logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఐవీఎం సురేష్ విద్యాసేవ అభినందనీయం - 240మంది విద్యార్థులకు రూ.70లక్షలు సహాయం నిరుపేద ప్రతిభావంతులకు ఇండి విలేజ్ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ వేములపల్లి సురేష్ - రోజా దంపతుల సేవలు ప్రశంసనీయం అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య అన్నారు. ఆదివారం చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఐవీఎం డైరెక్టర్ డాక్టర్ వేములపల్లి సురేష్-రోజా 240మంది విద్యార్థులకు రూ.70లక్షలు ఉపకార వేతనాలు, లాప్ టాప్స్ అందచేశారు. కొనకళ్ళ బుల్లయ్య, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర చైర్మన్ చిలకలపూడి పాపారావు, టీడీపీ ఇంచార్జి విక్కుర్తి శ్రీనివాసరావు చెక్కులు పంపిణీ చేశారు.

1 day ago
user_Md.A.K.Jilani
Md.A.K.Jilani
Photographer అవనిగడ్డ, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
1 day ago

ఐవీఎం సురేష్ విద్యాసేవ అభినందనీయం - 240మంది విద్యార్థులకు రూ.70లక్షలు సహాయం నిరుపేద ప్రతిభావంతులకు ఇండి విలేజ్ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ వేములపల్లి సురేష్ - రోజా దంపతుల సేవలు ప్రశంసనీయం అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య అన్నారు. ఆదివారం చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఐవీఎం డైరెక్టర్ డాక్టర్ వేములపల్లి సురేష్-రోజా 240మంది విద్యార్థులకు రూ.70లక్షలు ఉపకార వేతనాలు, లాప్ టాప్స్ అందచేశారు. కొనకళ్ళ బుల్లయ్య, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర చైర్మన్ చిలకలపూడి పాపారావు, టీడీపీ ఇంచార్జి విక్కుర్తి శ్రీనివాసరావు చెక్కులు పంపిణీ చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పాలకొల్లులో.. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సోమంచి శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ ఎంతో నీతి నిజాయితీలతో రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన సేవ చేశారని జీవిత మలిదశలో ఎన్నో అవస్థలకు గురయ్యారని ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఆయనకి భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చిర్రావూరి నరసింహమూర్తి, కార్యదర్శి నందుల దశరథ్ కోశాధికారి గోటేటి వెంకటేశ్వరరావు, సంఘ ఉపాధ్యక్షులు హోతాహరి నారాయణ, సంఘ సభ్యులు వై ప్రభాకర్ శాస్త్రి, మంచిలి సదాశివమూర్తి, దక్షిణామూర్తి, మీడియా ఇంచార్జ్ శివ సత్య రమణ కుమార్, పాల్గొని ఘన నివాళులు అర్పించారు.
    3
    పాలకొల్లులో.. 
టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం
స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 
ఈ సందర్భంగా శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సోమంచి శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ ఎంతో నీతి నిజాయితీలతో రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన సేవ చేశారని జీవిత మలిదశలో ఎన్నో అవస్థలకు గురయ్యారని ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఆయనకి భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చిర్రావూరి నరసింహమూర్తి, కార్యదర్శి నందుల దశరథ్ కోశాధికారి గోటేటి వెంకటేశ్వరరావు, సంఘ ఉపాధ్యక్షులు హోతాహరి నారాయణ, సంఘ సభ్యులు వై ప్రభాకర్ శాస్త్రి,  మంచిలి సదాశివమూర్తి, దక్షిణామూర్తి, మీడియా ఇంచార్జ్ శివ సత్య రమణ కుమార్, పాల్గొని ఘన నివాళులు అర్పించారు.
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బుకింగ్‌కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్‌లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
    1
    తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా బుకింగ్‌కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్‌లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • ***సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం***. రేషన్ బియ్యం పట్టివేత సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం నుంచి ఏపీలోని కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా శనివారం తెల్లవారుజా మున పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో రేషన్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, మధ్యవర్తి ద్వారా కాకినాడకు బియ్యం తరలిం చేందుకు ఆటోలు లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సత్తుపల్లి పోలీసులు దాడులు నిర్వహించగా 25క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం తరలించడానికి ప్రయత్నించిన నక్క వెంకటేశ్వరరావు, మధ్యవర్తి ఏపీకి చెందిన రాజా, కాకినాడకు చెందిన బాబీపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి సివిల్ సప్లై గోదాంకు తరలించారు
    1
    ***సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం***.   రేషన్ బియ్యం పట్టివేత

సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం నుంచి ఏపీలోని కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా శనివారం తెల్లవారుజా మున పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో రేషన్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, మధ్యవర్తి ద్వారా కాకినాడకు బియ్యం తరలిం చేందుకు ఆటోలు లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సత్తుపల్లి పోలీసులు దాడులు నిర్వహించగా 25క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం తరలించడానికి ప్రయత్నించిన నక్క వెంకటేశ్వరరావు, మధ్యవర్తి ఏపీకి చెందిన రాజా, కాకినాడకు చెందిన బాబీపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి సివిల్ సప్లై గోదాంకు తరలించారు
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే బోనాలు తయారు చేసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, కోళ్లు, యాటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
    1
    భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను  ఘనంగా నిర్వహించారు.
నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే బోనాలు తయారు చేసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, కోళ్లు, యాటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • ఖమ్మం: స్థిరంగా ఏసీ మిర్చి ధర... నాన్ ఏసీ మిర్చి, తగ్గిన పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,900, అటు క్వింటా పత్తి ధర రూ.9,100గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 21 శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి రూ.200 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.
    1
    ఖమ్మం: స్థిరంగా ఏసీ మిర్చి ధర... నాన్ ఏసీ మిర్చి, తగ్గిన పత్తి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,900, అటు క్వింటా పత్తి ధర రూ.9,100గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 21 శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి రూ.200 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • బోనమెత్తిన పల్లె... కొత్త కొత్తూరు గ్రామంలో బొడ్రాయికి ప్రత్యేక పూజలు... బోనమెత్తిన పల్లెలు... నేలకొండపల్లి మండలం లోని వివిధ గ్రామాలలో ఆదివారం బోనమెత్తారు. ముత్యాలమ్మ తల్లి పండగ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో, కోలాటం, నృత్యాలతో సందడి చేశారు. బోనాలను ఎత్తుకుని ప్రదర్శన నిర్వహించారు. అమ్మవారికి బోనాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు గ్రామాలలో కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు రాకతో సందడి వాతావరణం నెలకొంది. వర్షాలు సమృద్ధిగా పడాలని... పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని కొత్తకొత్తూరు గ్రామంలో బొడ్రాయి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల * సీతారాములు, సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
    1
    బోనమెత్తిన పల్లె...
 కొత్త కొత్తూరు గ్రామంలో బొడ్రాయికి ప్రత్యేక పూజలు...
బోనమెత్తిన పల్లెలు...
నేలకొండపల్లి
మండలం లోని వివిధ గ్రామాలలో ఆదివారం బోనమెత్తారు.
ముత్యాలమ్మ తల్లి పండగ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో, కోలాటం, నృత్యాలతో సందడి చేశారు. బోనాలను ఎత్తుకుని ప్రదర్శన నిర్వహించారు. అమ్మవారికి బోనాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు గ్రామాలలో కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు రాకతో సందడి వాతావరణం నెలకొంది. వర్షాలు సమృద్ధిగా పడాలని... పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని కొత్తకొత్తూరు గ్రామంలో బొడ్రాయి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల * సీతారాములు, సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
    user_తేజవత్ గిరిబాబు
    తేజవత్ గిరిబాబు
    Local News Reporter Nelakondapalli, Khammam•
    17 hrs ago
  • మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వంపై జనసేనలో తారాస్థాయికి చేరిన అంతర్గత విబేధాలు మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వంపై జనసేనలో అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయి. జనసేనలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో జనసేన నేతలు తన్నులాటకు దిగారు. రెండు రోజుల క్రితం నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ బండి రామకృష్ణ అనుచరుడు గడ్డం రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ అభ్యర్థిత్వం ఆశించిన కొట్టె వెంకట్రావ్ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరైన సమయంలో కొట్టె వెంకట్రావ్ తో వాగ్వివాదానికి దిగిన గడ్డం రాజు. మాటమాట పెరగడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువురికి సర్దుబాటు చేశారు.
    1
    మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వంపై జనసేనలో తారాస్థాయికి చేరిన అంతర్గత విబేధాలు
మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వంపై జనసేనలో అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయి. జనసేనలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి.
ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో జనసేన నేతలు తన్నులాటకు దిగారు. రెండు రోజుల క్రితం నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్  బండి రామకృష్ణ అనుచరుడు గడ్డం రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ అభ్యర్థిత్వం ఆశించిన కొట్టె వెంకట్రావ్
ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరైన సమయంలో కొట్టె వెంకట్రావ్ తో వాగ్వివాదానికి దిగిన గడ్డం రాజు. మాటమాట పెరగడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువురికి సర్దుబాటు చేశారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • పాలకొల్లు లో.. గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ భవన్ కు కనీసం రంగులు కూడా వేయలేని మీకు పాలకొల్లు తో ఏం పని..!? వైసీపీని ప్రశ్నించిన మంత్రి రామానాయుడు
    1
    పాలకొల్లు లో.. గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ భవన్ కు కనీసం రంగులు కూడా వేయలేని మీకు పాలకొల్లు తో ఏం పని..!?
వైసీపీని ప్రశ్నించిన మంత్రి రామానాయుడు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరారం పంచాయతీ పరిధిలోని వావిళ్లపాడు గ్రామానికి చెందిన పీట్ల శ్రీనివాసరావు.. టీవీఎస్ ఎక్సెల్‌పై కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉప్పలచలక సమీపంలోని శివాలయం వద్ద లింగగూడెం లింక్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా.. టోల్‌గేట్ వైపు నుంచి ఎర్రగుంట వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
    1
    లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరారం పంచాయతీ పరిధిలోని వావిళ్లపాడు గ్రామానికి చెందిన పీట్ల శ్రీనివాసరావు.. టీవీఎస్ ఎక్సెల్‌పై కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఉప్పలచలక సమీపంలోని శివాలయం వద్ద లింగగూడెం లింక్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా.. టోల్‌గేట్ వైపు నుంచి ఎర్రగుంట వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.