రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ప్రారంభం రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణ యాగం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తదనంతరం మంత్రులు వరుణ యాగంలో పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ వరుణ యాగంలో ప్రతిరోజూ ప్రత్యేక హోమాలు, వేదపారాయణాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ప్రారంభం రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణ యాగం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ
కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం వారు శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తదనంతరం మంత్రులు వరుణ యాగంలో పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్
గరిమ అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ వరుణ యాగంలో ప్రతిరోజూ ప్రత్యేక హోమాలు, వేదపారాయణాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
- వేములవాడలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. బండ్ పార్క్ ప్రారంభం – బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన – బాసరకు నూతన బస్సు ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు వద్ద నిర్మించిన బండ్ పార్క్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డా. సంజయ్, మేడిపల్లి సత్యం సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం వేములవాడ బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేములవాడ–బాసర మధ్య నూతన ఆర్టీసీ బస్సును మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- రగుడు కలెక్టరేట్ జంక్షన్ అభివృద్ధి సుందరీ కరణ పనుల మరియు బస్సు సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడి న మున్సిపల్ చైర్పర్సన్ రగుడు కలెక్టరేట్ జంక్షన్ అభివృద్ధి సుందరీ కరణ పనుల మరియు బస్ షెల్టర్ల ప్రారంభోత్సవ మహోత్సవ కార్యక్రమలలో భాగంగా నిర్వహించిన సభ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి సభ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , అడ్లరి లక్ష్మణ్ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , శాసనసభ్యులు మేడిపల్లి సత్యం , కవ్వంపల్లి సత్యనారాయణ , రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి , జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ , ఎస్పీ మహేష్ గీతే , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన సిరిసిల్ల అభివృద్ధిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ చౌరస్తా అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దాదాపు 3 కోట్ల 22.50 లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి పనులను ప్రారంభించగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సుందరంగా ఈ కలెక్టరేట్ చౌరస్తాను రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా సిరిసిల్ల అంటే వస్త్ర పరిశ్రమ చేనేత రంగం ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తుంది వస్త్ర పరిశ్రమకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన సిరిసిల్ల పట్టణంలో ప్రధాన చౌరస్తా అయినా కలెక్టరేట్ చౌరస్తాలో వస్త్ర పరిశ్రమకు చెందిన పద్మశాలి కులవృత్తులను తెలియజేసేలా వస్త్రం తయారీ యొక్క ప్రతి ఒక్క దశను వివరించేలా చక్కటి కళ ఆకృతులతో చౌరస్తాను తీర్చిదిద్దినందుకు ప్రభుత్వానికి మరియు ఇక్కడ ఇంత చక్కటి విశాలమైన చౌరస్తా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసిన శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావుకి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులకు, ప్రభుత్వ విప్ కి, శాసనసభ్యులకు, జిల్లా కలెక్టర్ కి ఎస్పీ కి ఇతర హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏం సి చైర్మన్ , కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు ప్రజలు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లో పౌర హక్కుల దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహశీల్దార్ పుష్పలత ఆధ్వర్యంలో సర్పంచ్ గండి నారాయణ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి హాజరయ్యారు.ఈ సందర్భంగా అంటరానితనం నిర్ములనకై ప్రజలందరు సోదరభావముతో కలిసి మెలిసి ఉండాలని అన్నారు.అంటరాని తనం గురించి అవగాహన కలిపించారు.ప్రతి ఒక్కరు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని సూచించారు. చెరువులు కుంటల వద్దకు ప్రజలు వెళ్లకూడదని సూచించారు.విద్యుత్ పరికరాలను తడి చేతులతో ముట్టకూడదని సూచించారు.వర్షాల కారణంగా ఏవైనా సమస్యలు ఎదురావుతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈకార్యక్రమంలో, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,ఆర్ఐ శ్యామ్,వార్డు మెంబర్లు గుగ్గిళ్ల వెంకటేష్,పుదరి మహిపాల్,నాయకులు గడ్డం శ్రీనివాస్,దాసరి గంగరాజం,లింగంపెళ్లి నిఖిల్,కార్యదర్శి స్వామి, జిపిఓ సంతోష్,కరోబర్ రాజేశం,పాల్గొన్నారు....1
- ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్ ఆర్టీసీ.. కరీంనగర్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు శ్రీకారం..మొదటి దశలో మూడు రూట్లలో సేవలు త్వరలో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు విస్తరణ పేదల సంక్షేమం.. ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యం.. సిటీ బస్సులను విద్యార్థులు మహిళలు ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలి.. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నగర ప్రజలకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను ఘనంగా ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మమేకమయ్యారు. మొదటి దశలో కరీంనగర్–వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్–చింతకుంట, కరీంనగర్–కొత్తపల్లి హవేలీ రూట్లలో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సిటీ బస్సుల డిమాండ్‌ను నెరవేర్చామని తెలిపారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతిరోజూ ఉపాధి కోసం చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు వచ్చే కార్మికులు, ఉద్యోగులు, అలాగే వాగేశ్వరి, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు కూడా సిటీ బస్సు సేవలను విస్తరిస్తామని ప్రకటించారు. ప్రయాణికుల ఆదరణను బట్టి అవసరమైతే ఒకే రూట్‌లో అదనపు బస్సులు నడపడంతో పాటు, 24 గంటల సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు దశలవారీగా సిటీ బస్సు సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.వికాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశామని, ఆర్టీసీ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. కొత్త బస్సుల కొనుగోలు, కొత్త నియామకాలు, కారుణ్య నియామకాలు, కార్మికుల పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగుల సంక్షేమం వంటి చర్యలతో సంస్థను బలోపేతం చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని, ప్రతి గ్రామానికి ఆర్టీసీ సేవలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు అంకితభావంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నారని కొనియాడారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కరీంనగర్ నగర ప్రజలు సిటీ బస్సులను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు స్పందించి సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణతోనే ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ప్రజలకు చేరువయ్యే రవాణా సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల వరకు సిటీ బస్సులు ఏర్పాటు చేయడం హర్షణీయమని, తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పి, ఏఎమ్ & లీగల్) కె. రాజశేఖర్ రీజినల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్. భూపతిరెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (మెకానికల్) పి. మల్లేశం, కరీంనగర్ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి బావ్ రావు, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, డిపో మేనేజర్లు ఐ. విజయమాధురి (కరీంనగర్-1), ఎం. శ్రీనివాస్ (కరీంనగర్-2), ఎ. ప్రకాశ్‌రావు (సిరిసిల్ల), బి. శ్రీనివాస్ (వేములవాడ), ఎన్. రమేశ్ (జగిత్యాల), డి. హరి (మెట్‌పల్లి)తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కరీంనగర్ పట్టణంలో సిటీ బస్సులను ప్రారంబించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించడానికి కరీంనగర్ బస్ స్టేషన్ లో సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు. కరీంనగర్ పట్టణంలో చాలా కాలంగా డిమాండ్ ఉన్న సిటీ బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతిరోజు ఉపాధి కొరకు కరీంనగర్ నుండి వచ్చే చింతకుంట , ఓద్యారం, కొత్తపల్లి ,విద్యా సంస్థలకు నిలయమైన వాగేశ్వరి వైపు ఈ సిటీ బస్సు సర్వీసులు నడిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం , కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా , ముఖ్య నేతలు ,అధికారులు పాల్గొన్నారు.2
- గౌరవెల్లి ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ..... కాంగ్రెస్ పార్టీ నేతల సంబరాలు హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతుల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేయడంతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురైన ప్రధాన అడ్డంకులు తొలగాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా వివిధ న్యాయపరమైన వివాదాల కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు తిరిగి వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది. గతంలో పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని కొందరు భూ నిర్వాసితులు సుప్రీంకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ), వనశక్తి సంస్థల్లో పిటిషన్లు దాఖలు చేయడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టతతో ప్రస్తుతం సుమారు 95 శాతం పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. 8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షా 20 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశముంది. దీంతో హుస్నాబాద్ ప్రాంతంలోని రైతులకు శాశ్వత సాగునీటి వసతి కలిగి వ్యవసాయాభివృద్ధికి ఊతమివ్వనుంది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలితంగానే ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకులు తొలగి నిర్మాణానికి మార్గం సుగమమైందని వారు పేర్కొన్నారు.2
- భారీ వర్షాలతో కోరుట్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, కమిషనర్ రాఘవేంద్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు."1
- తిప్పాపూర్ మూలవాగులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ మూలవాగు వద్ద గంగమ్మ తల్లికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డా. సంజయ్, మేడిపల్లి సత్యం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.1