మెట్ పల్లిలో నూతన జూనియర్ సివిల్ జడ్జి బాధ్యతల స్వీకారం... మెట్ పల్లి ఎప్రిల్: 30 జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి కోర్టుకు నూతన జూనియర్ సివిల్ జడ్జిగా వి. మాధవి బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న నారం అరుణ్ కుమార్‌ను రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు కు బదిలీ చేయగా, ఖమ్మం జిల్లా మూడవ అదనపు కోర్టు మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తున్న మాధవి మెట్‌పల్లికి బదిలీపై వచ్చారు. గురువారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి రాంరెడ్డి మొక్క అందించి ఆమెకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, క్రీడా కార్యదర్శి నీరటి రమణ, జూనియర్ ఈసీ సభ్యురాలు మాలేపు సంధ్య రాణి, న్యాయవాదులు కోటగిరి వెంకట స్వామి, చైతన్య, సత్యనారాయణ, మన్నె గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
మెట్ పల్లిలో నూతన జూనియర్ సివిల్ జడ్జి బాధ్యతల స్వీకారం... మెట్ పల్లి ఎప్రిల్: 30 జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి కోర్టుకు నూతన జూనియర్ సివిల్ జడ్జిగా వి. మాధవి బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న నారం అరుణ్ కుమార్‌ను రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు కు బదిలీ చేయగా, ఖమ్మం జిల్లా మూడవ అదనపు కోర్టు మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తున్న మాధవి మెట్‌పల్లికి బదిలీపై వచ్చారు. గురువారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి రాంరెడ్డి మొక్క అందించి ఆమెకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, క్రీడా కార్యదర్శి నీరటి రమణ, జూనియర్ ఈసీ సభ్యురాలు మాలేపు సంధ్య రాణి, న్యాయవాదులు కోటగిరి వెంకట స్వామి, చైతన్య, సత్యనారాయణ, మన్నె గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
- జగిత్యాల జిల్లా కోరుట్ల, పట్టణంలోని చారిత్రక గడి బురుజులు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన గ్రామ కంఠం, ఆబాదీ భూములపై భూ మాఫియా కన్నుపడి నకిలీ దస్తావేజులు, అనుమానాస్పద వీఎల్టీల ఆధారంగా ఈ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చే కుట్ర జరుగుతుంది కావున జగిత్యాల జిల్లా కోరుట్ల గడి స్థలాల రక్షణకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు అక్కడ వేసిన విఎల్టీల రద్దుకు బిజేపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంతకాలతో సిద్దం..*ఇక మిగిలింది కాంగ్రెస్ కౌన్సిలర్లు వారు కూడా పెడితే కోరుట్ల ప్రజల విజయం. కలుగుతుంది పురాతన గడి బురుజులు, కోనేరు వాటి స్థలాలు రక్షించాలని అక్కడ ప్రతి సంవత్సరం జరిగే విజయదశమి, బతుకమ్మ, గణేష్, మొహరం ఉత్సవాలు యదావిధిగా కొనసాగించాలని మరియు ఆ స్థలాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ మార్కెట్, ఆహ్లాదకరమైన పార్కు, మైసమ్మ, హనుమాన్ దేవాలయాల తో పాటు నిరంతరం ఎగిరే జాతీయ జెండా ఆవిష్కరించాలని గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న ఉద్యమాలకు ఇన్ని రోజులు అక్కడ నిషేధం కొనసాగింది కానీ ఈమధ్య మున్సిపల్ కమిషనర్ తప్పిదం వల్ల నకిలీ దస్తావేజులతో అక్రమ విఎల్టీలు వేసి ప్రజల ఆకాంక్షలను చెల్లాచెదురు చేసిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని ఆ విఎల్ టి లను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా చేసిన నిరసన దీక్షల అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులకు బిజేపి, బిఆర్ ఎస్ కౌన్సిలర్ లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమంలో మొదటి రోజు బీజేపీ కౌన్సిలర్లు తమ సంతకాలు చేసి పూర్తి మద్దతు ప్రకటించగా, నేడు బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా సంతకాల కార్యక్రమంలో పాల్గొని గడి బురుజు భూముల రక్షణకు తమ మద్దతు తెలిపారు. వీఎల్టీల రద్దు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని గడి బురుజు భూములు ఎవరి స్వంతం కాదు ఇది ప్రజల ఆస్తి… ప్రజల హక్కు అని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గడి బురుజు భూములు ప్రజల ఆస్తి అని, అవినీతి దస్తావేజులతో వాటిని ఆక్రమించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాపాడటానికి ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తామని వారు తెలిపారు.ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం. డాక్టర్ పేట భాస్కర్, ఎండి ముజాహిద్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, చింత భూమేశ్వర్, సుతారి రాములు, భూపెల్లి నగేశ్, షాహేద్ మహ్మద్ షేక్, కుంచెం శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.1
- అన్నదాత ఆవేదన...1
- Post by Venu Gopal1
- జన్నారం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ, బస్టాండ్, తదితర ప్రాంతాలలో సిపిఎం, సీఐటీయూ, ఐద్వా మహిళా సంఘం నాయకులు మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న, సిఐటియు నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షులు పోతు విజయశంకర్, సిపిఎం నాయకులు జయక్క, రాజన్న, పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు.1
- రైతులు పండించిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జన్నారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. అకాల వర్షాల భయంతో రైతులు వణుకుతున్నారని, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను వెంటనే సేకరించాలి. తేమ శాతం నెపంతో రైతులను ఇబ్బంది పెట్టకూడదు. రైతులకు సకాలంలో మద్దతు ధర చెల్లించాలి. పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు జి. మధుసూదన్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కొంతం శంకరయ్య, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు బద్రి నాయక్, పొనకల్ ఉప సర్పంచ్ అప్పల జలపతి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పవన్ యాదవ్ పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పిట్టల రాజారావు, మాజీ మండలాధ్యక్షుడు గోలిచందు, వీరాచారి, బీజేవైఎం అధ్యక్షుడు కందుల రమేష్ మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మేడే 140 కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.3
- ముధోల్ ప్రాజెక్ట్ లో ముదురుతున్న అంగన్వాడి టీచర్స్ వివాదం... " ముధోల్ అంగన్వాడి స్కామ్" CVR NEWS కథనం పై స్పందించిన ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్లు... బాసర అంగన్వాడీ సెక్టర్ లోని సూరెల్లి గ్రామ అంగన్వాడి ఆయమ్మ చనిపోతే మేమంతా డబ్బులు జమచేసి కుటుంబాన్ని ఆదుకున్నాం.. అది అవినీతి ఎలా అవుతుంది..?? కొందరు అంగన్వాడి టీచర్స్ లను కలుపుకుని కావాలనే మాపై పని గట్టుకుని అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శ... కార్మిక సంఘం నేతల ఆదేశాలు పాటించకుంటే, మీటింగ్ లకు హాజరు కాకుంటే ఫైన్ లు వేస్తున్నారని..! మేము ఎలాంటి కార్మిక సంఘాలలో లేమని తేల్చి చెప్పిన ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్స్... కలసి కట్టుగా పనిచేసి అవినీతి కి తావు లేకుండా, అంగన్వాడి లను అభివృద్ధి చేసుకుందామని, ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చవద్దని తెలిపిన అంగన్వాడి టీచర్స్... జిల్లా కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ అధికారిణి కి తమ వినతి పత్రాన్ని అందించిన సుమారు 170 మంది ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్స్...4
- Post by Venu Gopal1