ఘనంగా ‘ఆదివాసీ రేలా ఉత్సవాల’ లోగో ఆవిష్కరణ మే 24, 25, 26 తేదీల్లో ఉత్సవాలను జయప్రదం చేయండి* *👉 – లోతా రామారావు పిలుపు* *రంపచోడవరం, ఏప్రిల్,18* అల్లూరి సీతారామరాజు జిల్లా (రంపచోడవరం) కేంద్రంగా మే నెల 24, 25, 26 తేదీలలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న *‘ఆదివాసీ రేలా ఉత్సవాల లోగోను* ఈరోజు అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జి రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ గారు, ఐటిడిఏ పి.ఓ స్మరణ రాజ్ గారు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, జిల్లా కార్యదర్శి పులి సంతోష్* మరియు ఇతర గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోతా రామారావు గారు మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ రేలా ఉత్సవాలు ఒక గొప్ప వేదిక అని కొనియాడారు అంతరించిపోతున్న ఆదివాసీ కళలు, భాషలు మరియు ఆచారాలను భావి తరాలకు అందించడం అనీ,వివిధ తెగలకు చెందిన ఆదివాసీలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతను చాటడం. ఆదివాసీల హక్కులు, అటవీ సంరక్షణ మరియు సామాజిక అభివృద్ధిపై అవగాహన కల్పించడం. గిరిజన సంప్రదాయ నృత్యాలు (రేలా, ధింసా), హస్తకళలు మరియు అడవి ఉత్పత్తుల ప్రదర్శన. *"ప్రకృతిని ఆరాధించే ఆదివాసీ జీవన విధానం అద్భుతమైనది. ఈ ఉత్సవాల ద్వారా మన మూలాలను గౌరవించుకుందాం.అని లోతా రామారావు, పిలుపునిచ్చారు మే నెలలో మూడు రోజుల పాటు జరిగే ఈ చారిత్రాత్మక ఉత్సవాలకు ఆదివాసీ మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు మరియు ప్రజలు వేలాదిగా తరలివచ్చి దిగ్విజయం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం కోరుతోంది. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమాల్ రెడ్డి, కాకా అర్జున్,పూనెం.ప్రదీప్, కారం సుందరయ్య, సోంది రామారావు, కారం నాగేష్, పూనెం.వెంకటరావు, సాధన విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు...

- Post by Ramprasad islavath1
- Post by Shyam1
- .పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన ఓ నిరుపేద కూలీని దురదృష్టం వెన్నాడింది. తేనె అనుకుని పొరపాటున పురుగుల మందు తాగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాకు చెందిన హిడ్మా సోరి (46), మామిడికాయలు కోసే పని నిమిత్తం కురవి మండలం బలపాల గ్రామానికి వలస వచ్చాడు. ప్రతిరోజూ రాత్రి సమయంలో తేనె తాగే అలవాటు ఉన్న హిడ్మా సోరి.. నిన్న రాత్రి 8 గంటల సమయంలో చీకట్లో పొరపాటు పడ్డాడు. తేనె డబ్బాకు బదులుగా పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బాను తీసి తాగాడు. గంట తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. తాను తాగింది పురుగుల మందని గుర్తించాడు. వెంటనే తన బంధువులకు విషయం తెలపడంతో, వారు అతడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGM ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో తెల్లవారుజామున 1:30 గంటలకు హిడ్మా సోరి తుదిశ్వాస విడిచాడు. మృతుని అల్లుడు ముడమి దేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతుడి కుటుంబం అత్యంత పేదరికంలో ఉండటం, మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించే స్తోమత లేకపోవడంతో కురవి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. కురవి రెండో ఎస్సై జయకుమార్, మృతదేహాన్ని తరలించే ఖర్చుల నిమిత్తం తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీలు హరిబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కూలీ మృతి పట్ల స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి1
- 🙏😭1
- 🙏😭1
- డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- మహిళా బిల్లుకు కాంగ్రెస్ అడ్డుగోడ..? నేలకొండపల్లిలో బీజేపీ ఆగ్రహ జ్వాలలు.. పొట్టి శ్రీరాములు సెంటర్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు. మహిళల హక్కులను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపాటు నేలకొండపల్లి బిజెపి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్... మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు నేలకొండపల్లిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకోవటంతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకుడు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగమైన మహిళలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళల అభివృద్ధి, సాధికారతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్, అసలు సమయంలో మాత్రం మహిళల హక్కులకు విరుద్ధంగా వ్యవహరించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మహిళల ఆశయాలను నీరుగార్చిందని తీవ్రంగా దుయ్యబట్టారు. బిజెపి జిల్లా నాయకుడు. నున్న రవి కుమార్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మహిళలు పోరాడుతున్న రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మహిళల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదే మహిళల హక్కులను నిర్లక్ష్యం చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ వైఖరిని దేశవ్యాప్తంగా మహిళలు ఖండిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మహిళల గౌరవం, సమాన హక్కుల కోసం బీజేపీ కట్టుబడి ఉందని, అన్ని పక్షాలను ఏకం చేసి మహిళా బిల్లును తప్పనిసరిగా ఆమోదింపజేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో మండల బీజేపీ అధ్యక్షులు పాగర్తి సుధాకర్ తో పాటుగా నాయకులు కార్యకర్తలు మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు బిజెపి సీనియర్ నాయకులు భావనాసి దుర్గారావు బిజెపి నాయకులు సూరేపల్లి గ్యానరత్నం కొండ హర్షవర్ధన్ కే స్వామి దాస్ ఎలిగేటి గిరి కందరబోయిన గోపి బిజెపి మైనార్టీ మోర్చా స్టేట్ ఈసీ నెంబర్ ఎస్కే షర్ఫుద్దీన్ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణ ఎలిగేటి వెంకటేష్ ఎస్సీ మోర్చా గుండె పొంగు క్రాంతి తోకటి నాగ చారి ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు తేజావత్ నాగరాజు పాల్గొన్నారు.3
- Post by Ramprasad islavath1