రగుడు కలెక్టరేట్ జంక్షన్ అభివృద్ధి సుందరీ కరణ పనుల మరియు బస్సు సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడి న మున్సిపల్ చైర్పర్సన్ రగుడు కలెక్టరేట్ జంక్షన్ అభివృద్ధి సుందరీ కరణ పనుల మరియు బస్ షెల్టర్ల ప్రారంభోత్సవ మహోత్సవ కార్యక్రమలలో భాగంగా నిర్వహించిన సభ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి సభ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , అడ్లరి లక్ష్మణ్ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , శాసనసభ్యులు మేడిపల్లి సత్యం , కవ్వంపల్లి సత్యనారాయణ , రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి , జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ , ఎస్పీ మహేష్ గీతే , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన సిరిసిల్ల అభివృద్ధిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ చౌరస్తా అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దాదాపు 3 కోట్ల 22.50 లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి పనులను ప్రారంభించగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సుందరంగా ఈ కలెక్టరేట్ చౌరస్తాను రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా సిరిసిల్ల అంటే వస్త్ర పరిశ్రమ చేనేత రంగం ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తుంది వస్త్ర పరిశ్రమకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన సిరిసిల్ల పట్టణంలో ప్రధాన చౌరస్తా అయినా కలెక్టరేట్ చౌరస్తాలో వస్త్ర పరిశ్రమకు చెందిన పద్మశాలి కులవృత్తులను తెలియజేసేలా వస్త్రం తయారీ యొక్క ప్రతి ఒక్క దశను వివరించేలా చక్కటి కళ ఆకృతులతో చౌరస్తాను తీర్చిదిద్దినందుకు ప్రభుత్వానికి మరియు ఇక్కడ ఇంత చక్కటి విశాలమైన చౌరస్తా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసిన శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావుకి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులకు, ప్రభుత్వ విప్ కి, శాసనసభ్యులకు, జిల్లా కలెక్టర్ కి ఎస్పీ కి ఇతర హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏం సి చైర్మన్ , కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు ప్రజలు పాల్గొన్నారు.
రగుడు కలెక్టరేట్ జంక్షన్ అభివృద్ధి సుందరీ కరణ పనుల మరియు బస్సు సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడి న మున్సిపల్ చైర్పర్సన్ రగుడు కలెక్టరేట్ జంక్షన్ అభివృద్ధి సుందరీ కరణ పనుల మరియు బస్ షెల్టర్ల ప్రారంభోత్సవ మహోత్సవ కార్యక్రమలలో భాగంగా నిర్వహించిన సభ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి సభ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , అడ్లరి లక్ష్మణ్ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , శాసనసభ్యులు మేడిపల్లి సత్యం , కవ్వంపల్లి సత్యనారాయణ , రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి , జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ , ఎస్పీ మహేష్ గీతే , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన సిరిసిల్ల అభివృద్ధిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ చౌరస్తా అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దాదాపు 3 కోట్ల 22.50 లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి పనులను ప్రారంభించగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సుందరంగా ఈ కలెక్టరేట్ చౌరస్తాను రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా సిరిసిల్ల అంటే వస్త్ర పరిశ్రమ చేనేత రంగం ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తుంది వస్త్ర పరిశ్రమకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన సిరిసిల్ల పట్టణంలో ప్రధాన చౌరస్తా అయినా కలెక్టరేట్ చౌరస్తాలో వస్త్ర పరిశ్రమకు చెందిన పద్మశాలి కులవృత్తులను తెలియజేసేలా వస్త్రం తయారీ యొక్క ప్రతి ఒక్క దశను వివరించేలా చక్కటి కళ ఆకృతులతో చౌరస్తాను తీర్చిదిద్దినందుకు ప్రభుత్వానికి మరియు ఇక్కడ ఇంత చక్కటి విశాలమైన చౌరస్తా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసిన శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావుకి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులకు, ప్రభుత్వ విప్ కి, శాసనసభ్యులకు, జిల్లా కలెక్టర్ కి ఎస్పీ కి ఇతర హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏం సి చైర్మన్ , కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు ప్రజలు పాల్గొన్నారు.
- తిప్పాపూర్ మూలవాగులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ మూలవాగు వద్ద గంగమ్మ తల్లికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డా. సంజయ్, మేడిపల్లి సత్యం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- రూ.180 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్ కాంగ్రెస్–బీజేపీ పెద్దల కుమ్మక్కుపై అనుమానాలు.. కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి: సర్ధార్ రవీందర్ సింగ్.. రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానం.. - కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్ - ఎక్సెస్ టెండర్‌ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు పనులు ఎలా అప్పగించారు? - GO 745 ఎవరి ప్రయోజనం కోసం? టెండర్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి - కాంగ్రెస్–బీజేపీ పెద్దల కుమ్మక్కుపై అనుమానాలు.. కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి: సర్ధార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగరంలో రూ.180 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల టెండర్ ప్రక్రియపై మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ టెండర్ వ్యవహారంలో రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టాల్సిన భారీ ప్రాజెక్టును కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రభుత్వం GO 745 ద్వారా రూ.180 కోట్ల నిధులు కేటాయించిందని, ఇంత భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు టెండర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్సెస్ టెండర్‌ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడంలో ఆంతర్యమేంటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. ఎక్సెస్ టెండర్‌ను రద్దు చేయడానికి బలమైన కారణం ఉండాలని, నిబంధనల ప్రకారం తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేవలం 5 శాతం ఎక్సెస్ పేరుతో టెండర్ ప్రక్రియను మార్చి, తిరిగి అదే కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టడం వెనుక అసలు కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. "రూ.50 లక్షల పనులకు ఒక నిబంధన.. రూ.180 కోట్ల పనులకు మరో నిబంధనా?" అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల రూ.50 లక్షల విలువైన పనుల్లో ఎక్సెస్ కారణంగా జిల్లా కలెక్టర్ టెండర్‌ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే నిబంధన భారీ విలువైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్‌కు ఎందుకు వర్తించదని నిలదీశారు. *"కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారా?"* అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్ విషయంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. "నేను చేస్తున్నది ఆరోపణ. దీనిపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. టెండర్‌లో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే పూర్తి వివరాలను బహిర్గతం చేయాలి" అని అన్నారు. *స్మార్ట్ సిటీ పనుల పేరుతో నిలువు దోపిడీ* కరీంనగర్ నగరంలో గతంలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులపై కూడా సర్ధార్ రవీందర్ సింగ్ పలు ప్రశ్నలు సంధించారు. నగరంలో సీసీ రోడ్లు, ఇతర నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు భవిష్యత్తులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా ముందుగానే ఇంటర్నల్ కనెక్షన్లు, ప్రధాన డ్రైనేజీ లింకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇన్స్పెక్షన్ ఛాంబర్లు లేవని, ప్రధాన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు సరైన లింకులు లేవని ఆరోపించారు. "రూ.180 కోట్లతో కొత్తగా డ్రైనేజీ పనులు చేపడుతున్నప్పుడు.. గతంలో చేసిన పనుల పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించారు? ఎన్ని ప్రాంతాలకు కనెక్షన్లు ఇచ్చారు?" అని ప్రశ్నించారు. ప్రతి డివిజన్‌లో ఎన్ని ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మిస్తున్నారు, ఎన్ని ఇళ్లకు ఇంటర్నల్ కనెక్షన్లు ఇస్తున్నారు, ప్రధాన డ్రైనేజీ లైన్‌కు ఎక్కడెక్కడ లింకులు కలుపుతున్నారనే పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. *"గతంలో చేసిన పనులపై విచారణ లేకుండానే మళ్లీ అదే సంస్థకు పనులా?"* గతంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టిన పనులను పూర్తి స్థాయిలో పరిశీలించకుండా మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు భారీ విలువైన పనులు అప్పగించడం ఏమిటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. గత పనుల నాణ్యత, పూర్తి స్థాయి, డ్రైనేజీ లింకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు, ప్రజలకు అందిన ప్రయోజనాలపై ముందుగా సమీక్ష నిర్వహించాలని అన్నారు. గతంలో ఇదే సంస్థపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారని, ఇప్పుడు అదే సంస్థకు మళ్లీ భారీ విలువైన టెండర్ ఎలా దక్కిందని ప్రశ్నించారు. అప్పట్లో చేసిన ఆరోపణలు నిజమా? కాదా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. *"కాంగ్రెస్–బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు"* కరీంనగర్ నగరంలో జరుగుతున్న టెండర్ వ్యవహారాలపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం కలిసి కరీంనగర్ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయనే అనుమానం కలుగుతోందని అన్నారు. "కాంగ్రెస్, బీజేపీ నేతలకు నిజంగా కరీంనగర్ ప్రజలపై ప్రేమ, గౌరవం ఉంటే.. ఈ టెండర్ ప్రక్రియను వెంటనే పారదర్శకంగా నిర్వహించాలి. గతంలో వచ్చిన ఎక్సెస్ టెండర్ ఎందుకు రద్దయింది? ఇప్పుడు మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు ఎలా పనులు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు. *STPల పరిస్థితి ఏంటి? రూ.180 కోట్లతో ఏం చేయబోతున్నారు?* నగరంలో ఇప్పటికే ఉన్న సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల పరిస్థితిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. సీతారాంపూర్‌లో 5 MLD, కిసాన్‌నగర్‌లో 6 MLD, అలుగునూరులో 2 MLD సామర్థ్యం కలిగిన STPల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సదాశివపల్లి ప్రాంతంలో పనుల పరిస్థితి, లెవెల్స్, డ్రైనేజీ అనుసంధానంపై కూడా అధికారులు వివరాలు వెల్లడించాలని కోరారు. "ఇప్పటికే ఉన్న STPలు, డ్రైనేజీ వ్యవస్థ, స్మార్ట్ సిటీ పనులను పూర్తిగా పరిశీలించకుండా రూ.180 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు చేపట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? గతంలో చేసిన పనుల పరిస్థితిని చూడకుండా కొత్త పనులు చేపట్టడం ఎందుకు?" అని ప్రశ్నించారు. *మేము ప్రజా సేవకులం ఊరుకోం ...* ప్రజలకు ఉపయోగపడేలా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేయాలని, కేవలం టెండర్లు కేటాయించి పనులు ప్రారంభించడం కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సర్ధార్ రవీందర్ సింగ్ కోరారు. "ఇది ప్రజల సౌకర్యం కోసం చేస్తున్న టెండర్ కావాలి.. కమిషన్ల కోసం చేసే టెండర్ కాకూడదు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును ఖర్చు చేయొద్దు. కరీంనగర్ నగరాన్ని కాంట్రాక్టర్ల ప్రయోగశాలగా మార్చకండి" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రూ.180 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని, ఎక్సెస్ టెండర్ రద్దు నుంచి మళ్లీ టెండర్ కేటాయింపు వరకు జరిగిన ప్రతి అంశాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని భావిస్తే ప్రజల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని సర్ధార్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. "కరీంనగర్ ప్రజల సొమ్ము కరీంనగర్ అభివృద్ధికే ఖర్చు కావాలి. కమిషన్లు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు" అని ఆయన అన్నారు.2
- వర్షం దాటికి నారాయణపూర్ లో కూలిన ఆరు ఇళ్ళు... 2000 చొప్పున తక్షణ సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే రవిశంకర్. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ లో ఆరు ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. పురాతన మట్టి గోడలు, ఇళ్ళ పైకప్పులు కూలిపోయాయి. నారాయణపూర్ రిజర్వాయర్ కింద ముంపు గ్రామంగా ప్రకటిస్తారని మరమ్మతులు చేయకపోవడంతో ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో పురాతన ఇల్లు కూలిపోవడం బాధితులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కూలిన ఇళ్లను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సందర్శించి బాధితులను ఓదార్చారు. గ్రామంలోని దెబ్బతిన్న ఇళ్ళను పరిశీలించి ప్రతి ఇంటి బాధిత కుటుంబానికి తక్షణ అవసరాల కోసం 2,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. తహశీల్దార్ ఎంపీడీఓ లతో మాట్లాడి ప్రభుత్వ పరంగా పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, బాధిత కుటుంబాల వివరాలను సేకరించి నష్టాన్ని అంచనా వేశారు. ఇళ్లు కూలిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని గ్రామస్తులు కోరారు.4
- భారీ వర్షాలతో కోరుట్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, కమిషనర్ రాఘవేంద్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు."1
- కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సలబత్‌పూర్ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి గత రెండు దశాబ్దాలుగా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. చెక్‌పోస్ట్‌లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రక్కులో ప్రయాణిస్తున్న యూట్యూబర్ చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన సందర్భంగా వివాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వెంటనే ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో ఘటనకు సంబంధించి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని గుర్తించినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ నివేదికను కరీంనగర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి (నోడల్ అధికారి)కి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. సదరు కానిస్టేబుల్‌పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయాలని సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ముకుంద రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై శాఖ ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించదని, విధి నిర్వహణలో నిబంధనలు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.1
- వేములవాడలో అభివృద్ధి ఆధ్యాత్మికతకు కొత్త ఊపు బస్‌స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన గుడి చెరువు బండ్ పార్క్ ప్రారంభంచి,వరుణయాగంలో పాల్గొన్న మంత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.. రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి. గీతే, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. *తిప్పాపూర్ బస్‌స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన* వేములవాడ తిప్పాపూర్ బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు రూ.1.62 కోట్లతో మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం వేములవాడ కోరుట్ల మీదుగా బాసరకు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా *మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ*, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసి హామీని నిలబెట్టుకుందని తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో పాటు సిబ్బంది నియామకాలు కూడా చేపట్టామని చెప్పారు. 1984లో నిర్మించిన బస్‌స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నామని, దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడకు ప్రతిరోజూ సుమారు 250 బస్సులు, 560 ట్రిప్పులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. కోరుట్ల మీదుగా బాసరకు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సుతో పాటు గతంలో ముంబైకి కూడా బస్సు సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించామని, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. *మంత్రి తుమ్మల నాగేశ్వరరావు* మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయ ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు బస్‌స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. *మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు రూ.240 కోట్లతో కొనసాగుతున్నాయని తెలిపారు. అదే అభివృద్ధి దిశగా బస్‌స్టేషన్ ఆధునీకరణ కూడా జరుగుతుండడం ఆనందంగా ఉందన్నారు. *రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ* తిప్పాపూర్ బస్‌స్టేషన్ ఆధునీకరణకు నిధులు మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. లక్షలాది మంది భక్తులు, ప్రయాణికులకు ఆధునీకరించిన బస్‌స్టేషన్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. గతంలో బస్‌స్టేషన్‌ను తొలగించే ప్రయత్నాలు జరిగాయని, ప్రజల ఆకాంక్ష మేరకు దానిని కొనసాగిస్తూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గతంలో పలుమార్లు కూలిపోయిన సమీప వంతెనను భూ నిర్వాసితులకు న్యాయం చేస్తూ పూర్తి చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.249.40 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. *ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ* దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానాన్ని భక్తులకు మరింత సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అభివృద్ధికి 2023–24లో రూ.50 కోట్లు, 2024–25లో రూ.100 కోట్లు, అనంతరం మరో రూ.99.40 కోట్లు మంజూరు చేయడంతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం సుమారు 45 శాతం పనులు పూర్తయ్యాయని, మరో 10 నుంచి 12 నెలల్లో పూర్తి చేసి రాబోయే వెయ్యేళ్ల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతామని వెల్లడించారు. భక్తుల కోసం రూ.35 కోట్లతో అన్నదాన సత్రం నిర్మాణం, రూ.47 కోట్లతో 80 అడుగుల రహదారి విస్తరణ, రూ.10 కోట్లతో బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ అభివృద్ధి పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. *భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగం ప్రారంభం* జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడకు చేరుకున్న మంత్రులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి. గీతే పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు పూర్ణకుంభంతో మంత్రులకు స్వాగతం పలికారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు... శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు నిర్వహించే సత్వర సద్యఃసువృష్టి వరుణయాగాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ పర్జన్య జపానుష్ఠానాలు, హవనాలు, సంతత ధారాభిషేకం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భీమేశ్వర సదన్‌లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వరుణయాగం కేవలం ఆధ్యాత్మిక క్రతువు మాత్రమే కాకుండా లోకకళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించే మహోన్నత వైదిక సంప్రదాయమని పేర్కొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని, రైతులకు సాగునీరు సమృద్ధిగా లభించి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సస్యశ్యామలంగా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. *గుడి చెరువు బండ్ పార్క్ ప్రారంభం* వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ శివుడి విగ్రహం, నటరాజ స్వామి విగ్రహం, సప్తమాతృకల విగ్రహాలు, ఉద్యానవనం, మొక్కలతో అభివృద్ధి చేసిన పార్కును పరిశీలించారు. ఈ పార్క్ వేములవాడకు వచ్చే భక్తులతో పాటు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.1
- రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ప్రారంభం రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణ యాగం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తదనంతరం మంత్రులు వరుణ యాగంలో పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ వరుణ యాగంలో ప్రతిరోజూ ప్రత్యేక హోమాలు, వేదపారాయణాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.4
- జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని దూలూరు గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకొని పంచనామా నిర్వహించి వారి వద్ద నుండి 5206/- రూపాయలు మరియు 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై రవి కిరణ్ తెలియజేసినారు.1