*పత్రికా ప్రకటన* *2025లో సూపర్ సిక్స్ తో సుపరిపాలన అందించాం* *రాష్ట్రంలో రామరాజ్యాన్ని నెలకొల్పుతున్నాం* *రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి* ➖ దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసాం ➖ కొంతమంది సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు ➖ ఎవరెన్ని కుట్రలు, అసత్య ప్రచారాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏమి చేయలేరు...అభివృద్ధిని అడ్డుకోలేరు ➖ ప్రజల అభీష్టం మేరకే జిల్లాల పునర్ విభజన ప్రక్రియ చేపట్టాం ➖ నెల్లూరు జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు కలువాయి సైదాపురం రాపూరు మండలాలు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాం ➖ కృష్ణపట్నం పోర్టును కూడా నెల్లూరుకే కేటాయించారు ➖ గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపడం శుభ పరిణామం ➖ ప్రజల ఆమోదంతో పనిచేసే ప్రభుత్వం ఇది ➖ పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుతో పారిశ్రామిక ప్రగతి వైపు రాష్ట్రాన్ని పయనింప చేస్తున్నాం ➖ ఏడాది కాలంలోనే అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించాం ➖ ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని మరింత వేగంగా కొనసాగిస్తాం *రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి* నెల్లూరు, జనవరి 1 : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ తో సుపరిపాలన అందించి సూపర్ హిట్ కొట్టామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్న తనకు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం గర్వకారణమని అన్నారు. గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం పాత్రికేయులతో ఇష్టగోష్టిగా మాట్లాడారు. తమ ప్రభుత్వ పాలనలో మీడియా కూడా ఎంతో కీలకంగా పనిచేస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను చేరవేస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయిందని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ ఏడాది చివరి రోజు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించామని, కానీ కొందరు నేతలు, అధినాయకులు సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు. కొత్త సంవత్సరంలో కూడా ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పథకం ద్వారా రూ.10,090 కోట్లు, స్త్రీశక్తి పథకం కింద మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు రూ.వెయ్యి కోట్లకు పైగా,అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు, దీపం–2 పథకం ద్వారా 2 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.2,684 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎన్‌టీఆర్ భరోసా ఫించన్లకు గత ఏడాది రూ.33 వేల కోట్లు పంపిణీ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి ఇప్పటివరకు 4 కోట్ల మందికి భోజనాలు అందించామని, త్వరలో గ్రామాల్లోనూ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాటలకే పరిమితమైన గత ప్రభుత్వాలకు భిన్నంగా, కూటమి ప్రభుత్వం చట్టం చేసి అమలు చేస్తుందని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ ద్వారా ఒకే రోజు 15,941 ఉద్యోగాలు, పోలీస్ శాఖలో 5,747 ఖాళీల భర్తీ చేశామని తెలిపారు. గత వైసీపీ పాలనలో మిగిలిపోయిన 84 లక్షల టన్నుల చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని, రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మత్తులు, రూ.3,000 కోట్లతో నూతన రోడ్ల పనులు చేపట్టామని వివరించారు. పారిశ్రామిక రంగంలో 23 కొత్త పాలసీలు తీసుకొచ్చామని, ప్రతి జిల్లాకు ఒక పోర్టు వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. వైజాగ్‌లో జరిగిన సమ్మిట్‌లో రూ.13.21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. విదేశీ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. ఆగమశాస్త్ర నియమాల మేరకు ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారాలను సరిచేశామని చెప్పారు. దేవాదాయ శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. వేద విద్యను ప్రోత్సహిస్తున్నామన్నారు. 492 పురాతన ఆలయాల్లో రూ.590 కోట్లతో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఆలయాలను ఎకో టెంపుల్ టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. జిల్లాలో రేపటి నుంచి రెవెన్యూ సదస్సుల ప్రక్రియ ప్రారంభమవుతుందని, రెవెన్యూ సదస్సులను ప్రారంభించి ప్రభుత్వ రాజ్యముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందించనున్నట్లు చెప్పారు. కృష్ణపట్నం పోర్టును తిరుపతి జిల్లాకు తరలించాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం సరిచేసి, కృష్ణపట్నం పోర్టుతో పాటు వెంకటగిరి మూడు మండలాలు, గూడూరును నెల్లూరు జిల్లాలో కొనసాగించిందని చెప్పారు. ప్రజల ఆమోదం మేరకే జిల్లాల పునర్విభజన చేపట్టామని, నెల్లూరు జిల్లాకు ఎంతో మేలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆనం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా స్టేట్స్‌మన్‌గా గుర్తింపు పొందారని, ఆయనపై కేసీఆర్ విమర్శలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. జిల్లాకు పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాకతో రామరాజ్యం ఆరంభమైందని, ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం ధీమా వ్యక్తం చేశారు.

- *🔰ఏపీలో నేటితో ముగియనున్న సర్పంచుల పదవీ కాలం* రేపటి నుంచి ప్రత్యేక అధికారుల నియామకానికి ఉత్తర్వులు తహశీల్దార్, MPDO స్థాయి అధికారులు, కొత్త పాలకమండలి వచ్చే వరకు బాధ్యతలు జీవో జారీ చేసిన ప్రభుత్వం1
- గాండ్లపెంట మండలo క ఠారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించి, ముగింపుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి ఉత్సవాలు ముగింపు కావడంతో యోగివేమన గొడుగుకి వేమన పీఠాధిపతులు నందవేమారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలు చేశారు. వేమన సమాధిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన నందవేమారెడ్డికి భక్తులు ప్రశంసిస్తున్నారు.1
- పొన్నూరు: ప్రేమ జంటకు రక్షణ కల్పించిన పోలీసులు పొన్నూరుకు చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు అనే భయంతో మార్చి 28వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరి మిస్సింగ్పై అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వటంతో పోలీసులు వీరిని పిలిపించారు.1
- ఆకలి కడుపులు నింపుటకై పెట్టిన కార్యక్రమం అన్న క్యాంటీన్. దయచేసి ఒక టోకెన్ మాత్రమే తీసుకోవాలి అని మనవి.మీ వెనకాల ఉన్న పేద వాడి కడుపు కూడా నిండాలి అంటే ..1
- ఆంధ్రప్రదేశ్ లో... ఆగని డోలి మోతలు *అల్లూరి జిల్లా. న్యూస్ డోలిలో గర్భిణి… 5 కి.మీ నడక. ▪️అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల కష్టాలు మరోసారి వెలుగులోకి. ▪️డుంబ్రిగూడ మండలం డొక్రిపాడు గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణి మహిళను కుటుంబ సభ్యులు డోలిలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి. ▪️పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను భర్తతో పాటు బంధువులు సుమారు 5 కిలోమీటర్ల మేర డోలిలో మోసుకుంటూ ఆస్పత్రికి తరలింపు. ▪️రోడ్డు లేకపోవడంతో ప్రతిసారి ఇలాంటి కష్టాలు పడాల్సి వస్తోందని గిరిజనులు ఆగ్రహం. ▪️వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి వినతి.1
- ములకలకాలువ గ్రామ సభ1
- బద్వేలు :స్వచ్ఛ సర్వేక్షన్ 2026 లక్ష్యంగా మన బద్వేలు పురపాలక సంఘం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు వార్డు స్థాయిలో జరిగిన చెత్త వర్గీకరణ (Waste Segregation) కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ కమీషనర్ స్వయంగా పాల్గొని, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమ ముఖ్యాంశాలు: నేరుగా క్షేత్రస్థాయిలో: కమిషనర్ గారు స్వయంగా తడి, పొడి మరియు హానికర వ్యర్థాలను ఎలా వేరు చేయాలో (ఆకుపచ్చ, నీలం, ఎరుపు బుట్టల వినియోగం) ప్రజలకు వివరించారు. కార్మికులకు దిశానిర్దేశం: పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి, వ్యర్థాల సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలను పర్యవేక్షించారు. పౌరుల బాధ్యత: "మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మన వీధిని, మన పట్టణాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత" అని కమీషనర్ గారు పిలుపునిచ్చారు. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న వేళ, మన వంతుగా చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి సహకరిద్దాం. స్వచ్ఛ సర్వేక్షన్ 2026లో మన బద్వేలు ను నంబర్ 1 గా నిలుపుదాం!1
- ' కామా తురాణం న భయం న లజ్జ ' ... తహశీల్దార్ తీరు *సత్యసాయి జిల్లా:* *▪️సమస్య కోసం వస్తే ... సరసాలు, ఆధారాలు ఇచ్చిన కూడా విచారణకే పరిమితం...?* గతంలోను ఇలాంటి తరహా ఘటన విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు. *▪️ఇలాంటి అక్రమ సంబంధంలు బయట పడని అధికారులు ఎంత మంది ఉన్నారో ...?* *▪️ఆ తహసిల్దార్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్.* ▪️పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమందపల్లి తహసిల్దార్ పై కర్ణాటక బాగేపల్లి కి చెందిన విద్యుత్ ఉద్యోగి వేణు సంచలన ఆరోపణలు. ▪️ఆంధ్రాలో చలమత్తూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న తన భార్యతో తహశీల్దార్ మారుతి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఏకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితుడు. ▪️రెవెన్యూ సమస్యలపై వెళ్లిన మహిళ ఉపాధ్యాయురాలి ఫోన్ ట్రాప్ చేసి వలలోకి వేసుకున్న తహశీల్దార్ ▪️భర్త వేణుని వదిలేసి తహశీల్దార్ తో వెళ్లిపోయిన భార్య ఆందోళనలో భర్త. ▪️సమస్యను కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదు చేసిన విద్యుత్ ఉద్యోగి వేణు. ▪️బాధితుని సమస్య విన్న కలెక్టర్ తక్షణమే విచారణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్‌కు ఆదేశం.1
- ఎమ్మిగనూరు నుండి ముఖ్య వార్త… అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక ఘట్టంగా మారడంతో ఎమ్మిగనూరులో ఘనంగా సంబరాలు నిర్వహించారు. రైతుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలు ఈ విజయాన్ని పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.1