logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ అది శ్రీనివాస్.స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు.జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, విప్.

10 hrs ago
user_సిరిసిల్ల స్వరం
సిరిసిల్ల స్వరం
సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
10 hrs ago

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ అది శ్రీనివాస్.స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు.జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, విప్.

More news from తెలంగాణ and nearby areas
  • తిప్పాపూర్ మూలవాగులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ మూలవాగు వద్ద గంగమ్మ తల్లికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డా. సంజయ్, మేడిపల్లి సత్యం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    తిప్పాపూర్ మూలవాగులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ మూలవాగు వద్ద గంగమ్మ తల్లికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డా. సంజయ్, మేడిపల్లి సత్యం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • రూ.180 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్ కాంగ్రెస్–బీజేపీ పెద్దల కుమ్మక్కుపై అనుమానాలు.. కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి: సర్ధార్ రవీందర్ సింగ్.. రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానం.. - కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్ - ఎక్సెస్ టెండర్‌ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు పనులు ఎలా అప్పగించారు? - GO 745 ఎవరి ప్రయోజనం కోసం? టెండర్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి - కాంగ్రెస్–బీజేపీ పెద్దల కుమ్మక్కుపై అనుమానాలు.. కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి: సర్ధార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగరంలో రూ.180 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల టెండర్ ప్రక్రియపై మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ టెండర్ వ్యవహారంలో రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టాల్సిన భారీ ప్రాజెక్టును కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రభుత్వం GO 745 ద్వారా రూ.180 కోట్ల నిధులు కేటాయించిందని, ఇంత భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు టెండర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్సెస్ టెండర్‌ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడంలో ఆంతర్యమేంటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. ఎక్సెస్ టెండర్‌ను రద్దు చేయడానికి బలమైన కారణం ఉండాలని, నిబంధనల ప్రకారం తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేవలం 5 శాతం ఎక్సెస్ పేరుతో టెండర్ ప్రక్రియను మార్చి, తిరిగి అదే కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టడం వెనుక అసలు కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. "రూ.50 లక్షల పనులకు ఒక నిబంధన.. రూ.180 కోట్ల పనులకు మరో నిబంధనా?" అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల రూ.50 లక్షల విలువైన పనుల్లో ఎక్సెస్ కారణంగా జిల్లా కలెక్టర్ టెండర్‌ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే నిబంధన భారీ విలువైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్‌కు ఎందుకు వర్తించదని నిలదీశారు. *"కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారా?"* అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్ విషయంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. "నేను చేస్తున్నది ఆరోపణ. దీనిపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. టెండర్‌లో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే పూర్తి వివరాలను బహిర్గతం చేయాలి" అని అన్నారు. *స్మార్ట్ సిటీ పనుల పేరుతో నిలువు దోపిడీ* కరీంనగర్ నగరంలో గతంలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులపై కూడా సర్ధార్ రవీందర్ సింగ్ పలు ప్రశ్నలు సంధించారు. నగరంలో సీసీ రోడ్లు, ఇతర నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు భవిష్యత్తులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా ముందుగానే ఇంటర్నల్ కనెక్షన్లు, ప్రధాన డ్రైనేజీ లింకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇన్స్పెక్షన్ ఛాంబర్లు లేవని, ప్రధాన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు సరైన లింకులు లేవని ఆరోపించారు. "రూ.180 కోట్లతో కొత్తగా డ్రైనేజీ పనులు చేపడుతున్నప్పుడు.. గతంలో చేసిన పనుల పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించారు? ఎన్ని ప్రాంతాలకు కనెక్షన్లు ఇచ్చారు?" అని ప్రశ్నించారు. ప్రతి డివిజన్‌లో ఎన్ని ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మిస్తున్నారు, ఎన్ని ఇళ్లకు ఇంటర్నల్ కనెక్షన్లు ఇస్తున్నారు, ప్రధాన డ్రైనేజీ లైన్‌కు ఎక్కడెక్కడ లింకులు కలుపుతున్నారనే పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. *"గతంలో చేసిన పనులపై విచారణ లేకుండానే మళ్లీ అదే సంస్థకు పనులా?"* గతంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టిన పనులను పూర్తి స్థాయిలో పరిశీలించకుండా మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు భారీ విలువైన పనులు అప్పగించడం ఏమిటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. గత పనుల నాణ్యత, పూర్తి స్థాయి, డ్రైనేజీ లింకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు, ప్రజలకు అందిన ప్రయోజనాలపై ముందుగా సమీక్ష నిర్వహించాలని అన్నారు. గతంలో ఇదే సంస్థపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారని, ఇప్పుడు అదే సంస్థకు మళ్లీ భారీ విలువైన టెండర్ ఎలా దక్కిందని ప్రశ్నించారు. అప్పట్లో చేసిన ఆరోపణలు నిజమా? కాదా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. *"కాంగ్రెస్–బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు"* కరీంనగర్ నగరంలో జరుగుతున్న టెండర్ వ్యవహారాలపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం కలిసి కరీంనగర్ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయనే అనుమానం కలుగుతోందని అన్నారు. "కాంగ్రెస్, బీజేపీ నేతలకు నిజంగా కరీంనగర్ ప్రజలపై ప్రేమ, గౌరవం ఉంటే.. ఈ టెండర్ ప్రక్రియను వెంటనే పారదర్శకంగా నిర్వహించాలి. గతంలో వచ్చిన ఎక్సెస్ టెండర్ ఎందుకు రద్దయింది? ఇప్పుడు మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు ఎలా పనులు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు. *STPల పరిస్థితి ఏంటి? రూ.180 కోట్లతో ఏం చేయబోతున్నారు?* నగరంలో ఇప్పటికే ఉన్న సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల పరిస్థితిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. సీతారాంపూర్‌లో 5 MLD, కిసాన్‌నగర్‌లో 6 MLD, అలుగునూరులో 2 MLD సామర్థ్యం కలిగిన STPల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సదాశివపల్లి ప్రాంతంలో పనుల పరిస్థితి, లెవెల్స్, డ్రైనేజీ అనుసంధానంపై కూడా అధికారులు వివరాలు వెల్లడించాలని కోరారు. "ఇప్పటికే ఉన్న STPలు, డ్రైనేజీ వ్యవస్థ, స్మార్ట్ సిటీ పనులను పూర్తిగా పరిశీలించకుండా రూ.180 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు చేపట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? గతంలో చేసిన పనుల పరిస్థితిని చూడకుండా కొత్త పనులు చేపట్టడం ఎందుకు?" అని ప్రశ్నించారు. *మేము ప్రజా సేవకులం ఊరుకోం ...* ప్రజలకు ఉపయోగపడేలా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేయాలని, కేవలం టెండర్లు కేటాయించి పనులు ప్రారంభించడం కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సర్ధార్ రవీందర్ సింగ్ కోరారు. "ఇది ప్రజల సౌకర్యం కోసం చేస్తున్న టెండర్ కావాలి.. కమిషన్ల కోసం చేసే టెండర్ కాకూడదు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును ఖర్చు చేయొద్దు. కరీంనగర్ నగరాన్ని కాంట్రాక్టర్ల ప్రయోగశాలగా మార్చకండి" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రూ.180 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని, ఎక్సెస్ టెండర్ రద్దు నుంచి మళ్లీ టెండర్ కేటాయింపు వరకు జరిగిన ప్రతి అంశాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని భావిస్తే ప్రజల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని సర్ధార్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. "కరీంనగర్ ప్రజల సొమ్ము కరీంనగర్ అభివృద్ధికే ఖర్చు కావాలి. కమిషన్లు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు" అని ఆయన అన్నారు.
    2
    రూ.180 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్
కాంగ్రెస్–బీజేపీ పెద్దల కుమ్మక్కుపై అనుమానాలు.. కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి: సర్ధార్ రవీందర్ సింగ్..
రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానం.. 
- కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్
- ఎక్సెస్ టెండర్‌ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు పనులు ఎలా అప్పగించారు?
- GO 745 ఎవరి ప్రయోజనం కోసం? టెండర్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి
- కాంగ్రెస్–బీజేపీ పెద్దల కుమ్మక్కుపై అనుమానాలు.. కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి: సర్ధార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగరంలో రూ.180 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల టెండర్ ప్రక్రియపై మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ టెండర్ వ్యవహారంలో రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టాల్సిన భారీ ప్రాజెక్టును కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని ఆయన డిమాండ్ చేశారు.
కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రభుత్వం GO 745 ద్వారా రూ.180 కోట్ల నిధులు కేటాయించిందని, ఇంత భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు టెండర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు.
ఎక్సెస్ టెండర్‌ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడంలో ఆంతర్యమేంటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. ఎక్సెస్ టెండర్‌ను రద్దు చేయడానికి బలమైన కారణం ఉండాలని, నిబంధనల ప్రకారం తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేవలం 5 శాతం ఎక్సెస్ పేరుతో టెండర్ ప్రక్రియను మార్చి, తిరిగి అదే కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టడం వెనుక అసలు కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
"రూ.50 లక్షల పనులకు ఒక నిబంధన.. రూ.180 కోట్ల పనులకు మరో నిబంధనా?" అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల రూ.50 లక్షల విలువైన పనుల్లో ఎక్సెస్ కారణంగా జిల్లా కలెక్టర్ టెండర్‌ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే నిబంధన భారీ విలువైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్‌కు ఎందుకు వర్తించదని నిలదీశారు.
*"కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారా?"* అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్ విషయంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
"నేను చేస్తున్నది ఆరోపణ. దీనిపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. టెండర్‌లో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే పూర్తి వివరాలను బహిర్గతం చేయాలి" అని అన్నారు.
*స్మార్ట్ సిటీ పనుల పేరుతో నిలువు దోపిడీ*
కరీంనగర్ నగరంలో గతంలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులపై కూడా సర్ధార్ రవీందర్ సింగ్ పలు ప్రశ్నలు సంధించారు. నగరంలో సీసీ రోడ్లు, ఇతర నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు భవిష్యత్తులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా ముందుగానే ఇంటర్నల్ కనెక్షన్లు, ప్రధాన డ్రైనేజీ లింకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
కానీ నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇన్స్పెక్షన్ ఛాంబర్లు లేవని, ప్రధాన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు సరైన లింకులు లేవని ఆరోపించారు. "రూ.180 కోట్లతో కొత్తగా డ్రైనేజీ పనులు చేపడుతున్నప్పుడు.. గతంలో చేసిన పనుల పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించారు? ఎన్ని ప్రాంతాలకు కనెక్షన్లు ఇచ్చారు?" అని ప్రశ్నించారు.
ప్రతి డివిజన్‌లో ఎన్ని ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మిస్తున్నారు, ఎన్ని ఇళ్లకు ఇంటర్నల్ కనెక్షన్లు ఇస్తున్నారు, ప్రధాన డ్రైనేజీ లైన్‌కు ఎక్కడెక్కడ లింకులు కలుపుతున్నారనే పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
*"గతంలో చేసిన పనులపై విచారణ లేకుండానే మళ్లీ అదే సంస్థకు పనులా?"*
గతంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టిన పనులను పూర్తి స్థాయిలో పరిశీలించకుండా మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు భారీ విలువైన పనులు అప్పగించడం ఏమిటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. గత పనుల నాణ్యత, పూర్తి స్థాయి, డ్రైనేజీ లింకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు, ప్రజలకు అందిన ప్రయోజనాలపై ముందుగా సమీక్ష నిర్వహించాలని అన్నారు.
గతంలో ఇదే సంస్థపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారని, ఇప్పుడు అదే సంస్థకు మళ్లీ భారీ విలువైన టెండర్ ఎలా దక్కిందని ప్రశ్నించారు. అప్పట్లో చేసిన ఆరోపణలు నిజమా? కాదా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
*"కాంగ్రెస్–బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు"*
కరీంనగర్ నగరంలో జరుగుతున్న టెండర్ వ్యవహారాలపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం కలిసి కరీంనగర్ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయనే అనుమానం కలుగుతోందని అన్నారు.
"కాంగ్రెస్, బీజేపీ నేతలకు నిజంగా కరీంనగర్ ప్రజలపై ప్రేమ, గౌరవం ఉంటే.. ఈ టెండర్ ప్రక్రియను వెంటనే పారదర్శకంగా నిర్వహించాలి. గతంలో వచ్చిన ఎక్సెస్ టెండర్ ఎందుకు రద్దయింది? ఇప్పుడు మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు ఎలా పనులు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు.
*STPల పరిస్థితి ఏంటి? రూ.180 కోట్లతో ఏం చేయబోతున్నారు?*
నగరంలో ఇప్పటికే ఉన్న సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల పరిస్థితిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. సీతారాంపూర్‌లో 5 MLD, కిసాన్‌నగర్‌లో 6 MLD, అలుగునూరులో 2 MLD సామర్థ్యం కలిగిన STPల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సదాశివపల్లి ప్రాంతంలో పనుల పరిస్థితి, లెవెల్స్, డ్రైనేజీ అనుసంధానంపై కూడా అధికారులు వివరాలు వెల్లడించాలని కోరారు.
"ఇప్పటికే ఉన్న STPలు, డ్రైనేజీ వ్యవస్థ, స్మార్ట్ సిటీ పనులను పూర్తిగా పరిశీలించకుండా రూ.180 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు చేపట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? గతంలో చేసిన పనుల పరిస్థితిని చూడకుండా కొత్త పనులు చేపట్టడం ఎందుకు?" అని ప్రశ్నించారు.
*మేము ప్రజా సేవకులం ఊరుకోం ...*
ప్రజలకు ఉపయోగపడేలా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేయాలని, కేవలం టెండర్లు కేటాయించి పనులు ప్రారంభించడం కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సర్ధార్ రవీందర్ సింగ్ కోరారు.
"ఇది ప్రజల సౌకర్యం కోసం చేస్తున్న టెండర్ కావాలి.. కమిషన్ల కోసం చేసే టెండర్ కాకూడదు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును ఖర్చు చేయొద్దు. కరీంనగర్ నగరాన్ని కాంట్రాక్టర్ల ప్రయోగశాలగా మార్చకండి" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
రూ.180 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని, ఎక్సెస్ టెండర్ రద్దు నుంచి మళ్లీ టెండర్ కేటాయింపు వరకు జరిగిన ప్రతి అంశాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని భావిస్తే ప్రజల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని సర్ధార్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. "కరీంనగర్ ప్రజల సొమ్ము కరీంనగర్ అభివృద్ధికే ఖర్చు కావాలి. కమిషన్లు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు" అని ఆయన అన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • కరీంనగర్ లో సిటీ బస్సులు ప్రారంభం...రాబోయే రోజుల్లో మరిన్ని సిటీ బస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి కరీంనగర్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆర్టీసీ సిటీ బస్సులు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి మూడు రూట్లలో వెళ్ళే మూడు సిటీ బస్సులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించారు. సిటీ బస్సుల ప్రారంభోత్సవంలో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మేయర్ శ్రీనివాస్ కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి చింతకుంట, కరీంనగర్ టు కొత్తపల్లి, కరీంనగర్ టు వాగేశ్వరి నగర్ వరకు మూడు సిటీ బస్సులను ప్రారంభించామని రాబోయే రోజుల్లో కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీ, కరీంనగర్ చల్మెడ మెడికల్ కాలేజీ, కరీంనగర్ టు మానకొండూరు కు బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు ఉపాధి కోసం కరీంనగర్కు వచ్చే వారి కోసం సిటీ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ పేద ప్రజల గుండెచప్పుడుగా లైఫ్ లైన్ గా ఆర్టీసీ పనిచేస్తుందన్నారు. మహాలక్ష్మి కింద మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యంతో ఆర్టీసీకి ఆదరణ పెరిగిందని తెలంగాణలో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ, బస్సుల సంఖ్య పెంచి ప్రతి గ్రామానికి ఆర్టిసీ బస్సు నినాదంతో ముందుకు పోతున్నామని తెలిపారు. ప్రతిరోజు 35 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు నడిచి 65 లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరవేస్తుందని ప్రకటించారు. ఆర్టీసీ ప్రజలదని ఆ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైనే ఉందని స్పష్టం చేశారు.
    2
    కరీంనగర్ లో సిటీ బస్సులు ప్రారంభం...రాబోయే రోజుల్లో మరిన్ని సిటీ బస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
కరీంనగర్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆర్టీసీ సిటీ బస్సులు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి మూడు రూట్లలో వెళ్ళే మూడు సిటీ బస్సులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించారు. సిటీ బస్సుల ప్రారంభోత్సవంలో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మేయర్ శ్రీనివాస్ కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి చింతకుంట, కరీంనగర్ టు కొత్తపల్లి, కరీంనగర్ టు వాగేశ్వరి నగర్ వరకు మూడు సిటీ బస్సులను ప్రారంభించామని రాబోయే రోజుల్లో కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీ, కరీంనగర్ చల్మెడ మెడికల్ కాలేజీ, కరీంనగర్ టు మానకొండూరు కు బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు ఉపాధి కోసం కరీంనగర్కు వచ్చే వారి కోసం సిటీ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ పేద ప్రజల గుండెచప్పుడుగా లైఫ్ లైన్ గా ఆర్టీసీ పనిచేస్తుందన్నారు. మహాలక్ష్మి కింద మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యంతో ఆర్టీసీకి ఆదరణ పెరిగిందని తెలంగాణలో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ, బస్సుల సంఖ్య పెంచి ప్రతి గ్రామానికి ఆర్టిసీ బస్సు నినాదంతో ముందుకు పోతున్నామని తెలిపారు. ప్రతిరోజు 35 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు నడిచి 65 లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరవేస్తుందని ప్రకటించారు. ఆర్టీసీ ప్రజలదని ఆ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైనే ఉందని స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • తెలంగాణలోకి డిప్రెషన్ ఎంట్రీ రానున్న 12 గంటలు అత్యంత కీలకం
    1
    తెలంగాణలోకి డిప్రెషన్ ఎంట్రీ
రానున్న 12 గంటలు అత్యంత కీలకం
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • రెయిన్బో బ్లడ్ బ్యాంకు ను ప్రారంభించిన డిఎస్పి మధుసూదన్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్ లో గల రెయిన్బో బ్లడ్ బ్యాంకును కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో రక్తదాతలు ముందుకు వస్తేనే సకాలంలో రక్తాన్ని అందజేయగలుగుతామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తం దొరకక ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని తల సేమియా బాధిత చిన్నారులకు వారి జీవితాంతం 15 రోజులకు ఒక ఎన్ని రక్తం అవసరం ఉంటుందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రక్తదాతలు ముందుకు రావాలని అన్నారు.నూతనంగా రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.ఈ రక్తదాన శిబిరంలో కామారెడ్డి జిల్లా సెంట్రల్ ఆర్మ్డ్ పరామిలిటరీ ఫోర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎమ్.డి. గౌస్ఉద్దీన్ అధ్వర్యంలో సైనికులు హెడ్ కానిస్టేబుల్ బండి ప్రభాకర్(బి యస్ఎఫ్),మోతాజి బాల కృష్ణ రావు,మాజీ సైనికుడు రంజిత్ రెడ్డి,కానిస్టేబుల్ బద్రి లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.వీరికి డీఎస్పీ మధుసూదన్,సీఐ నరహరి ప్రశంస పత్రాలను,ఉత్తమ రక్తదాత పురస్కారాలను అందజేసి సన్మానించడం జరిగింది.దేశ రక్షణ కోసం సేవ చేయడమే కాకుండా ప్రాణాలను కాపాడడానికి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లికార్జునరావు,ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్,డాక్టర్ సంతోష్ కుమార్,ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్,డాక్టర్ అజయ్ పేరాల,ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరీ మారుతి, ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి,24 వ వార్డు కౌన్సిలర్ డాకి అరవింద్ రాజ్ మరియు బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం ససాల రాజు,భట్టు భరద్వాజ్,సైఫ్ నజీర్,మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    1
    రెయిన్బో బ్లడ్ బ్యాంకు ను ప్రారంభించిన డిఎస్పి మధుసూదన్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్ లో గల రెయిన్బో బ్లడ్ బ్యాంకును కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో రక్తదాతలు ముందుకు వస్తేనే సకాలంలో రక్తాన్ని అందజేయగలుగుతామని అన్నారు. 
ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తం దొరకక ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని తల సేమియా బాధిత చిన్నారులకు వారి జీవితాంతం 15 రోజులకు ఒక ఎన్ని రక్తం అవసరం ఉంటుందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రక్తదాతలు ముందుకు రావాలని అన్నారు.నూతనంగా రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.ఈ రక్తదాన శిబిరంలో కామారెడ్డి జిల్లా సెంట్రల్ ఆర్మ్డ్ పరామిలిటరీ ఫోర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎమ్.డి. గౌస్ఉద్దీన్ అధ్వర్యంలో సైనికులు హెడ్ కానిస్టేబుల్ బండి ప్రభాకర్(బి  యస్ఎఫ్),మోతాజి బాల కృష్ణ రావు,మాజీ సైనికుడు రంజిత్ రెడ్డి,కానిస్టేబుల్ బద్రి లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.వీరికి డీఎస్పీ మధుసూదన్,సీఐ నరహరి ప్రశంస పత్రాలను,ఉత్తమ రక్తదాత పురస్కారాలను అందజేసి సన్మానించడం జరిగింది.దేశ రక్షణ కోసం సేవ చేయడమే కాకుండా ప్రాణాలను కాపాడడానికి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లికార్జునరావు,ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్,డాక్టర్ సంతోష్ కుమార్,ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్,డాక్టర్ అజయ్ పేరాల,ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరీ మారుతి, ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి,24 వ వార్డు కౌన్సిలర్ డాకి అరవింద్ రాజ్ మరియు బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం ససాల రాజు,భట్టు భరద్వాజ్,సైఫ్ నజీర్,మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    11 hrs ago
  • నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 13714 క్యూసెక్కులు... ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగ 80.5 టీఎంసీలు ప్రస్తుత నీటి మట్టం 1065.90 అడుగులు కాగ 17.243 టీఎంసీలు గత ఏడాది 1077 అడుగులు కాగ 37.636 టీఎంసీలు
    1
    నిజామాబాద్ జిల్లా 

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి

ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 13714 క్యూసెక్కులు...

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగ 80.5 టీఎంసీలు 

ప్రస్తుత నీటి మట్టం 1065.90 అడుగులు కాగ 17.243 టీఎంసీలు 

గత ఏడాది 1077 అడుగులు కాగ 37.636 టీఎంసీలు
    user_Boss
    Boss
    భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • వేములవాడలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారు. వేములవాడలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారు. ముందుగా భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్న మంత్రులు, ఆలయంలో జరుగుతున్న వరుణ యాగంలో పాల్గొని రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించనున్నారు. అనంతరం రూ.12 కోట్లతో అభివృద్ధి చేసిన గుడి చెరువు ట్యాంక్‌బండ్ సుందరీకరణ పార్కును, భారీ ఆది యోగి శివుడు విగ్రహాన్ని ప్రారంభించడంతో పాటు, ఆర్టీసీ బస్టాండ్ వద్ద రూ.1.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
    2
    వేములవాడలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారు.
వేములవాడలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారు.
ముందుగా భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్న మంత్రులు, ఆలయంలో జరుగుతున్న వరుణ యాగంలో పాల్గొని రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించనున్నారు.
అనంతరం రూ.12 కోట్లతో అభివృద్ధి చేసిన గుడి చెరువు ట్యాంక్‌బండ్ సుందరీకరణ పార్కును, భారీ ఆది యోగి శివుడు విగ్రహాన్ని ప్రారంభించడంతో పాటు, ఆర్టీసీ బస్టాండ్ వద్ద రూ.1.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
మంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ప్రారంభం రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణ యాగం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తదనంతరం మంత్రులు వరుణ యాగంలో పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ వరుణ యాగంలో ప్రతిరోజూ ప్రత్యేక హోమాలు, వేదపారాయణాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
    4
    రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ప్రారంభం
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణ యాగం గురువారం ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు.
ఆలయానికి చేరుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
తదనంతరం మంత్రులు వరుణ యాగంలో పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ వరుణ యాగంలో ప్రతిరోజూ ప్రత్యేక హోమాలు, వేదపారాయణాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • వేములవాడలో భారీ శివుడి ప్రతిమను ఆవిష్కరించిన మంత్రులు..బస్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శ్రీకారం కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. భారీ శివుడి ప్రతిమను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడలో విస్తృతంగా పర్యటించారు. 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వేములవాడ గుడి చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ సంజయ్, కలెక్టర్ గరీమ అగ్రవాల్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. వేములవాడకు దిక్సూచిగా నిలిచే శివుడి భారీ ప్రతిమను ఆవిష్కరించారు. కోటి 50 లక్షల రూపాయలతో వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అధికారంలోకి వచ్చాక సిబ్బందిని పెంచడమే కాకుండా కొత్త రూట్ లను కూడా ఏర్పాటు చేసి మరింత రవాణాకు సౌకర్యాలను పెంపొందించామన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ బస్టాండ్ ను గతంలో ఎత్తివేస్తామని ప్రకటన చేస్తే ఆది శ్రీనివాస్ తో కలిసి పోరాటం చేశామని చెప్పారు. 1984 లో ప్రారంభమైన బస్టాండ్ ను ఇప్పటివరకు ఎవరు అభివృద్ధి చేయలేదని, రాజన్న క్షేత్రం కావడంతో ప్రతిరోజు 250 బస్సులు 500 ట్రిప్పులతో ప్రతినిత్యం వేలాదిమంది ఇక్కడికి వస్తున్నారని అందులో భాగంగానే బస్టాండ్ కోటి పది లక్షల రూపాయలతో ఆధునికరిస్తున్నామని పొన్నం తెలిపారు. రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వర్షాలు ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్నాయని రైతులు ఆగస్టు చివరి మాసం వరకు త్వరగా పండే పంటలు మాత్రమే వేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వర్షాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా రైతులు ముందుకు సాగాలన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రముఖ ఆలయాలు ఉండే ప్రాంతాల్లోని బస్ స్టేషన్లను ఆధునికరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
    4
    వేములవాడలో భారీ శివుడి ప్రతిమను ఆవిష్కరించిన మంత్రులు..బస్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శ్రీకారం
కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. భారీ శివుడి ప్రతిమను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడలో విస్తృతంగా పర్యటించారు.
12 కోట్ల రూపాయలతో నిర్మించిన వేములవాడ గుడి చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ,  డాక్టర్ సంజయ్, కలెక్టర్ గరీమ అగ్రవాల్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. వేములవాడకు దిక్సూచిగా నిలిచే శివుడి భారీ ప్రతిమను ఆవిష్కరించారు. కోటి 50 లక్షల రూపాయలతో వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అధికారంలోకి వచ్చాక సిబ్బందిని పెంచడమే కాకుండా కొత్త రూట్ లను కూడా ఏర్పాటు చేసి మరింత రవాణాకు సౌకర్యాలను పెంపొందించామన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ బస్టాండ్ ను గతంలో ఎత్తివేస్తామని ప్రకటన చేస్తే ఆది శ్రీనివాస్ తో కలిసి పోరాటం చేశామని చెప్పారు. 1984 లో ప్రారంభమైన బస్టాండ్ ను ఇప్పటివరకు ఎవరు అభివృద్ధి చేయలేదని, రాజన్న క్షేత్రం కావడంతో ప్రతిరోజు 250 బస్సులు 500 ట్రిప్పులతో ప్రతినిత్యం వేలాదిమంది ఇక్కడికి వస్తున్నారని అందులో భాగంగానే బస్టాండ్ కోటి పది లక్షల రూపాయలతో ఆధునికరిస్తున్నామని పొన్నం తెలిపారు. రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వర్షాలు ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్నాయని రైతులు ఆగస్టు చివరి మాసం వరకు త్వరగా పండే పంటలు మాత్రమే వేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వర్షాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా రైతులు ముందుకు సాగాలన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రముఖ ఆలయాలు ఉండే ప్రాంతాల్లోని బస్ స్టేషన్లను ఆధునికరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.