logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Eye donation fortnight 2026 program conducted at PHC BHIKANOOR by Ravinder patel ophthalmic officer O/o Dy.Dm&ho Domakonda & participated 30 no.of patients,press reporters ex sarpanch&phc staff. శుభోదయం సార్, ఈరోజు 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవం – 2026 కార్యక్రమం PHC భిక్కనూర్లో నిర్వహించబడింది. ఈ సందర్భంగా నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, దృష్టి లోపంతో బాధపడుతున్న వారికి చూపును పునరుద్ధరించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నేత్రదానం చేయడానికి ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రవీందర్ పటేల్, ఆప్తాల్మిక్ ఆఫీసర్ నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ధన్యవాదాలు సార్.

4 hrs ago
user_Ravinder patel
Ravinder patel
Eye Care Clinic భిక్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
4 hrs ago

Eye donation fortnight 2026 program conducted at PHC BHIKANOOR by Ravinder patel ophthalmic officer O/o Dy.Dm&ho Domakonda & participated 30 no.of patients,press reporters ex sarpanch&phc staff. శుభోదయం సార్, ఈరోజు 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవం – 2026 కార్యక్రమం PHC భిక్కనూర్లో నిర్వహించబడింది. ఈ సందర్భంగా నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, దృష్టి లోపంతో బాధపడుతున్న వారికి చూపును పునరుద్ధరించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నేత్రదానం చేయడానికి ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రవీందర్ పటేల్, ఆప్తాల్మిక్ ఆఫీసర్ నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ధన్యవాదాలు సార్.

More news from తెలంగాణ and nearby areas
  • ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందని తెలిసి.. రైతుల పరుగులు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా చేరిందన్న సమాచారంతో రైతులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు గంటల తరబడి క్యూలో నిలబడి ఎరువుల కోసం ఎదురుచూశారు. వరి నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు కీలక సమయంలో ఎరువు కోసం ఇలా రోజుల తరబడి తిరగాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. తమ అవసరాలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
    1
    ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందని తెలిసి.. రైతుల పరుగులు
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా చేరిందన్న సమాచారంతో రైతులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు గంటల తరబడి క్యూలో నిలబడి ఎరువుల కోసం ఎదురుచూశారు. వరి నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు కీలక సమయంలో ఎరువు కోసం ఇలా రోజుల తరబడి తిరగాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. తమ అవసరాలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • సిరికొండ మండల కేంద్రంలో చిన్నారులతో హనుమాన్ చాలీసా పారాయణం మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో మంగళవారం చిన్నారులతో హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చిన్నారులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రతి మంగళవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.
    1
    సిరికొండ మండల కేంద్రంలో చిన్నారులతో హనుమాన్ చాలీసా పారాయణం
మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో మంగళవారం చిన్నారులతో హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చిన్నారులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రతి మంగళవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.
    user_RC REDDY
    RC REDDY
    Local News Reporter Nizamabad Rural, Telangana•
    19 hrs ago
  • కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బెజ్జంకి మండలం నేతలు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కరివేద మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగే పోరాటానికి బీజేపీ శ్రేణులతో కలిసి తరలివెళ్తున్నామని ప్రకటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆడిచర్ల రాజు, బీజేవైఎం నాయకులు సంఘ నరేష్, విమల్ కుమార్, గుంజేటి శివకుమార్, రావుల రాజిరెడ్డి, బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షులు గైని రాజుతో పాటు బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
    1
    కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బెజ్జంకి మండలం నేతలు
బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం  సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా కరివేద మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగే పోరాటానికి బీజేపీ శ్రేణులతో కలిసి తరలివెళ్తున్నామని ప్రకటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆడిచర్ల రాజు, బీజేవైఎం నాయకులు సంఘ నరేష్, విమల్ కుమార్, గుంజేటి శివకుమార్, రావుల రాజిరెడ్డి, బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షులు గైని రాజుతో పాటు బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యార్థుల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    22 hrs ago
  • మల్కాజ్‌గిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, స్వామివారి దర్శనానికి స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు.
    1
    మల్కాజ్‌గిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా
మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, స్వామివారి దర్శనానికి స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    2 hrs ago
  • బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయం ఎదుట బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న దేశపాండేకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షామీర్‌పేట్ నివాసంలో దేశపాండేను కలిసిన ఈటల, బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు.
    1
    బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయం ఎదుట బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న దేశపాండేకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షామీర్‌పేట్ నివాసంలో దేశపాండేను కలిసిన ఈటల, బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు.
    user_FOCUS MEDIA
    FOCUS MEDIA
    Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    6 hrs ago
  • ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని  బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలని.. వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. అటవీ శాఖ ఆద్వర్యంలో గంభీరావుపేట మండలం గోరంటాల బీట్ పరిధి గజ సింగవరం శివారులో మంగళవారం వన మహోత్సవం కింద మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మొక్కలు నాటి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అడవులను అందరూ సంరక్షించాలని పిలుపు నిచ్చారు. దీంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలిపారు. అడవులతోనే వర్షాలు కురుస్తాయని వివరించారు. అటవీ విస్తీర్ణం తగ్గడంతో వన్యప్రాణులు, పక్షుల మనుగడకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వన్యప్రాణులు ఇండ్లలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వివరించారు. జిల్లా మొత్తం లక్ష్యం 8,65,200 కాగా, 6,89, 212 మొక్కలు నాటి.. 79.66 శాతం లక్ష్యం పూర్తి చేశామని వెల్లడించారు. వన మహోత్సవంలో భాగంగా రెండు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికి మూడు నుంచి ఐదు మొక్కలు పంపిణీ చేస్తామని, అందరూ నాటి సంరక్షించాలని పిలుపు నిచ్చారు. మునగ మొక్కలు నాటాలని, దీంతో ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఇంటికి ఇచ్చిన తడి, పొడి చెత్త బుట్టలను సద్వినియోగం చేసుకోవాలని, ఇంటి నుంచే చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లు వాడటంతో పర్యావరణ ఇబ్బందులు వస్తున్నాయని, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మార్కెట్, షాపుకి వెళ్లినప్పుడు బట్ట సంచితో వెళ్లాలని తెలిపారు. ప్రతి ఇంట్లో, అన్ని ఫంక్షన్లలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమురిశెట్టి విజయ, సర్పంచ్ లతిక, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
    1
    పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలని.. వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. 

అటవీ శాఖ ఆద్వర్యంలో గంభీరావుపేట మండలం గోరంటాల బీట్ పరిధి గజ సింగవరం శివారులో మంగళవారం వన మహోత్సవం కింద మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మొక్కలు నాటి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అడవులను అందరూ సంరక్షించాలని పిలుపు నిచ్చారు. దీంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలిపారు. అడవులతోనే వర్షాలు కురుస్తాయని వివరించారు. అటవీ విస్తీర్ణం తగ్గడంతో వన్యప్రాణులు, పక్షుల మనుగడకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వన్యప్రాణులు ఇండ్లలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే పర్యావరణ సమస్యలు 
తలెత్తుతున్నాయని వివరించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వివరించారు. జిల్లా మొత్తం లక్ష్యం 8,65,200 కాగా, 6,89, 212 మొక్కలు నాటి.. 79.66 శాతం లక్ష్యం పూర్తి చేశామని వెల్లడించారు. వన మహోత్సవంలో భాగంగా రెండు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికి మూడు నుంచి ఐదు మొక్కలు పంపిణీ చేస్తామని, అందరూ నాటి సంరక్షించాలని పిలుపు నిచ్చారు. మునగ మొక్కలు నాటాలని, దీంతో ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఇంటికి ఇచ్చిన తడి, పొడి చెత్త బుట్టలను సద్వినియోగం చేసుకోవాలని, ఇంటి నుంచే చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లు వాడటంతో పర్యావరణ ఇబ్బందులు వస్తున్నాయని, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మార్కెట్, షాపుకి వెళ్లినప్పుడు బట్ట సంచితో వెళ్లాలని తెలిపారు. ప్రతి ఇంట్లో, అన్ని ఫంక్షన్లలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడాలని పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమురిశెట్టి విజయ, సర్పంచ్ లతిక, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
  • పరిశ్రమ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థ జలాలతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు చేగుంట మండలం పోలంపల్లి గ్రామ శివారులోని డేకర్ పేపర్ మిల్ లిమిటెడ్ పరిశ్రమలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థ జలాలతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు పీసీబీ ఏఈ పద్మావతి తెలిపారు. పరిశ్రమ పరిసరాల నుంచి నీటి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు ఆమె వెల్లడించారు. పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
    1
    పరిశ్రమ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థ జలాలతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు 
చేగుంట మండలం పోలంపల్లి గ్రామ శివారులోని డేకర్ పేపర్ మిల్ లిమిటెడ్ పరిశ్రమలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థ జలాలతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు పీసీబీ ఏఈ పద్మావతి తెలిపారు. పరిశ్రమ పరిసరాల నుంచి నీటి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు ఆమె వెల్లడించారు. పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • జమ్మిగడ్డలో గార్డెన్ల తొలగింపునకు కాలనీ వాసుల స్వచ్ఛంద నిర్ణయం జమ్మిగడ్డ సాయిలోక్ కాలనీలో ఇరుకైన రోడ్లపై ఇళ్ల ముందు ఏర్పాటు చేసిన గార్డెన్లతో వాహనాలు, అంబులెన్సుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కాలనీ అసోసియేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అధ్యక్షుడు ఎన్. శంకర్, జనరల్ సెక్రటరీ ఎన్. సురేష్ ఆధ్వర్యంలో గార్డెన్ల తొలగింపు డ్రైవ్ ప్రారంభించారు. అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దల సూచనతో పలువురు తమ ఇళ్ల వద్ద గార్డెన్లను స్వచ్ఛందంగా తొలగించారు. ఇతర కాలనీలు కూడా ఇదే విధంగా ముందుకు రావాలని కోరారు.
    1
    జమ్మిగడ్డలో గార్డెన్ల తొలగింపునకు కాలనీ వాసుల స్వచ్ఛంద నిర్ణయం
జమ్మిగడ్డ సాయిలోక్ కాలనీలో ఇరుకైన రోడ్లపై ఇళ్ల ముందు ఏర్పాటు చేసిన గార్డెన్లతో వాహనాలు, అంబులెన్సుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కాలనీ అసోసియేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అధ్యక్షుడు ఎన్. శంకర్, జనరల్ సెక్రటరీ ఎన్. సురేష్ ఆధ్వర్యంలో గార్డెన్ల తొలగింపు డ్రైవ్ ప్రారంభించారు. అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దల సూచనతో పలువురు తమ ఇళ్ల వద్ద గార్డెన్లను స్వచ్ఛందంగా తొలగించారు. ఇతర కాలనీలు కూడా ఇదే విధంగా ముందుకు రావాలని కోరారు.
    user_FOCUS MEDIA
    FOCUS MEDIA
    Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.