logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెదకూరపాడులో ఎండ తీవ్రతకు రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. పెదకూరపాడు : వేసవి తాపానికి ప్రధాన వీధులు రోడ్లన్నీ నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం కి 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీ వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ వాహనదారులు ప్రయాణాలు కొనసాగించలేకపోయారు. వ్యవసాయ కూలీలు 12 గంటలకి తమ పనుల ముగించుకొని ఇంటి బాట పట్టారు.

2 hrs ago
user_Raju Paragati
Raju Paragati
అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

పెదకూరపాడులో ఎండ తీవ్రతకు రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. పెదకూరపాడు : వేసవి తాపానికి ప్రధాన వీధులు రోడ్లన్నీ నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం కి 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీ వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ వాహనదారులు ప్రయాణాలు కొనసాగించలేకపోయారు. వ్యవసాయ కూలీలు 12 గంటలకి తమ పనుల ముగించుకొని ఇంటి బాట పట్టారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • rentapalla
    2
    rentapalla
    user_Yekula lakshmanarao Yekula
    Yekula lakshmanarao Yekula
    Tour Guide సత్తెనపల్లె, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనులపై *నేషనల్ హైవే అధికారులు* హుటాహుటిన రంగంలోకి.. *బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగవర్షిత్ రెడ్డి* ఫిర్యాదుతో శుక్రవారం చీఫ్ ఇంజనీర్ ధర్మారెడ్డి, రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ నేతృత్వంలోని బృందం ఆకస్మిక తనిఖీలు... పరిశీలించిన అధికారులు పనుల్లో లోపాలు ఉన్నాయన్న ప్రాథమిక సమాచారం... అధికారులు పలు ప్రాంతాల నుంచి మట్టి,మెటీరియల్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం... నివేదికలో అవకతవకలు తేలితే పెద్దఎత్తున చర్యలు తప్పవని, కాంట్రాక్టర్లపై ఉక్కుపాదం మోపే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ.? నాణ్యత లేని మట్టితో రోడ్లు నిర్మిస్తున్నారని, నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు లాభాలు చేకూరుస్తున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు... నల్లగొండ చుట్టుపక్కల చెరువుల నుంచి మట్టిని తరలించి హైవే పనులకు వినియోగిస్తున్నారని, ఇది భవిష్యత్తులో రోడ్డు కుంగిపోవడానికి దారితీస్తుందని వర్షిత్ రెడ్డి ఫైర్... "రాష్ట్రానికి ఆర్ అండ్ బీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత జిల్లాలోనే ఇలా జరుగుతుంటే మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి" అంటూ ఘాటు విమర్శలు... ఈ వ్యవహారం జిల్లాలో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారగా, మంత్రి సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్... సమాధానం రాకపోతే హైవే పనుల వద్ద మహాధర్నా, చలో కలెక్టరేట్, రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని *బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి* హెచ్చరిక చేశారు...☝️
    1
    నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనులపై *నేషనల్ హైవే అధికారులు* హుటాహుటిన రంగంలోకి..
*బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగవర్షిత్ రెడ్డి* ఫిర్యాదుతో శుక్రవారం చీఫ్ ఇంజనీర్ ధర్మారెడ్డి, రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ నేతృత్వంలోని బృందం ఆకస్మిక తనిఖీలు...
పరిశీలించిన అధికారులు పనుల్లో లోపాలు ఉన్నాయన్న ప్రాథమిక సమాచారం...
అధికారులు పలు ప్రాంతాల నుంచి మట్టి,మెటీరియల్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం...
నివేదికలో అవకతవకలు తేలితే పెద్దఎత్తున చర్యలు తప్పవని, కాంట్రాక్టర్లపై ఉక్కుపాదం మోపే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ.?
నాణ్యత లేని మట్టితో రోడ్లు నిర్మిస్తున్నారని, నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు లాభాలు చేకూరుస్తున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు...
నల్లగొండ చుట్టుపక్కల చెరువుల నుంచి మట్టిని తరలించి హైవే పనులకు వినియోగిస్తున్నారని, ఇది భవిష్యత్తులో రోడ్డు కుంగిపోవడానికి దారితీస్తుందని వర్షిత్ రెడ్డి ఫైర్...
"రాష్ట్రానికి ఆర్ అండ్ బీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత జిల్లాలోనే ఇలా జరుగుతుంటే మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి" అంటూ ఘాటు విమర్శలు...
ఈ వ్యవహారం జిల్లాలో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారగా, మంత్రి సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్...
సమాధానం రాకపోతే హైవే పనుల వద్ద మహాధర్నా, చలో కలెక్టరేట్, రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని *బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి* హెచ్చరిక చేశారు...☝️
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    2 hrs ago
  • నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుభాష్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ గత కొన్ని నెలలుగా పని చేయడం లేదు. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారుల వెంటనే స్పందించి సిగ్నల్స్ మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుభాష్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ గత కొన్ని నెలలుగా పని చేయడం లేదు. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారుల వెంటనే స్పందించి సిగ్నల్స్ మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    8 hrs ago
  • జీవితమరణ సరిహద్దుల్లో నిలిచిన వేళ 108 అంబులెన్స్ సిబ్బంది చూపిన అప్రమత్తత, మానవత్వం ఓ తల్లి, శిశువుకు కొత్త జీవితం అందించింది. బయ్యారం మండలం నామాలపాడు గ్రామానికి చెందిన ఒడిశా కార్మికురాలు రశ్మిత (20)కు గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే 108 సేవలకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ మెరుపువేగంతో చేరుకుంది. ఆసుపత్రికి తరలిస్తుండగానే నొప్పులు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. పరిస్థితి అత్యంత కీలకంగా మారిన వేళ మెడికల్ టెక్నీషియన్ శ్రీను, పైలట్ ఉపేందర్ అప్రమత్తంగా వ్యవహరించి అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపారు. క్షణక్షణం కీలకమవుతున్న పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేసి, అంబులెన్స్‌లోని డెలివరీ కిట్ సహాయంతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. వారి సమయస్ఫూర్తి ఫలితంగా రశ్మిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ కాసిరెడ్డి ఫోన్ ద్వారా నిరంతరం సూచనలు అందిస్తూ కీలక పాత్ర పోషించారు. అనంతరం తల్లికి ఐవీ ఫ్లూయిడ్స్ అందించి, శిశువుకు ఆక్సిజన్ ఇచ్చి, ఇద్దరినీ సురక్షితంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అత్యవసర సమయంలో ప్రాణాల విలువను కాపాడుతూ అద్భుత సేవ అందించిన EMT శ్రీను, పైలట్ ఉపేందర్‌లపై స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
    1
    జీవితమరణ సరిహద్దుల్లో నిలిచిన వేళ 108 అంబులెన్స్ సిబ్బంది చూపిన అప్రమత్తత, మానవత్వం ఓ తల్లి, శిశువుకు కొత్త జీవితం అందించింది. బయ్యారం మండలం నామాలపాడు గ్రామానికి చెందిన ఒడిశా కార్మికురాలు రశ్మిత (20)కు గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే 108 సేవలకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ మెరుపువేగంతో చేరుకుంది.
ఆసుపత్రికి తరలిస్తుండగానే నొప్పులు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. పరిస్థితి అత్యంత కీలకంగా మారిన వేళ మెడికల్ టెక్నీషియన్ శ్రీను, పైలట్ ఉపేందర్ అప్రమత్తంగా వ్యవహరించి అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపారు. క్షణక్షణం కీలకమవుతున్న పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేసి, అంబులెన్స్‌లోని డెలివరీ కిట్ సహాయంతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు.
వారి సమయస్ఫూర్తి ఫలితంగా రశ్మిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ కాసిరెడ్డి ఫోన్ ద్వారా నిరంతరం సూచనలు అందిస్తూ కీలక పాత్ర పోషించారు. అనంతరం తల్లికి ఐవీ ఫ్లూయిడ్స్ అందించి, శిశువుకు ఆక్సిజన్ ఇచ్చి, ఇద్దరినీ సురక్షితంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అత్యవసర సమయంలో ప్రాణాల విలువను కాపాడుతూ అద్భుత సేవ అందించిన EMT శ్రీను, పైలట్ ఉపేందర్‌లపై స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పుట్ట మధు తదితరులు బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరమ్మతులు చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు బోనస్, రైతు బంధు కూడా అమలు కావడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి నీటి భరోసా లభించిందని, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు, అధికారులు నమ్మకం కోల్పోయారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పుట్ట మధు తదితరులు బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరమ్మతులు చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు బోనస్, రైతు బంధు కూడా అమలు కావడం లేదని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి నీటి భరోసా లభించిందని, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు, అధికారులు నమ్మకం కోల్పోయారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ ఒక నినాదంగానే ఉంది. ఇంతకాలానికి చట్టరూపం దాల్చుతోంది. ఇది దేశచరిత్రలో గొప్ప రోజు. మహిళాబిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. మహిళల అభ్యున్నతి దిశగా అడుగులు వేసిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా మహిళలనే ముందు వరుసలో నిలబెట్టిన నాయకుడు మా జగనన్నే. మహిళల మీద దా*డులు, అత్యా*చారాలు, ఆత్మహ*త్యలు ఇవే చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత. -విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త #WomenReservationBill #YSRCPForWomen
    1
    చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ ఒక నినాదంగానే ఉంది. ఇంతకాలానికి చట్టరూపం దాల్చుతోంది. ఇది దేశచరిత్రలో గొప్ప రోజు. మహిళాబిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. మహిళల అభ్యున్నతి దిశగా అడుగులు వేసిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా మహిళలనే ముందు వరుసలో నిలబెట్టిన నాయకుడు మా జగనన్నే. మహిళల మీద దా*డులు, అత్యా*చారాలు, ఆత్మహ*త్యలు ఇవే చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత.
-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త 
#WomenReservationBill
#YSRCPForWomen
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • పెదకూరపాడు : పోలీస్ స్టేషన్ ఆవరణమంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. ఎస్సై గిరిబాబు ఆధ్వర్యంలో రోజూ సిబ్బందితో ఆవరణమంతా మొక్కలు నాటి పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. మొక్కలు నాటడం ద్వారా ఆక్సిజన్ అధికంగా లభించి కాలుష్యం దూరం చేయవచ్చని ఎస్సై గిరిబాబు అన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రతి ఇంటికి ఒక మొక్క నాటి వాతావరణాన్ని కాపాడాలని కోరారు.
    1
    పెదకూరపాడు : పోలీస్ స్టేషన్ ఆవరణమంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. ఎస్సై గిరిబాబు ఆధ్వర్యంలో రోజూ సిబ్బందితో ఆవరణమంతా మొక్కలు నాటి పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. మొక్కలు నాటడం ద్వారా ఆక్సిజన్ అధికంగా లభించి కాలుష్యం దూరం చేయవచ్చని ఎస్సై గిరిబాబు అన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రతి ఇంటికి ఒక మొక్క నాటి వాతావరణాన్ని కాపాడాలని కోరారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • నల్గొండలో సియాన్ యూత్ ఆధ్వర్యంలో విరామ బైబిల్ పాఠశాల టీచర్లకు ఒకరోజు శిక్షణా శిబిరాన్ని స్థానిక టీఎన్జీవోస్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మర్లో చిన్నారులు ఎండలో తెలియకుండా భక్తి వైపు నడిపించాలని పాస్టర్లు కోరారు.
    1
    నల్గొండలో సియాన్ యూత్ ఆధ్వర్యంలో విరామ బైబిల్ పాఠశాల టీచర్లకు ఒకరోజు శిక్షణా శిబిరాన్ని స్థానిక టీఎన్జీవోస్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మర్లో చిన్నారులు ఎండలో తెలియకుండా భక్తి వైపు నడిపించాలని పాస్టర్లు కోరారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    2 hrs ago
  • వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.