Shuru
Apke Nagar Ki App…
అద్భుతమైన తారాబు జలపాతం పెదబయలు (M) తారాబు జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఎత్తైన కొండల మధ్య నుంచి ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న నీరు, చుట్టూ పచ్చని అడవులు, చల్లని వాతావరణం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తున్నాయి. సెలవు దినాల్లో సమీప గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు. అతి కష్టం మీద అక్కడికి చేరుకుని ఆ అందాల దృశ్యాలను చూసి ఆ కష్టాన్ని మరిచిపోతున్నారు.
Nava surya
అద్భుతమైన తారాబు జలపాతం పెదబయలు (M) తారాబు జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఎత్తైన కొండల మధ్య నుంచి ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న నీరు, చుట్టూ పచ్చని అడవులు, చల్లని వాతావరణం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తున్నాయి. సెలవు దినాల్లో సమీప గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు. అతి కష్టం మీద అక్కడికి చేరుకుని ఆ అందాల దృశ్యాలను చూసి ఆ కష్టాన్ని మరిచిపోతున్నారు.
More news from Alluri Sitharama Raju and nearby areas
- అడ్డతీగల: దుచ్చర్తి వై.జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పోలవరం జిల్లాలో ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మంచు కురుస్తున్నందున వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.1
- సీతంపేట మండలం శంబం & కోడిశ పంచాయతీ సచివాలయాలను పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ నేడు సీతంపేట మండలం, శంబం పంచాయతీ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ పనితీరును మరియు రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్థిక పారదర్శకత: 15వ ఆర్థిక సంఘం నిధుల జమ, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. నిధుల వినియోగంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.అభివృద్ధిపై సమీక్ష: కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు, పెద్దలకు మరియు కార్యకర్తలకు సిబ్బంది తగిన గౌరవం ఇవ్వాలని, వారి సమస్యలను చిరునవ్వుతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేసి, పాలనను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు1
- శ్రీకాకుళం: నగరంలో ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జేమ్స్, కిమ్స్ సంస్థలు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ప్రారంభించారు. ముందస్తు అవగాహన, ఆరోగ్యకరమైన ఆహారం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సరు జయించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.1
- పొందూరు మండలంలో రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించబోయే ఖాదీ–ఖద్దర్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం స్థలాన్ని పరిశీలించారు. ఖద్దరు కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు లభిస్తుందని ఆయన వివరించారు.1
- ఫిబ్రవరి 4,టెక్కలి మండలం నర్సింగపల్లి తదితర గ్రామాల్లో బుధవారం ఉదయం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి నలుగురిని గాయపరిచిన విషయం తెలిసిందే. మధ్యాహ్నానానికి ఆ సంఖ్య 9కి చేరింది. గాయపడిన మరో ఐదుగురు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్సకు చేరారు. ఒక రోజులో తొమ్మిది మంది కుక్క కాటుకు గురవ్వడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులు పరిశీలించి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.3
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి టెక్కలి మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో నర్సింగపల్లి మొక్ర. మొఖలింగపురం. కిట్టలపాడు తదితర గ్రామాల్లో పిచ్చుకలు స్వైర విహారం చేస్తూ కనబడిన వారి కల్లా కరిచి గాయాల పాలు చేస్తున్నాయి. దీనితో తెల్లవారి నుండి టెక్కలి జిల్లా ఆసుపత్రికి కుక్కలు కరిచిన బాధితులు చికిత్స కోసం తరలివస్తున్నారు .ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పిచ్చి కుక్కల్ని అరికట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు4
- గిరిజన హక్కులు, చట్టాల సమర్థ అమలుకు భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపి) నిరంతరం కృషి చేస్తుందని ఆ పార్టీ అల్లూరి జిల్లా కన్వీనర్ కిలో రాజన్ తెలిపారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు.గిరిజన ప్రాంతాల్లో అమలులో ఉన్న చట్టాలను గత పాలకులు విస్మరించారని ఆయన విమర్శించారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని రాజన్ స్పష్టం చేశారు.1
- వై.రామవరంలో జరిగిన ‘సంపూర్ణ అభియాన్’ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయని, పాఠశాలల నిర్వహణ సక్రమంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరైనా తాగునీటి పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. గిరిజన గ్రామాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు.1
- పొందూరు: మండలం లోని తాడివలస పంచాయతీలో రూ.2.85 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు బీటీ, సిసి రోడ్లను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కూన రవి కుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, రోడ్లు గ్రామాల ప్రగతికి ప్రాణాధారమని ఆయన అన్నారు. రోడ్ల ప్రారంభంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభమై రైతులు, విద్యార్థులు, కార్మికులకు మేలు జరుగుతుందని తెలిపారు.1