాధ్యత పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అకాంక్షించారు.
జాతీయ పురస్కారం పొందిన వెలమల శ్రీనివాసరావు ఫిబ్రవరి 3న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించి, మిఠాయిలు తినిపించి, సాలువతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, రిజర్వు ఇన్స్పెక్టరు ఎన్.గోపాల నాయుడు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, శ్రీనివాసరావు మాస్టరును  అభినందించారు.
    user_Giridhar singh
    Giridhar singh
    రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • పెదబయలు (M) తారాబు జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఎత్తైన కొండల మధ్య నుంచి ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న నీరు, చుట్టూ పచ్చని అడవులు, చల్లని వాతావరణం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తున్నాయి. సెలవు దినాల్లో సమీప గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు. అతి కష్టం మీద అక్కడికి చేరుకుని ఆ అందాల దృశ్యాలను చూసి ఆ కష్టాన్ని మరిచిపోతున్నారు.
    1
    పెదబయలు (M) తారాబు జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఎత్తైన కొండల మధ్య నుంచి ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న నీరు, చుట్టూ పచ్చని అడవులు, చల్లని వాతావరణం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తున్నాయి. సెలవు దినాల్లో సమీప గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు. అతి కష్టం మీద అక్కడికి చేరుకుని ఆ అందాల దృశ్యాలను చూసి ఆ కష్టాన్ని మరిచిపోతున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అడ్డతీగల: దుచ్చర్తి వై.జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పోలవరం జిల్లాలో ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మంచు కురుస్తున్నందున వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
    1
    అడ్డతీగల: దుచ్చర్తి వై.జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పోలవరం జిల్లాలో ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మంచు కురుస్తున్నందున వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services Paderu, Alluri Sitharama Raju•
    2 hrs ago
  • పొందూరు: మండలం లోని తాడివలస పంచాయతీలో రూ.2.85 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు బీటీ, సిసి రోడ్లను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కూన రవి కుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, రోడ్లు గ్రామాల ప్రగతికి ప్రాణాధారమని ఆయన అన్నారు. రోడ్ల ప్రారంభంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభమై రైతులు, విద్యార్థులు, కార్మికులకు మేలు జరుగుతుందని తెలిపారు.
    1
    పొందూరు: మండలం లోని తాడివలస పంచాయతీలో రూ.2.85 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు బీటీ, సిసి రోడ్లను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కూన రవి కుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, రోడ్లు గ్రామాల ప్రగతికి ప్రాణాధారమని ఆయన అన్నారు. రోడ్ల ప్రారంభంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభమై రైతులు, విద్యార్థులు, కార్మికులకు మేలు జరుగుతుందని తెలిపారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • డుంబ్రిగూడ మండలంలోని కించుమండ సంతలో ఎస్సై సురేష్ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
    1
    డుంబ్రిగూడ మండలంలోని కించుమండ సంతలో ఎస్సై సురేష్ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు.
హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • వై.రామవరంలో జరిగిన ‘సంపూర్ణ అభియాన్’ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయని, పాఠశాలల నిర్వహణ సక్రమంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరైనా తాగునీటి పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. గిరిజన గ్రామాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు.
    1
    వై.రామవరంలో జరిగిన ‘సంపూర్ణ అభియాన్’ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయని, పాఠశాలల నిర్వహణ సక్రమంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరైనా తాగునీటి పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. గిరిజన గ్రామాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services Paderu, Alluri Sitharama Raju•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.