Shuru
Apke Nagar Ki App…
తిప్పాపూర్ మూలవాగులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ మూలవాగు వద్ద గంగమ్మ తల్లికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డా. సంజయ్, మేడిపల్లి సత్యం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Gampa mahesh
తిప్పాపూర్ మూలవాగులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ మూలవాగు వద్ద గంగమ్మ తల్లికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డా. సంజయ్, మేడిపల్లి సత్యం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం.స్వామి వారిని దర్శించుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డా. సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్న మంత్రులు వరుణ యాగంలో పాల్గొన్న మంత్రులు రాష్ట్రంలో వర్షాలు కురువాలని కోరుతూ మూడు రోజులపాటు కొనసాగనున్న వరుణ యాగం.2
- రూ.180 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్ కాంగ్రెస్–బీజేపీ పెద్దల కుమ్మక్కుపై అనుమానాలు.. కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి: సర్ధార్ రవీందర్ సింగ్.. రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానం.. - కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్ - ఎక్సెస్ టెండర్‌ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు పనులు ఎలా అప్పగించారు? - GO 745 ఎవరి ప్రయోజనం కోసం? టెండర్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి - కాంగ్రెస్–బీజేపీ పెద్దల కుమ్మక్కుపై అనుమానాలు.. కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి: సర్ధార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగరంలో రూ.180 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల టెండర్ ప్రక్రియపై మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ టెండర్ వ్యవహారంలో రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టాల్సిన భారీ ప్రాజెక్టును కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రభుత్వం GO 745 ద్వారా రూ.180 కోట్ల నిధులు కేటాయించిందని, ఇంత భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు టెండర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్సెస్ టెండర్‌ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడంలో ఆంతర్యమేంటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. ఎక్సెస్ టెండర్‌ను రద్దు చేయడానికి బలమైన కారణం ఉండాలని, నిబంధనల ప్రకారం తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేవలం 5 శాతం ఎక్సెస్ పేరుతో టెండర్ ప్రక్రియను మార్చి, తిరిగి అదే కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టడం వెనుక అసలు కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. "రూ.50 లక్షల పనులకు ఒక నిబంధన.. రూ.180 కోట్ల పనులకు మరో నిబంధనా?" అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల రూ.50 లక్షల విలువైన పనుల్లో ఎక్సెస్ కారణంగా జిల్లా కలెక్టర్ టెండర్‌ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే నిబంధన భారీ విలువైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్‌కు ఎందుకు వర్తించదని నిలదీశారు. *"కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారా?"* అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్ విషయంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. "నేను చేస్తున్నది ఆరోపణ. దీనిపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. టెండర్‌లో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే పూర్తి వివరాలను బహిర్గతం చేయాలి" అని అన్నారు. *స్మార్ట్ సిటీ పనుల పేరుతో నిలువు దోపిడీ* కరీంనగర్ నగరంలో గతంలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులపై కూడా సర్ధార్ రవీందర్ సింగ్ పలు ప్రశ్నలు సంధించారు. నగరంలో సీసీ రోడ్లు, ఇతర నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు భవిష్యత్తులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా ముందుగానే ఇంటర్నల్ కనెక్షన్లు, ప్రధాన డ్రైనేజీ లింకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇన్స్పెక్షన్ ఛాంబర్లు లేవని, ప్రధాన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు సరైన లింకులు లేవని ఆరోపించారు. "రూ.180 కోట్లతో కొత్తగా డ్రైనేజీ పనులు చేపడుతున్నప్పుడు.. గతంలో చేసిన పనుల పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించారు? ఎన్ని ప్రాంతాలకు కనెక్షన్లు ఇచ్చారు?" అని ప్రశ్నించారు. ప్రతి డివిజన్‌లో ఎన్ని ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మిస్తున్నారు, ఎన్ని ఇళ్లకు ఇంటర్నల్ కనెక్షన్లు ఇస్తున్నారు, ప్రధాన డ్రైనేజీ లైన్‌కు ఎక్కడెక్కడ లింకులు కలుపుతున్నారనే పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. *"గతంలో చేసిన పనులపై విచారణ లేకుండానే మళ్లీ అదే సంస్థకు పనులా?"* గతంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టిన పనులను పూర్తి స్థాయిలో పరిశీలించకుండా మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు భారీ విలువైన పనులు అప్పగించడం ఏమిటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. గత పనుల నాణ్యత, పూర్తి స్థాయి, డ్రైనేజీ లింకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు, ప్రజలకు అందిన ప్రయోజనాలపై ముందుగా సమీక్ష నిర్వహించాలని అన్నారు. గతంలో ఇదే సంస్థపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారని, ఇప్పుడు అదే సంస్థకు మళ్లీ భారీ విలువైన టెండర్ ఎలా దక్కిందని ప్రశ్నించారు. అప్పట్లో చేసిన ఆరోపణలు నిజమా? కాదా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. *"కాంగ్రెస్–బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు"* కరీంనగర్ నగరంలో జరుగుతున్న టెండర్ వ్యవహారాలపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం కలిసి కరీంనగర్ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయనే అనుమానం కలుగుతోందని అన్నారు. "కాంగ్రెస్, బీజేపీ నేతలకు నిజంగా కరీంనగర్ ప్రజలపై ప్రేమ, గౌరవం ఉంటే.. ఈ టెండర్ ప్రక్రియను వెంటనే పారదర్శకంగా నిర్వహించాలి. గతంలో వచ్చిన ఎక్సెస్ టెండర్ ఎందుకు రద్దయింది? ఇప్పుడు మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు ఎలా పనులు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు. *STPల పరిస్థితి ఏంటి? రూ.180 కోట్లతో ఏం చేయబోతున్నారు?* నగరంలో ఇప్పటికే ఉన్న సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల పరిస్థితిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. సీతారాంపూర్‌లో 5 MLD, కిసాన్‌నగర్‌లో 6 MLD, అలుగునూరులో 2 MLD సామర్థ్యం కలిగిన STPల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సదాశివపల్లి ప్రాంతంలో పనుల పరిస్థితి, లెవెల్స్, డ్రైనేజీ అనుసంధానంపై కూడా అధికారులు వివరాలు వెల్లడించాలని కోరారు. "ఇప్పటికే ఉన్న STPలు, డ్రైనేజీ వ్యవస్థ, స్మార్ట్ సిటీ పనులను పూర్తిగా పరిశీలించకుండా రూ.180 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు చేపట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? గతంలో చేసిన పనుల పరిస్థితిని చూడకుండా కొత్త పనులు చేపట్టడం ఎందుకు?" అని ప్రశ్నించారు. *మేము ప్రజా సేవకులం ఊరుకోం ...* ప్రజలకు ఉపయోగపడేలా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేయాలని, కేవలం టెండర్లు కేటాయించి పనులు ప్రారంభించడం కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సర్ధార్ రవీందర్ సింగ్ కోరారు. "ఇది ప్రజల సౌకర్యం కోసం చేస్తున్న టెండర్ కావాలి.. కమిషన్ల కోసం చేసే టెండర్ కాకూడదు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును ఖర్చు చేయొద్దు. కరీంనగర్ నగరాన్ని కాంట్రాక్టర్ల ప్రయోగశాలగా మార్చకండి" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రూ.180 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని, ఎక్సెస్ టెండర్ రద్దు నుంచి మళ్లీ టెండర్ కేటాయింపు వరకు జరిగిన ప్రతి అంశాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని భావిస్తే ప్రజల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని సర్ధార్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. "కరీంనగర్ ప్రజల సొమ్ము కరీంనగర్ అభివృద్ధికే ఖర్చు కావాలి. కమిషన్లు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు" అని ఆయన అన్నారు.2
- తెలంగాణలోకి డిప్రెషన్ ఎంట్రీ రానున్న 12 గంటలు అత్యంత కీలకం1
- కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సలబత్‌పూర్ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి గత రెండు దశాబ్దాలుగా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. చెక్‌పోస్ట్‌లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రక్కులో ప్రయాణిస్తున్న యూట్యూబర్ చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన సందర్భంగా వివాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వెంటనే ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో ఘటనకు సంబంధించి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని గుర్తించినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ నివేదికను కరీంనగర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి (నోడల్ అధికారి)కి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. సదరు కానిస్టేబుల్‌పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయాలని సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ముకుంద రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై శాఖ ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించదని, విధి నిర్వహణలో నిబంధనలు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.1
- నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 13714 క్యూసెక్కులు... ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగ 80.5 టీఎంసీలు ప్రస్తుత నీటి మట్టం 1065.90 అడుగులు కాగ 17.243 టీఎంసీలు గత ఏడాది 1077 అడుగులు కాగ 37.636 టీఎంసీలు1
- రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ప్రారంభం రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణ యాగం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తదనంతరం మంత్రులు వరుణ యాగంలో పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ వరుణ యాగంలో ప్రతిరోజూ ప్రత్యేక హోమాలు, వేదపారాయణాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ అది శ్రీనివాస్.స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు.జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, విప్.1
- ఎల్లంపల్లి ప్రాజెక్టు భారీగా వరద...15 గేట్లు ఎత్తిన అధికారులు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తారు. 1 లక్షా 55 వేల 625 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలో విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 356254 క్యూసెక్కులు కాగ ఔట్ ప్లో 171650 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 19.341 టిఎంసిలు ఉంది. ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్ ద్వారా ఐదు మోటర్లు ఆన్ చేసి 15750 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది. సుందిళ్ళ బ్యారేజ్ 74 గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళను వచ్చినట్లు వదిలేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ప్లో 1 లక్షా 85 వేల క్యూసెక్కులు ఉంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు సుందిళ్ళ బ్యారేజ్ లో నీటిని నిల్వ చేయడం లేదు. పార్వతి బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 11.87 టిఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిలువ నిల్ గా ఉంది.1
- కల్లూరు వద్ద వాగులో తృటలో తప్పిన ప్రమాదం... వరదలో బైకులతో సహా పడిపోయిన ఇద్దరిని కాపాడిన స్థానికులు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామ శివారులోని వాగు వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. వాగుపై ఉన్న లో-లెవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న నీటిని దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు రెండు బైకులతో పాటు వాగులో పడిపోయారు. అయితే అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ వన తడుపుల అంజయ్య, స్థానిక రైతులు, గ్రామస్తులు సాహసోపేతంగా స్పందించి ఇద్దరినీ, వారి బైకులను సురక్షితంగా బయటకు తీశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కల్లూరు గ్రామ శివారులోని వాగుకు ఉద్ధృతంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో కల్లూరు నుంచి రాయికల్ వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు రెండు బైకులపై లో-లెవల్ బ్రిడ్జిని దాటేందుకు ప్రయత్నించారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి బైకులతో సహా వాగులో పడిపోయారు. స్థానికులు సమయస్ఫూర్తితో స్పందించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.1