logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వైసీపీ బలోపేతానికి కలిసికట్టుగా పని చేయాలి గ్రామస్థాయిలో వైసీపీ బలోపేతానికి నాయకులు ,కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కోరారు. బుధవారం పాతపట్నం మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు కలిసి కట్టుగా పని చేయాలని అన్నారు. అన్ని గ్రామాలలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే విధంగా సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

4 hrs ago
user_ANR
ANR
పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

వైసీపీ బలోపేతానికి కలిసికట్టుగా పని చేయాలి గ్రామస్థాయిలో వైసీపీ బలోపేతానికి నాయకులు ,కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కోరారు. బుధవారం పాతపట్నం మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు కలిసి కట్టుగా పని చేయాలని అన్నారు. అన్ని గ్రామాలలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే విధంగా సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సీతంపేట మండలం శంబం & కోడిశ పంచాయతీ సచివాలయాలను పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ నేడు సీతంపేట మండలం, శంబం పంచాయతీ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ పనితీరును మరియు రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్థిక పారదర్శకత: 15వ ఆర్థిక సంఘం నిధుల జమ, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. నిధుల వినియోగంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.అభివృద్ధిపై సమీక్ష: కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు, పెద్దలకు మరియు కార్యకర్తలకు సిబ్బంది తగిన గౌరవం ఇవ్వాలని, వారి సమస్యలను చిరునవ్వుతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేసి, పాలనను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు
    1
    సీతంపేట మండలం శంబం & కోడిశ పంచాయతీ  సచివాలయాలను 
పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ  నేడు సీతంపేట మండలం, శంబం పంచాయతీ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ పనితీరును మరియు రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్థిక పారదర్శకత: 15వ ఆర్థిక సంఘం నిధుల జమ, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. నిధుల వినియోగంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.అభివృద్ధిపై సమీక్ష: కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు, పెద్దలకు మరియు కార్యకర్తలకు సిబ్బంది తగిన గౌరవం ఇవ్వాలని, వారి సమస్యలను చిరునవ్వుతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేసి, పాలనను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • శ్రీకాకుళం: నగరంలో ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జేమ్స్, కిమ్స్ సంస్థలు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ప్రారంభించారు. ముందస్తు అవగాహన, ఆరోగ్యకరమైన ఆహారం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సరు జయించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
    1
    శ్రీకాకుళం: నగరంలో ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జేమ్స్, కిమ్స్ సంస్థలు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ప్రారంభించారు. ముందస్తు అవగాహన, ఆరోగ్యకరమైన ఆహారం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సరు జయించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • చాలా మంది రోగులు దంత చికిత్సలను ధరల ఆధారంగా మాత్రమే పోల్చుతారు. కానీ దంతవైద్యంలో, సత్వరమార్గాలు తరచుగా పునరావృత విధానాలు, చిగుళ్ల సమస్యలు లేదా నెలల తర్వాత విఫలమైన పనిగా మారుతాయి. నైతిక దంతవైద్యం నైతిక దంతవైద్యం ఖరీదైనది కాదు. ఇది మీ దీర్ఘకాలిక నోటి ఆరోగ్యానికి సురక్షితమైనది మరియు శాశ్వతమైనది చేయడం గురించి. ఎందుకంటే ఒకే పంటిని రెండుసార్లు సరిచేయడం దీర్ఘకాలంలో ఎప్పుడూ చౌకగా ఉండదు.
    1
    చాలా మంది రోగులు దంత చికిత్సలను ధరల ఆధారంగా మాత్రమే పోల్చుతారు. 
కానీ దంతవైద్యంలో, సత్వరమార్గాలు తరచుగా పునరావృత విధానాలు, చిగుళ్ల సమస్యలు లేదా నెలల తర్వాత విఫలమైన పనిగా మారుతాయి.
నైతిక దంతవైద్యం నైతిక దంతవైద్యం ఖరీదైనది కాదు. ఇది మీ దీర్ఘకాలిక నోటి ఆరోగ్యానికి సురక్షితమైనది మరియు శాశ్వతమైనది చేయడం గురించి.
ఎందుకంటే ఒకే పంటిని రెండుసార్లు సరిచేయడం దీర్ఘకాలంలో ఎప్పుడూ చౌకగా ఉండదు.
    user_కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్
    కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్
    Dental Clinic విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • పెదబయలు (M) తారాబు జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఎత్తైన కొండల మధ్య నుంచి ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న నీరు, చుట్టూ పచ్చని అడవులు, చల్లని వాతావరణం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తున్నాయి. సెలవు దినాల్లో సమీప గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు. అతి కష్టం మీద అక్కడికి చేరుకుని ఆ అందాల దృశ్యాలను చూసి ఆ కష్టాన్ని మరిచిపోతున్నారు.
    1
    పెదబయలు (M) తారాబు జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఎత్తైన కొండల మధ్య నుంచి ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న నీరు, చుట్టూ పచ్చని అడవులు, చల్లని వాతావరణం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తున్నాయి. సెలవు దినాల్లో సమీప గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు. అతి కష్టం మీద అక్కడికి చేరుకుని ఆ అందాల దృశ్యాలను చూసి ఆ కష్టాన్ని మరిచిపోతున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • వై.రామవరం: మండలంలోని పనసలపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ​వార్డెన్ స్టోర్ రూంకు తాళాలు వేసుకుని నిర్లక్ష్యంగా వెళ్లిపోవడంపై చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదని, వార్డెన్ తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఫిర్యాదులు అందాయని ఆయన పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్డెన్‌ను హెచ్చరించారు.
    1
    వై.రామవరం: మండలంలోని పనసలపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు.
​వార్డెన్ స్టోర్ రూంకు తాళాలు వేసుకుని నిర్లక్ష్యంగా వెళ్లిపోవడంపై చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదని, వార్డెన్ తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఫిర్యాదులు అందాయని ఆయన పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్డెన్‌ను హెచ్చరించారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services Paderu, Alluri Sitharama Raju•
    2 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    17 hrs ago
  • పొందూరు: మండలం లోని తాడివలస పంచాయతీలో రూ.2.85 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు బీటీ, సిసి రోడ్లను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కూన రవి కుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, రోడ్లు గ్రామాల ప్రగతికి ప్రాణాధారమని ఆయన అన్నారు. రోడ్ల ప్రారంభంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభమై రైతులు, విద్యార్థులు, కార్మికులకు మేలు జరుగుతుందని తెలిపారు.
    1
    పొందూరు: మండలం లోని తాడివలస పంచాయతీలో రూ.2.85 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు బీటీ, సిసి రోడ్లను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కూన రవి కుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, రోడ్లు గ్రామాల ప్రగతికి ప్రాణాధారమని ఆయన అన్నారు. రోడ్ల ప్రారంభంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభమై రైతులు, విద్యార్థులు, కార్మికులకు మేలు జరుగుతుందని తెలిపారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • డుంబ్రిగూడ మండలంలోని కించుమండ సంతలో ఎస్సై సురేష్ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
    1
    డుంబ్రిగూడ మండలంలోని కించుమండ సంతలో ఎస్సై సురేష్ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు.
హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అడ్డతీగల: దుచ్చర్తి వై.జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పోలవరం జిల్లాలో ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మంచు కురుస్తున్నందున వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
    1
    అడ్డతీగల: దుచ్చర్తి వై.జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పోలవరం జిల్లాలో ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మంచు కురుస్తున్నందున వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services Paderu, Alluri Sitharama Raju•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.