*పట్టు చీరలకు వీరవరం పెట్టింది పేరు* *తక్కువ ధరకే నాణ్యమైనవి* సంక్రాంతి పండుగ సీజన్ మంచి జోరు మీద ఉంది. వస్త్ర వ్యాపారానికి రాజమహేంద్రవరంకు విశేష గుర్తింపు ఉంది. మరి ఆ రాజమహేంద్రవరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో కడియం మండలం వీరవరం అనే గ్రామం ఉంటుంది.మా ఊరికి దగ్గరగా ఉండే ఈ గ్రామానికి సుదూర ప్రాంతాల నుంచి చీరల కొనడానికి వస్తారంటే నమ్ముతారా...? నమ్మడం కష్టమే. ఎందుకంటే రాజమహేంద్రవరం కంటే మించింది ఎలా ఉంటుంది అనుకుంటారు అందరు. అయితే ఇక్కడ చీరలు వాడిన వారు మాత్రం ఇక్కడికే వస్తుంటారు.ఎంతో నాణ్యమైన చీరలను తక్కువ ధరలకే ఇస్తుంటారు. అలా ఎందుకు ఇస్తారో తెలుసుకుందాము.. ఇక్కడ అద్దాలమేడలు ఉండవు....ఏసీ గదులు ఉండవు...కళ్లు చెదిరే విద్యుత్ కాంతులు ఉండవు...కస్టమర్లకు ఒంగి ఒంగి నమస్కారాలు పెట్టే నౌకరీలు ఉండరు...ఆ షాప్ కి రమ్మని పెద్దపెద్ద ప్రకటనలు ఇవ్వరు... ఇన్ఫిలెన్సర్లు ప్రమోషన్ చేయరు..కంప్యూటర్ బిల్లులుండవు..కలర్ ఫుల్ కవర్లు ఉండవు..న్యూ ఇయర్ క్యాలెండర్స్ ఉండవు.. పని వాళ్లతో పనిలేకుండా భార్య భర్తలు,ఇతర కుటుంబ సభ్యులు కలసి సొంత ఇంట్లోనే ఈ ఖరీదైన పట్టుచీరలను విక్రయిస్తుంటారు.ఆ గ్రామంలో పలు కుటుంబాలు ఎన్నో ఏళ్ల నుంచి ఈ చీరల అమ్మకాలు చేపడుతున్నారు. అసలు ఆ గ్రామంలో చీరలు అమ్మడానికి ప్రత్యేకంగా కారణాలు తెలుసుకుంటే... వీరవరంతో పాటు పరిసర గ్రామాలైన దుళ్ల, మురమండ ప్రాంతలలో వందలాది కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవించేవారు. ఇక్కడ ఒకప్పుడు బలమైన సహకార సంఘాల ద్వారా ఈ చేనేత వస్త్రాల అమ్మకాలు జరిగేవి. ఆ తర్వాత రోజుల్లో ఈ చేనేత ఎలా అంతరించిపోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ గ్రామంలో కూడా అదే జరిగింది.వారికి నష్టాలు రావడం, పట్టు ధరలు పెరిగిపోవడం వంటి కారణాలతో వీరు చేనేత వస్త్రాల తయారీ తగ్గించేశారు.అలా కాదు కానీ ఇంచుమించు మానేశారనే చెప్పాలి. అయితే వీరు తయారు చేసిన ఎన్నో రకాల పట్టు చీరలు ఉప్పాడ,వెంకటగిరి, మంగళగిరి తదితర ప్రాంతాలకు సరఫరా చేసేవారు. అందువల్ల ఆ ప్రాంతంలో వీరికి ఎనలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధం కొనసాగింపుగా వీరికి నేరుగా తయారీదారుల నుంచి చీరలు కొనుగోలు చేసి తక్కువ నిర్వహణ ఖర్చులతో కొనుగోలు దారులకు అమ్మగలుగుతున్నారు. ధరలు ఒక్కటే కాదు నాణ్యతలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది.ఆ నాణ్యత అనేది హలో సేల్ గా కొనుగోలు చేసే షాపింగ్ మాల్స్ వారికి కంటే వీరికే ఎక్కువ తెలుస్తుంది. అదీగాక చేనేత కుటుంబాల వారి పక్షాన్నే తయారు చేసే చేనేత కార్మికులు ఉంటారు. అందుకునే ప్రెస్ స్టాక్ ను వీరు తీసుకొచ్చి అమ్మతూ వినియోగదారుల విశ్వాన్ని చూరగొంటున్నారు.మార్కెట్‌లో ఏడు వేల రూపాయలు ఉండే చీర తమ వద్ద అయిదువేలుకే దొరుకుతుందంటున్నారు బనిశెట్టి శ్రీనివాస్ అనే చీరల వ్యాపారి.

- next ma ycp ra puka1
- *ఏపీలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థత.* *పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ, కాలేజీకి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరు విద్యార్థినులు.* *అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఏరియా ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది.*1
- నల్గొండ పెట్రోల్ బంకుల్లో వన్టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి బుధవారం తరిగిన నిర్వహించారు. నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం అమలులోకి తెచ్చిన తరువాత పెట్రోల్ బంక్ యజమానులు విధానాన్ని అమలుపరుస్తున్నారా లేదా ప్రత్యక్షంగా తనకి చేశారు.1
- మంథని: త్వరలోనే 'డే కేర్ సెంటర్' ప్రారంభం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ డే కేర్ సెంటర్‌ను త్వరలోనే మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో సీనియర్ సిటిజన్స్‌కు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాగా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం పనిచేయనుంది.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఆలయంలో హుండీ దొంగతనం పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు టెక్కలి మండలం బొప్పాయి పురం పంచాయతీ నీలాపురం గ్రామంలో అర్ధరాత్రి వేళ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో దొంగతనాన్ని పాల్పడి ఆలయంలో చొరబడి హుండీ ఎత్తుకెళ్లారు. వేకు జామున దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు1
- వెదిర లో ఓసి సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ ... కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో బుధవారం వాల్పోస్టర్ను సంఘం నాయకులు ఆవిష్కరించారు .ఈ సందర్భంగా రెడ్డి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డి మండల శాఖ అధ్యక్షులు దొడ్డ లచ్చిరెడ్డి మాట్లాడుతూ, ఈనెల 11న వరంగల్లో నిర్వహించే ఓ సి సింహగర్జనకు రెడ్డి వెలమ వైశ్య బ్రాహ్మణ కుల బంధువులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వెధిర గ్రామ ఉపసర్పంచ్ దుద్యాల రాజిరెడ్డి వార్డు సభ్యురాలు కళావతి,శ్రీ రాజరాజేశ్వర శ్రీ వినాయక రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.1
- *ఆహా ఎంత అద్భుతం* ఈ మహానుభావుడు హాస్యాస్పదంగా సాగిన మాటల్లో ఎంత అర్థం సందేశం ఉందో చూడండి.1
- ఎస్ ఆర్ నగర్ పి ఎస్ పరిధిలో గ్రీన్ పార్క్ హోటల్ పక్కన చిన్నారిని ఎత్తుకెళుతూ స్థానికులకు పట్టుబడ్డ ఛత్తీస్‌గఢ్ కు చెందిన దొంగ... నిందితునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు1
- Post by Ravi Poreddy1